অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కూనారం సంన్యాలు (కె.ఎన్.ఎం.118)వరి రకం లక్షణాలు – యాజమాన్య పద్ధతులు

కూనారం సంన్యాలు (కె.ఎన్.ఎం.118)వరి రకం లక్షణాలు – యాజమాన్య పద్ధతులు

తెలంగాణ జిల్లాలలో గత 10-12 సంవత్సరాల నుండి ఎం.టి.యు – 1010 వరి రకం సాగులో కొన్ని సమస్యలున్నప్పటికి దీని దిగుబడి సామర్ధ్యం రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఈ విధంగా ఈ రకాన్ని రైతులు ఏళ్ళ తరబడి సాగుచేస్తున్నందుకు దీనికి చీడపీడల తెగుళ్ళను తట్టుకునే శక్తి తగ్గుతూ వస్తుంది. ఇంకా ఈ రకంలో గింజరాలే గుణం ఎక్కువగా కనిపిస్తుంది.

అందువల్ల ఎం.టి.యు – 1010 రకానికి ఉన్న మార్కెట్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఎం.టి.యు – 1010 రకానికి ధీటుగా ప్రత్యామ్నయంగా కూనారం వ్యవసాయ పరిశోధనా స్ధానం నుండి 120 రోజుల పంటకాలం కలిగిన కె.ఎన్.ఎం. 118 అనే సన్న గింజ రకాన్ని తయారు చేసి ‘కూనారం సన్నాలు’ పేరుతో విడుదల చేశారు. ఈ రకానికి ఉన్న దిగుబడి సామర్ధ్యం, చీడపీడలు, తెగుళ్ళను తట్టుకునే గుణం వల్ల, పరిశోధనా స్ధానంలో 3 సవత్సరాలు రైతుల పొలాల్లో 2 సవత్సరాలుగా వివిధ పరిక్షలలో ఎం.టి.యు – 1010 కంటే మంచి ఫలితాలనిచ్చింది.

ఈ రకం ఎం.టి.యు – 1010 రకం గింజ ఆకారాన్ని పోలిఉండి, దీనికంటే బరువైన నాణ్యతగల గింజ, తక్కువ గిన్జరాలే గుణం తక్కవ చేను మీద పడే గుణం కలిగి ఉండి నేల సరవంతతను బట్టి ఎకరానికి 28-35 క్వింటాళ్ళ దిగిబదినిస్తుంది. ఈ రకం కొంత వరకు అగ్గి తెగులు, సుడిదోమను, రబీ నారుమడి దశలో కొంత వరకు చలిని తట్టుకొంటూ ఖరిఫ్, రబీ కాలంలో మంచి దిగుబడులను నమోదు చేసుకొంటున్నది.

రకం వివరాలు

రకం – కూనారం సన్నాలు (కె.ఎన్.ఎం. 118) తల్లి/తండ్రి – ఎం.టి.యు – 1010 / జె.జి.ఎల్. 13595 పంట కాలం – ఖరీఫ్ – 120 రోజులు; రబీ – 125-130 రోజులు

పంట దిగుబడి – 28-25 క్వింటాళ్ళు / ఎకరాకు విడుదలైన సంవత్సరం – 2015

లక్షణాలు

  • ఎం.టి.యు – 1010 రకాన్ని పండించే నీటి వసతి గల అన్ని సారవంతమైన నేలల్లో ఈ రకాన్ని పండించుకోవచ్చు.
  • ఖరిఫ్, లేట్ ఖరిఫ్, రబీ కలాలకు అనువైన స్వలపకలిక దొడ్డు గింజ రకం. ఈ రకాన్ని pv
  • kunaram.jpg
  • ఖరిఫ్ లో అయితే జూలై చివరి వారం వరకు, రబీలో నవంబర్ 15 నుండి డిసెంబర్ 20 వరకు నార్లు పోసుకోవచ్చు.
  • ఖరిఫ్లో ఆలస్యంగా (జూలైలో) విత్తుకోవడానికి అనువైన రకం కనుక పచ్చిరొట్ట పంటలతో భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
  • ఈ రకం ఎం.టి.యు – 1010 గింజ ఆకారాన్ని పోలి ఉండి, దీని కంటే బరువైన నాణ్యత గ్లా గింజ , తక్కువ గిన్జరాలే గుణం, తక్కువ చేను మీద పడిపోయే గుణం కలిగి ఉంటుంది.
  • ఈ రకం కొంత వరకు అగ్గి తెగులును, సుడిదోమను, రబీ నారుమడి దశలో కొంతవరకు చలిని తట్టుకుంటుంది.
  • ఈ రకం నేల సరవంతతను బట్టి ఎకరానికి 28-35 క్వింటాళ్ళ దిగుబడినిస్తూ, తేలికపాటి చౌడు నెలల్లో సైతం మంచి ఫలితాలను ఇస్తుంది.

పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కూనారం సన్నాలు బ్రిడర్ విత్తనాన్ని కూనారం వ్యవసాయ పరిశోధనా నుండి సేకరించుకోవాలి.
  • ఎకరానికి 25-30 కిలోల విత్తనాన్ని సేకరించికొని తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి పొడి విత్తన శుద్ధి కొరకు ఒక కిలో వితనానికి 3 గ్రా. కార్బండిజమ్ తడి విత్తనా శుద్ధి కొరకు అయితే ఒక లీటరు నీటికి 1 గ్రా కార్బండిజమ్ కలిపి నీటిలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, ఆ తర్వాత 24 గంటలు మండే బురదలో కొద్ది సేపటికి దిగునట్లు నారుమళ్ళలో సమానంగా చల్లుకోవాలి.• ఒక ఎకరానికి సరిపడా నరుడుమడికి 1 కిలో నత్రజని అరకిలో భాస్వరం, అరకిలో పోటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి.
  • నరుపోసిన 15 రోజుల తర్వాత నారుమడిలో అరకిలో నత్రజని కలిగిన ఎరువును పైపాటుగా వేసుకోవాలి.
  • స్వల్పకాలిక రకం కనుక నారు పెరుగుదలను బట్టి 25-28 రోజుల వయసుగల నారును వేరు వ్యవస్ధ దెబ్బతినకుండా తీసి ఒక డుబ్బుకు 2 నుండి 3 మొక్కలు ఉండేలా పైపైన నాటుకోవాలి. ఒకవేళ ఎక్కువేళ ఎక్కువ రోజుల వయస్సు గల నారును నాతుకుంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.
  • స్వల్పకాలిక రకం కనుక నాట్లు వేసుకున్న తర్వాత 15 రోజుల వ్యవధిలో నత్రజనిని 3 దఫాలుగా చిరుపోట్ట దశలోపు చల్లుకోవాలి. పూర్తి భాస్వరంను 75 శాతం పోటాష్ ను నాట్లు వేసేటప్పుడు, 25 శాతం అంకూర్ దశలో వేసుకోవడం వల్ల నాణ్యమైన గట్టి గింజలు ఏర్పడుతాయి.
  • రబీలో ముఖ్యంగా జింక్ లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. కనుక నాటిన 15 రోజుల లోపు జింక్లోపం కనిపించినా, చౌడు పొలాలు జింక్ లోపం ఉన్న నేలల్లో తప్పనిసరిగా ఎకరానికి 20 నుండి 25 కిలోల జింక్ సల్ఫేట్ ను లేదా లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం రోజుల తేడాతో 2-3 సార్లు పంట పై పిచికరీ చేసిన మంచి దిగుబడులు పొందవచ్చు.
  • వరి పంట దిగుబడి తగ్గిపోకుండా కలుపు నివారణ చాలా అవసరం కనుక కులుపు నివారణకు నాటిన 4-5 రోజులకు ఎకరానికి 1 లీటరు బ్యూటాక్లోర్ లేదా 500 మి. లీ. ప్రిటిల్లా క్లోర్ లేదా 400 మి. లీ. అనిలోఫాస్ ద్రావణాన్ని లేదా 35 గ్రా. ఆక్జాడయార్జిల్ పొందిమందును 20-25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో పలుచగా నీరు ఉంచి సమానంగా వేదజల్లాలీ. పోత్తదశ నుండి గింజ కట్టే దశవరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
  • ఈ రకంలో కాండం తొలిచే పురుగు (మొగి పురుగు) ఉధృతిని బట్టి, నాటిన 20-25 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ లేదా 4 కిలోల క్లోరాన్త్రనిప్రోల్ లేదా 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు వేసుకోవాలి. పంట చిరుపోట్ట దశలో అయితే ఎకరానికి 60 మి. లీ. క్లారాన్త్రనిప్రోల్ ద్రావణం పిచికరీ చేసుకోవాలి.
  • ఈ రకానికి పాముపొడ లేదా కాండం కుళ్ళు ఆశించినప్పుడు లీటరు నీటికి 2 మి. లీ. వలిడామైసిన్ లేదా 2 మి. లీ. హెక్సాకోనజోల్ లేదా 0.4 గ్రా. ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్, టిబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి.
  • ఈ రకంలో అగ్గి తెగులు నివారణకు లీటరు నీటికి 0.6 గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి. లీ. ఇసొప్రొధియోలిన్ లేదా 1.25 మి.లీ. టిబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
  • ఈ రకం 15-20 రోజుల నిద్రవస్దను కలిగి ఉంటుంది. కనుక కోసిన ధాన్యాన్ని వెంటనే విత్తనంగా వాడుకోవాలంటే బాగా ఎండబెట్టిన తరువాత మొలక శాతాన్ని పరీక్షించి నార్లుపోసుకోవాలి.

ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/13/2022



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate