హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / నార్లాపూర్ గ్రామంలో రైతు స్థాయిలో విత్తనోత్పత్తి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నార్లాపూర్ గ్రామంలో రైతు స్థాయిలో విత్తనోత్పత్తి

రైతు స్థాయిలో విత్తనోత్పత్తి

గడిచిన 15 సంవత్సరాలలో వ్యవసాయ రంగంలో రైతులు అనుసరిస్తున్న విధానాలలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విత్తనాలకు సంబంధించి గతంలో రైతులు తమ విత్తనాన్ని తామే వాడుకునేవారు. దీని వలన

 • రైతులు సరైన సమయంలో విత్తనాన్ని విత్తుకోవచ్చు.
 • అనుకున్నటువంటి రకాన్నివిత్తుకోవచ్చు.
 • కలీలేని విత్తనాలను విత్తనంగా వాడుకోవచ్చు.
 • విత్తన ఖర్చుతగ్గించుకోవచ్చు.

కానీ ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం మార్కెట్ పై ఆధారపడుతున్నారు. దీని వలన రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. వాటిలో:

 • రైతులు ఎంపిక చేసుకొన్న విత్తనాలు మార్కెట్లో లభించక వేరే విత్తనం విత్తుకోవడం.
 • రైతుకు కావాల్సిన విత్తనం కోసం వివిధ కంపెనీలపై ఆధారపడటం.
 • విత్తేటటువంటి సమయం ఆలస్యమవడం.
 • విత్తనాలలో కలీరావడం.
 • స్వచ్చత లేకపోవడం.
 • దిగుబడి తగ్గిపోవడం.

nvoneకాబట్టి విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యుశుద్ధి కలిగిన విత్తనంతో మార్పిడి చేయాలి. నాణ్యమైన విత్తనం పైరు ఉత్పాదకతలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. గత నలభై సంవత్సరాలుగా అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రూపొందించి, వాటిని రైతులకు అందుబాటు ధరలలో అందించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయశాఖ, ఇతర ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు అవిరళంగా కృషి చేస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయశాఖ ద్వారా ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్ లో రాష్ట్రంలోని ప్రతి మండలంలో 'గ్రామీణ విత్తనోత్పత్తి కార్యక్రమం నిర్వహిస్తోంది.

వ్వసాయశాఖ ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, విత్తన ధృవీకరణ అధికారుల పర్యవేక్షణలో రైతులతో సొంతంగా నాణ్యమైన విత్తనాలను తయారు చేయడానికి అమలు జరుగుతున్న పథకం - "గ్రామీణ విత్తనోత్పత్తి పథకం"

పథకం ముఖ్య ఉద్దేశం

 • ఈ పథకం ద్వారా ప్రతి సీజన్లో మండలానికి 2-4 గ్రామాలను ఎంపిక చేసుకొని, గ్రామానికి 25 ఎకరాలలో 10-25 మంది రైతులలో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడం.
 • ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసుకొని ఉత్పత్తి చేయడం.
 • ఫౌండేషన్ విత్తనం నుండి సర్టిఫైడ్ విత్తనాన్ని ఉత్పత్తి చేయడం.
 • ఈ పథకం ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాలను రైతులు తమ గ్రామానికి సరిపడా పోను మిగతా విత్తనాలను ఇతర గ్రామాలకు సరఫరా చేయటం.
 • కలీలేని నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడం.
 • ధృవీకరణ చేయబడిన విత్తనాన్ని తయారు చేయడానికి ప్రాసెసింగ్, టెస్టింగ్ (పరీక్ష), ప్యాకింగ్, లేబులింగ్, ట్యాగింగ్ చేయబడుతాయి.

గ్రామీణ విత్తనోత్పత్తి పథకం అమలు పరచటంలో క్షేత్రస్థాయిలో నరైన గోదాం నదుపాయం లేకపోవడం, ఉత్పత్తి చేసిన విత్తనాన్ని తొందరగా కొనుగోలు చేసే సౌకర్యం లేకపోవడం వంటి కారణాల వలన వివిధ గ్రామాలలో పథకం అనుకున్న మేర లక్ష్యాలను సాధించలేక పోతుంది.

దీన్ని అధిగమిసూ నార్తాపూర్ గ్రామంలో 2013-14 రబీలో 'ఆదర్శ రైతు క్లబ్ కన్వీనర్ చేపరి సాంబయ్య, సభ్యుల సహకారంతో గ్రామంలో 25 ఎకరాలలో వరంగల్ (డబ్యూజి.ఎల్) 32100 అనేటువంటి బ్రీడర్ (మూల) విత్తనం నుండి ఫౌండేషన్ విత్తనాన్ని ఉత్పత్తి చేశారు. ఈ 25 ఎకరాల విస్తీర్ణంలో వేసిన విత్తనాన్ని సీనియర్ విత్తన ధృవీకరణ అధికారి, వరంగల్ ధృవీకరణ చేశారు. ఉత్పత్తి చేసిన ఫౌండేషన్ విత్తన నమూనాలను పరీక్షకు పంపగా సరైన విత్తనంగా ధృవీకరిస్తూ రిపోర్టు వచ్చింది.

ఖరీఫ్ 2014 సీజన్ కోసం 'ఆదర్శ రైతు క్లబ్' నార్లాపూర్ వద్ద సుమారు nvtwo1600 ఎకరాలకు సరిపడా 400 క్వింటాళ్ళ డబ్యూ.జి.ఎల్-32100 ఫౌండేషన్ విత్తనాలు అందుబాటులో ఉంచారు. ధర క్వింటాలుకు రూ.2600/-గా నిర్ణయించారు. ఈ విత్తనాలను రైతులు సుమారు 2-3 సంవత్సరాలు విత్తనంగా వాడుకోవచ్చు.

గ్రామంలో చేపట్టిన విత్తనోత్పత్తి కార్యక్రమంపై క్షేత్ర దినోత్సవాన్ని 01 జూన్, 2014న గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామారావు, జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు, వరంగల్, డా.చేరాలు, ఎ.డి.ఆర్. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వరంగల్, ఆర్.ఉమారెడ్డి, కో-ఆర్డినేటర్, డాట్ సెంటర్, వరంగల్, ఎ.డి.ఎ, పరకాల డివిజన్, ఎ.నాగరాజు, వ్యవసాయ అధికారి, పరకాల, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో విత్తనోత్పత్తి పథకం ద్వారా గ్రామ స్థాయిలో విత్తనాలను ఉత్పత్తి చేసి, లేబులింగ్, ట్యాగ్ లతో ఇతర రైతులకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంచటం అభినందనీయమైన కార్యక్రమంగా పేర్కొన్నారు.

గ్రామంలో ఉత్పత్తి చేసిన ఈ 400 క్వింటాళ్ళ ఫౌండేషన్ విత్తనాన్ని 2014 ఖరీఫ్ సీజన్లో జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్.ఎఫ్.ఎస్.ఎం) ద్వారా జిల్లాల్లోని వివిధ వ్యవసాయ డివిజన్లలో నిర్వహించే క్లస్టర్ డెమానుస్టేషన్స్ సరఫరా చేయడానికి జిల్లా అధికారులు కోరడంతో నివేదిక పంపించారు.

గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా రైతులు సొంతంగా గ్రామ స్థాయిలో విత్తనాలను ఉత్పత్తి చేసుకొని నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించాలని, పరకాల ఎ.డి.ఎ. బి.గంగారాం, మండల వ్యవసాయాధికారి ఎ.నాగరాజు తెలిపారు.

ఈ పథకం విజయవంతమవడానికి నార్తాపూర్ గ్రామంలో రాస్త్రీయ కృషి వికాస్ యోజన (ఆర్.కె.వి.వై.) 2013-14 పథకం ద్వారా రూ.4.35 లక్షల విలువ కలిగిన మినీ మొబైల్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను 90 శాతం సబ్సిడీపై నార్తాపూర్ గ్రామంలోని 'ఆదర్శ రైతు క్లబ్' కు అందజేశారు.

vithanothpathithree.jpgఈ మొబైల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా గ్రామస్థాయిలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాలను ప్రాసెసింగ్ చేసి ఆ విత్తనాన్ని బ్యాగులతో లేబులింగ్, ట్యాగులతో సిద్ధంగా ఉంచి వ్యవసాయశాఖ ద్వారా రైతులకు సరఫరా చేస్తారు.

ఈ కార్యక్రమం విజయవంతమవడానికి దోహదపడిన ఆదర్శ రైతు గ్రూపు సభ్యులు, కన్వీనర్, గ్రామ రైతులను అభినందిస్తారు. రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సమాచారం, సేవలు అందిస్తూ, అందుబాటులో ఉంటూ 4 వ రకాల మండల వ్యవసాయాధికారి ఎ.నాగరాజు తోడ్పాటును అదించారు.

నార్తాపూర్ గ్రామంలో ఉత్పత్తి చేసిన 404. 75 క్వింటాళ్ళ ఫౌండేషన్ విత్తనం ఖరీఫ్ 2014 సీజన్లో వరంగల్ జిల్లాలోని కింద పేర్కొనబడిన వ్యవసాయశాఖ సబ్ డివిజన్ / వ్యవసాయశాఖ మండలాలకు 'జాతీయ ఆహార భద్రత పథకం' ద్వారా రైతులకు సరఫరా చేయబడింది.

డివిజన్/మండలం

బ్యాగ్స్

క్వింటాళ్ళు

స్టేషన్ ఘన్ పూర్

200

50

జనగాం

120

30

మరిపెడ

170

42.5

నర్సంపేట

200

50

మహబూబ్ నగర్

84

21

గోవిందరావు పేట

200

50

మంగపేట

200

50

శాయంపేట

200

50

పరకాల

100

25

రాయపర్తి

130

32.5

మొత్తం

16040

404.75

వ్యవసాయ శాఖ ద్వారా నార్లపూర్ గ్రామంలో చేపట్టిన ఈ విత్తనోత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న రైతుల వివరాలు:

రైతు పేరు

తండ్రి పేరు

విత్తనోత్పత్తి విస్తీర్ణం

మెరుగు బలయ్య

ఎల్లయ్య

2.00

మెరుగు బిక్షపతి

ఐలయ్య

2.00

మెరుగు సంపత్త్

ఐలయ్య

2.00

కొత్తపల్లి విజేందర్

సాంబయ్య

1.00

కొత్తపల్లి పుష్ప

విజేందర్

1.00

కొత్తపల్లి రాజేశ్వర్ రావు

బంగారి

2.00

కొత్తపల్లి శ్రీనివాసు

రాజేశ్వర్ రావు

1.00

కొత్తపల్లి సంతోప్

రాజమౌళి

2.00

కొత్తపల్లి సాంబయ్య

రాజలింగం

2.00

బండ రవీందర్

ఆగయ్య

2.00

రాజ్ కుమార్

రామస్వామి

2.00

దమేరుప్పుల స్వరూప

మొగిలి

2.00

మొత్తం

21.00

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.0390625
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు