অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉద్యాన పంటలలో తేమ భారం నిర్వహణ

ఉద్యాన పంటలలో తేమ భారం నిర్వహణ

సాధారణ సిఫార్సులు

అనుకూల పంటలు మరియు రకాల ఎంపిక

డొలికసస్ బీన్, లెగ్యుమినాసే, గోరు చిక్కుడు, లిమా బీన్, మిరప, మునగకాయ, వంకాయ, ఓక్రా వంటి కూరగాయల పంటలు వర్షాధార సాగుకు అనుకూలంగా ఉంటాయి. వీటిలో పప్పుదినుసు కూరగాయల పంటలను రుతుపవనాల అనిశ్చిత పరిస్థితిలో సిఫార్సు చేయవచ్చు. ఒత్తిడి నుండి ఉపశమనం తరువాత తిరిగి మంచి వేరు వ్యవస్థ మరియు సామర్థ్యం గల రకాలు ఎంపిక చేయాలి. పరిస్థితిని బట్టి, తక్కువ నిడివి గల రకాలను ఉపయోగించాలి.

విత్తనాల ఉత్పత్తిలో మెరుగైన పద్ధతి

కోకో పీట్, నైలాన్ నెట్ ప్రొటెక్షన్ మరియు జీవ ఎరువులు/ బయో-పురుగు మందుల టీకాలను ఉపయోగించి ప్రోట్రేలో పెంచిన విత్తనాలకు నర్సరీ సమయం నుంచి ఉపయోగించటం వలన ఆరోగ్యకరమైన మెరుగైన విత్తనాల ఉత్పత్తి చేయవచ్చు. ఈ మొలకలను నాటినప్పుడు తక్కువ వేరు నష్టంతో ముఖ్యంగా నీటి ఎద్దడి పరిస్థితుల్లో జీవ మరియు నిర్జీవ ఒత్తిడులను అధిగమిస్తాయి.

మట్టి మరియు తేమ పరిరక్షణ పద్ధతుల ఉపయోగం

ఆకృతి సాగు, కౌంటరు ట్రిప్ సాగు, మిశ్రమ పంట, దుక్కి, కప్పడం, సున్నాదుక్కి వంటివి ఇన్-సిటు నేలలో తేమ పరిరక్షించడానికి కొన్ని వ్యవసాయ చర్యలు. ఆకృతి గట్లు, గ్రేడెడ్ గట్లు, బెంచ్ టెర్రేసింగ్, నిలువు కప్పడం వంటి యాంత్రిక చర్యలు డ్రైలాండుల్లో ప్రభావ వంతంగా మట్టి మరియు తేమ పరిరక్షణ కోసం ఉపయోగించవలసిన అవసరం ఉంది. నీటిపారుదల సమర్థవంతమైన వినియోగం కోసం ఇంకొక సాంకేతికత నీటి రీసైక్లింగును ఉపయోగించవచ్చు. వర్షపునీటిని చిన్న స్థలాలలో, సందులు మరియు భూమిలో లేదా ట్యాంకుల్లో ఇంకా నిల్వ ఆనకట్టలలో ప్రవాహ నీటిని సేకరించాలి. 500mm నుంచి 800 mm వంటి కొద్ది వర్షపాతం కల ప్రాంతాల్లో వాన నీటి వినియోగం సాధ్యమే. వర్షపాతం మరియు మట్టి లక్షణాలను బట్టి, 10-50% పారే నీటిని వ్యవసాయ చెరువులో సేకరించవచ్చు. ఒక వ్యవసాయ చెరువులో సేకరించిన నీటిని సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు ద్వారా రక్షిత నీటి పారుదల అందించడానికి ఉపయోగించవచ్చు.

మట్టి సేంద్రీయ పదార్థాన్ని మెరుగుపరవటం

మట్టిలోని సేంద్రీయ కర్బనాన్ని మెరుగు పరచడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలి. మట్టిలో పంట అవశేషాలు మరియు పేడ కలపడం వలన సేంద్రీయ పదార్థం స్థాయి మెరుగుపడుతుంది మరియు మట్టి నిర్మాణం మరియు నేల తేమనిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. సందు పంట, పచ్చ ఎరువులు, పంట మార్పిడి మరియు వ్యవసాయ అటవీ ద్వారా కూడా మట్టిలోని సేంద్రీయ పదార్థాన్ని వృద్ధి చేయవచ్చు. కూరగాయలు తోందరగా పెరిగే పంటలు. వీటికి వేగంగా అభివృద్ధి దశలు ఉంటాయి. అందువల్ల అందుబాటులోని సేంద్రీయ పదార్థాన్ని సరిగా మిశ్రమం చేసి వీటికి ఉపయోగించాలి. వానపాముల కంపోస్టింగును నేలలో అందుబాటులో ఉన్న సేంద్రీయ పదార్థాన్ని వేగంగా వాడడానికి మరియు నేలలోని తేమను నిలుపుకొనే శక్తిని మెరుగు పరిచడానికి ఉపయోగించవచ్చు.

ఆకుల పోషణ ఉపయోగం:

నీటి ఎద్దడి సమయాలలో పోషకాల ఆకుల ఉపయోగం పోషకాలను త్వరగా పీల్చుకొని మంచి వృద్ధికి సహాయపడుతుంది. K మరియు Caను చల్లడం వలన కూరగాయల పంటలు కరువును తట్టుకుంటాయి. సూక్ష్మపోషకాల పిచికారీ మరియు ద్వితీయ పోషకాలు మెరుగైన పంట దిగుబడి మరియు నాణ్యత పెరగడానికి ఉపయోగపడతాయి.

బిందు సేద్యం యొక్క ఉపయోగం

హార్టికల్చర్ లో కాండనికి నీటిని ఖచ్చితంగా మరియు ప్రత్యక్షంగా అందిచటం వలన బిందు సేద్య నీటిపారుదల ఇతర సాంప్రదాయక పద్ధతుల కంటే మెరుగైనదిగా నిరూపించబడింది. నీటి ఆదా, పెరుగుదల వేగం, అభివృద్ధి, పండ్లు మరియు కూరగాయల దిగుబడి, కలుపు నియంత్రణ మరియు తక్కువ పనివారి అవసరం వంటివి బిందు సేద్యం యొక్క ముఖ్య లాభాలు. పండ్ల తోటలకు, అన్ని కూరగాయల పంటలకు మరియు ఉల్లిపాయలు, చిక్కుళ్ళు వంటి అంతరం పంటలకోసం బిందు సేద్యాన్ని ఉపయోగించవచ్చు. పంట మరియు కాలమును బట్టి నీటి ఆదా 30-50% మేర ఉంటుంది. సాధారణంగా ఇన్లైన్ డ్రిప్, కూరగాయల పంటలు కోసం, ఏమిట్టింగ్ పాయింట్ 30cm దూరంలో 2లీ/గం చొప్పున నీటిని వెలువరించే విదంగా ఉంటాయి. మిరప, వంకాయ, కాలీఫ్లవర్ మరియు ఓక్రా వంటి పంటలులో జత వరుస నాటే పద్దతిని అవలంబిస్తున్నారు. ఒక బిందు పార్శ్వం రెండు పంట వరుసల కోసం ఉపయోగించవచ్చు.

సూక్ష్మ స్ప్రింక్లర్ వ్యవసాయం

పరిస్థితి మరియు నీటి లభ్యతను బట్టి, ఈ సాంకేతికను పండ్లు మరియు కూరగాయల పంటలకు ఉపయోగించవచ్చు. ప్రారంభ ఖర్చు బిందు వ్యవస్థతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. వేసవిలో నీటి చిలకరించడం వలన మైక్రో క్లైమాట్ ఉష్ణోగ్రత తగ్గుతుంది మరియు పెరిగే తేమ ద్వారా పంట పెరుగుదల మరియు దిగుబడి మెరుగు పడుతుంది. దీని వలన 20 నుండి 30 శాతం మేర నీటి పొదుపు జరుగుతుంది.

పరిమిత నీటి వనరుల పరిస్థితుల్లో తేమను కాపాడే పద్ధతులు:

క్రింది పద్ధతులను నీటి కొరత పరిస్థితుల్లో నీరు ఆదా చేయడానికి వాడవచ్చు.

  • నీటి ఎద్దడి పరిస్థితులలో, మడత నీటిపారుదల లేదా విస్తృత ఖాళీ మడత నీటిపారుదల మరియు బిందు సేద్యం వ్యవస్థల వంటి నీటిని ఆదా చెసే నీటిపారుదల పద్ధతులను వాడవచ్చు. మిరపకాయ, టమోటా, ఓక్రా మరియు కాలీఫ్లవర్ పంటల నీటిపారుదల పద్ధతులపై నిర్వహించిన అధ్యయనాలు ప్రత్యామ్నాయ మడత నీటిపారుదల మరియు విస్తృత ఖాళీ మడత నీటిపారుదల పద్దతులు, దిగుబడిపై ప్రభావం లేకుండా, 40నుచి 35 శాతం నీటిని పొదిపు చేస్తాయని నిరూపించాయి.
  • కూరగాయల ఉత్పత్తిలో మల్చింగ్ పధ్ధతులు

    సహజ పంట అవశేషాలు లేదా ప్లాస్టిక్ ఫిల్ములతో మట్టిని కప్పి మట్టి మరియు నీటిని సంరక్షించటాన్ని మల్చింగ్ అంటారు. మల్చింగ్ పద్దతిని పండ్లు మరియు కూరగాయ పంటల వ్యవసాయానికి అందుబాటులో ఉన్న పంట అవశేషాలను మరియు ఇతర సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి వాడవచ్చు. ఇటీవల సమర్థవంతమైన తేమ పరిరక్షణ, కలుపు నియంత్రణ, మట్టి నిర్మాణ నిర్వహణ వంటి స్వాభావిక ప్రయోజనాల వల్ల ప్లాస్టిక్ రక్షణ పూతలు వాడుకలోకి వచ్చాయి. అనేక రకాల కూరగాయలను విజయవంతంగా మల్చింగును ఉపయోగించి పెంచవచ్చు. మట్టి మరియు నీటి సంరక్షణ, మెరుగైన దిగుబడి మరియు నాణ్యతలే కాకుండా మల్చింగు ద్వారా ఎరువుల పోషకాల వాడుక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు వైరస్ వ్యాధులను తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు. కూరగాయల ఉత్పత్తికి సాధారణంగా 30 మైక్రో మందం మరియు 1 నుంచి 1.2 మీటర్ల వెడల్పు పాలిథిన్ మల్చు ఫిల్మును ఉపయోగిస్తారు. మల్చు ఫిల్ముమును వేస్తున్నప్పుడు సాధారణంగా ఎత్తు బెడ్ మరియు బిందు సేద్య వ్యవస్థను వాడతారు.

వీండ్ బ్రేక్, కంచెలు మరియు అంతర పంటలు:

అధిక ఉష్ణోగ్రత మరియు పొడి గాలుల వంటి ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి, పొడవుగా పెరిగే చెట్లను మొత్తం వ్యవసాయ సరిహద్దు వెంబడి నాటాలి. వేసవి నెలల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన కూరగాయ పంటలను అంతర పంటగా తోటలలో వేయవచ్చు. మొక్కజొన్న / జొన్నలను గాల్లో తేమ ప్రభావం తగ్గించడానికి ప్లాట్లు సరిహద్దు వెంట పెంచవచ్చు.

కూరగాయల పంటలకు రక్షిత సాగు ఉపయోగం

సంవత్సరం పొడవునా బయటి వాతావరణంలో పంటల ఉత్పత్తికి అనుకూలంగా ఉండని పెరి-అర్బన్ ప్రాంతాలలో రక్షిత వాతావరణంలో కూరగాయల ఉత్పత్తి తీసుకోవచ్చు. రక్షణ నిర్మాణం జీవ మరియు నిర్జీవ అడ్డంకులు నుండి పంటను రక్షించడానికి ఉపయోగపడుతుంది. పచ్చ గృహాలు, ప్లాస్టిక్/నెట్ గృహాలు మరియు "సొరంగాలు" రక్షిత సాగు నిర్మాణాలు. సాధారణంగా ఉపయోగించే రక్షిత సాగు నిర్మాణాలు పాలీ గృహాలు మరియు నెట్ లేదా నీడ గృహాలు. టమోటా, ఉల్లిపాయలు మరియు పుచ్చకాయల ఉత్పాదకత అధిక వర్షపాతంతో ప్రభావితమవుతాయి. వర్ష-ఆశ్రయం పాలిథిలిన్ షీట్ తో చేసిన ఒక సాధారణ నిర్మాణం, ఇది అధిక వర్ష ప్రభావంగల ప్రాంతాలలో పంటలను పండించడానికి సహాయపడుతుంది. వ్యాధులు, సరైన మట్టి గాలి లేకపోవటం, సరియైన నీటి పారుదల లేకపోవడం, ఆకులు మరియు పుష్పాలు రాలిపోవటం వంటివి పంటపై ప్రభావాన్ని చూపుతాయి. నెట్ గృహము సాగు మరియు షేడ్ నెట్ సాగు వేసవిలో ముఖ్యంగా మంచి మైక్రో క్లైమాటును అందిస్తాయి. ప్రత్యేకంగా అధిక ఉష్ణోగ్రత ప్రభావం తగ్గిస్తాయి మరియు సాపేక్ష తేమను మెరుగుపరుస్తాయి. అధిక ఉష్ణోగ్రత కాలంలో టమోటా, ఫ్రెంచ్ బీన్ మరియు మిరపకాయ ఉత్పాదకతను నెట్ / షేడ్ నెట్ ఉపయోగించి పెంచవచ్చు.

అధిక ఉష్ణోగ్రత సమయంలో లీఫ్ మైనర్ మరియు పురుగుల నియంత్రణ

లీఫ్ మైనర్ నియంత్రిణకు వేప రసం 4 గ్రా/లీ చల్లండి లేదా ట్రైయజోఫస్ 1.5 ml /లీ ను చల్లండి. పురుగుల నింత్రణకు అబమేక్టిన్ 0.5 ml / లీ వేయండి. బీన్స్ విషయంలో అఫిడ్స్ పీల్చు కుంటుంది. వేప రసం (1.0%) లేదా వేప సీడ్ కెర్నల్ సారం (4.00%) చల్లడి.

కూరగాయ పంటలకు చేయవలసినవి మరియు చేయకూడనివి

  1. చెట్ల కింద మరియు చెట్టు వరుసలు మధ్య పెరిగే మొక్కలు లేకుండా చూడాలి.
  2. ఉల్లిపాయ వంటి పంటకు డ్రమ్ సీడరును ప్రత్యక్ష విత్తనాలను నాటడానికి ఉపయోగించవచ్చు.
  3. నేలలో అనుకూలమైన తేమ ఉన్నంత వరకూ ట్రాంస్ ప్లాంటింగును వాయిదా వేయాలి.
  4. నేలలో తేమ పరిస్థితి అనుకూలమైనప్పుడు మొలకల ట్రాంస్ ప్లాంటింగు చేయవచ్చు.
  5. ప్రధాన పోషకాల(నీటిలో కరిగే) ఫాయిలర్ అప్లికేషన్ పునరుద్ధరించు.
  6. పాక్షిక నీడ నుంచి చిన్న మొక్కలను రక్షించు.
  7. పంటల కలుపు తీయటం మరియు ఇంటర్ కల్చర్ విధానాలను అనుసరించవచ్చు.
  8. మొక్కల సంఖ్యను తగ్గించేందుకు కలుపుతీత చేయవచ్చు.
  9. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ చాలు నీటిపారుదల వరకు తీయవచ్చు.
  10. డ్రిప్ ఇరిగేషన్ అనుసరించవచ్చు. బిందు సేద్యం వీలుకానప్పుడు కుండ నీటిపారుదల రక్షిత నిర్వహణ కోసం అందుబాటులో ఉంది.
  11. మట్టి మరియు తేమ పరిరక్షణ మరియు కలుపు నియంత్రణ కొరకు ప్లాస్టిక్ మల్చింగ్ మరియు బిందు సేద్యాలను అనుసరించవచ్చు.
  12. ఉపరితల మరియు భూగర్భ జలాను కలిపి ఉపయోగించటం తోపాటు సంప్రదాయోతర వనరులు ఉప్పునీరు వంటి వాటిని వినియోగించాలి.
  13. మురికి నీటిని శుభ్రపరచకుండా వినియోగిచరాదు. పునర్వినియోగం సురక్షితంగా అండేలా చూడాలి.
  14. చెట్టు కాండం లావు సరిగా ఉంచడానికి K మరియు B లను ఫోలియర్ స్ప్రేగా ఉపయోగించండి, నత్రజని లాంటి వాటివి ఎక్కువగా ఇచ్చే ఎరువుల వాడకాన్ని తగ్గించండి.
  15. పారే టప్పుడు మరియు పంపిణీ సమయంలో నీటి వృథాను తగ్గించండి.
  16. నీటి శోషణ మరియు నెమ్మదిగా విడుదల కోసం లిక్వాసర్డ్ వంటి సూపర్ అబసర్బెంటు పాలిమర్సును ఉపయోగించండి.

పండ్ల పంటలకు చేయవలసినవి మరియు చేయకూడనివి

  1. కాలువలు తవ్వి, ఆకృతి /పొలంలో గట్లు, గుల్లీ ప్లగింగ్, లూస్ బౌల్డర్ చెక్ డ్యామ్లతో సిటు నేలలో తేమ పరిరక్షణ చేయవచ్చు.
  2. స్థానికంగా అందుబాటులో ఉన్న సేంద్రీయ రక్షణ పూతలను సితూలో సహజ స్థితిలో చెమ్మను పరిరక్షించడంలో ఉపయోగించండి. నీటిని సరిగా వినియోగించడానికి ట్రికెల్ లేదా బిందు సేద్యాన్ని ఉపయోగించండి. నేల తేమ పరిరక్షణ కోసం అతర్గత పంటలను వేయండి.
  3. తగిన మట్టి తేమ వచ్చే వరకు ఎరువుల మట్టి వాడకాన్ని నివారించండి.
  4. నీటి ఎద్దడి పరిస్థితుల్లో ప్రధాన పోషకాలకు అనుగుణంగా పోషకాలను విస్తరించేందుకు సమర్ధ ఫోలియర్ పోషణను ఉపయోగించాలి.
  5. అధిక బాష్పీభవన డిమాండ్ తగ్గించేందుకు చిన్న మొక్కల మట్టి రక్షిత నీడ ద్వారా రక్షిత నీటి పారుదల అందించాలి.
  6. పరిమిత నీటి పరిస్థితుల్లో పండ్ల పంటల ఉత్పత్తి కోసం నీటిపారుదల మల్చింగ్ మరియు బిందు సేద్యం కాకుండా నవీన నీటిపారుదల పద్ధతులు, పాక్షిక వేరు ఎండబెట్టడం (PRD) వంటి వాటిని ద్రాక్ష, మామిడి మరియు సిట్రస్ పంటలకు వాడవచ్చు. పాక్షిక వేరు ఎండబెట్టే పద్ధతి వలన లోతైన రూట్ వ్యవస్థ అభివృద్ధి జరుగుతుంది.
  7. అన్ని పండ్ల పంటలకు, స్థానికంగా అందుబాటులో ఉన్న మొక్క పదార్థం మరియు ప్లాస్టిక్ గడ్డిను వాడవచ్చు.
  8. అందుబాటులో ఉన్న అన్ని మొక్కల వ్యర్థ పదార్థాల కంపోస్ట్ ను పండ్లు మరియు కూరగాయల పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించడానికి ప్రయత్నించండి.
  9. అన్ని ఉద్యాన పంటలకు బిందు సేద్యాన్ని అనుసరించనచ్చు. పిట్చెర్ నీటిపారుదల బిందు సేద్యం అందుబాటులో లేని దగ్గిర రక్షిత నిర్వహణ కోసం అనుకూలంగా ఉంటుంది.

మూలం: NHM



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate