অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరిలో చీడపీడల నివారణ

యాసంగి (రబీ) సీజను రైతులకు అనుకులమనే చెప్పవచ్చు. మంచి వర్షాలతో చెరువుల్లో, బోరుబావుల్లో నీరు ఉన్నందున వరిసాగు అధికంగా సాగయ్యే అవకాశం ఉంది. సహజంగా వరి పంటలో తాటాకు తెగులు, కాండం తొలిచే పురుగు, దోమకాటు, ఉల్లికోడు, అగ్గితెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉండి. కాబట్టి రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే నష్ట నవారణ చేసిన వారమౌతాము.

తాటాకు తెగులు (హిస్పా)

ఇవి మెరిసే నిలంతో కూడిన నలుపు రంగులో ఉంటాయి. ఈ పెంకు పురుగుల శారిరభాగాన సన్నని ముళ్ళు కలిగి ఉండి, పొలాల్లో ఎగురుతు, పక్క పొలాలకు పోగలవు. తల్లి పురుగులు ఒకొక్క ఆకుల పొరల్లో చొప్పించి జిగురు పదార్ధంతో ముసివేస్తాయి. te.jpgపిల్ల పురుగులు లేతపసుపు రంగులో ఆకుల పొరలలో దాగి ఉండి, పత్రహరితాన్ని తినివేస్తాయి. దీనివలన ఆకుల పై పొరల్లో దాగి ఉండి, పత్రహరితాన్ని తినివేస్తాయి. దీని వలన ఆకుల పై పొరలు తెల్లని చారలుగా కనిపిస్తాయి.

నివారణ : మోనోక్రోటోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ గాని లీటరు నీటికి 2 మి. లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగులు వేరొకరి పొలంలోకి పోకుండా ముందుగా పొలం చుట్టారు నుండి పొలం మధ్యకు సస్యరక్షణ చేస్తూ రావాలి.

కాండం తొలిచే పురుగు

తల్లి రెక్కల పురుగు ముదురు గోధుమ రంగులో ఉండి రెక్కల పై నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. గుడ్ల సమాదాయాలను నారు మడులలోను నాటిన తరువాత నారు కొసలు అనగ ఆకుల చివరి భాగంలో పెడతాయి. వీటినుండి తెలుపు, గోధుమ రంగులో ఉండే లార్వాలు ఎదిగిన తర్వాత నారింజ పసుపు రంగులోకి మారి, పిలకలు తొడిగే దశలో మొక్క కింది భాగంలో రంధ్రం చేసుకొని లోపలికి చొచ్చుకొనిపోయి, మొవ్వును కొరికి వేయడం వలన, మువ్వలు ఎండి చనిపోతాయి. పూత దశలో వెన్నలు తెల్లకంకులుగా, తాలుగా మారుతాయి. చచ్చిన మొవ్వలు, కంకులు పీకితే తేలికగా బయటకు వస్తాయి.

నివారణ : నారుమడిలో కార్బోఫ్యురాన్ 3 జిగుళికలు, ఎకరాకు సరిపడే నరుమడికి (4 సెంట్లు) ఒకటిన్నర కిలోల వేయాలి. నాటిన 15 రోజులలో కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు గాని, కార్బోఫ్య

రాన్ 3జి గుళికలు 10 కిలోలు గానీ, క్లారాద్రానిలిప్రోల్ 0.4 శాతం (ఫేర్టేరా) 4 కిలోలు గాని ఎకరంలో వేయాలి. గుళికలు వే

యునప్పుడు పొలంలో సుమారు ఒక సెం. మీ. తగ్గగుండా నీరు నిలవు ఉంచి గట్లు బాగా వేయాలి. పొలంలోని నీరు బయటకు పోకుండా జాగ్రత్త పడాలి. పంట చిరుపోట్ట దశలో మోనోక్రోటోఫాస్ 350 మి. లీ. గానీ, ఫాస్ఫామిడాన్ 40 శాతం 400 మి.లీ. గానీ, క్లోరిఫైరిఫాస్ 50 ఇ.సి. 250 మి. లీ. గాని లేదా రీనాక్సీఫిర్ (కోరాజిన్) 50 మి. లీ.ktp.jpg గనీ ఎకరంలో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.యాసంగి సీజనులో ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది.

సుడిదోమ (దోమకాటు)

గోధుమ వర్ణపు తెల్లమచ్చ దోమలు, గుంపులు గుంపులుగా దుబ్బుల మొదళ్ళకు అడుగున నీటి మట్టం పై ఉండి, దుబ్బుల నుండి రసాన్ని పిలుస్తాయి. పైరు క్రమేణ సుడులు, సుడులుగా ఎండిపోతుంది. ఇవి ఒక్కొసారి తీవ్రనష్టాన్ని కలుగచేస్తాయి. నివారణ : దోమను తట్టుకొనే రకాలను సాగుచేయాలి. నత్రజని (యూరియా) ఎరువును సూచించిన మోతడులోనే దఫాలుగా వేయాలి. నాటిన పొలంలో 2 మీటర్లు ఎండంలో ఉత్తర, దక్షిణ దిక్కుల్లో కాలిబాటలు (పాయలు) తీయాలి.sd.jpg

సస్యరక్షణ : ఇధోఫెన్ ప్రాక్స్ 10 శాతం 300 మి.లీ. గానీ బూప్రొఫేజిన్ 25 శాతం 300 మి. లీ. గానీ ఫెన్బ్యూకార్బ్ 400 మి.లీ. గానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 60 మి.లీ. గానీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మందు ద్రావణం మొక్కల మొదళ్ళ మొక్కల దగ్గర పడునట్లు పిచికారీ చేయాలి.

ఉల్లికోడు

తల్లిపురుగు ఆకుల కోనల దగ్గర, మొవ్వుపై ఒక్కోక్కటిగా గుడ్లను పెడుతుంది. గుడ్డునుండి వచ్చిన వెంటనే పిల్లపురుగులు కాండంలోనికి తోలుచుకొని పోయి, ఆంకురం వద్ద వృద్ధి చెందుతాయి. తదుపరి అంకురం, uk.jpgఉల్లికాడ లాగ లేత ఆకుపచ్చటి పోడుగుటి గొట్టంగా మార్పు చెంది బయటకు వస్తుంది. ఈ గొట్టం చివర చిన్న ఆకు ఉంటుంది. వీటిని ఉల్లికోడు సిల్వర్ ఘాట్స్ అంటారు. పురుగు ఆశించన పిలకలు ఎండిపోతయి. ఆలస్యంగా నాటిన పొలంలో వీటి త్రీవ్రత అధికంగా ఉంటుంది.

సస్యరక్షణ : కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10కిలోలు గానీ లేదా ఫోరేట్ 10 జి గుళికలు 5 కిలోలు గాని ఎకరం పొలంలో వేయాలి.

అగ్గి తెగులు

ఆకుల పై ముదురు గోధుమ రంగు మచ్చులు నూలు కండె ఆకారంలో చివర్లు మొనదేలి ఉంటాయి. తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు ఆకుల పై మచ్చలు పెద్దవై ఒక దానితో ఒకటి కలిసి పోవడం వలన మొక్కలు తగలబడినట్లుగా కనబడటం వలన దీనిని అగ్గితెగులు అని పిలుస్తారు. ఈ తెగులు కణుపులకు సోకినప్పుడు అవి కుళ్ళపోవడం వలన కణుపులకు వద్ద విరిగిపోతాయి. ఇదే తెగులు కంకుల మెడల పై కనబడినప్పుడు నష్టం అధికంగా ఉంటుంది,. దీనిని మెడ విరుపు అంటారు.

సస్యరక్షణ : మొదటనే విత్తనశుద్ది విధిగా చేయాలి. నత్రజని (యూరియా) ఎక్కవ మోతాదులో వాడకూడదు. తెగులు కనిపించిన వెంటనే యూరియా వాడటం ఆపివేయాలి. చలి అధికంగా ఉండడం, గాలిలో తేమ 90 శాతం కన్నా ఎక్కువ, వర్షం, చిరుజల్లులు కురవడం తెగులు ఉధృతికి అనుకూలం.

ట్రైసైక్లోజోల్ 120గ్రా. లేదా తెబుకోనాజోల్ 50 శాతం + ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్ 25 డుబ్ల్యూ.జి. (నేటివో) – 160 గ్రా. లేదా ఇసొప్రొధయోలిన్ 300 మి.లీ. గానీ ఎకరంలో పిచికారీ చేయాలి.

ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate