హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / ప్లగ్ ట్రేలలో నారు పెంపకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్లగ్ ట్రేలలో నారు పెంపకం

విత్తన ప్రమాణాలు మరియు ప్లగ్ ట్రేలలో నారు పెంపకం

రైతులు విత్తన మొలక శాతం పరీక్షించిన తర్వాతే నారుమడులు పెంచుకోవాలి. రైతు స్థాయిలో సులభంగా మొలకశాతం పరీక్షించుకోవచ్చు. ఫిల్టర్ పేపర్లు తీసుకొని పరీక్షించవలసిన పంట గింజలను పేపర్లో వరుసగా ఒకదాని పక్కన మరొకటి పెట్టి పేపర్ను చుట్టాలి. ఆ తర్వాత చీకట్లో ఉంచి ఉదయం, సాయంత్రం పూట నీటితో తడి చేయాలి. వంగ, టమాట విత్తనాలు 5 నుండి 6 రోజులలో, మిరప అయితే 10-11 రోజులలో మొలకెత్తుత్తాయి. ఆ తర్వాత మొత్తం 100 విత్తనాలకు ఎన్ని మొలకెత్తితే అంత శాతంగా నిర్ధారించుకోవచ్చు.

వివిధ కూరగాయ పంటలలో కనీసంగా ఉండవలసిన విత్తన ప్రమాణాలు

పంట పేరు

మొలక శాతం

భౌతిక స్వచ్ఛత

టమాట

70 శాతం

98 శాతం

వంగ

70 శాతం

98 శాతం

మిరప

60 శాతం

98 శాతం

క్యాబేజి

65 శాతం

98 శాతం

కాలిఫ్లవర్

65 శాతం

98 శాతం

ఉల్లి

70 శాతం

98 శాతం

క్యారేట్

60 శాతం

95 శాతం

ప్లగ్ ట్రేలలో నారు పెంపకం

ఆధునిక పరిజ్ఞానం కూరగాయల్లో నారు పెంపకానికి పనికివస్తుంది. హైబ్రిడ్ కూరగాయల విత్తనాల ధర చాలా ఎక్కువ. naru pempakam.jpgఒక గ్రాము విత్తనం ధర రూ.35 నుండి రూ.70 వరకు ఉండి. సాంప్రదాయ పద్ధతిలో కూరగాయల నారు చేపట్టినప్పుడు నారు కుళ్ళు సమస్య, మృత్తిక సమస్యలతో నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నష్టం జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ప్లగ్ ట్రే పరిగ్యనంతో ప్రయోజనాలు అనేకం.

ప్లగ్ ట్రేలలో పెంచే విధానం

ప్లగ్ ట్రేలలో ముందుగా కోకోపీట్ / కొబ్బరి పీచు బాగా చివికినది నింపాలి. అలా నింపిన ప్లగ్ ట్రేలో మధ్యలో వేలితో చిన్న గుంత చేయాలి. దాంట్లో ఒక్క గింజ నాటాలి. ఆ తర్వాత కొబ్బరి పీచుతో కప్పాలి. కొబ్బరి పీచు 300 నుండి 400 శాతం నీటిని నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి వెంటనే విత్తనాలకు నీరు అందించాల్సిన అవసరం లేద. పంటను బట్టి 10 ట్రేలను ఒకదానిపైన మరొకటి పెట్టవచ్చు. అయితే ట్రేలలో నింపేందుకు వాడే కోకో పీట్ను వేప చెక్క లేదా విత్తనశుద్ధి శిలీంధ్ర నాశినులతో శుద్ధి చేయాలి. ఒక్కో ట్రే నింపడానికి ఒక కిలో నుండి 1200 గ్రా. కోకోపీట్ అవసరముంటుంది. విత్తనం నాటిన ట్రేలను 3 నుండి 6 రోజుల పాటు చీకట్లో ఉంచాలి. లేదా ట్రేలపై పాలిథీన్ కవర్ కప్పితే చీకటి కల్పించవచ్చు. కోకోపీట్లోని తేమ కపాడబడుతుంది. మొలక వస్తుంటే వెంటనే ట్రేలను ఒక్కొక్కటిగా పరచాలి. లేదంటే నారు మొక్కలు పొడుగా, బలహీనంగా పెరుగుతాయి. ఆ తర్వాత ట్రేలను షేడ్ హౌస్ లేదా నెట్ హౌస్లోకి తరలించాలి. వాతావరణ పరిస్థితులను బట్టి ట్రేలలోని నారుపై రోజ్ క్యాన్తో ప్రతిరోజు నీటిని పిచికారీ చేయాలి. నారుకుళ్ళ సోకకుండా శిలీంధ్రనాశకాలు కలిపిన నీటితో బ్రేలను తడపాలి. మొక్కలు 12, 20 రోజులలో నీటిలో కరిగే ఎరువులు పాలిఫీడ్) ఒక లీటరు నీటికి 3) గ్రా, చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు పెరుగుదల బాగుంటుంది. అలా పెరిగిన మొక్కలను ప్రధాన పొలంలో నాటే ముందు నీటిని అపివేసి, షేడ్ నెట్ నుండి తొలగించి గట్టి పరచాలి. మొక్కలు పంటను బట్టి 21 రోజుల నుండి 42 రోజులలో ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి. విత్తనాలు మొలకెత్తిన 7 నుండి 10 రోజులలో పరుగు మందులు పిచికారీ చేసి పరుగులు, వైరస్ వాహకాలను నిరోధించవచ్చు. మిరప, వంగ, టమాట పంటలకు ప్లగ్ ట్రేలలో పెంపకం అత్యంత లాభదాయకం. కాలిఫ్లవర్, క్యాప్సికం నారును పెంచుకోవచ్చు.

ప్రధాన లాభాలు

మొలక శాతం చాలా ఎక్కువ.

మొక్కలలో నారుకుళ్ళ సమస్య ఉండదు.

వేరు అభివృద్ధి చాలా ఎక్కువ.

ప్రధాన పొలంలో నాటిన తర్వాత వెంటనే నాటుకుంటాయి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
3.00657894737
Syedpashah Sep 19, 2018 08:39 AM

Mirapa naaru yekka doruku thundhi khammam area lo

దిండి తిరుపతి రావు Aug 31, 2018 10:20 AM

వంగ నారు ఎక్కడ దొరుకుతుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు