హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / వివిధ మొక్కజొన్న రకాల పంటకోతలో పాటించవలసిన మెళకువలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వివిధ మొక్కజొన్న రకాల పంటకోతలో పాటించవలసిన మెళకువలు

వివిధ మొక్కజొన్న రకాల పంటకోతలో పాటించవలసిన మెళకువలు.

మొక్కజొన్నను ఖరీఫ్ లో ముఖ్యంగా సిద్ధిపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కొమరం బీమ్, ఆసిఫాబాద్, మెదక్ మరియు వికారాబాద్ జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ లో సాగుచేసి మొక్కజొన్న పంట ప్రస్తుతం పూత దశ నుండి గింజ పాలుపోసుకునే దశలో ఉంది. సాధారణ ఏక సంకర రకాలు, తీసి మొక్కజొన్న పాప్ కార్న్ మరియు బేబీ కార్న్ రకాలను సాగు చేసినారు. సాధారణంగా బేబీకార్న్ అంటే ఫలదీకరణం చెందని మొక్కజొన్న, కండె, పీచు తొలి దశలో గింజ కట్టక ముందే కోసిన మొక్కజొన్న కండెలను బేబీ కార్న్ అంటారు. బేబీ కార్న్ కూరగాయగా ప్రాచుర్యం పొందుచున్నది. అలాగే పట్టాన పరిసర ప్రాంతాలలో తీపి మొక్కజొన్న కండెలకు బాగా గిరికి ఉంటుంది. గొంజాపాలు పోసుకునే దశలో సాధారణ మొక్కజోన్న కండెలతో పోలిస్తే తీపి మొక్కజొన్న కండెలలో చక్కర శాతం (25-30%) చాల ఎక్కవగా ఉంటుంది మరియు పోషక విలువలు ఎక్కవ. తీపి కండెను అవసరాన్ని బట్టి లేదా అనివార్య పరిస్ధితులలో బేబీ కార్న్ గా కూడా మార్కెట్ చేసుకోవచ్చు. గింజ రకాలు సాగుచేసినచో కండె తొలి దశలో నీటి తడులు ఇవ్వలేని పాశంలో బేబీ కార్న్ గా (50 రోజుల్లో) కోసుకొని మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు ఇవ్వలేని పాశంలో పచ్చి కదులుగా (80-85 రోజుల్లో) కోసుకొని మార్కెట్ చేసుకోవడం వలన రైతులు పంటను కోసే దశలను తెలుసుకొని అమ్మకాయంటే అధిక లాభాలను పొందవచ్చు.

సాధారణ మొక్కజొన్న

పంట కోతకు వచ్చినప్పుడు పక్వ దశను గమనించి కండెలను కోయాలి. పక్వ దశను క్రైంద విధంగా గుర్తించాలి.

  • కందుల పైపొరలు అందినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి.
  • బాగా ఎండిన కండెలు మొక్కల నుండి క్రైండికి వేలాడుతూ కనిపిస్తాయి.
  • కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు గట్టిగ ఉంది నొక్కులు ఏర్పడవు.
  • కండెలోని గోజాలను తీసి వాటి అడుగుభాగం పరిశించినచో (కొన్ని రకాలలో) నల్లని చారాలను గమనించవచ్చు.

కోసిన కండెల గొంజాలలో నీటి శాతం 25-30 ఉంటుంది. కాబట్టి తేమ శాతం 12-15 కు తగ్గే వరకు కండెలు వారం రోజుల పాటు ఎండబెట్టాలి. తరువాత కండెలను నూర్పిడి చేయుటకు (గిజాలను కండె నుండి వేరు చేయుట) కర్రలు లేదా కరెంటుతో లేదా ట్రాక్టరుతో నడుచు నూర్పిడి యంత్రాలను ఉపయెగించవచ్చు. నూర్పిడి తరువాత గిజలాలో తేమ 9-10 శాతం ఉండేటట్లు 2-3 రోజులు బాగా ఆరబెట్టాలి. ఈ విత్తనాలను గొనె సంచులలో లేదా పాలిథిన్ సంచులలో భద్రపరచి చల్లని తక్కువ తేమ గల ప్రాంతంలో నిల్వ  చేయాలి. నిల్వలో గింజలకు తేమ తగలకుండా, ఎలుకలు, పురుగులు లేదా శిలీముద్రలు మొదలగునవి ఆశించకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

తీపి మొక్కజొన్న

తీపి మొక్కజొన్నలో  పరంపరగా సంపర్కం జరిగిన మూడు వారాల తర్వాత గింజలు చాలా తీయగా ఉంటాయి. కొంచెం ఎండిన పీచు, కండెపైన బిగుతుగా ఉన్న పచ్చని పొత్తు మరియు బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బాట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గిల్లినచో పాలు కారును. చక్కర శాతం గింజ పాలు పోసుకునే దశ నుంచి 10 రోజుల వరకు స్దిరపడి తరువాత క్రమంగా తగ్గుతుంది. కావున రైతాంగం ఈ 10 రోజులలో నాణ్యతతో కూడిన కండెలను ఒకేసారి కాకుండా ధపాలుగా కోసి మార్కెట్ చేసుకోవలెను. దీనికి తోడుగా తీపి మొక్కజొన్నను ధపాలుగా విత్తుకోవడం వలన పంట ఒకేసారి కోతకు వచ్చి వృధా కాకుండా ధపాలుగా మార్కెట్ చేసుకోవచ్చు.

కోత ఆలస్యం చేయడం వలన గింజలోని తీపిదనం తగ్గుతుంది. అందుకే కండెలను కోసిన వెంటనే 1-2 రోజుల లోపు వినియెగించుకోవాలి.  తీపి మొక్కజొన్నను కోసిన వెంటనే పొలం నుంచి షెడ్ కి తరలించి చెక్క పెట్టెల్లో లేదా అత్తా పెట్టెల్లో పెట్టి చల్లని ప్రదేశంలో (0-4 సెం.) నిల్వ చేయాలి. కండెలను పాలిథిన్ సంచుల్లో పెట్టి మార్కెట్లో అమ్మవచ్చు. అత్యధిక చక్కర శాతం 27 సెం. దగ్గర 2 రోజులు, 16 సెం. దగ్గర 5 రోజులుంటుంది. కోసిన తర్వాత తీపిదనం చాల త్వరగా తగ్గుతుంది. కోసిన ఒక రోజులో 0 సెం. లో 8 శాతం, 30 సెం. లో. 52 శాతం చక్కర తగ్గిపోతుంది. తరువాత చక్కర పిండి పదార్థంగా మారుతుంది.

బేబి కార్న్

బేబి కార్న్ కండెలను 45-50 రోజులప్పుడు 2-3 సెం. మీ. పీచు ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేసినతైత్తే కండెలు ఒక్క రోజులోనే గట్టిపడి, కండెలలో పలు రసాయానికి మార్పులు, విత్తనాల అంకురార్పణ జరిగి బేబి కార్న్ గా ఉపయెగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడి తక్కువగా ఉన్నప్పుడు కోసిన యెడల కండెల నాణ్యత బాగుండును. వర్షాకాలంలో అయితే ప్రతి రోజు, రబీలో రోజు విడిచి రోజు పంట కోత చేపట్టాలి. ముందుగా మొక్కలలో పైనున్న బేబి కార్న్ ను కోసి తరువాత రోజు క్రైందవి కోయాలి. వేసుకునే రకాన్ని బట్టి మొత్తం 7-8 కోతల వరకు తీసుకోవచ్చు.

కోసిన కండెల పైన ఉన్న పిచ్చి తీసివేసి శుభ్రం చేయాలి. తొక్క తీసి మార్కెటింగ్ చేయునప్పుడు కండెలు విరగకుంగా జాగ్రత్తపడాలి. కండెలను సైజు వారీగా వేరు చేసి ప్యాకింగు చేసుకోవాలి. వీటిని 10 సెం. వద్ద 3-4 రోజుల వరకు నిలువ చేసుకోవచ్చు. కొలిచిన కండెలు 6-11 సెం.మీ. పొడవు మరియు 1.0-1.5 సెం.మీ. మందంతో ఉన్నప్పుడు మంచి ధర పొందవచ్చు.

బేబి కార్న్ పై తీసివేసిన తొక్కను మరియు కోత కోసిన మొక్కలను పచ్చిమేతగా ఉపయెగించుకొని అదనపు ఆదాయాన్ని పొందవచ్చును.

పేలాల మొక్కజొన్న

కాండపై పొరలు ఎండిపోయి, గింజ అడుగు భాగంలో నల్లటి చార ఏర్పడినప్పుడు పైరు పక్వ దశకు చేరుకున్నట్లు భావించాలి. గింజలో తేమ 30-35 శాతం ఉన్నప్పుడు కండెలను మొక్కల నుండి వేరు చేసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టినట్లయితే గింజలు పగిలి పేలాలు సరిగ్గా తయారుకావు. గింజలో తేమ శాతం 12-14 కు మించకుండా ఉంది సరైన సమయంలో కండెలు కోయడం వలన గింజలు దెబ్బతినకుండా, నాణ్యమైన పేలాలు తయారవడమే కుకుండా మంచి గిట్టుబాటు ధర పొందవచ్చు. గింజలను మంచి గాలి తాగితే గోదాముల్లో అంతే గాలిలో తేమం శాతం 70 కి తగ్గకుండా ఉండటం వల్ల ఎక్కవ కాలం నిల్వ చేసుకోవచ్చు.

పైన చెప్పిన విధంగా వివిధ రకాలను సరైన సమయంలో కోతచేపట్టి అధిక ఆదాయాన్ని పొందవచ్చును.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.90909090909
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు