హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / రబి వేరు శనగ సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రబి వేరు శనగ సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలు

రబి వేరు శనగ సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలు.

నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. విస్తీర్ణం, వినియెగం అధికంగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ఉత్పాదకత పొందలేక పోవడానికి గల కారణం మేలైన యాజమాన్య పద్దతులను పాటించకపోవటం. సాధారణంగా దశినా తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబరు మొదటి పాశం నుండి నవంబరు రెండవ పాశం వరకు విత్తడానికి అనుకూల సమయం. సాధారణంగా వేరుశనగలో హెక్టారుకు 12 క్వి. దిగుబడిని సాధించవచ్చు కాని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల 20 క్వి. వరకు దిగుబడి సాధించే అవకాశం ఉంది. సాగుచేసే ప్రాంతాన్ని బట్టి రకాల ఎంపిక, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, ఎరువుల ఎంపిక, సాగు నీటి యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు సక్రమంగా పాటిస్తే రబి వేరుశనగలో ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంది.

విత్తన ఎంపిక

ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలి. రబీలో నీటి వసతి క్రైంద కదిరి-6, కదిరి-9, టిఎజి-24, ఐసిజిఎస్-91144, ధరణి, అనంత, హరితాంధ్ర మరియు నారాయణ మెదలైనవి మేలైన రకాలు.

విత్తన మేతదు

గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మేతదు మారుతుంది. రబీలో ఎకరానికి 60-80 కిలోల విత్తనం అవసరమౌతుంది.

విత్తన శుద్ధి

విత్తే ముందు విత్తనశుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండజిమ్ లేదా 3 గ్రా. మ్యంకోజెబ్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి. తేలిక పాటి నెలల్లో వేరు పురుగు సమస్య కూడా గమనించవచ్చు. అలాంటి ప్రాంతాల్లో కిల్లో విత్తనానికి 6.5 మీ.లి. క్లోరిపైరిఫేస్ మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో 1 మీ.లి. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్.ను 7 మీ.లి. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. కొత్తగా వేరుశనగ సాగుచేసే ప్రాంతాల్లో ఎకరాకు సరిపడా కిలో విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చరుని పట్టించాలి. వేరు కుళ్ళు, మెడలు కుళ్ళు మరియు కండ కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే  ప్రాంతాలలో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

నేలలు

తేలికపాటి, నీరు నిలవని, మురుగు నీరు చేరని, మంచి గాలి ప్రసరణ ఉన్న నేలలు అనగా, ఎర్ర చల్క మరియు ఇసుకతో కూడిన గరపా వేళలు వేరుశనగ సాగుకు అనుకూలమైనవి. ఉదజని సూచిక 6.0-7.5 మధ్య గల నేలలు అనుకూలమైనవి.

విత్తే దూరం

రబి వేరుశనగలో గుత్తి రకాలను 22.5*10 సెం.మీ. దురంతో మరియు పెద్ద గుత్తి రకాలను 22.5*15 సెం.మీ. దూరంలో విత్తాలి. విత్తే సమయంలో నెలలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని గొర్రుతో గాని, నాగలి సళ్ళతో లేదా ట్రాక్టరుతో నడిచే సీడ్ డ్రిల్ ను ఉపయేగించి విత్తుకోవాలి. విత్తనం 5 సెం.మీ. లోతుకు మించకుండా విత్తాలి.

ఎరువుల యాజమాన్యం

భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మేతదును నిర్ణయంచుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 3-4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి మరియు 100 కిలోల సూపర్ ఫాస్ప్ట్, 33 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ మరియు మరియు 18 కిలోల యూరియాను విత్తే సమయంలో వేసుకోవాలి. మొక్క మిళచిన 30 రోజులకు 9 కిలోల యూరియాను పై పాటుగా  వేస్తే మంచి దిగుబడులు వెచ్చే ఆస్కారం ఉంది. వేరుశనగ పూత దశలో అనగా పంట 30-35 రోజుల దశలో ఒక ఎకరానికి 200 కిలోల జిప్సంను రెండు వరుసల మధ్య వేసి అంతర కృషి చేయాలి.

కలుపు యాజమాన్యం

అంతర కృషిలో కలుపు కొంతవరకు నివారించవచ్చు. పంట విత్తిన 48 గంటల లోపు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటికి 1 లి. పెండిమిధలైన్ లేదా అలకలా కలిపి పిచికారీ చేసినట్లయితే సుమారుగా 20-25 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు. విత్తిన 20-25 రోజులకు వెడల్పాటి ఆకుల కలుపు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితపైర్ 10% లేదా  ఇమాజిమాక్స్  35%+ ఇమాజితపైర్ 35% డబ్యు.జి. కలుపు మందును 40 గ్రా. ఎకరాకు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చు.

నీటి యాజమాన్యం

రబి వేరుశనగలో నీటి అవసరం ఎక్కవగా ఉంటుంది. ఉడడిగె దశ నుండి కాయ అభివృద్ధి చెందే దశ వరకు నీటి ఎద్దడి మరియు బెట్ట పరిస్ధితులు లేకుండా రబి వేరుశనగలో జాగ్రత్తలు వహించాలి. తేలిక నెలల్లో 6-8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు వేళా బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. రెండవ తడిని విత్తిని తర్వాత మెలిక వచ్చిన 20-25 రోజులకు, పూర్తిగా ఒకేసారి పూత వచ్చేటందుకు ఇవ్వాలి. తర్వాత తడులు నెల లక్షణం, బంక మట్టి శాతంను అనుసరించి 7-10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. చివరి తడి పంటకోతకు 4-7 రోజుల ముందు ఇవ్వాలి. నీటిని తుంపర్లు (స్ప్రీంక్లర్లు) ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు 25 శాతం నీరు అదా అయి, అధిక దిగుబడులు పొందవచ్చు.

సస్యరక్షణ

వేరు పురుగు : వేరుశనగలో వేరు పురుగు తల్లి పురుగులు వర్షాలు పడిన వెంటనే భూమి నుండి బయటకు వచ్చి చుట్టూ ప్రక్కల ఉన్న వేప, రేగు చెట్లను ఆశిస్తాయి. అడా పురుగులు భూమిలో గ్రుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి ఎరుపు తల కలిగి, బాగా ఎదిగిన పురుగులు 'సి' ఆకారంలో ఉండి వేరుశనగ మొక్క వేర్లను ఆశిస్తాయి. వేరు పురుగు ఆశించిన మొక్కలు వాడి పోయి, ఎండి చనిపోతాయి. మొక్కలని పీకితే సులువుగా ఉదివస్తాయి. మొక్కలు గుంపులు, గుంపులుగా చనిపోతాయి. లోతు దుక్కి చేయడం వల్ల వేరు పురుగు కోశస్ధా దశలు బయట పది పశుల బారిన పడతాయి లేదా ఎండ వేడిమికి చనిపోతాయి. దీని నివారణకు క్లోరి పైరిపాస్ 6.5 మీ.లి. లీటరు నీటికి చొప్పున కలిపినా నీటితో విత్తనశుద్ధి చేయాలి. పోరెట్ 10 జి గుళికలు ఎకరాకు 6 కిలోల చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి.

ఆకు ముడత పురుగు : విత్తిన 15 రోజుల నుండి ఆకు ముడత పురుగు వేరుశనగను ఆశిస్తుంది. తొలి దశలో ఆకుల పై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. వీటి లోపల ఆకు పచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు ఉంటాయి. ఇవి రెండు మూడు ఆకులను కలిపి గూడు చేసుకొని, వాటిలో ఉండి పచ్చని పత్రహరితాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ ఎండి, దూరం నుండి కాలినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు ఎకరానికి క్లోరి పైరిపాస్ 500 మీ.లి. లేదా ఎసిఫేట్ 300 గ్రా. 200 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర పంటగా జొన్న, సజ్జ 7:1 నిష్పత్తిలో వేయాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు అమర్చి మగ రెక్కల పురుగుల ఉనికిని, ఉధృతిని గమనించాలి.

పొగాకు లద్దె పురుగు : దీని యెక్క తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఆకుపైన లేదా ఆకు అడుగు భాగాన గుంపులు గుంపులుగా గ్రుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహరితాన్ని గోకి తినేసి జల్లెడకులుగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు మొక్కల మెదళ్ళ వద్ద లేదా మట్టిపెడ్డలు, రాళ్ల క్రైంద దాగి ఉండి రాత్రి పూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినేస్తాయి. దీని నివారణకు వేసవిలో లోతుగా దుక్కి చేసుకోవాలి. ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి. ఎర పంటగా 30-40 ఆముదం లేదా ప్రొద్దు తిరుగుడు మొక్కలు ఉండేలా విత్తాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కాషాయం పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 8-10 పాశిస్ధావరాలను అమర్చుకోవాలి. ఎదిగిన లార్వాలను నివారించడానికి నోవాల్యురం 200 మీ.లి. లేదా ప్లుబెండమైడ్ 40 మీ.లి. ఎకరాకు సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర (వరి తవుడు 5 కిలోలు + బెల్లం అర కిలో + మెనోక్రోటోఫాస్ 500 మీ.లి. ఎకరా పొలంలో) సాయంత్రం వేళా వెదజల్లాలి.

తమర పురుగులు : తమర పురుగులు పంటను ఆశిస్తా ఆకుల అడుగు భాగాన గోధుమ, ఇనుము రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది కాండం కుళ్ళు, మొవ్వ కుళ్ళ తెగుళ్ళను వ్యాప్తి చేస్తాయి. దీని నివారణకు మెనోక్రోటోపాస్ 320 మీ.లి. + వేప నూనె 1 లి. + ఒక కిలో సబ్బు పొడి 200 లీటర్లు నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. దయమీదకేసం 100 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

పచ్చ దీపపు పురుగులు : ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకు కోన భాగాన 'వై' ఆకారంలో పసుపు రంగు మచ్చలు కలిగిస్తాయి.

పేనుబంక పురుగు: పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క లేత కొమ్మలు మరియు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా పిప్రానిల్ 2 మీ.లి. నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.95652173913
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు