హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / భూసార పరీక్షలు - మినీ భూసార పరీక్షా కిట్ల
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూసార పరీక్షలు - మినీ భూసార పరీక్షా కిట్ల

భూసార పరీక్ష పద్ధతులు

పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడంలో పొలంలోని మట్టి కీలక పాత్ర పోషిస్తుంది. అట్టి మట్టి పరిరక్షణ కోసం మట్టి నమూనాలను సేకరించి వాటిపై పరీక్షలు నిర్వహించి తద్వారా భూసారాన్ని నిర్ధారించడం వంటి కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నాం.

మన రాష్ట్రంలో 1 ఏప్రిల్ 2017 నుండి భూసార పత్రాలు పంపిణీ పథకం రెండవ విడత కార్యక్రమం (2017-18) అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద మొత్తం రెండు సంవత్సరాల కాలంలో అంటే 2017-18, 2018-19 సంవత్సరాల కాలంలో రైతుల పొలం నుండి మట్టి నమూనాలు సేకరించి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరైతుకు భూసార పరీక్షా పత్రాలు అందించడం మన లక్ష్యం.

ఈ పథకం కింద మట్టి నమూనాలు సేకరించడానికి ఏప్రిల్, మే మాసాలు చాలా అనుకూలమైనది. ఈ సమయంలో మన భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి మన మండల వ్యవసాయాధికారుల సలహా నూ చనలు, నవగా కారంతో, వ్యవసాయు విస్తరణాధికారులు రైతుల పొలాల నుండి మట్టి నమూనాలను సేకరించి అందుబాటులోని జిల్లా భూసార పరీక్షా ప్రయోగశాలలకు ఆ మట్టి నమూనాలకు సంబంధించిన సమాచార పత్రాన్ని జతచేసి పంపించవలసి ఉంటుంది.

భూసార పరీక్షా కేంద్రాలలో ఈ మట్టి నమూనాలపై పరీక్షలు నిర్వహించి ఆయా మట్టిలో లభ్యమయ్యే ప్రధాన అంటే ఎన్.పి.కె., సూక్షధాతువులు అంటే ఇనుము, జింక్, బోరాన్ ఇతరత్రా సేంద్రియ కర్బనం ఇ.సి., పి.ఎచ్. వెుదలగు వాటి గురించిన సమాచారమంతా సాయిల్ హెల్త్ కారులలో పొందుపరిచి రైతులకు అందిస్తారు. అంతే కాకుండా ఆ భూమి అనుకూలతను బట్టి ఏయే పంటలు వేయాలో, ఏ ఎరువును ఎంత మోతాదులో వాడాలో = చెప్పడమే కాక సమగ్ర పోషక యాజమాన్యం గురించి కూడా తెలియజేస్తారు. క్షార భూములైనా ఆమ్ల భూములైనా వాటిని గుర్తించి వాటిని సాగుకు అనుకూల పరచడానికి చేపట్టవలసి చర్యలు కూడా సూచిస్తారు.

మన రాష్ట్రంలో జిల్లా స్థాయిలో అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాలలో, వ్యవసాయ కొనుగోలు కేంద్రాలలో ఉన్న భూసార పరీక్షా ప్రయోగశాలు పైవిధులను నిర్వర్తిస్తున్నాయి. ఐనప్పటికీ రాష్ట్రంలో ప్రతి రైతు పొలం నుండి మట్టి నమూనాలు సేకరించి మొత్తం రాష్ట్రంలోని 55.54 లక్షల రైతుసోదరులకు భూసార పరీక్ష పత్రాలను వారికి అందుబాటులోనే అంటే గ్రామస్థాయిలోనే అందజేసే సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2050 మినీ భూసార పరీక్ష కిట్లను కొనుగోలు చేసి వాటిని గ్రామస్థాయిలో స్థాపించి, ఆ గ్రామంలోని ప్రతి రైతు భూసార పరీక్షలు వ్యవసాయ విస్తరణాధికారి ద్వారా నిర్వహించాలని ప్రతిపాదించారు.

వ్యవసాయ విస్తరణాధికారులు వీటిని తమ తమ క్లస్టర్లలోని అతిపెద్ద గ్రామ పంచాయితీ భవనంలోగానీ, ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ భవనంలో గానీ లేదా ఆయా గ్రామ సర్పంచ్ను సంప్రదించి వారి సలహా సూచనల మేరకు గ్రామంలోనే ఒక సురక్షిత ప్రదేశంలో ఈ మృద పరీక్షక్లను స్థాపించి భూసార పరీక్షలను నిర్వహించడానికి నిర్ణయించారు.

bhusara.jpg

మృద పరీక్షక్ / మినీ భూసార పరీక్షా కిట్లు భూసార పరీక్షల కొరకు ఎంతో అనుకూలమైనవి. ఇవి సులభంగా గ్రామాలకు తరలించవచ్చు. ఈ పరికరాలతో డిజిటల్, క్వాంటిటేటివ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించవచ్చు. వీటి ద్వారా ప్రతి మట్టి నమూనాలో 12 ప్రధాన పరీక్షలు నిర్వహించి పోషకాల లభ్యతను నిర్ధారించవచ్చు. పరీక్షల ఫలితాలను రైతులకు ఎస్.ఎం.ఎస్.ల ద్వారా నేరుగా చేరవేయవచ్చు.

కావున వున రాష్ట్రంలో నూతనంగా నియమించబడిన ఉత్సాహవంతులైన యువ వ్యవసాయ విస్తరణాధికారులు, ముందు నుండి వ్యవసాయశాఖలో పనిచేసి అనుభవం గడించిన విస్తరణాధికారులు మొత్తం రెండువేల మంది వ్యవసాయ విస్తరణా అధికారులను ఈ మృద పరీక్షక్లను సద్వినియోగపరచుకుని, తెలంగాణ రైతుసోదరులందరికీ భూసార పరీక్షలు నిర్వహించి వారికి భూసార పరీక్ష కారులు అందించడమే లక్ష్యం. తద్వారా రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి రైతుల పెట్టుబడిని తగ్గించడమే కాక భూ కాలుష్య నివారణకు తోడ్పాటు అందించగలరని ఆశిద్దాం.

భూసార పరీక్ష-రైతు నేలలకు రక్ష! . . . . . . . . . . .

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు