హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / రైతులకు గ్రీన్ సిమ్ కార్డులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రైతులకు గ్రీన్ సిమ్ కార్డులు

ధ్వని ఆధారిత వ్యవసాయ సమాచారము

గ్రీన్ సిమ్ కార్డ్ అంటే ఏమిటి?

రైతులకు గ్రీన్ SIM కార్డ్ పథకము IFFCO కిసాన్ సంచార్ లిమిటెడ్ (IKSL) చే చేపట్టబడింది. IKSL ఎయిర్టెల్ మరియు IFFCOల (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కో ఆపరేటివ్) సమిష్టి కార్యక్రమము. IKSL గ్రామీణ రైతులకు ప్రాంతీయ భాషల్లో ధ్వని ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని అందిస్తుంది. ఈ సేవ 2008 లో ప్రారంభించబడింది.

చందాదారులు ఏ రకమైన సమాచారాన్ని అందుకుంటారు?

ప్రతి రోజూ, చందాదారులు 5 రికార్డ్ స్వర సందేశాలు అందుకుంటారు. ప్రతి స్వర సందేశం ఒక నిమిషం నిడివిని కలిగి ఉంటుంది. ఈ సందేశాలు ప్రాంతీయ భాషలలో ఉంటాయి. ఇవి వ్యవసాయం, జంతు పెంపకం, హార్టికల్చర్, భీమా, ప్రభుత్వ విధానాలు, పథకాలు, మార్కెటు ధరలు, వాతావరణ సమాచారం, పట్టు పురుగుల పెంపకం, పిస్సికల్చర్, పంట రుణాలు, సస్య రక్షణ, ఆరోగ్యం లాంటి అనేక రంగాలకు సంబంధించిన వివరాలను తెలుపుతాయి.

చందాదారులు ఫోను చేయడానికి ఏదైనా హెల్పు లైను ఉందా?

ఉంది. ఫోనును తీయలేక పోయినలేదా పగటిపూట స్వర సందేశం వినలేక పోయిన చందాదారులు 53435కు ఫోనుచేసి మళ్ళీ సందేశాలను వినవచ్చు. వారు ప్రత్యేక 'హెల్పు లైను - 534351' ను ఉపయోగించవచ్చు. రైతుల ప్రశ్నలకు అనుభవజ్ఞులైన నిపుణుల సమాధానాలు అందుబాటులో ఉంటాయి.

గ్రీన్ సిమ్ కార్డులను ఎక్కడనుడి పొందవచ్చు?

గ్రీన్ సిమ్ కార్డులు ఏ GSM మోబైలు ఫోనులోనైనాఇముడుతాయి. రైతులు ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ (PACS) నుండి సిమ్ కార్డులను పొందవచ్చు. లేదా కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-1551కు ఫోను చేయవచ్చు.

ఆధారము: IFFCO కిసాన్ సంచార్ లిమిటెడ్

3.00881488737
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు