వ్యవసాయ రంగంలో నూతనంగా వస్తున్న మార్పులను స్వాగతి స్తున్న రైతులు, సంప్రదాయ వ్యవసాయం నుండి ఆధునిక వ్యవసాయాన్ని అలవరుచుకోవడానికి పెద్దగా సమయాన్ని తీసుకోలేదు. కాలక్రమేణ వ్యవసాయ రగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకున్న రైతు సోదరులు, ఆధునిక వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులను సాధించి, ఆర్ధిక పురోగతిని పొందవచ్చునవి తొలుత భావించినా ఆధునిక వ్యవసాయం కాస్తా బహుళజాతి కంపెనీల లాభాల వలలో చిక్కుకొని త్రివ్రమైన నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఏది ఏమైనా ఈ ఆధునిక వ్యవసాయంలో వాడే వివిధ రకాల పురుగు మందులు, రసాయనిక ఎరువుల వల్ల రైతులు కొంత వరకు అధిక దిగుబడులు పొందుతున్న మాట నిజమే అయినా దీని వెనకాల సేద్యానికి అయ్యే ఖర్చు పెరుగుతూ రావడం అనేది అంతే నిజం. దీనికి తోడుగా వల్ల వాస్తవ ధర కంటే అధిక ధర వెచ్చింది బ్లాక్ మార్కెట్ లో కొనుగోలు చేయవలసిన పరిస్ధితి ఏర్పడింది. కావున రైతులు ఇలా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలు వెచ్చింది కొనుగోలు చేయడం ద్వారా సేంద్యానికి అయ్యే ఖర్చు పెరుగుతా, పంటపై రాబడి తగ్గి తీవ్రమైన నష్టాల్లో కురుకుపోతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధిక దిగుబడులను పొందాలనే ఉత్సాహంతో పురుగు మందుల కంటే ఎక్కువగా రసాయనిక ఎరువులను కొనుగోలు చేయడం గమనించ దగ్గ విషయం. దీని వల్ల రైతులు ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా, రసాయనిక ఎరువులు వాడకం ద్వారా నేల సహజ గుణాన్ని కోల్పోతోంది. ఏదీ ఏమైనా ప్రస్తుత కాలంలో ఎరువుల వాడకం అనేది సర్వ సాధారణమైన విషయం. ఈ విధంగా రసాయనిక ఎరువుల వాడకానికి అలవాటైపొయిన రైతులకు ఆర్ధికంగా కొంత మేరకు ప్రభుత్వం చేయూత నివ్వడం స్వాగతించాల్సిన విషయం. కావున రైతు సోదరులు ఎరువులు కొనుగోలు చేయడానికి ముందు వివిధ రకాల ఎరువుల పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, ఎరువుల వినియోగం మొదలగు విషయాల గురించి తెలుసుకోవడం అవసరం.
ఎరువులు |
స్వదేశీ ధర (రూ/50కి) |
అంతర్జాతీయ ధర (రూ/50కి) |
రాయితీ (రూ/50కి) |
డి.ఎ.పి |
1200 |
1810 |
618 |
పోటాష్ |
800 |
1300 |
465 |
యూరియా |
270 |
970 |
807 |
యూరియా పై గల స్వదేశీ ధర, డి.ఎపి., పోటాష్ లపై గల రాయితీలు ప్రభుత్వం చేత స్ధిరీకరించబడ్డాయి. మిగతా వాటి ధరలలో వివిధ కంపెనీల ఎగుమతులు, దిగుమతులను బట్టి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కావున రైతు సోదరులు ఇది గమనించగలరు.
నత్రజని, పోటాష్, భాస్వరం, సల్ఫర్ లాంటి ఎరువులకు గాను ఒక కిలో ఎరువులకు ఇచ్చే రాయితీ
ఎరువులు |
రాయితీ (రూ/కిలో) |
నత్రజని |
15.85 |
భాస్వరం |
13.24 |
పోటాష్ |
15.47 |
సల్ఫర్ |
2.00 |
కావున పైన తెలుపబడిన వివరాలను దృష్టిలో ఉంచుకొని ఎరువులను కొనుగోలు చేసేటప్పుడు వాటి ధరలను పరిశీలించి కొనాల్సిందిగా రైతులను కోరుతున్నాం. పైన తెలిపిన ధరలకు మంచి విక్రయాలు జరిగితే దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు