హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / గుర్రపు, తూటికాడతో సేంద్రియ ఎరువు తయారీ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గుర్రపు, తూటికాడతో సేంద్రియ ఎరువు తయారీ

గుర్రపు డెక్క,తూటికాడతో కంపోస్టు తయారీ

గుర్రపు డెక్క(ఐకార్నియూ క్రాసైమ్స్)ను, తూటికాడ(ఐపోమియా అక్వాటికా)ను కలుపుగా భావించి నివారించడం ఒక అంశమయితే దీనిని ఒక వ్యవసాయ జీవన వనరుగా వాడుకొని మల్చింగ్ లో, సేంద్రీయ ఎరువుల తయారీలో తద్వారా పంట ఉత్పాదకతను పెంపొందింపచేసే ప్రయత్నం మరొక ముఖ్యమైన అంశం.

భారతదేశంలో ఈ మొక్కలు సుమారు 20-30 లక్షల హెక్టార్ల నీటి వనరుల్లో విస్తరించినట్లు అంచనా. ఈ కలుపు మొక్కల నియంత్రణకు వివిధ కలుపు రసాయనాలు ఉన్నప్పటికీ వేగవంతమయిన ప్రత్యుత్పత్తి వలన వేగంగా కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందే గుణం వలన దీని నివారణ కష్టసాధ్యంగా మారింది.

దీనిని రెండు పద్ధతులు ఉపయోగించి ఎరువు తయారు చేసుకోవచ్చు.

గాలి చొరబడే పద్ధతిలో కంపోస్టు తయారీ

గుంత అడుగు భాగంలో గుర్రపు డెక్క కాడలు లేదా చెరకు కాడలు / కంది కట్టెలు పరచాలి. దీనివల్ల ఎరువుకు గాలి తగులుతుంది. ఎండిన గుర్రపు డెక్కను, తూటికాడను (2.5-5 సెం.మీ) ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలను (40 కి.గ్రా.) సమానంగా పేర్చాలి. ఒక పొరలాగ, తరువాత 50 గ్రా. మైక్రోబియల్ కల్బర్ను చల్లాలి. తరువాత ఇంకొక పొరను పైన చెప్పిన విధంగా అమర్చి దానిపైన 150-200 గ్రా. యూరియాను చల్లాలి. ఈ విధంగా కుప్పను మనకు అనుకూలమైన అంత ఎత్తువరకు అమర్చి, పైన బంక మన్నుతో కప్పి తేమను 50-60 శాతం ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా గుర్రపు డెక్క తూటికాడ ఎరువు 65 రోజుల్లో తయారవుతుంది .

flowers.jpg

 

తుటికాడ పెంట గుర్రపుడెక్క పెంట

పోషకాలు

పోషకాల శాతం

నత్రజని

2.32

 

2.01

భాస్వరం

0.45

0.36

పోటాష్

1.59

1.38

కర్బన పదార్ధం

40.44

38.66

సుక్ష్మధాతువులు

 

 

జింక్

125

110

ఐరన్

1595

1567

మాంగనీస్

964

852

కాపర్

48

39

 

 

 

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

 

3.01398601399
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు