অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కరువు నిర్వహణ

భారతదేశ కరువు వాస్తవాలు

భారతదేశంలో, కరువుకు ముఖ్య కారణంగా నైరుతి రుతుపవనాల (జూన్- సెప్టెంబర్ ) వైఫల్యం అని చెప్పవచ్చు. దేశంలో 73% వర్షపాతం SW రుతుపవనాల సమయంలో కురవటంవల్ల కరువు ప్రభావిత ప్రాంతాలు వర్షంకోసం తదుపరి రుతుపవనాల వరకు వేచి ఉండవలసి వస్తుంది.

కరువుకు సంబంధించి అందుబాటులో ఉన్న వర్షపాత వివరాలు -

  • దేశం మొత్తంలో 16% భూభాగం కరువు పీడిత ప్రాంతం, ఏటా 50 మిలియన్ల ప్రజలు కరువు సంక్షోభానికి గురి అవుతారు.
  • సుమారు 68% సాగు ప్రాతం వివిధ స్థాయిల్లో కరువుకు గరవుతుంది.
  • 35% ప్రాంతంలో 750 మిల్లీమీటర్ల నుంచి 1125 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతుంది. దీనిని కరువు పీడిత ప్రాంతంగా చెప్పవచ్చు.
  • 429 మిలియను హెక్టారులలో శుష్క (19.6%), పాక్షిక-శుష్క (37%) మరియు ఉప-తేమ (21%) కనిగినని కరువు పీడిత ప్రాంతాలు. ఇవి మొత్తం దేశ భూభాగంలో 77.6% ఉంటాయి.
  • వార్షిక సగటు వర్షపాతం భారతదేశంలో 1160 మిమీ. అయితే, 85% వర్షపాతం 100-120 రోజులలో (SW వర్షాకాలం) కేంద్రీకృతమై ఉంటుంది.
  • 33% ప్రాంతంలో 750mm కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా కరువు పీడిత ప్రాంతం.
  • 21% ప్రాంతంలో 750mm కంటే తక్కువ వర్షపాతం (పెనిన్సులర్ ప్రాంతం మరియు రాజస్థాన్ ) ఉంటుంది.
  • వర్షపాతం 10 లో 4 సంవత్సరాలు అస్థిరంగా ఉంటుంది.
  • నీటిపారుదల సంభావ్యత 140 మిలియన్ హెక్టార్లు (76 మిలియన్ హెక్టార్లు ఉపరితల + 64 మిలియన్ హెక్టార్లు భూగర్భజలం).
  • గ్రౌండ్ వాటర్ క్షీణత మరియు ఉపరితల నీటి పరిమితి ఉన్నప్పుడు పైన చూపిన మొత్తం ప్రాంతంలో నాట్లు వేయడానికి వీలుకాదు అని తెలుస్తోంది.
  • పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పంట తీవ్రత మరియు భూగర్భ జలాల తగ్గుదల వలన తలసరి నీటి లభ్యత క్రమంగా తగ్గుతుంది. దీనివలన సమస్యలు వేగంగా పెరిగే అవకాశం ఉంది.
  • మొత్తనికి - ఒక ప్రాంతంలో కాకపోతే ఇంకో ప్రాంతంలో కరువు అనివార్యం.

రాబోవు కరువును నిర్ధారించటం

ఇప్పటి వరకు పొందిన అనుభవం ఆధారంగా, రాబోయే కరువులకు సంబంధించిన కొన్ని హెచ్చరిక సంకేతాలను మన వ్యవసాయ చక్రం యొక్క వివిధ దశల్లో గుర్తించారు. అవి:

ఖరీఫ్ కోసం (జూన్ నుండి ఆగష్టు వరకు)

  • నైరుతి రుతుపవనాల ఆలస్యం.
  • నైరుతి ఋతుపవనాల యొక్క కదలికలలో పెద్ద అంతరం.
  • జూలై నెలలో తక్కువ వర్షాలు.
  • పశుగ్రాసం ధర పెరగడం.
  • రిజర్వాయర్లలో నీటి స్థాయిలలో పెరుగుదల ధోరణి లేకపోవడం
  • గ్రామీణ మంచినీటి సరఫరాకు ఉపయోగపడే వనరులు ఎండిపోవటం.
  • "సాధారణ సంవత్సరాలు"తో పోలిస్తే వారాలు గడిచే కొద్ది విత్తనాల నాటడంలో తగ్గుదల ధోరణి ఉండటం.

రబీ కోసం (నవంబర్ నుండి జనవరి వరకు)

  • దక్షిన-పశ్చిమ వర్షాకాలం (30 సెప్టెంబర్) ముగింపులో తగ్గుదల.
  • "సాధారణ సంవత్సరాలు"తో పోలిస్తే భూగర్భజల స్థాయిలలో చాలా క్షీణత .
  • "సాధారణ సంవత్సరాలు" తో పోల్చితే జలాశయాల మట్టం తక్కువగా ఉంటే దక్షిన-పశ్చిమ వర్షాకాలంలో తక్కువ రీచార్జీ ఉంటుందని సూచిస్తుంది.
  • చెప్పుకోదగ్గ నేల తేమ ఒత్తిడి సూచన.
  • పశుగ్రాసం ధరలో పెరుగుదల.
  • ట్యాంకర్ల ద్వారా నీటి వితరణ పెరుగుతుంది.
  • ( తమిళనాడు & పుదుచ్చేరీలకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలలో కీలకమైన కాలం)

ఇతర కారణాలు:

  • గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాలకు మార్చి/ఏప్రిల్ మాసాలు కీలకమైనవి. దీర్ఘకాలిక జలసంబంధ కరువు వలన, అనేక ప్రాంతాల్లో తాగు నీటి కొరత తీవ్రంగా పెరుగుతుంది.
  • నిర్దిష్ట రాష్ట్రాలకు మరియు ప్రత్యేక పంటలకు వర్షాల పురోగతి చాలా ముఖ్యం. ఉదాహరణకు, కేరళలో ఫిబ్రవరి వర్షాలు తోట పంటలకు చాలా ముఖ్యం.

మూలం: వ్యవసాయ శాఖ, సహకార మరియు రైతులు సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate