హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / ప్రస్తుత బి.టి.ప్రత్తిలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రస్తుత బి.టి.ప్రత్తిలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ

ప్రస్తుత బి.టి.ప్రత్తిలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ

ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తిని సుమారుగా 17.23 లక్షల హెక్టార్లలో విత్తుకోవడం జరిగినది. ప్రస్తుతం ప్రత్తి సుమారు 50 నుండి 65 రోజుల దశలో ఉన్నది. ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాలకు ప్రత్తి పెరుగుదల చాలా చోట్ల కుంటుపడటం గమనించడం జరిగినది. దానికి తోడు అక్కడక్కడా వడలు తెగులు, పేనుబంక మరియు పచ్చదోమ ఆశించడం వలన మొక్కల పెరుగుదల తగ్గింది. కొన్నిచోట్ల అధిక వర్షాలకు పోషకాల లోపం వలన ఆకులూ పండుబారి ఎరుపు రంగులోకి మారడం గమనించడం జరిగింది. కావున ప్రస్తుత తరుణంలో ఈ కారింది సమగ్ర సస్యరక్షణ చర్యలను పఠించి ప్రత్తి పంటను కాపాడుకోవచ్చును.

వడలు తెగులు

జులై మొదటి పాషం వరకు నెలకొన్న వర్షాభావ పరిస్ధితులు, ఆ తర్వాత, జులై - ఆగస్టు మాసాల్లో కురిసిన అధిక వర్షాలకు ప్రత్తిలో చాలా చోట్ల వడలు తెగులును గమనించడం జరిగినది. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కలు ఆకుపచ్చ రంగులోనే ఉండి తలల వాల్చడం జరుగుతుంది. దీని నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 లీటరు నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల చుట్టూ మరియు చుట్టూ ఉన్న మంచి మొక్కల మెదళ్ళ వద్ద కూడా వేరు వ్యవస్ధ బాగా తడిచేటట్లుగా ద్రావణాన్ని పోయాలి లేదా నాజిల్ తీసిన పంపుతో పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే చాలా వరకు వడలు తెగులు వ్యాప్తిని తగ్గించుకోవచ్చును. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు వారం లోపు రెండవ సారి కూడా ఈ ద్రావణంతో భూమిని తడపాలి.

పేనుబంక

ప్రస్తుతం ప్రత్తిలో చాలా చోట్ల పేనుబంక ఆశించి ప్రత్తిని బాగా నష్ట పరుస్తుంది. పేనుబంక తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క లేత కొమ్మలు మరియు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన మొక్క పెరుగుదల చాలా చోట్ల కుంటుపడటం జరిగింది. ఈ ఆకుల అడుగు బాగానే ఉన్న పేనుబంకలలో కొన్నింటికి రెక్కలు ఉండటం కూడా గమనించవచ్చును. సాధారణంగా ఈ రెక్కల పేనుబంక అనేవి పేనుబంక గుంపు బాగా ఉన్నప్పుడు లేదా పంట నాణ్యత సరిగా లేనప్పుడు మనం గమనించవచ్చును.

ఈ పేనుబంక తేనెలాంటి జిగట పదార్ధాన్ని విసర్జించడం వలన కొన్ని చోట్ల ఆకులూ జిగటగా ఉండి మెరపడం కూడా గమనించడం జరిగింది. ఈ పేనుబంకతో పాటు ఆశింతల పురుగు పిల్ల, తల్లి పురుగులు సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం మనము గమనించవచ్చు. అయితే వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే పురుగు మందుల పిచికారీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఆశింతల పురుగు తల్లి లేదా పిల్ల పురుగు రోజుకు 100-150 పేనుబంకలను తింటుంది. ఒకవేళ వీటి సంఖ్య లేనట్లయితే పురుగు ఉదృతిని బట్టి 0.2 గ్రా. ఎసిటమిప్రిడ్ లేదా 2 మీ.లి. పెఒరొనిల్ లేదా 2 మీ. లి. డైమిదోయేట్ లేదా 0.25 మీ.లి. ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రా. ప్లోనికండి లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.

పచ్చదోమ

ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు ఇప్పుడిప్పుడే ప్రత్తిలో చాలా చోట్ల పచ్చదోమ ఆశించి నష్టపరుస్తున్నట్లు గమనించడం జరిగింది. పచ్చదోమ తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన మీదట ఆకూ అంచు భాగాన పసుపు రంగులోకి మారి, క్రైందకు డొప్పలుగా మాదిరి ఎర్రబడటం గమనించవచ్చును. ఈ పచ్చదోమ ఉదృతి పంటకాలం మొత్తం ఉండే అవకాశం ఉంది. కావున తొలి దశలోనే 5% వేప కాషాయం లేదా వేపనూనె (1500 పి.పి.యమ్.) ను పిచికారీ చేసుకొని పచ్చదోమ గ్రుడ్లను నాశనం చేయవచ్చును. అలాగే ఖండానికి పైన ఉన్న లేత ఆకూ పచ్చ భాగంలో ప్లేనికండి, నీరు 1:20 నిష్పత్తిలో కలుపుకున్న మందు ద్రావణంతో కందం పూత పూసి కూడా సమగ్రంగా నివారించుకోవచ్చును. రసాయన మందుల పిచికారీ కొరకు 0.2 గ్రా. దయమీదకేసం లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఆకులు ఎర్రబడటం

అధికంగా కురుస్తున్న వర్షాల వలన చాలా చోట్ల ఆకులు పండుబారి ఎర్రబడటం గమనించవచ్చును. మరియు కొన్ని చోట్ల మొక్కల క్రైంద బాగానే ఉన్న ఆకుల పూర్తిగా ఎరుపు రంగులోకి మారి ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండటం గమనించవచ్చు. దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియమ్ సల్పేట్ + 10 గ్రా. యూరియా లేదా 10 గ్రా. 19:19:19 కలుపుకొని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

గులాబీ రంగు కాయ తొలుచు పురుగు

ముందుగా విత్తుకున్న ప్రత్తిలో అలాగే మిల్లుల దగ్గరలో ఉన్న ప్రత్తి చేలల్లో పూతకు వచ్చిన ప్రత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగును "గుడ్డి పూల" రూపంలో గమనించడం జరిగినది. కావున రైతు సోదరులందరు తక్షణమే ఈ క్రీంది జాగ్రత్తలను తీసుకున్నట్లయితే గులాబీ రంగు కాయతొలుచు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకునే అవకాశమున్నది.

  • పూతకు వచ్చిన ప్రతి ప్రత్తి శేత్రంలో తప్పని సరిగా ఎకరానికి 4 లేదా 8 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు పై నిషూ ఉంచుకోవాలి.
  • గుడ్డి పూలను ఎప్పటికప్పుడు ఏరివేసి నాశనం చేయాలి.
  • లింగాకర్షక బట్టలలో వరసగా 3 రోజులు 5-8 రెక్కల పురుగులు పడినట్లు గమనించినట్లయితే వెంటనే పురుగు గ్రుడ్లును మరియు చిన్న లార్వాలను చంపే శక్తి ఉన్న రసాయన మందులను మఖ్యంగా ప్రొఫెనోఫేస్ 2 మీ.లి. లేదా ధాయేదికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరిపైరిపాస్ 2.5 మీ.లి. లీటరు నీటికి కలుపుకొని వారం - పది రోజులకొకసారి అవసరం మేర పిచికారీ చేయాలి.
  • కాయలు పెరుతున్న దశలో, 10 కాయలలో ఒక లార్వాను గమనించినట్లయితే 0.5 గ్రా. ఇమామేక్తిన్ బెంజోయెట్ లేదా 1 మీ.లి. ఇండక్షకార్బ్ లేదా 0.4 మీ.లి. స్పైనోశాడ్ లేదా 0.5 మీ.లి. స్పైనటోరమ్ లీటరు నీటికి కలిపి పచ్చికారీ చేయాలి.
  • లింగాకర్షక బుట్టల్లోని రబ్బరు ఎరను కంపెనీ వారు సూచించిన సమయానికి ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు