অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉద్యాన పంటలలో ప్లాస్టిక్ కల్చర్ – ప్లాస్టిక్ మల్చింగ్

ప్రస్తుతం నెలకొన్ని వర్షాభావ పరిస్దితులు, బోరుబావుల్లో నీరు అడుగంటుకుపోవడం, దీనివల్ల రైతులు పంటలకు కావాల్సినంత నీరు అందించలేకపోతున్నారు. నీటి వాడకం గణనీయంగా పెరగడం వల్ల చాలా వరకు పంటల దిగుబేడి తగ్గుతుంది. ఉద్యాన పంటలలో ప్లాస్టిక్ ని చాలా రకాలుగా వాడవచ్చు. ముఖ్యంగా డ్రిప్, స్ప్రింక్లర్, మైక్రో జెట్స్, రెయిన్గన్స్ ఇలా చాలా రకాలుగా వాడవచ్చు. అలాగే పాలీమల్చ్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

మల్చింగ్ విధానం వల్ల సాగు ఖర్చులను అధిక భాగం ఎరువులు, పురుగుమందులు, తెగుళ్ళ మందులు, కలుపు మందుల ఖర్చుతో పాటు కూలీల ఖర్చులను కూడా తగ్గించవచ్చు.

ప్లాస్టిక్ మల్చింగ్ అంటే ఏమిటి

మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని ఏవేని పదార్దాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గుళకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కానీ వీటి లభ్యత రానురాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ షిటుతో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు.

ప్లాస్టిక్ మల్చింగ్ – లాభాలు

నీటి ఆదా : మొక్కల చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారంచడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. దీనిని డ్రిప్ పద్ధాతికో కలిపి వాడితే మరో 30 శాతం నీరు ఆదా అవుతుంది.

మట్టికోత నివారణ : వర్షపు నరు నేరుగా భూమి పైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు.

నేల ఉష్ణోగ్రత నియంత్రణ : మొక్క చుట్టూ సుక్ష్మవాతావరణ పరిస్దితులను కలుగచేస్తూ నేల ఉషోనోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సుక్ష్మజివుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలను అన్ని పోషక పదార్ధాలు అందేలా చూస్తుంది.

భిమిలో చీడపీడల నివారణ : పారదర్శక ఫిల్ములను వేసవిలో భూమి పై పరిచి సూర్యరశ్మిని లోపాలను ప్రసరింపచేస్తూ అది భుమ్నిలోని క్రిమి కిటకాలను తెగుళ్ళను నివారిస్తుంది.

ఎరువులు, క్రిమి సంహార మందులు ఆదా : నేలలో వేసిన ఎరువులు భూమి లోపలీ పొరల్లోనికి వెళ్ళకుండా నివారించడం వల్ల కలుపు నివారణ జరిగి క్రిమి సంహారక మందుల శాతం తగ్గి మందులు ఆదా అవుతాయి. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది.

మల్చింగ్ షీటు ఎంపిక

  • ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కల్లో మల్సింగ్ షిటును ఉపయోగిస్తారు.
  • మనం పండించే పంట కాల పరిమితిని బాటి మల్చింగ్ షీటు మందాన్ని ఎంపిక చిసుకోవడం
  • సాధారణంగా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు 3-4 నెలల కాలవ్యవధి కలిగినవి కాబట్టి 15-25 మైక్రాన్ల మందంగల మల్చిషిటును ఉపయోగించడం మేలు.
  • కాని దీర్ఘకాలిక పంటలకు 100 మైక్రాన్ల మల్చిశిటును వాడాలి .
  • మల్చ్ షీట్లను యూ.వి. కిరణాలను తట్టుకొనే విధంగా రసాయన శుద్ధి ద్వారా తయారు చేయడం వల్ల వీటి మన్నిక కనీసం 3 సంవత్సరాల వరకు ఉంటుంది.
  • ప్లాస్టిక్ మల్చ్ షీట్లు వివిధ రంగులలో లాభిస్తాయి. ఉదా : నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, వెండి రంగులో లభిస్తాయి. రెండు వైపులా వేర్వేరూ రంగులవి కూడా లభిస్తాయి.
  • ఉదా : నలుపు తెలుపు, పసుపు, నలుపు వెండి రంగు గలవి. ఒక్కోరంగు ఒక్కో పంటకు వివిధ కాలాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది.

  • టమాట - ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగులు వాడడం వల్ల తెలుపు
  • వెండి రంగు కంటే అధిక దిగుబడులు పొందవచ్చు.పండ్ల తోటల్లో ఎక్కువగా వెండి రంగు మల్చింగ్ షిటును వాడతారు.
  • క్యాబేజిలో పసుపు రంగుతో అధిక దిగుబడులు వస్తాయి.
  • కొబ్బరి చెట్లకు వెండి రంగు షిట్లను తొడిగితే మొవ్వ పురుగు తాకిడిని నివారించుకోవచ్చు.

మల్చ్ వేసే విధానం

సాలు మొక్కలకు ఇరువైపుల (కూరగాయలు) లేదా చుట్టూరా (పూలు, పండ్లు) 5-10 సెం. మీ.లోతు గాడి చేయాలి. మల్చ్ షిటును కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షిట్లను ప్రతి వరసలో లేక చెట్ల దగ్గర మారీ వదులుగా లేక బిగువుగా లేకుండా కప్పి అన్ని చివర్లను గదిలోకి పోయేటట్లు చేసి మట్టిలో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీని వల్ల మల్చిషీట్లు గాలికి చేదిరిపోకుండా ఉంటాయి.

మల్చ్ వేసే విధానం రెండు రకాలు

విత్తడానికి ముందుగా మల్చ్ వేసే విధానం : మొక్కకు, మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే షిటుకు రంధ్రాలు చేయాలి.

  • ప్రస్తుత మార్కెట్ లో రంధ్రాలు గల షీట్లు పంటలకు అనుకూలమైనవి లభిస్తాయి.
  • రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి.
  • ఈ విధంగా చేయడం వల్ల సుమారు 20-25 శాతం విత్తనాలు ఆదా అవుతాయి.

నాటిన పైర్లకు మల్చ్ వేసే విధానం

మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చ్షిటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తరువాత మల్చ్ షీటు పై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివరలను యాంకరింగ్ చేసుకోవాలి.

పండ్ల తోటల్లో మల్చింగ్ విధానం

చెట్టు చుట్టూ కొలతను బట్టి, తగిన సైజులో మల్చ్ షిటును కత్తిరించుకోవాలి,. పొడవు, వెడల్పు సరిసమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. కత్తేరను ఉపయోగంచి మల్చ్ షిట్ ఒక వైపు నుండి మొదలు పెట్టి మధ్య వరకు కత్తిరించుకోవాలి.

  • మల్చ్ షీటు వేయడానికి ముందు మొక్క చుట్టూ ఉన్న రాళ్ళను, కలుపు మొక్కలను తీసి శుభ్రం చేయాలి.
  • చెట్టు చుట్టూ గాడిని తీసి మల్చ్ కత్తిరించిన భాగం నుండి మల్చ్ షిట్ తెరిచి చేట్టు చుట్టూ కొలత మొత్తం అమరేటట్లు వేయాలి.
  • చుట్టూ మిగిలిన షిటును గడిలోకి యాంకరింగ్ చేసుకోవాలి.
  • నాలుగు మూలల్లో చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇవి నీటి ప్రసరణకు తోడ్పడతాయి.
  • మల్చ్ షీట్లు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    • మల్చ్ షిట్లను బలంగా లాగరాదు.
    • ఉదయం లేదా సాయంత్రం వేళలో మల్చ్ షిట్లను వేయాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.
    • ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చ్ వేయరాదు.
    • పంటకాలం తరువత మల్చ్ షిట్లను తీసి భద్రపరచుకోవాలి.

    ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

    చివరిసారిగా మార్పు చేయబడిన : 10/17/2023



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate