హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / రబీ జొన్నలో సస్యరక్షణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రబీ జొన్నలో సస్యరక్షణ

రబీ జొన్నలో సస్యరక్షణ.

ప్రస్తుతం రబీలో సాగుచేస్తున్న జొన్న పంటలో మ్యావు చంపు ఈగ, కోండం తొలుచు పురుగు మరియు సమయంలో సస్కరక్షణ చర్యలు చేపట్టనట్లైతే అధిక దిగుబడులు సాదించవచ్చును.

మువ్యుచంపు ఈగ : ఈ పురుగు పంట మొలకెత్తినప్పటి నుండి ఒక నెల వయస్సు వరకు ఆశించి పంటకు నిష్పాన్ని కలుగజేస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్క మధ్యలోని మువ్యు ఎండిపోయి చిపోతుంది. మొవ్యూను లాగినప్పుడు సులువుగా వచ్చి, కుళ్లిపోయిన వాసనను కలిగి ఉంటుంది. ఈ పురుగు నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. ద్యమిద్దాక్సామ్ లేదా ఇమిడాక్లోప్రేడ్ 12 మీ.లి. తో విత్తనశుద్ధి చేసుకోవాలి లేదా డయామీద్క్సామ్ 0.2 గ్రా. లేదా ఇమిడాక్లోప్రేడ్ 0.3 మీ.లి. లీటరు నేటికీ కలిపి పిచికారీ చేసుకోవాలి.

కోండం తొలుచు పురుగు : ఈ పురుగు పంట ఒక నెల వయస్సు నుండి కోత వరకు ఆశించి త్రీవ్ర నష్తన్ని కలుగజేయును. ఈ పురుగు ఆశించినప్పుడు మొవ్యూ చనిపోయి తెల్లకంకి వస్తుంది. కాండాన్ని చీల్చి చుస్తే లార్వాలు మైర్యు రాతి కణజాలం కనిపిస్తుంది. విత్తిన 30-35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బొపువైరం 3జి గుళికలు ఆకు సుడులతో వేయాలి.

కెత్తర పురుగు : జొన్న పంటలో కత్తెర పురుగు గ్రుడ్లను ఆకులపై గమనించినప్పుడు వేపనూన్ 1500 ఫై.ఫై.యం. 5 మీ.లి. లీటరు నేటికీ మరియు వివిధ దశలలో గల లార్వాలు గమినించినట్లయితే ఇమామేక్తిన్ బొంజెట్ 0.4 గ్రా. లీటరు నేటికీ కలిపి పిచికారీ చేసుకోవాలి.

వేసవి సజ్జ సాగులో మెళకువులు

రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్న తరువాత సజ్జ ప్రధానమైన ఆహార పంట, సజ్జ పంట ఇతర పంటలకు బొన్నంగా ఎక్కువ ఉష్ణగ్రతలను, బెట్టే పరిస్దితులను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. సజ్జలో ఇనుము మరియు జింకు అధికంగా ఉంటాయి. సజ్జ పంటకు మొట్ట ప్రాంతాల్లో తక్కువ సారవంతమైన నెలలో సాగు చేయటం వలన తక్కువ దిగుబడులు వస్తన్నాయి. సజ్జ ఉత్పత్తి, ఉత్వదకత మరియు నాణ్యతను పెంచుటకు రకాలను ఎంపిక చేసుకోవటం, మేలితేన యాజమాన్య పద్దతులను పాటించటం ఎంతో అవసరం.

  • సజ్జ సాగుకి సైనరీగా 400-450 మీ.మీ. వర్షపాతం అవసరం.
  • వేసవిలో సజ్జను జనవరి మాసంలో విత్తుకోవచ్చును. తేలికపాటి ఎర్ర నెలలు బాగా అనుకూలం, నీరు నిలువని నల్లరేగడి నెలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. కానీ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిలువ ఉంటె మొక్కలు సరిగా ఎదగవు.

పి.హెచ్.బి. -3 (హైబ్రిడ్) : ఖరీఫ్ మరియు వేసవి కాలానికి అనుకూలం. 85-90 రోజులలో పంటకాలం పూర్తవుతుంది. ఎకరానికి 10-12 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. వర్రీ కంకి తెగులును మరియు బెట్టాను తట్టుకుంటుంది.

హెచ్.హెచ్.బి-67 (హైబ్రిడ్): ఖరీఫ్ మరియు వేసవి కాలానికి అనుకూలం. అవి తక్కువ కాలంలో (65-70 రోజులు) కోతకు వచ్చే ఈ హైబ్రిడ్ వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది.

ఐ.సి.యమ్.హెచ్-356 : ఖరీఫ్ మరియు వేసవి కాలానికి అనుకూలం. 80-85 రోజులలో పంట కలం పూర్తవుతుంది. గజాలు మద్యస్ద లావుగా ఉంది ఎకరానికి 10-12 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. వెర్రి కంకి తెగులు ను తట్టుకుంటుంది.

ఐ.సి.టి.పి 8203 : ఖరీఫ్, వేసవి కాలాలకు అనుకూలం, 80-85 రోజులలో పంట కలం పూర్తివుతుంది. గింజలు లావుగా ఉంటాయి. ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది.

విత్తన మోతాదు, విత్తు విధానం: ఎకరానికి 1.5-2.0 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తనాలను 2% ఉప్పు ద్రావణంలో (20 గ్రా. లీటరు నీటికి) 10 నిమిషాలు ఉంచటం ద్వారా ఎర్గాత్ శిలింద్ర అవశిషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చును. ఆరిన తరువాత కిలో విత్తనానికి 3 గ్రామాల చొప్పున డ్తెఱమోను కలిపి విత్తనశుద్ధి చేయాలి. నేరుగా విత్తనాన్ని సళ్ళు మధ్య 45 సమ్మె.మీ. ఎదంగాను మరియు సళ్ళలో మొక్కల మధ్య 10 నుండి 15 సమ్మె.మీ. దూరం ఉండే విధంగా విత్తకోవాలి.

ఎరువుల యాజమాన్యం: ఆఖరి దుక్కి చేసేటప్పుడు 3-4 టన్నుల పశువుల ఎరువును ఎకరా పొలంలో వేసి కలియదున్నాలి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నేటి పారుదల పంటకు ఎకరానికి 32 కిలోల నత్రజని, 16 కిలోల బస్యరం మరియు 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నత్రజనిని వితేటప్పుడు సగం, విగత భాగం 30 రోజుల దశలో వేయాలి.

కలుపు నివారణ: విత్తిన 21 రోజుల లోపు మొక్కల మధ్య 10 సమ్మె.మీ. దూరం ఉండేలా చుస్తే ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తిన 15 రోజులకు దంతాలు నడిపి ఎదసేద్యం చేయాలి. విత్తిన 48 గంటలలోగా అత్రిజీన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. సజ్జలో అంటారా పంటగా కందిని 4:1 లేదా 6:1 నిశ్శబ్ట్టిలో వేసుకోవచ్చు.

నేటి యాజమాన్యం: వేసవిలో సాగు చేసేటప్పుడు పూత దశ, గింజ పలు పోసుకునే దశ మరియు గింజ గట్టిపడే దశల్లో నేటి తడులు ఇవ్వాలి.

పచ్చకంకి / వెర్రి కంకి తెగులు: వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు లేత మొక్కల ఆకుల ఎదుగు బాగానే తెల్లని బూజు పెరుగుదల కనిపించి తెగులు తీవ్రత ఎక్కువై మొక్కలు గిడసబారి చనిపోతాయి. కంకి పూర్తిగా ఆకుపచ్చని ఆకులుగా మరి గాంజా ఏరుదాడు. దీని నివారణకు కిలో విత్తనానికి 6.0 గ్రా. మోతలాక్సీలతో విత్తనశుద్ధి చేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకినా మొక్కలు 5% మించి ఉన్నట్లయితే మోతలాక్సీల 35 ఉబైమ్సన్ 1.0 గ్రా. లేదా మోటాలకిలా 8% + మ్యాంకోజాబ్ 64% బాబయ్యా.పి. 3.0 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెనాబంక తెగులు: మొక్కలు పుష్పించే దశలో మబ్బులతో కూడిన ఆకాశం మరియు వర్షపు తుంపరులు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. దీని నివారణకు పైరు పూత దశలో మొంకోజాబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి వరం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

త్రుప్పు మరియు అగ్గి తెగులు: ఈ తెగుళ్ళ ఆశించిన మొక్కల ఆకుల పై మచ్చలు ఏర్పడును. ఈ తెగుళ్ళ ఎక్కువగా ఆశించినప్పుడు లీటర్ నీటికి 2.5 గ్రా. మ్యాంకోజాబ్ లేదా 1 గ్రా. కార్బొడిజం చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

గులాబీ రంగు పురుగు/కాండం తొలుచు పురుగు: ఈ పురుగు ఆశించినట్లయితే నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

పంటకోత మరియు నూర్పిడి: సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కండపు కంకి మడత కోతకు వస్తుంది. కాబట్టి కనీసం 2 దశల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతికట్టాలి. కంకులను బాగా ఆరబెట్టి తర్వాత సర్పిడి చేసుకోవచ్చును.

ఆధారం: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం

2.95652173913
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు