హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / కందిలో అధిక దిగుబడులకు సూచనలు మరియు అనువైన రకాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కందిలో అధిక దిగుబడులకు సూచనలు మరియు అనువైన రకాలు

తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ లో అపరాలను ప్రధాన పంట లేదా అంతరపంటగా సాగు చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందవచ్చును. ఈ మధ్య కాలంలో మార్కెట్ లో ఒక కిలో కందిపప్పు ధర రూ.200/- దాటి పోయి మార్కెట్  అవసరాలకు అపారలు అనుకూలంగా ఉన్నందున ఆధునికి మెళకువలు పాటించి అధిక దిగుబడులనిచ్చే మేలైన రకాలతో సాగు చేస్తే లాభసాటిగా ఉంటుంది.

కందిలో అధిక దిగుబడులు సాధించక పోవటానికి గల కారణాలు:

 • కంది పంట చివరి దశలో బెట్టకు గురికావటం.
 • తెగుళ్ళు (ఎండు, వెర్రి), పురుగులు (కాయతొలుచు, శనగ పచ్చ) వలన పంటకు నష్టం కల్గచేయటం.
 • కంది పైరును సహపంటగాను, మిశ్రమ పంటగాను పండించినప్పుడు అంతరపంటను కోసిన తరువాత కందిని ఆశ్రద్ధి చేయటం.
 • మొక్కల సాంద్రత తక్కువగా ఉండటం.
 • అధిక వర్షాలు, బెట్టను తట్టుకునే రకాలను ఎంచుకోకపోవటం.

నేలలు మరియు నేల తయారీ: నిరుబాగా ఇంకి, మురుగునీరు నిల్వలేని మధ్యస్ధ బరువైన నేలలు అనుకూలం. చేదు నేలలు పనికి రావు. తొలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దూకి బాగా తయారీ చేసుకొని తొలికపాటి నెలల్లో 50 నుంచి  60 మి.మీ. మరియు బరువైన నెలల్లో 60-75 మీ.మీ. వర్షపాతం నమేదైనా తర్వాత లేదా 15-20 సెం.మీ. లోతు తడిసిన తర్వాత మ్త్రామే విత్తనాన్ని విత్తుకోవాలి.

విత్తే సమయం మరియు ఎరువుల యాజమాన్యం : పంటను జూన్ మొదటి పాశం నుండి జులై రెండో పాశం వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చును. 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ లేదా 50 కిలోల డి.ఎ.పి.ను ఒక ఎకరాకు అక్షర దుక్కిలో కానీ, విత్తిన 10-15 రోజులకు  సాళ్ళలో గని వేయాలి.

విత్తన మేతాడు మరియు విత్తే దూరం: స్వచ్ఛమైన, బాగా మెలిక శాతం కల్గి కీటకాలు, తెగుళ్ళు బారిన పాడనీ విత్తనాన్ని నిత్తుటకు వాడుకోవాలి. 2-3 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. మధ్యస్ధ మరియు తేలికపాటి నెలల్లో సాళ్ళ మధ్య 90-120 సెం.మీ. బరువైన నెలల్లో సాళ్ళ మధ్య 150-180 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి.

విత్తనశుద్ధి: విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను అరికట్టడానికి ధైరం (లేదా) కప్తాన్ 2.5 గ్రా. మరియు తొలిదశలో రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రాడ్ 5 గ్రా. కిలో విత్తనానికి పట్టించి, తొలిసారి పండించే భూముల్లో ఎకరాకు సరిపడే విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ కలిపి విత్తితే అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే ట్రైకోడెర్మా విరిడిని 8 గ్రా. ప్రతి కిలో విత్తనానికి పట్టించినచో ఎండు తెగులు మరియు భూమి నుండి సంక్రమించే తెగుళ్ళ నుండి అరికట్టవచ్చును.

క్రమ. సంఖ్య

రకం

పంటకాలం (రోజుల్లో)

దిగుబడి (క్వి.ఎ)

లక్షణాలు

1 .

ఎల్.ఆర్.జి.-41

180

8-10

 • శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది.
 • నల్లరేగడి భూములకు అనుకూలం     
  • నీటి వసతి గల తేలిక భూముల్లో సాగు చేయవచ్చు.
2 .

ఐ.సి.పి.ఎల్-87119 (ఆశ)

 

170-180

7-8

 • ఎండు మరియు వెర్రి తెగులును తట్టుకునే రకం
3 .

ఐ.సి.పి-8863(మారుతీ)

155-160

7-8

 • ఎండు తెగులును తట్టుకుంటుంది. వరి మాగాణి గట్ల పైన పెంచటానికి అనువైనది.
4 .

డబ్ల్యు. ఆర్.జి-65 (రుద్రేశ్వర)

160-180

8-10

 • ఎండు తెగులు మరియు శవాగా పచ్చ పురుగును కొంత వరకు తట్టుకొనును. నల్లరేగడి భూములకు అనుకూలం.
5 .

పి.ఆర్.జి-176 (ఉజ్వల)

130-135

7-8

 • మధ్యస్ధ నేలలు, తక్కువ వర్షపాతం నేమేడయ్యే ప్రాంతాలకు అనువైన రకం.
6 .

ఎమ్.ఆర్.జి-1004 (సూర్య)

165-180

8-9

 • మాక్రోఫోమైనా ఎండు తెగులును తట్టుకునే రకం.
7 .

డబ్ల్యు.ఆర్.జి.ఇ-97

150-165

7-8

 • విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ  రకం మధ్యస్ధ నేలలు, తక్కువ వర్షపాతం కలిగే ప్రాంతాలలో సాగుచేయవచ్చు.
 • ఎండు తెగులును తట్టుకుని ఆకుముడత పురుగులను తక్కువగా అధించే రకం.
8 .

డబ్ల్యు.ఆర్.జి.ఇ-93

150-165

7-8

 • మధ్యస్ధ నేలలు, తక్కువ వర్షపాతం కలిగే ప్రాంతాలకు అనువైన రకం
 • ఎండు తెగులును తట్టుకునే విడుదలకు సిద్ధంగా ఉన్న రకం.

అంతర పంటలు : కందిని వివిధ పంటలతో అంతర పంటగా పండించినప్పుడు ఖచ్చితమైన నిష్పత్తి పాటించాలి.

కంది+మొక్కజొన్న / జొన్న / సజ్జ -1:4

కంది+ప్రత్తి -1:4 లేదా  1:6

కంది+వేరుశనగ / సోయాచిక్కుడు - 1:7

కంది+పెసర / మినము- 1:4

కలుపు యాజమాన్యం : కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కలుపు నివారణకు విత్తిన 24-48 గంటలలోపు పెండిమిధలైన్ 1.0 నుండి  1.25 లీటర్లు అనగా లీటరు నీటికి 5.0 నుండి  6.0 మీ. లీలా చొప్పున కలిపి సమానంగా పిచికారీ చేయాలి. కందిలో విత్తిన తర్వాత 20,40 రోజులలో పైరు పెరిగే సాళ్ళ మధ్య దంతి లేదా గుంటకతోలి కలుపు లేకుండా చేయాలి. అధిక వర్షాల వాళ్ళ గుంతక కుదరకపోతే ఇమాజితపైర్ (పేరు స్యూట్) 250-300 మీ.లి. అనగా లీటరు నీటికి 1.25-1.5 మీ.లి. చొప్పున కలిపి పిచికారి చేసినచో గడ్డి మరియు వెడల్పకు కలుపును నివారించవచ్చును.

గమనిక : బహువర్షకా కంది రకాలను సాగుచేయడానికి రైతు సోదరులు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇలా సాగుచేయడం వలన కలిగే అనర్ధాలను గుర్తించడం లేదు. వెర్రి తెగులును కలుగజేసే నల్లికి బహువార్షికా కంది అతిధేయగా పనిచేస్తూ నల్లి వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. తద్వారా మొక్కలలో వంధ్యత్వాన్ని కలుగజేస్తుంది. వంధ్యత్వానికి గురైన మొక్కలు పుష్పిమ్చవు మరియు కథాకాయదు. కావున రైతు సోదురులు బహువార్షికా కందిని సాగుచేయరాదు.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.01960784314
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు