অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రైతులకు సూచనలు

రైతులకు సూచనలు

వరి పంట పై చిట్కాలు

వరి పంట పై జాతీయ ఆహార భద్రతా సంస్థ ( నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ - ఎన్.ఎఫ్.ఎస్.ఎం.) అందించే చిట్కాలు

మంచి దిగుబడికి తోడ్పడే చిట్కాలు

 • మీ ప్రాంతానికి సిఫారసు చేసిన అధిక దిగుబడి / హైబ్రిడ్ రకాల ధ్రువీకరించిన విత్తనాలను అధికృత ఏజెన్సీలు / డీలర్ల నుంచి సమకూర్చుకోండి
 • తెగుళ్ళు సోకడాన్ని వీలున్నంత వరకు నివారించడం కోసం విత్తనాలను సిఫారసు చేసిన శిలీంధ్ర నాశినులతో (ఫంగిసైడ్) శుద్ధి చేయండి
 • మొలకెత్తని ( ప్రి- జెర్మినేటెడ్ ) వరి విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్గ దర్శకాల మేరకు నారు మళ్ళలో విత్తండి
 • విత్తే సమయంలో సిఫారసు చేసిన మోతాదులలో పశువుల ఎరువును; ప్రధాన, సూక్ష్మ పోషకాలను నారుమళ్ళలో వేయండి . శ్రీ వరి రకం వంటి నారుమళ్ళ పెంపకం అటు యంత్రాలతోను, ఇటు సాంప్రదాయిక పద్ధతిలోను శాస్త్రీయమైన సిఫారసులకు అనుగుణంగా సాగించండి
 • పొలంలో పోషకాల పరిస్థితిని గురించి తెలుసుకుని, తగిన సిఫారసులు పొందడానికి వీలుగా భూసార పరీక్ష జరిపించండి. ప్రధాన, సూక్ష్మ పోషకాల విషయంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధారణ సిఫారసులను ప్రత్యామ్నాయంగా పాటించండి.
 • ఆమ్లగుణం కలిగిన నేలలలో, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసుల మేరకు, పొలాన్ని దున్నే సమయంలో హెక్టారుకు 2-4 క్వింటాళ్ళ వంతున సున్నం లేదా సున్నపుపదార్ధాలను వేయండి
 • అధిక దిగుబడి / హైబ్రిడ్ రకాల వరి విత్తనాల చిన్న సంచులను ఎన్.ఎఫ్.ఎస్.ఎం. పంపిణీ చేస్తున్నది. ఆసక్తి కలిగిన రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించవచ్చు.

జాతీయ ఆహార భద్రతా సంస్థ నుంచి రైతులకు సహాయం

 • ధ్రువీకరించిన అధిక దిగుబడి వరి విత్తనాలను క్వింటాలు 500 రూపాయల వంతున లేదా, 50 % ధరకు (ఏది తక్కువైతే ఆ ధరకు ) పంపిణీ చేసే సహకారం
 • హైబ్రిడ్ వరి విత్తనాలను క్వింటాలు 2,000 రూపాయల వంతున లేదా, 50 % ధరకు (ఏది తక్కువైతే ఆ ధరకు ) పంపిణీ చేసే సహకారం
 • క్వింటాలు 1,000 రూపాయల వంతున హైబ్రిడ్ వరి విత్తనాలను ఉత్పత్తి చేసే సహకారం
 • హెక్టారుకు 500 రూపాయల వంతున లేదా 50 % ధరకు (ఏది తక్కువైతే ఆ ధరకు) సూక్ష్మ పోషకాలను అందించే సహకారం
 • హెక్టారుకు 500 రూపాయల వంతున లేదా 50 % ధరకు (ఏది తక్కువైతే ఆ ధరకు) ఆమ్ల భూములకు సున్నం పంపిణీలో సహకారం
 • కలుపుతీసే యంత్రాన్ని ( కోనో వీడర్ ) , ఇతర పరికరాలను 3,000 రూపాయలకు లేదా వాటి ధరలో 50 % ధరకు ( ఏది తక్కువైతే ఆ ధరకు) అందించే సహకారం
 • విత్తనాలను విత్తే , అనేక రకాల నాట్లు వేసే , కలుపు తీయడానికి ఉపయోగపడే , " జీరో టిల్ సీడ్ డ్రిల్ / మల్టి క్రాప్ ప్లాంటర్ / సీడ్ 6 డ్రిల్ / పవర్ వీడర్ ) యంత్రాలను ఒక్కొక్కటి 15,000 రూపాయల వంతున, లేదా 50 % ధరకు ( ఏది తక్కువైతే ఆ ధరకు) అందించే సహకారం
 • రోటవేటర్‌ను 30, 000 రూపాయలకు లేదా 50 % ధరకు ( ఏది తక్కువైతే ఆ ధరకు) కొనుగోలు చేయడంలో సహకారం
 • పురుగు మందు చల్లే (నేప్‌శాక్) స్ప్రేయర్‌ను 3,000 రూపాయలకు లేదా 50 % ధరకు ( ఏది తక్కువైతే ఆ ధరకు) కొనుగోలు చేయడంలో సహకారం
 • పంటను సంరక్షించడానికి ఉపయోగపడే రసాయనికాలను హెక్టారుకు 500 రూపాయలవంతున లేదా 50 % ధరకు ( ఏది తక్కువైతే ఆ ధరకు ) అందించే సహకారం
 • హైబ్రీడ్ రకాల సాగు , శ్రీ వరి సాగు , మొదలైన మెరుగైన సాగు పద్ధతుల విషయంలో క్షేత్ర ప్రదర్శనలకు కూడా అవకాశం వుంది
 • రైతులు ఎన్ ఎఫ్ఎస్ఎం నిర్వహించే వ్యవసాయ క్షేత్ర పాఠశాలలలో కూడా పాల్గొన వచ్చు.

ఆధారం: వ్యవసాయ మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వం
మరిన్ని వివరాలకోసం మీకు సమీపంలోని వ్యవసాయ అధికారిని సంప్రతించండి ; లేదా , చార్జీ చెల్లించవలసిన అవసరంలేని ( టోల్ ఫ్రీ ) కిసాన్ కాల్ సెంటర్ ఫోన్ నంబరు 1800-180-1551 కు ఫోన్ చేయండి.

సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించేందుకు ఆసరా

సేంద్రీయ ఎరువులను, దిగువ పేర్కొన్న పధకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

 • సేంద్రీయ వ్యవసాయం పై జాతీయ ప్రణాళిక (National project on organic farming – NPOR) క్రింద, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, ప్రణాళికకు అయ్యే మొత్తం ఖర్చులో 40.00 లక్షల రూపాయల వరకు 25 శాతం ఒక్కొక్క కేంద్రానికి చొప్పున, పండ్ల, కూరగాయల వ్యర్థాలతో తయారు చేసే ఎరువుల కేంద్రాలకు యివ్వబడుతుంది. క్రిముల తో తయారు చేసే ఎరువుల కేంద్రాలకు, కేంద్రానికి రూ 1.50 లక్షరూపాయల చొప్పున రుణం, నాబార్డ్ (NABARD) ద్వారా, వేరే విధంగా రాయితీ యివ్వబడుతుంది.
 • జాతీయ పండ్ల తోటల పెంపక సంఘం (National Horticulture Mission) క్రింద, వానపాముల వంటి క్రిములతో తయారు చేసే ఎరువు (వర్మి కంపోస్ట్) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కావలసిన ఆర్థిక సహకారం, ఒక్కొక్క లబ్ధిదారునికి పెట్టుబడి ఖర్చు 30,000రూపాయల గరిష్ట పరిమితిలో 50 శాతం యిస్తుంది.
 • జాతీయ భూసారం మరియు భూ స్వాస్థ్యం (National project on management of soil health and fertility - NPMS) నిర్వహణ ప్రణాళిక క్రింద హెక్టారుకు 500రూపాయల చొప్పున సేంద్రీయ ఎరువులను అభివృద్ధి చేయడానికి, ఒక నిబంధన ఉంది.
 • రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన (RKVY- జాతీయ వ్యవసాయ అభివృద్ధి పధకం) ద్వారా కూడ సేంద్రీయ ఎరువులకు సహకారం అందుబాటులో ఉంది.
 • దీనివలన పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది

శీతలీకరించిన గిడ్డంగుల నిర్మాణానికి ఆసరా

ప్రభుత్వం, శీతలీకరించిన గిడ్డంగుల నిర్మాణానికి, క్రింది విధంగా, పేర్కొన్న పధకాల ద్వారా సహకారం అందిస్తోంది.

 • National horticulture mission (జాతీయ పండ్ల తోటల పెంపక సంఘం ) పధకం ద్వారా, పంట చేతికి వచ్చిన తరువాత అభివృద్ధి పరచే నిర్మాణాలకు, శీతలీకరణ గిడ్డంగులతో సహా, సహకారం అందిస్తున్నది.
 • టెక్నాలజీ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ ఆఫ్ హార్టి కల్చర్ యిన్ నార్త్ ఈస్ట్రన్ స్టేట్సే యింక్లూడింగ్ సిక్కిం, జమ్ము& కాశ్మీర్, హిమచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ - TMNE (Technology mission for integrated development of horticulture in north – eastern states in cluding sikkim, jammu and Kashmir, himachal Pradesh and uttarakhand) – (పండ్ల తోటల పెంపక సమాగ్రాభివృద్ధి సాంకేతిక సంఘం, ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం తో సహా జమ్ము& కాశ్మీర్, హిమచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లకు, ఈ పధకం ద్వారా ఫలసాయం దిగుబడి అయిన తరువాత చేసే నిర్వహణ, అనగా శీతలీకరించిన గిడ్డంగుల నిర్మాణం/ ఆధునీకీకరణ / విస్తరించడం వంటి అంశాలకు సహకారం అందిస్తుంది.
 • జాతీయ పండ్ల తోటల పెంపక సమితి (National horticulture board), ప్రధాన పెట్టుబడి ఖర్చు కు యిచ్చే రాయితీ పధకం పండ్ల తోటల ఉత్పత్తులకు శీతలీకరించిన గిడ్డంగుల నిర్మాణ / విస్తరణ / ఆధునీకీకరణ / కు అన్వయించడం ద్వారా శీతలీకరించిన గిడ్డంగుల నిర్మాణ / ఆధునీకీకరణ / విస్తరణ లకు సహకారం అందిస్తున్నది.
 • వ్యవసాయ మరియు శుద్ధి చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అధికార సంఘం - ( Agriculturals processed food products export development authority – APEDA) ద్వారా నిర్మాణాభివృద్ధి పధకం నుండి సమగ్రమైన గిడ్డంగుల నిర్మాణం, శీతలీకరణ సదుపాయాలతో సహా ఏర్పాటు చేయడానికి సహకారం అందిస్తుంది.
 • ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ( ministry of food processing industries), శీతలీకరణ నిర్మాణాల అభివృద్ధి, శీతలీకరించిన గిడ్డంగులతో పాటు, ఈ పధకం క్రింద శీతలీకరణ శ్రేణి, అనుబంధ విలువ మరియు సంరక్షణ కట్టడాలకు సహకారం అందిస్తుంది.

వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు

రేవతి కార్తి (30.3.11 నుండి 13.4.11)

వరిస్వల్పకాలిక రకాల కోతకు తయారి, అశ్వినీ కార్తి వరికి పొలం తయారి
జొన్నజనవరి మొదటి వారంలో విత్తిన జొన్న కంకులకు పురుగుల నుండి రక్షణ
వేరుశెనగడిసెంబర్ ఆఖరులో విత్తిన పంట త్రవ్వకాలు
ప్రత్తిమాగాణి ప్రత్తిలో కాయ తొలిచే పురుగు నివారణ మందులు చల్లుట.
చెఱకుఅంతర కృషి, నీరు పెట్టుట, బోదె సవరింపులు
పసుపుఆగష్టులో నాటిన పంట త్రవ్వకాలు, పండుట, మార్కెట్ కు పంపుట.
పొగాకుఅమ్మకాలు
పండ్లునిమ్మ, నారింజలో ఎండు కొమ్మల కత్తిరింపు, బోర్డోమిశ్రమం పూయుట, గజ్జి రాకుండా మందులు చల్లుట, ద్రాక్ష అమ్మకాలు పూర్తి చేయుట, అరటికి అంతరకృషి.
కూరగాయలుఉల్లిగడ్డల త్రవ్వకం, ఆకు కూరలకు ఎరువులు వేయట, కాకర పాదులు తయారు చేయట.
అల్లంత్రవ్వకాలు పూర్తి .చేయుట, దుక్కులు తయారు చేయట

అశ్విని కార్తె (14.4.11 నుండి 27.04.11)

సజ్జవేసవి పైరు కోతలు
వరికోతలు కత్తెరకు (కృత్తిక) వరి నారు పోయుట
జొన్నవేసవి జొన్న పంట సాగు
మొక్కజొన్నృవేసవి పంట విత్తుట
గోగుఅంతరకృషి, మొక్కలను పలుచన చేయుట
పండ్లుఅరటి, మామిడి, జామనాట్లు, కొబ్బరి చెట్లకు ఎరువులు వేయట, రేగు, దానిమ్మ నాట్లు
పప్పుధాన్యాలువర్షాలు ఆలస్యం అయినచో, కంది విత్తుటకు భూమిని తయారుచేయట, విత్తుట
కూరగాయలుబీర, సొర, పొట్ల, గుమ్మడి – విత్తుట
సువాసన మొక్కలునిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రోనల్లా నాట్లు

రోహిణి – మృగశిర కార్తెలు (25.05.11 నుండి 21.06.11)

వరిసార్వ లేక అబి వరినారు పోయుట, వరి వేయ బోయే పొలాల్లో ఎరువులు వేయుట
మొక్కజొన్నదమ్ములు చేయుట, ఎరువులు వేసి దుక్కుల దున్నుట, ఖరీఫ్ పంటలను విత్తుట.
కాయ ధాన్యాలుతక్కువ పంటక కాలపు పెసర, మినుము, కంది విత్తుట, అంతర కృషి చేయుట
గోగురసాయనిక ఎరువులు వేయుట
పసుపుభూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, విత్తనం వేయుట (కడప, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో)
కూరగాయలుబెండ, గోరుచిక్కుడు విత్తుట, గుమ్మడి, సొర, పొట్ల, కాకర పాదులు పెట్టుట.
సజ్జఎరువులు వేసి, దుక్కులు దున్నుట, విత్తనం వేయుట
ఆముదంఎరువులు వేసి, దుక్కులు దున్నుట
ప్రత్తిఎరువులు వేసి, దుక్కులు దున్నుట, విత్తనములు వేయుట
పండ్లుద్రాక్షకు క్రిమిసంహారక మందులు చల్లుట, ఎరువులు వేయుట, నిమ్మకు ఎరువులు, రేగు, దానిమ్మ మొక్కల నాట్లు (అంటు కట్టే మొక్కలకు మామిడి టెంకలు నాటడం)
వేరుశెనగరసాయనిక ఎరువులు వేసి, విత్తుట
సువాసన మొక్కలురూషాకామంచి, ఫార్మ రోజా విత్తనాలు చల్లటం

ఆర్ద్ర కార్తె (22.06.11 నుండి 6.07.11)

వరినారు మళ్లలో అంతర కృషి, సస్యరక్షణ
జొన్నదుక్కులు దున్నుట, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయుట
మొక్కజొన్నసస్యరక్షణ – రెండవ దాాఫా ఎరువులు వేయుట
పండ్లుమామిడి, నిమ్మ, నారింజ, అరటి, సపోటాలకు ఎరువులు వేయుట, ద్రాక్షతీగలను పారించుట, మందులు చల్లుట, జామ, సపోటాలకు అంట్లు కట్టుట, దానిమ్మ, రేగు, అనాస నాట్లు వేయుట.
కొర్రఎరువులు వేయుట, దుక్కి తయారుచేయుట
వేరుశనగఅంతరకృషి, సస్యరక్షణ
ఆముదంకలుపుతీయుట. సస్యరక్షణ
కూరగాయలుచేమ, వంగనాట్లు
సువావస మొక్కలుకామంచి గడ్డి, నిమ్మగడ్డి మొక్కలు నాటడం

పునర్వసు కార్తె (7.7.11 నుండి 19.7.11)

వరిసార్వా లేక అబి వరి నాట్లు, ముందుగా నాటిన వరిలో అంతరకృషి, సస్యరక్షణ
సజ్జరసాయనిక ఎరువులు వేసి, పునాస లేక ఖరీఫ్ పైరు విత్తుట
వేరుశెనగఅంతరకృషి, సస్యరక్షణ
ఆముదంరసాయనిక ఎరువులు వేసి, విత్తుట
మిరపనారుమళ్లలో విత్తులు జల్లుట
పసుపుదుగ్గిరాల ప్రాంతంలో నాట్లకు భూమిని తయారు చేయట, ఎరువులు వేయుట, గోదావరి ప్రాంతంలో పైరులో కలుపు తీయుట, గొప్పు త్రవ్వుట (త్రవ్వటం)
పూలుచామంతి, నారుపోయుట, గులాబి, మల్లి, కనకాంబరం చెట్లకు ఎరువులు వేయుట, సస్యరక్షణ
జొన్నపునాస లేక ఖరీఫ్ జొన్న విత్తుట, విత్తన పంటకు ఎరువులు వేయుట, సస్యరక్షణ
మొక్కజొన్నఅంతరకృషి, సస్యరక్షణ, నెలాఖరులో ఎరువులు వేయుట
ప్రత్తివర్షాధారపు పంట విత్తడం, ముందుగా వాటిన ప్రత్తిలో అంతరకృషి, ఎరువులు వేయుట
పసుపృదుగ్గిరాల ప్రాంతంలో పసుపునాట్లు
చెఱకుసస్యరక్షణ, ఎరువులు వేయుట
మిరపనారుమళ్లలో సస్యరక్షణ
పొగాకునారుపోయుట, తర్వాత సస్యరక్షణ
పసుపుఆర్మూర్, మెట్టుపల్లి, కోరట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపులో కలుపు తీయుట, ఎరువులు వేయుట, కృష్ణా జీల్లాలో భూమిని తయారు చేయుట, విత్తడం పూర్తి చేయుట
వరిఅంతకృషి, సస్యరక్షణ, ఉల్లికోడు తట్టుకునే రకాల నాట్లు పూర్తి చేయుట
మొక్కజొన్నరసాయనికి ఎరువులు వేయుట

పుష్యమి కార్తె (20.7.11 నుండి 2.8.11)

వరిసస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట
జొన్నఅంతరకృషి, మొక్కలు పలుచన చేయట, సస్యరక్షణ
మొక్కజొన్నఅంతరకృషి, సస్యరక్షణ
కొర్రవిత్తనం వేయుట
మిరపనాట్లకు భూమి తయారుచేయట
పొగాకునారుమళ్లు తయారుచేయట
పండ్లుతక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మజాతి మొక్కలు నాటుట, దానిమ్మ, రేగు, అనాస చెట్టు
వనమహోత్సవంచెట్ల నాట్లకు తయారి, పొలాల గట్లపై చెట్లనాట్లకు తయారి

ఆశ్లేషా కార్తె (3.8.11 నుండి 16.8.11)

జొన్నఅంతరకృషి, రెండవ దఫా ఎరువులు వేయుట, సస్యరక్షణ
సజ్జఅంతరకృషి, సస్యరక్షణ
వేరుశెనగసస్యరక్షణ
ఆముదంరసాయనిక ఎరువులు వేయుట, అంతరకృషి, సస్యరక్షణ
పొగాకునారుమళ్లలో సస్యరక్షణ, పొగాకు వేయు చేలలో దుక్కులు తయారుచేయుట
పశుగ్రాసాలుచలి కాలపు పశుగ్రాసాల నాట్లకు నేలను తయారుచేయుట, విత్తనం సేకరించుట
పశువులువ్యాధులు రాకుండా టీకాలు వేయించుట
చేపల పంపకంమరుగులు నిర్మించుపట, విత్తనం సేకరించుట
అటవీ శాస్త్రంమెట్టపొలాలల గట్లపై చెట్లు నాటుట
పండ్లుజీడిమామిడి తోటల నాట్లు, మామిడి మొక్కల నాట్లు, ఎరువులు వేయుట

మాఘ కార్తె (17.8.11 నుండి 30.8.11)

జొన్నమాఘి జొన్నకు నేల తయూరీ
సజ్జసస్యరక్షణ
కొర్రరసాయనిక ఎరువులు వేసి అంతరకృషి చేయుట
ఆముదంఅంతరకృషి, సస్యరక్షణ, దాసరి పురుగు నివారణ
పొగాకునారుమళ్లలో సస్యరక్షణ
పసుపుమే, జూన్, జూలై నెలల్లో నాటిన పైరులో సస్యరక్షణ, ఎరువులు వేయుట
వరిసస్యరక్షణ, కలుపు తీయుట, రెండవ దఫా ఎరువులు వేయుట
కాయధాన్యాలుతక్కువ పంట కాలపు మినుము పంటకు వస్తుంది
వేరుశెనగసస్యరక్షణ
ప్రత్తిసస్యరక్షణ
మిరపనారుమడిలో సస్యరక్షణ, నాట్లకు దుక్కులు తయారుచేయుట
పండ్లుఎక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో నిమ్మ మొక్కలు నాటుట, అరటి నాట్లకు నేలను తయారు చేయట, విత్తనం పిలకలను సేకరించుట
సజ్జకోతలు
నువ్వులుజూన్ నెలలో పేసిన పైరు కోతలు
ప్రత్తిసస్యరక్షణ
పొగాకుపొగాకు వేయ చేలలో దుక్కులు దున్నటం కొనసాగించుట
పశుగ్రాసాలుశీతాకాలపు పశుగ్రాసాల విత్తనం సేకరించుట, నేలను తయారు చేయుట

పుబ్బ కార్తె (31.8.11 నుండి 10.9.11)

వరిరసాయనికి ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు తీయుట
జొన్నరబీ జొన్న వేయుటకు దుక్కులు తయారుచేయుట
వేరుశెనగసస్యరక్షణ, కలుపు తీయుట
ఆముదంసస్యరక్షణ, ఎరువులు వేయుట
పసుపుఆగష్టులో నాటిన పైరులో కలుపు తీయుట, జూన్ లో నాటిన పంటకు పొటాష్ వంటి ఎరువులు వేయుట, సస్యరక్షణ
కూరగాయలుక్యాబేజి, కాలిఫ్లవర్ పంటలకు నారు పోయుట

ఉత్తర కార్తె (11,9,11 నుండి 28.9.11)

సజ్జరబీ పంటలకు రసాయనిక ఎరువులు వేయుట, విత్తుట
వేరుశనగసస్యరక్షణ
ఆముదంసస్యరక్షణ
ప్పత్తిసస్యరక్షణ
మిరపమిరప తోటలలో ఖాళీలను పూరించుట, సస్య రక్షణ, అంతరకృషి
పొగాకునారుమడిలో సస్యరక్షణ, పొగాకు వేయబోయే చేలలో దుక్కులు దున్నుట
కూరగాయలువంగ, టమాటో నాట్లు
జీలకర్రవిత్తుట
వామువిత్తుట
పశుగ్రాసాలులూనర్స్, బర్సీము, పిల్లి పెసర, జనుము విత్తుట
పండ్లుకోస్తా జిల్లాల్లో అరటి పిలకల నాట్లు, రేగు పండ్ల మొక్కలు, దానిమ్మ మొక్కల నాటు

హస్త-చిత్త కార్దెలు (29.9.11 నుండి 23.10.11)

జొన్నజూలై నెలలో విత్తిన పైరులో సస్యరక్షణ, రబీ జొన్న విత్తుట, సస్యరక్షణ
కాయధాన్యాలుకోతలు, దీర్ఘకాలపు కందికి సస్యరక్షణ, ఉలవ, శనగ విత్తుట
వేరుశనగగుత్తి రకం కాయ తీయుట
మిరపఅంతరకృషి, సస్యరక్షణ, పచ్చికాయ ఏరుట
ఉల్లినారు పోయుట
పూలుగులాబి కత్తిరించుట, ఎరువులు వేయుట
మొక్కజొన్నకోతలు
ప్రత్తిసస్యరక్షణ
ఆముదంఅరుణ పైరులో కాయ తీయుట ప్రారంభించుట
పొగాకునాట్లు, మూడవ వారంలో ఖాళీలను పూరించడం
పసుపుసస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో కలుపు తీయుట, రసాయనిక ఎరువులు వేయుట, జూలై నెలలో నాటిన పైరులో అంతరకృషి
కొర్రకోతలు
కుసుమవిత్తుట
ధనియాలువిత్తుట
పసుపుసస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో ఎరువులు వేయుట, ఆఖరి సారి నాగలితో అంతరకృషి
కాయగూరలుక్యాబైజి, కాలిఫ్లవర్ నాట్లు, కంది నాట్లు, బిన్నీసు నాట్లు
పండ్లుమామిడి తోటలకు సస్యరక్షణ, అరటి నాట్లు

స్వాతి కార్తె (24.10.11 నుండి 8.11.11)

వరితక్కువ పంట కాలపు రకాల కోతలు
జొన్నరబీ జొన్నలో సస్యరక్షణ, ఖరీఫ్ లో వేసిన తక్కువ పంట కాలపు రకాలు కోతకు వచ్చుట
వేరుశనగతీగ రకం కాయ తీయుట
గోగుకోతలు
పొగాకుఅంతరకృషి
ఆలుగడ్డనాటుటకు భూమిని తయారు చేయుట.
మొక్కజొన్నరబీ పంటకు విత్తనాలు వేయుట
పశుగ్రాసాలుచలి కాలపు పశుగ్రాసాలు విత్తుట (పిల్లి పెసర, లూసర్స్)
చిలగడదుంపనాటుట

విశాఖ కార్తె (7.11.11 నుండి 19.11.11)

జొన్నరబీ జొన్నలో అంతరకృషి, తొందరగా విత్తిన వాటికి సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట
మొక్కజొన్నరబీ పంటకు విత్తనం వేయుట
గోధుమభూమిని తయారుచేయుట, ఎరువులు వేయుట, రెండవ నారంలో విత్తుట
ప్రత్తిఖరీఫ్ ప్రత్తిలో ఎరువులు
గోగుకోసిన గోగు మొక్కలను నీటిలో ఊరవేయుట
మిరపఅంతరకృషి, సస్యరక్షణ
పొగాకుఅంతరకృషి, సస్యరక్షణ
ఉల్లినాట్లు
కాయధాన్యాలుతక్కువ పంట కతాలపు పెసర, మినుము, వరి పండిన పొలాల్లో చల్లుట, కందికి సస్యరక్షణ
గోధుమఅంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట
కాధాన్యాలుదీర్ఘకాలిక కంది రకాలు, కోతకు వచ్చుట
మిరపసస్యరక్షణ
పొగాకుతలలు త్రుంచుట, సస్యరక్షణ
చెఱకునరుకుట, బెల్లం తయారి
పసుపుఆగష్టులో నాటిన పైరుకు రసాయనిక ఎరువులు వేయుట
పూలుగులాబీల్లో బడ్డింగ్ చేయుట, ఎరువులు వేయుట
ప్రత్తిమాగాణి ప్రత్తికి భూమిని తయారు చేయుట
ఆముదందీర్ఘకాలిక రకాల కాయ తీయుట ప్రారంభించుయ

అనూరాధ కార్తె (20.11.11 నుండి 2.12.11)

వరిమధ్యకాలిక రకాల కోతలు, రబీ పైర్లకు నారు పోయుట
మొక్కజొన్నసస్యరక్షణ
మిరపతోటలలో సస్యరక్షణ
చెఱకుచెఱకు తోటలు కొట్టడం ప్రారంభం, కార్శి తోటల పెంపకం, వెల్లం తాయరీ, చెకు పిప్పిని పాతర వేయట
గోధుమరెండవ వారంలో విత్తనిచో పెంటనే విత్తనం వేయుట
జొన్నరబీ పైరులో సస్యరక్షమ
గోగునార తీయుట
పసుపుసస్యరక్షణ
పశుగ్రాసాలుచెఱకు పిప్పిని పాతరవేసి పశుగ్రాసంగా మార్చడం
కాయధాన్యాలుకంది విత్తడం
పశువులుఈనిక కాలంలో మాయ పడనిచో తగు జాగ్రత్తలు తీసుకొనుట, దూడలకు ఏతలికపాములు రాకుండా నివారణ చర్యలు
పండ్లుఫాల్సా కత్తిరింపులు, ఉసిరి కాయలు మార్కెటింగ్, పచ్చళ్ల తయారీ
సువాసన మొక్కలుకోతలు, సుగంధ తైలం తీయుట

జ్యేష్ఠ కార్తె (3.12.11 నుండి 15.12.11)

వరిదీర్ఘకాలిక రకాల కోతలు, రబీ నారుమళ్లకు ఎరువులు వేయుట, సస్యరక్షణ
మొక్కజొన్నఅంతరకృషి, సస్యరక్షణ, రసాయనికి ఎరువులు వేయుట
పండ్లుఅరటిపిలకలు తీయుట, వాటిన పిలకలకు ఎరువులు వేయుట

మూల కార్తె (16.12.11 నుండి 28.12.11)

వరినారుమడికి ఎరువులు వేయుట, దాళ్వా లేక తాబి వరి నాట్లకు పొలం తయారు చేయట
మొక్కజొన్నఅంతరకృషి, సస్యరక్షణ, ఎరువులు వేయుట
గోధుమసస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట
రాగులురాగి విత్తుట
కాయధాన్యాలుపెసర, మినుములను తవరి పంజించిన భూముల్లో విత్తుట, కంది కోతలు, కంది మొడెం పంటగా సాగుచేయుట
మిరపపండు కాయలు కోయుట
చెఱకుతెలంగాణా జిల్లాల్లో నాట్లు
ఉల్లివరి పండించిన నేలల్లో నాటుట
వేరుశనగనరి పండించిన చేలలో విత్తుట

పూర్వాషాఢ-ఉత్తరాషాఢ కార్తె (29.12.11 నుండి 23.1.12)

వరితాబీ లేక దాళ్వా వరి నాట్లు, డిసెంబర్ లో వరికి కలుపు తీయుట, సస్యరక్షణ
జొన్నసంకర జొన్నకు నేలను తయారు చేయుట, విత్తనం వేయుట
సజ్జవేసవి పంటకు నేల తయారి – విత్తనం వేయుట
ప్రత్తిమాగాణి ప్రత్తికి నేలను తయారు చేయుట
మొక్క జొన్నఎరువులు వేయుట, అంతరకృషి
మొక్కజొన్నఎరువులు వేయుట, అంతరకృషి
పసుపుమే నెలలో ఆర్మూర్, కోరుట్ల, మెట్టుపల్లి మరియు ఇతర ప్రాంతాల్లో నాటిన కస్తూరి రకం పసుపు రవ్వుట, విత్తనం నిల్వ చేసుకొనుట
వేరుశనగడిసెంబరులో విత్తిన వేరుశనగకు అంతరకృషి, తెలంగాణా ప్రాంతంలో నీటి వసతి క్రింద విత్తుట
ఆముదంవిత్తుట
చెఱకుతెలంగాణా జిల్లాల్లో నాటిన పైరుకు, కార్శి తోటల్లో ఎరువులు వేయుట, సస్యరక్షణ, కోస్తా రాయలసీమల్లో క్రొత్త తోటలను నాటుట
పప్పుదినుసులువరి పొలాలందు (మాగాణిలో) నవంబరులో వేసిన మినుము, పెసర కోతలు
కూరగాయలుబఠాణీ కాయ ఏరుట, ధనియాల కోతలు
పండ్లుమామిడిపై తేనె మంచు పురుగు నివారణ చర్యలు, అరటి, ద్రాక్ష నాట్లకు గుంతలు త్రవ్వుట, ఉసిరి కాయలు అమ్ముట, నిల్వ చేయుట
పువ్వులుమల్లె తోటలలో చెట్ల కత్తిరింపు, ఎరువులు వేయుట, నీరు పెట్టుట, చామంతి కోతలు
పశుగ్రాసాలులూనర్స్, బర్సీము కోతలు, వేసవి పశుగ్రాసాల సాగు
ఆముదండిసెంబరు-జనవరి నెలలో విత్తిన పంటకు సస్యరక్షణ
పొగాకుఆకుకోత, క్యూరింగ్ చేయుట
మిరపకరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పండుకాయ ఏరుట, అమ్ముట
పండ్లుద్రాక్ష గుత్తులు కత్తిరించుట, మార్కెట్ కు పంపుట, జామ, వారింజత, సపోట చెట్లకు సస్య రక్షణ, పండ్లను విల్వ చేయుట

శ్రవణ కార్తె (24.1.12 నుండి 3.2.12)

వరిముందు నాటిన వరికి ఎరువులు వేయుట, సస్యరక్షణ
జొన్నరబీ జొన్న కోతలు – వేసవి రకాలను విత్తుట
పప్పుదినుసులుఉలవ కోతలు
వేరుశనగడిశంబరులో విత్తిన పంటకు సస్యరక్షణ
ధనియాలుకోతలు
ప్రత్తివరిపొలాల్లో వేసిన ప్రత్తికి కలుపు తీయుట, పైరును పలుచన చేయట
కూరగాయలుదొండ, కాకర పాదులు పెట్టుట, బఠాణి కోతలు
పండ్లుమామిడిపై తేనె మందు పురుగు నివారణ, ద్రాక్ష గుత్తుల పై బూడిద తెగుళ్లకు స్సయరక్షణ
పువ్వులుగులాబి, మల్లెల కత్తరింపులు, ఎరువులు వేయుట, చామంతి పూల కోతలు
ధాన్య నిల్వలువిత్తనాలు నిల్వ చేసుకొనుటలో జాగ్రత్తలు తీసుకొనుట, విల్వ ఉంచిన ధాన్యానికి పురుగు పట్టకుండా శాస్త్రీయ పధ్దతులను పాటించుట

ధనిష్ఠ కార్తె (7.2.12 నుండి 19.2.12)

వరిడిసెంబర్-జనవరి మాసాల్లో నాటిన వరికి రెండవ దఫా ఎరువులు వేయుట, కలుపు తీయుట
జొన్నరబీ జొన్న కోతలు, వేసవి పంటకు ఎరువులు వేయుట, అంతరకృషి
గోధుమకోస్తా జిల్లాల్లో కోతలు, తెలంగాణాలో నీరు పెట్టుట, సస్యరక్షణ, ఎలుకల నిర్మూలన
సజ్జవేసవి పంట విత్తుట, ఎరువులు వేయుట
ప్రత్తిమొక్కలు పలుచన చేయుట, ఎరువులు వేయుట, సస్యరక్షణ
చెఱకుడిసెంబర్ లో నాటిన పంటకు, కార్శి తోటలకు ఎరువులు వేయుట
వేరుశనగవరి పొలాల్లో వేసిన పంటకు సస్యరక్షణ
కుసుమకోతలు మార్కెట్ కు పంపుట
రాగిరబీ రాగి కోతలు
సజ్జసస్యరక్షణ
వేరుశనగఎరువులు, సస్యరక్షణ
పసుపుజూలైలో నాటిన పసుపు త్రవ్వుట
మిరపఎండు కాయలు అమ్ముట, విత్తనం తయారు చేయుట
పొగాకుఆకు కోయుట, క్యూరింగ్
చెఱకుజనవరిలో నాటిన పేరుకు ఎరువులు వేయుట, సస్యరక్షణ
పప్పుదినుసులుమాగాణిలో విత్తిన పసర, మినుము పంటకు వచ్చుట
ఆకుకూరలుపాల, తోట, చుక్క కూరలు విత్తుట
అల్లంపంచిట త్రవ్వకాలు

పూర్వాభాధ్ర కార్తె (5.3.12 నుండి 17.3.12)

వరిరెండవ పంటకు ఎరువులు వేయుట, సస్యరక్షణ
గోధుమతెలంగాణా, రాయలసీమ జిల్లాల్లో కోతలు
జొన్నవేసవి పంటకు సస్యరక్షణ
ప్రత్తిఎరువులు వేయుట – సస్యరక్షణ, ఎడ సేద్యం

ఉత్తరభాధ్రా కార్తె (18.3.12 నుండి 1.4.12)

పసుపుపంటకాలు, మార్కెట్ కు పంపుట, విత్తనం సేకరించుట
ఆముదంసస్యరక్షణ
అల్లంత్రవ్వకాలు, అమామకాలు, శొంటి తయారొ
గోధుమఆలస్యంగా విత్తిన పంట కోతలు
వేరుశనగడిసెంబర్ లో విత్తిన పంట నుండి కాయ త్రవ్వుట
పండ్లుద్ర్రాక్ష పండ్ల ఎగుమతి, నిల్వలు, పానీయాలు తయారు చేయుట
కూరగాయలువేసని కూరగాయల పెంపకం
పప్పుదినుసులుపెసర, మినుము కోతలు
ఖర్బూజకోతలకు తయారగుట
ఉల్లిగడ్డడిసెంబర్ లో నాటిన ఉల్లి త్రవ్వకాలు
వరిఅశ్వని కార్తెలో వేయబోయే వరిని విత్తుట

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన మరియు విస్తరణ కేంద్రాలు

వ్యవసాయ వాతారణ మండలాలలు మరియు పరిశోధానా స్ధానాలు

పరిశోధనాంశాలు

I. ఉత్తరకోస్తా పరిశోధన కేంద్రాలు
1. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అనకాపల్లి-531 001,
విశాఖపట్నం జిల్లా, ఫోన్ – 08924-223370
చెఱకు, చెఱకు ఆధారిత పంటల సరళి.
2. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఎలమంచిలి-531 005,
విశాఖపట్నం జిల్లా, ఫోన్ – 08931-232441
నువ్వులు
3. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఆముదాలవలస – 532 185,
శ్రీకాకుళం జిల్లా, ఫోన్ – 08942-286270
గోగు, గోగు ఆధారిత పంటల సరళి
వ్యవసాయ పరిశోధనా కేంద్రం, విజయనగరం – 531291,
ఫోన్ – 08922 225983.
సజ్జ, రాగి
5. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, గాగోలు – 532484,
శ్రీకాకుళం జిల్లా, ఫోన్ 08942-279836
వరి, వరి ఆధారిత పంటల సరళి
II. గోదావరి పరిశోధన కేంద్రాలు
6. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మారుటేరు-534122,
పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ – 08819-2142731, 247583.
వరి, వేసవి అపరాలు, నీటి మరియు నేలల యాజమాన్యం, మిశ్రమ వ్యవ సాయం, కోతానంతర పంటల యాజ మాన్యం.
7. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పూళ్ల-534401,
పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ –08829-282498
ముంపునీటికి అనువైన వరి
8. తేనెటీగల స్కీము, విజయరాయి,
పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన- 08812-225689.
తేనెటీగలు
9. నీటియాజమాన్యం స్కీము, ఉండి,
పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్-08816-222453.
నీటియాజమాన్యం
10. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పెద్దాపురం-533437,
తూర్పు గోదావరి జిల్లా, ఫోన్ – 08852-241853.
తృణధాన్యాలు, అపరాలు, నూనె గింజలు
III. కృష్టా పరిశోధన కేంద్రాలు
11ఏ. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, లాం ఫారం,
గుంటూరు-522034 ఫోన్-0863-2524022, 2524017
అపరాలు, ప్రత్తి, చిరుధాన్యాలు, నేలల యాజమాన్యం, మిశ్రమ వ్యవసాయం.
11బి. వ్యవసాయ కళాశాల, బాపట్ల లోని స్కీములు, వరి పరిశోధనా విభాగం, వ్యవసాయ కళాశాల,
బాపట్ల-522101, ఫోన్-08643-225901.
వరి
12ఏ. ఆంధ్రప్రదేశ్ నీటి యాజమాన్య పధకం, వ్యవసాయ కళాశాల,
బాపట్ల – 532101, ఫోన్-08643-225194
నీటి యాజమాన్యం, మురుగునీటి యాజమాన్యం
12బి. ఉప్పునీటి పరిశోధనా పధకం, వ్యవసాయ కళాశాల,
బాపట్ల-522101, ఫోన్-08643-225098
ఉప్పునీటీ వినియోగం.
12సి. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, వ్యవసాయ కళాశాల,
బాపట్ల-522101, ఫోన్ – 08643-225180
వరి, అపరాలు, వేరుశనగ, వ్యవసాయోత్పత్తుల సద్వినియోగం, వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలు.
13. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, జంగమహేశ్వరపురు-522415,
గుంటూరు జిల్లా, ఫోన్-08649-213108.
విత్తనోత్పత్తి
14. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అమరావతి-522020,
గుంటూరు జిల్లా, ఫోన్-08645-255345.
జీవన ఎరువులు
15. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఉయ్యూరు-521165,
కృష్టా జిల్లా, ఫోన్-08676-223266.
చెఱకు
16. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మచిలీపట్నం – 521002,
కృష్టా జిల్లా, ఫోన్-08672-223266.
ఉప్పునీటి భూముల్లో వరి.
17. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, గరికపాడు-521175,
కృష్టా జిల్లా, ఫోన్-08654-203160.
అపరాలు, నానెగింజలు, నీటి యాజమాన్యం
18. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఘంటసాల-521133,
కృష్టా జిల్లా, ఫోన్-08671-254218.
వరి మాగాణుల్లో అపరాలు
19. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, దర్శి-523247,
ప్రకాశం జిల్లా, ఫోన్-08407-253248.
చిరుధాన్యాలు, నూనెపంటులు, ఆగ్రోఫారెస్ట్రీ, భూమి, నిటి యాజమాన్యం.
IV. దక్షిణ పరిశోధన కేంద్రాలు
20. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, తిరుపతి-517502,
చిత్తూరు జిల్లా, ఫోన్-0877-2248704
వేరుశనగ, నీటి యాజమాన్యం, ఉష్ణ మండల అపరాలు.
21. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పెరుమాళ్లపల్లె-517505,
చిత్తూరు జిల్లా, ఫోన్-0877-2276240.
చిరుధాన్యాలు, చెఱకు
22. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పలమనేరుచిరుధాన్యాలు, వేరుశనగ
23. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, నెల్లూరు-524004,
ఫోన్-0861-2327803
వరి
24. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కావలి-524202,
నెల్లూరు జిల్లా, ఫోన్-08626-241528.
ఆగ్రో ఫారెస్ట్రీ, వరి, నూనె గింజలు
25. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పొదలకూరు-524345, నెల్లూరు జిల్లా, ఫోన్-08621-285279.జొన్న, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, గడ్డి జొన్న
వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఊటుకూరు-516003,
కడప జిల్లా, ఫోన్-08562-259778
వరి, వేరుశలగ, పంటల సరళి, మెట్ట వ్యవసాయం
V. ఉత్తర తెలంగాణా పరిశోధన కేంద్రాలు
27. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, జగిత్యాల-505327,
కరీంనగర్ జిల్లా, ఫోన్-08724-277281
వరి, వేరుశలగ, నువ్వులు, పంటల విధానాలు, నీటి యాజమాన్యం.
28 వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కరీంనగర్-505002,
ఫోన్-0878-2254280
మొక్కజొన్న
29. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కునారం, శ్రీ రాంపూర్ (మం.),
కరీంనగర్ జిల్లా-505174, ఫోన్-08728-200328
వరి, మొక్కజొన్న
30. ప్రాంతీయ చెఱకు మరియు వరి పరిశోధనా కేంద్రం, రుద్రూరు-503188,
నిజామాబాద్ జిల్లా, ఫోన్-08467-284024
చెఱకు, వరి, పంటల సరళి
31. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఆదిలాబాద్-504002,
ఫోన్-8732-255544, సెల్ 9391248462
ప్రత్తి, జొన్న, వర్షాధార వరి, సోయచిక్కుడు.
32. సీనియర్ సైంటిస్ట్ (ప్రత్తి) వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ముధోల్-504102,
ఆదిలాబాద్ జిల్లా, ఫోన్-08752-244243
వర్షాధార ప్రత్తి.
VI. మధ్య తెలంగాణా పరిశోధన కేంద్రాలు
33. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వరంగల్-506007,
ఫోన్-0870-2424337, 2424334
వరి, అపరాలు, ప్రత్తి, నీటియాజమాన్యం.
34. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మధిర-507023,
ఖమ్మం జిల్లా, ఫోన్-08749-274235
మాఘీ జొన్న, అపరాలు
35. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైరా,
ఖమ్మం జిల్లా, ఫోన్-08749-251803
విత్తనోత్పత్తి
36. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, బసంత్ పూర-మామిడిగి, న్యాల్ కోల్ మండలం, జహీరాబాద్,
మెదక్ జిల్లా, ఫోన్-08451-280141.
చిరుధాన్యాలు, అపరాలు.
37. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, నత్నాయిపల్లి-502313,
మెదక్ జిల్లా, ఫోన్ నం. 9959636529
చిరుధాన్యాలు, పంటల విధానాలు, నీటి యాజమాన్యం.
VII. దక్షిణ తెలంగాణా పరిశోధన కేంద్రాలు
38. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పాలెం-509215,
మహబూబ్ నగర్ జిల్లా, ఫోన్-08540-221017, 228646.
జొన్న, సజ్జ, అపరాలు, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, వేరశనగ, పశుగ్రాసాలు.
39. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, తాండూరు-501141,
రంగారెడ్డి జిల్లా, ఫోన్-08411-299518, 9440939974
కంది, కుసుమ, రబీ జొన్న
40. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కంపాసాగర్, మిర్యాలగూడ,
నల్గొండ జిల్లా, ఫోన్ – 9951997861, 08689-238866.
వరి, చిరుధాన్యాలు, అపరాలు, ఆముదం.
41. మొక్కజొన్న పరిశోధనా సంస్ధ, రాజేంద్రనగర్, హైద్రాబాద్,
ఫోన్-040-27038498, 24018447.
మొక్కజొన్న, పశుగ్రాస మొక్కజొన్న
42. వ్యవసాయ పరిశోధనా సంస్ధ, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030.ఇందులోని స్కీములు.
42ఏ వరి విభాగం, ఫోన్ 040-24015011, ఎక్స్ టెన్షన్-411, 421.వరి
42బి. సూక్ష్మపోషక పదార్ధాల ప్రయోగశాల,
ఫోన్ 040-24015011, ఎక్స్ టెన్షన్-413.
సూక్ష్మ పోషక పదార్ధాలు
42సి. వ్యవసాయ వాతావరణ విభాగం,
ఫోన్ 040-24016901, 040-24015011, ఎక్స్ టెన్షన్-433.
వ్యవసాయ వాతావరణం
42డి. రేడియో ట్రేసర్ లేబోరేటరీ,
ఫోన్ 24014404, 040-24015011, ఎక్స్ టెన్షన్-412.
రేడియో ఐసోటోప్ ల సహాయంతో నేలలపై పరిశోధన
42ఇ. వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాల విభాగం,
ఫోన్ 040-24018277
వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలు.
42ఎఫ్. ఆగ్రో ఫారెస్ట్రీ విభాగం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030,
ఫోన్ 040-24010116.
ఆగ్రో ఫారెస్ట్రీ.
43జి. జీవ సాంకేతిక శాస్త్ర కేంద్రం, రాజేంద్రేనగర్, హైద్రాబాద్-500030.
ఫోన్ 040-24015011-ఎక్స్ టెన్షన్-428.
జీవ సాంకేతిక విషయాలు
42హెచ్. వ్యవసాయ సంబంధిత పక్షి శాస్త్ర విభాగం, పశు వైద్య కళాశాల దగ్గర, రాజేంద్రనగర్,
హైద్రాబాద్-500030, ఫోన్ 040-24015754, 040-24015011, ఎక్స్ టెన్షన్ 420.
వ్వవసాయ సంబంధిత పక్షులు.
42ఐ. సస్యరక్షణ మందుల అవశేషాల విభాగం, రాజేంద్రనగర్,
హైద్రాబాద్-500030, ఫోన్ 040-24015011, ఎక్స్ టెన్షన్ 378.
సస్యరక్షణ మందుల అవశేషాలు.
42జె. కలుపు నివారణ పధకం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030,
ఫోన్ 040-24015011, ఎక్స్ టెన్షన్ 367.
కలుపు నివారణ
42కె. పంటల విధానాల పరిశోధానా పధకం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030,
ఫోన్ 040-24017463, 040-24015011, ఎక్స్ టెన్షన్ 369..
పంట విధానాలు.
42ఎల్. పుట్టగొడుగుల పెంపక విభాగం, ప్లాంట్ పాథాలజీ డిపార్ట్ మెంట్, వ్యవసాయ కళాశాల,
రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030. ఫోన్ 040-24015011, ఎక్స్ టెన్షన్ 376
పుట్టగొడుగులు
42ఎమ్. ప్రాజెక్ట్ కొ-ఆర్జినేటర్, అఖిల భారత సమన్వయ గృహ విజ్ఞాన పరిశోధనా పధకం,
పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రిసెర్చ్ సెంటర్, రాజేంద్రనగర్,
హైద్రాబాద్-500030. ఫోన్ 040-24011263.
గృహ విజ్ఞానం.
42ఎన్. డైరెక్టర్, నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, రాజేంద్రనగర్,
హైద్రాబాద్-500030. ఫోన్ 040-24001445.
నీటి సద్వినియోగం
42ఓ. జీవ నియంత్రణ ప్రయోగశాల, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030. ఫోన్ 040-24010031, 040-24015011, ఎక్స్ టెన్షన్ 428.జీవ నియంత్రణ పధ్దతిలో పురుగుల వివారణ
42పి. పశుగ్రామ పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్, హైద్రాబాద్ – 500030. ఫోన్ 040-24001706పశుగ్రాస పరిశోధన
42క్యు. అగ్రానమీ సెంటర్, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030,
ఫోన్ 040-24015324, 040-24015011, ఎక్స్ టెన్షన్ 415.
వరి, అముదం, విత్తనోత్పత్తి.
42ఆర్. విత్తన పరిశోధనా సంస్ధ, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030.
ఫోన్ 040-24015382.
విత్తన పరిశోధన మరియు ఉత్పత్తి.
42ఎస్. నాణ్యత నియంత్రణ కేంద్రం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030,
ఫోన్ నం. 040-24013456.
వివిధ ఆహార పదార్ధాలలో పోషకాల నాణ్యత, విష పదార్ధాలు మరియు సస్యరక్షణ మందుల అవశేషాలు.
VIII. తక్కువ వర్షపాత పరిశోధన కేంద్రాలు
43. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్దానం,నంద్యాల, కర్నూలు జిల్లా-518503. ఫోన్ నం. 08514-248264, 242296.వరి, ప్రత్తి, కొర్రలు, జొన్నలు, పొగాకు, వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, నీటి సద్వినియోగం, పశుగ్రాసాలు, విత్తనోత్పత్తి పరిజ్ఞానం.
44. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అనంతపురం-515001. ఫోన్ నం. 08554-226408.మెట్ట సేధ్యం, చిరుధాన్యాలు, అపరాలు, వేరుశ నగ, పశుగ్రాసాలు, పంటలు, వ్యవసాయ పనిముట్లు.
45. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, రెడ్డిపల్లి, అనంతపురం జిల్లా-515001. ఫోన్ నం. 08554-257239.నీటి యాజమాన్యం, అపరాలు, వేరుశనగ
46. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కదిరి, అనంతపురం జిల్లా-515591. ఫోన్ నం. 08494-221180వేరుశనగ
IX. ఎత్తైన గిరిజన ప్రాంత పరిశోధన కేంద్రాలు
47. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, చింతపల్లి-531111,
విశాఖపట్నం జిల్లా, ఫోన్ – 08937-238244.
వరి,వలిశలు, గాగి, మొక్కజొన్న,అల్లం, పైనాపిల్.
48. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, సీతంపేట-532443,
శ్రీకాకుళం జిల్లా, ఫోన్ – 08941-238628.
గిరిజనుల సాంఘిక, ఆర్ధిక అభివృధ్ది, వరి, పశుగ్రాసం.

జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ కేంద్రాలు

1. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ కేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, అనంతపూర్-515001, ఫోన్ – 08554-277963, సెల్ నెం. 99896238122. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అనకాపల్లి-531001, ఫోన్ – 08924-221711, సెల్ నం. 9989623892.
3. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఆదిలాబాద్-504002, ఫోన్ – 08732-230797 సెల్ నం. 9989623816.4. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఆముదాలవలస-532185, ఫోన్ -08932-287720, శ్రీకాకుళం జిల్లా, సెల్ నం. 9989623800
5. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఏలూరు-534005, ఫోన్ – 08812-248543, సెల్ నెం. 9989623804.6. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, త్రోవగుంట-523002, ఒంగోలు. ఫోన్ – 08592-220788, సెల్ నం. 9989623807.
7. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఊటుకూరు-516001, ఫోన్ – 08562-252389, సెల్ నెం. 99896238118. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, కరీంనగర్-505001, ఫోన్ నెం. 0878-2229744, సెల్ నెం. 9989623818.
9. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, కర్నూలు-518003, ఫోన్- 08518-251813, సెల్ నెం.9989623810.10. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, నడికుదురు, కరప (మం), కాకినాడ-533016, తూర్పు గోదావరి జిల్లా, ఫోన్ – 0884-2348780, సెల్ నెం. 9989623803.
11. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఖమ్మం-507003, ఫోన్ 08742-256188, సెల్ నెం.. 998972381312. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, ప్రాంతీయ పరిశోధనా కేంద్రం, లాం ఫారం, గుంటూరు-522004, ఫోన్ – 0863-2524009, సెల్ నెం. 9989623806.
13. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, చిత్తూర్-517001, ఫాన్ – 08572-245112, సెల్ నెం. 9989623809.14. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రంద్రం, ఇంటి నెం. 6-3-253, రుద్రమ నిలయం, రామగిరి, నల్లగొండ-508001, ఫోన్ – 08682-226547, సెంల్ నెం. 9989623815.
15. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, నిజామాబాద్-503002, ఫోన్ -08462-223575, నెం, 998962381716. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రేంద్రం, వ్యవసాయ పరిశోధానా కేంద్రం, నెల్లూరు-524003, ఫోన్ -0861-2314052, సెల్ నెం. 9989623808.
17. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ క్రంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, మచిలీపట్నం-521002, ఫోన్ -08672-250629, సెల్ నెం, 998062380518. కో ఆర్జీనేటర్, జిల్లా వ్యవసాయ సలహా మరియు విస్తరణ కేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, మహబూబ్ నగర్ 5009001, ఫోన్ – 08542-279156, సెల్ నెం, 9989623820

ఇతర విస్తరణ సంస్ధలు

1. ప్రధాన వ్యవసాయ సమాచార అధికారి, వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం, ముద్రణాలయం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ - 040-24015380, 040-24015011, ఎక్స్ టెన్షన్ 372.2. ప్రధాన వ్యవసాయ సమాచార అధికారి & నోడల్ అధికారి, వ్యవసాయ సాంకేతిక సమాచార కేంద్రం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, 040-24010549, 1551 (టోల్ ఫ్రీ నెంబరు), 040-24015011, ఎక్స్ టెన్షన్ 435.
3. కోఆర్జినేటర్, ఎలక్ట్రానిక్ వింగ్, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం. 040-24018223, 040-24015011, ఎక్స్ టెన్షన్ 434.4. ప్రిన్సిపాల్, విస్తరణ విద్యాసంస్ధ, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం. 040-24015368, 040-24015011, ఎక్స్ టెన్షన్ 391.
5. కో-ఆర్జినేటర్, ఫార్మర్స్ కాల్ సెంటర్, ఇ-సేవా సెంటర్ పైన, సీతాఫల్ మండి, సికింద్రాబాద్-500061, టోల్ ఫ్రీ నెం. 1100, 18004251110

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రాలు

 1. ఉద్యాన పరిశోధనా కేంద్రం, అంబాజీపేట-533214, తూర్పు గోదావరి జిల్లా, ఫోన్ నెం. 08856-243847.

 2. తమలపాకు పరిశోధనా కేంద్రం, వెంకటరామన్నగూడెం-534101, పశ్చిమ గోదావరి జిల్లా.

 3. జీడిమామిడి పరిశోధనా కేంద్రం, బాపట్ల-522101, గుంటూరు జిల్లా, ఫోన్ నెం.08643-225304.

 4. ఉద్యావ పరిశోధనా కేంద్రం, చింతపల్లి-531111, విశాఖపట్నం జిల్లా, ఫోన్ నెం.08937-238244.

 5. ఉద్యాన పరిశోధనా కేంద్రం, దర్శి-523428, ప్రకాశం జిల్లా, ఫోన్ నెం. 08407-200220.

 6. ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొవ్వూరు-534350, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ నెం.08813-231507.

 7. ఉద్యాన పరిశోధనా కేంద్రం, లాం ఫారం-522034, గుంటూరు జిల్లా, ఫోన్ నెం.0863-2524017.

 8. మామిడి పరిశోధనా కేంద్రం, నూజివీడు-522101, కృష్ణా జిల్లా, ఫోన్ నెం.08656-233061.

 9. ఉద్యాన పరిశోధనా కేంద్రం, పందిరిమామిడి-533228, తూర్పు గోదావరి జిల్లా, ఫోన్ నెం.08864-243577.

 10. ఉద్యాన పరిశోధనా కేంద్రం, వెంకటరామన్నగూడెం-534101, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ నెం.08818-284223.

 11. ఉద్యాన పరిశోధనా కేంద్రం, విజయరాయి-534475, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ నెం.08812-225431.

 12. ఉద్యాన పరిశోధనా కేంద్రం, పెద్దాపురం-533437, తూర్పు గోదావరి జిల్లా, ఫోన్ నెం. 08852-241852.

 13. ఉద్యాన పరిశోధనా కేంద్రం, అనంతపురం-515001, ఫోన్ నెం.08554-201383.

 14. ఉద్యాన పరిశోధనా కేంద్రం, అనంతరాజుపేట-516105, కడప జిల్లా, ఫోన్ నెం. 08566-200218.

 15. ఉద్యాన పరిశోధనా కేంద్రం, మహానంది-518502, కర్నూలు జిల్లా, ఫోన్ నెం.08514-284555.

 16. నిమ్మ పరిశోధనా కేంద్రం, పెట్లూరు-524132, నెల్లూరు జిల్లా, ఫోన్ నెం.08625-257209.

 17. చీని, నిమ్మ పరిశోధనా కేంద్రం, తిరుపతి-517502, చిత్తూరు జిల్లా, ఫోన్ నెం.0877-249957.

 18. ఉద్యాన పరిశోధనా కేంద్రం, ఆదిలాబాద్-505002, ఫోన్ నెం.08732-224215.

 19. ఉద్యాన పరిశోధనా కేంద్రం, అశ్వారావుపేట-507506, ఖమ్మం జిల్లా, ఫోన్ నెం.08740-200141.

 20. ఉద్యాన పరిశోధనా కేంద్రం, జగిత్యాల-505326, (పసుపు)కరీంనగర్ జిల్లా, ఫోన్ నెం. 08724-277283.

 21. మెట్ట ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొండమల్లేపల్టి-508243, నల్గొండ జిల్లా, ఫోన్ నెం.08691-200338.

 22. జే.వి.ఆర్.ఉద్యాన పరిశోధనా కేంద్రం, మల్యాల్-505101, వరంగల్ జిల్లా, ఫోన్ నెం.08719-240950.

 23. అఖిలభారత పూలమొక్కల సమన్వయ పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం.040-24011649.

 24. కూరగాయల పరిశోధనా స్దానం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం.040-24018016.

 25. ద్రాక్ష పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం.040-20025322.

 26. హెర్బల్ గార్డెన్, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం. 040-24013331.

 27. మామిడి పరిశోధనా కేంద్రం, సంగారెడ్డి-501001, మెదక్ జిల్లా, ఫోన్ నెం.08455-276451.

 28. పసుపు పరిశోధనా కేంద్రం, కమ్మరపల్లి, నిజామాబాద్ జిల్లా-503308, ఫోన్ నెం.08724-272343.

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రాలు

 1. పందుల పరిశోధనా కేంద్రం, తిరుపతి-517502, చిత్తూరు జిల్లా, ఫోన్ నెం.0877-2248948.

 2. కోళ్ల పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం.040-15316.

 3. ఫశు పరిశోధనా కేంద్రం, పలమనేరు-517408, చిత్తూరు జిల్లా, ఫోన్ నెం.08579-252208.

 4. పశు పరిశోధనా కేంద్రం, మహబూబ్ నగర్-509001, ఫోన్ నెం.08542-275007.

 5. పశు పరిశోధనా కేంద్రం, గరివిడి-532101, విజియనగరం జిల్లా, ఫోన్ నెం.08952-282458.

 6. పశు పరిశోధనా కేంద్రం, లాం ఫారం, గుంటూరు-522034, ఫోన్ నెం. 0863-2524186.

 7. గేదెల పరిశోధనా కేంద్రం, వెంకటరామన్నగూడెం-534101, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ నెం.08818-284444.

 8. పశు పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్, హైద్రాబాద్-500030, ఫోన్ నెం.040-25505442.

 9. పశు పరిశోధనా కేంద్రం, మహానంది-518502, కర్నూలు జిల్లా, ఫోన్ నెం.08514-284523.

 10. చేపల పరిశోధనా కేంద్రం, కాకినాడ-533007, ఫోన్ నెం.0884-2374267.

 11. చేపల పరిశోధనా కేంద్రం, పాలేరు-507157, ఖమ్మం జిల్లా, ఫోన్ నెం.08742-273046.

 12. చేపల పరిశోధనా కేంద్రం, ఉండి-534199, పశ్చిమ గోదానరి జిల్లా, ఫోన్ నెం.08816-250430.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

కలుపు మందుల వాడకంలో మెలకువలు

సుస్థిర అధికోత్పత్తికి సమగ్ర పోషక యాజమాన్యంతోపాటు సమగ్ర కలుపు నిర్మూలన కూడా అంతే అవసరం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభించినప్పటికీ, కలుపు మందుల వాడకంలో తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించినట్లయితే సమర్థవంతంగా కలుపును నివారించి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.

 • పస్తుతం మార్కెట్‌లో అనేక రకాలైన కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పంటకు ఏ కలుపు మందును ఎంత పరిమాణంలో, ఏ సమయంలో వాడాలో తెలుసుకొన్న తరువాత మాత్రమే పిచికారీ చేయాలి.
 • కలుపు మందులు రెండు రకాలు. మొదటి రకం, కలుపు మొలకెత్తక ముందు పిచికారీ చేసే మందులు (ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు). విత్తిన వెంటనే అంటే 24 గంటల నుంచి 48 గంటల్లోపు తడి నేల మీద పిచికారీ చేయాలి. ఉదా.. పెండిమిథాలిన్, అట్రాజిన్, అలాక్లోర్.
 • కలుపు గింజలు మొలకెత్తే సమయంలో ఈ మందులను పీల్చుకొని చనిపోతాయి. కాబట్టి పంట విత్తిన 48 గంటల్లోపేపిచికారీ చేయాలి.
 • రెండో రకం కలుపు మందులు పంట, కలుపు మొలకెత్తిన తర్వాతే పిచికారీ చేసుకొనేవి(పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు). ఉదా: ఇమాజిథాపైర్, పినాక్సాప్రాప్ పి ఇథైల్ లాంటివి. ఈ మందులను పంట మొలిచిన 15 నుంచి 20 రోజుల్లో పిచికారీ చేయాలి.
 • పంట మొలకెత్తిన తర్వాత వాడే కలుపు మందులను.. కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.
 • కొన్ని రకాల కలుపు మందులు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి ఉపయోగపడతాయి. వీటిని చల్లేటప్పుడు పక్కన పత్తి, పొద్దుతిరుగుడు లాంటి వెడల్పాకు పంటలు ఉంటే జాగ్రత్తవహించాలి.
 • అంతర పంటలు వేసుకొన్నప్పుడు ఆ రెండు పంటలకు అనుకూలమైన కలుపు మందులు వాడాలి. ఎకరానికి 200 నుంచి 240 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
 • కలుపు మందులను తేలికపాటి నేలల్లో తక్కువ మోతాదులోనూ, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులోనూ, ఎర్ర నేలల్లో మధ్యస్థంగా వాడుకోవాలి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు గానీ, గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు గానీ కలుపు మందులు చల్లకూడదు.
 • కలుపు మందులను ఇతర సస్యరక్షణ మందులతో కలిపి వాడకూడదు.
 • హాండ్ స్ప్రేయర్‌తో మాత్రమే కలుపు మందులను పిచికారీ చేయాలి.
 • కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు మాస్క్, అప్రాన్ తప్పనిసరిగా ధరించాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయకూడదు. వెనక్కి నడుచుకుంటూ మందులు పిచికారీ చేయాలి.
 • రసాయనాలతోనే కాకుండా అంతర కృషి ద్వారా కూడా కలుపును నివారించుకోవచ్చు. నేల గుల్లబారడంతోపాటు నీటి సంరక్షణ, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్

శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110

కిసాన్ కాల్ సెంటర్ :1551

ఆధారము: సాక్షి సాగుబడి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate