హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / చైనా అస్టర్ పూల సాగులో మెళకువలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చైనా అస్టర్ పూల సాగులో మెళకువలు

ఉద్యానవనాలలో చైనా అస్టర్ పూల సాగు

శీతాకాలంలో ఆకర్షణియమైన వివిధ వర్ణాలతో లభించే పూలను, పూజా కార్యక్రమాలకి, కాడ పూలను బోకేలలో, మొక్కలను ఉద్యానవనాలలో పూల మళలో పెంచడానికి ఉపయోగించవచ్చు.

వాతావరణం

ఈ పూల మొక్కల సరైన పెరుగుదల, నాణ్యమైన పూల ఉత్పత్తికి చల్లని వాతావరణం, మంచి సూర్యరశ్మి లభించాలి. 20-30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం.

నేలలు

నాణ్యమైన, అధిక పూల దిగుబడికి నీరు బాగా ఇంకి పోయే లోతైన ఎర్ర గరప నేలలు అనుకూలం. నేల ఉదజని సూచిక 6.0 నుండి 7.0 మధ్య ఉండాలి.

రకాలు

కామిని, శశాంక్ పూర్ణిమ, ఆర్కా, అద్య, ఆర్కా అర్చన, వయోలేట్ కుషన్ రకాలు ఉన్నాయి.

ప్రవర్ధనం

దీనిని విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఒక ఎకరా పొలంలో సాగు చేయడానికి కావాల్సిన విత్తన ఉపయోగిస్తే మొలకశాతం బాగా ఉంటుంది.

నారు పెంచడం

సెప్టెంబర్ మాసంలో విత్తనాలని ఎత్తు నారుమడుల మీద వరుసలలో పలుచగా విత్తుకోవాలి. విత్తనాన్ని దగ్గర, దగ్గరగా విత్తుకోవడం వలన నారుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది.

నేల తయారీ

నేలని 3-4 సార్లు దుక్కి దున్ని, ఆఖరి దుక్కికి ముందు ఎకరానికి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేసుకొని కలీయదున్నాలి. తరువత నేలని 30 సెం. మీ. దూరంతో బోదెలు తయారు చేసుకోవాలి.

నాటే విధానం, సమయం

25 నుండి 30 రోజుల వయస్సు 3-4 ఆకులు కలిగిన ఆరోగ్యవంతమైన, బలమైన నారు మొక్కల్ని నాటుకోవడానికి ఎంచుకోవాలి. బోదెల మీద 30 సెం.మీ ఒక మొక్క ఉండే విధంగా నాటుకోవాలి. నారు మొక్కల్ని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నాటుకుంటే బాగా నాటుకుంటాయి. ;నాటిన వెంటనే పలుచగా నీరు పెట్టాలి.

ఎరువులు

నత్రజని, భాస్వరం ఎరువులు చాలా ముఖ్యం. నత్రజని లోపిస్తే మొక్కలు పొట్టిగా ఉండి, చిన్న పరిమాణంలో ఉన్న పూలను పుస్తాయి. భాస్వరం లోపిస్తే ఆలస్యంగా పుస్తాయి. ఎకరాకు 36 కిలోల నత్రజని, 48 కిలోల భాస్వరం, 24 కిలోల పోటాషియం నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో ముందు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు వేసుకోవాలి. తరువాత 36 కిలోల నత్రజనిని మొక్కలు నాటిన 40 రోజులకి వేసుకోవాలి.

నీటి యాజమాన్యం

వాతావరణ పరిస్ధితులు, నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. 5-6 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందిచాలి. మొక్కల వేర్లు పైనే (పిచు వేరు వ్యవస్ధ) ఉంటాయి. కాబట్టి పంట పూర్తి కాలం పాటు, నేల పై పొరల్లో అవసరమైన తేమ ఉంటె విధంగా చూసుకోవాలి.

కలుపు నియంత్రణ

పంట పూర్తి కాలంలో 2 నుండి 3 సార్లు చేతితో కలుపును తీసివేయాలి.

రేమ్మల గిల్లి వేత

నాటిన 30 రోజుల తరువత మొక్కల కాండం కోన భాగాన్ని తుంచి వేయాలి. దీని వలన పక్క కొమ్మలు ఎక్కువ సంఖ్యలో వచ్చి, పూల దిగుబడి పెరుగుతుంది.

మట్టిని ఎగదోయడం

పూల బరువుకి మొక్కలు పక్కలకి వంగి పోతాయి. మట్టిని మొక్కల మొదళ్ళలో ఎగదోయాలి.

పూత కోత

మొక్కలు నాటిన 70 నుండి 80 రోజులకి పూల పుస్తాయి. పూలను కాడలతో కోసినట్లయితే కట్ ప్లవర్ గా, విడిగా కోసినట్లయితే అలంకారానికి, పూజా కార్యక్రమాలకి ఉపయోగపడతాయి.

దిగుబడి

ఎకరానికి 6-7 టన్నుల పూల దిగుబడిని పొందవచ్చు

సస్యరక్షణ

మొగ్గ తొలిచే పురుగు : లార్వాలు పూమొగ్గలను ఆశించి లోపలి భాగాలని తింటాయి. పూర్తిగా వికసించిన పూలను ఆశించి పూరేకులను తింటాయి. దీని నివారణకు 3 గ్రా. కార్బరిల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

వేరుకుళ్ళు తెగులు : తేమతో కూడిన వెచ్చని వాతావరణం మురుగు నీరు వలన వస్తుంది,. కాండం, వేర్లు నల్లబడి, ఆకులు పండు బారుతాయి. మొక్కల అకస్మాత్తుగా చనిపొతాయి. డైధేన్ యం- 45 లీటరు నీటికి 2 గ్రా. చొప్పున కలిపిన ద్రావనంతో మొక్కల మొదళ్ళ దగ్గర తడిపి నివారించుకోవచు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.96296296296
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు