অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ధాన్యం నిల్వలో మెళకువలు

ధాన్యం నిల్వలో మెళకువలు

  • ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసేటప్పుడు పాటించవలసిన వద్దతుల గురించి తెలుసుకుందాం.
  • గోదాములను సిమెంటు కాంక్రిట్తో నిర్మించాలి. పాత ఇల్లు అయితే కీటకాలు, తేమ, వర్షపు నీరు లోనికి రాకుండా నేల, గోడలు, పైకప్పులలో పగుళ్ళు రంధ్రాలు లేకుండా సిమెంటుతో పూడ్చి వేయాలి.
  • ఎలుక కన్నాలను గాజు ముక్కలు, సిమెంటు కాంక్రీట్తో పూడ్చివేయాలి.
  • పక్షులు రాకుండా కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు బిగించాలి.
  • గోదాములను దమ్మ ధూళి లేకుండా శుభ్రం చేయాలి.
  • నేల, గోడలు, పైకప్చు మీద మలాథియాన్ (50 ఇ.సి) 3 లీటర్ల నీటికి కలిపి 100 చ.మీ. విస్తీర్ణంపై పిచికారీ చేయాలి.
  • ధాన్యం నింపే ముందు గోనె సంచుల మీద, లోపల మలాథియాన్ ద్రావణం పిచికారీ చేయాలి.
  • ధాన్యాన్ని ఎడంలో ఆరబెట్టి తేమ శాతం 14 లేదా అంతకంటే తక్కువగా ఉండేటట్న జాగ్రత తీసుకోవాలి. తరువాత శుభ్రపరిచి నిల్వ చేయాలి.
  • ధాన్యం నిల్వ చేసేటప్పుడు ఎ టు వంటి వురు గు మందులను కలుపకూడదు.
  • గిడ్డంగిలో నేలమీద చెక్కదిమ్మలు, చెక్క పలుకలు, కర్ర దుంగలు వేసి వాటిపైన ధాన్యం బస్తాలు
  • dn .jpg

  • గోడలకు తాకకుండా జాలీవేయాలి. జాలీకి జాలీకి మధ్య ఖాళీ ఉండాలి.
  • మలాథియాన్ (50 ఇ.సి.) 30 మి.లీ. మందు 3 లీటర్ల నీటిలో కలిపి 100 చ.మీ. విస్తీర్ణనానికి బస్తాల మీద, గోడల మీద అప్పుడప్పుడు పిచికారీ చేసూ ఉండాలి.
  • బయట గాలి లోపలికి, లోపలి గాలి బయటకు రాకుండా నిర్మించిన సింమెంటు కాంక్రీట్ గిడ్డంగిలో కీటక నివారణ ఇథైల్ డైబ్రోమైడ్ ఏంఫ్యూయల్స్ వాడవచ్చు.
  • అల్యూమినియం ఫాస్బైడ్ బిళ్ళలు ఒక టన్ను ధాన్యానికి 3 గ్రా. బిళ్ళలు రెండు చొప్పున బస్తాల మధ్య పెట్టి 7 రోజుల పాటు తలుపులు మూసి ఉంచితే విషపు వాయువు విస్తరించి కీటకాలు ఎలుకలు చనిపోతాయి.

ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate