অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరిలో యాంత్రికరణ

వరిలో యాంత్రికరణ

  1. దుక్కి దున్నే పరికరాలు
    1. యమ.బి.ప్లవ్ (రెక్క నాగలి)
    2. పళ్ళెపు నాగలి
    3. భ్రమణ నాగలి
  2. దుక్కిని పదునుకు తెచ్చే పరికరాలు
    1. చక్రాల గుంటక (పళ్ళెపు గొర్రు)
    2. కల్టివేటర్
    3. రోటా వేటరు
    4. లేజర్ సహాయముతో భూమిని చదునుచేయు పరికరం
  3. దమ్మచేయు పరికరాలు
    1. వరి చక్రాల గుంటక
    2. రోటోపచ్లర్
    3. విత్తనము విత్తే పరికరాలు (మెట్ట వరి)
    4. పూటెడ్ రోటర్ఫీడ్ విత్తే పరికరాలు (విత్తన గొర్రు)
    5. ఒకేసారి విత్తనము మరియు ఎరువు విత్తే యంత్రము
    6. మొలకెత్తిన వరి విత్తనాలు సాళ్ళలో నాటు పరికరము (డ్రమ్ సీడర్)
  4. వరి నాటు యంత్రములు
    1. మనిషి వెనుకనుంచి నడిపే నాటు యంత్రము
    2. స్వయంశక్తితో నడిచే వరినాటు యంత్రము:
      1. వరి సాళ్ళలో కలుపు తీయు దంతి (కోనో వీడరు)
      2. మోటారుతో నడిచే కలుపు తీయు పరికరము
      3. వరికోత యంత్రము
      4. వరికోత మరియు కట్టలు కట్టు యంత్రము
      5. వరి నూర్పిడి యంత్రము
      6. కంబైన్ హార్వెస్టరు
    3. వరిగడ్డినిర్వహణ పరికరాలు
      1. గుండ్రంగా కట్టలు కట్టే పరికరము
      2. చతురస్రాకారంలో కట్టలు కట్టే పరికరము
      3. గడ్డిపోగుచేయు పరికరము
      4. వరి దుబ్బులు ముక్కలు చేయు పరికరము(రోటరీ శ్లేషర్)
      5. గడ్డిని కోసి మరియు ముక్కులు చేసి ట్రాలీలోకి వేసే పరికరము
      6. గడ్డిని కోసి మరియు ముక్కలు చేసి పొలంలో పరిచే పరికరము
      7. వరి ఆరబెట్టే పరికరము (ప్యాడీ డ్రయర్)

వరి ఆంధ్రప్రదేశ్ లో  సాగుచేయు ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట పెరుగుతున్నజనాభాకు ఆహారమును అందించుటయేగాక పశుగ్రాసంను మరియు గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నది. వరి విస్తీర్ణము మరియు దిగుబడి ఏదైనా క్షీణించినచో దాని ప్రభావము రాష్ట్ర ఆర్థిక మరియు ఆహార భద్రతమీద పెను ప్రభావం చూపుతుంది. వరి సాగు అధిక శ్రమతో కూడుకున్నప్పటికి 60% గ్రామీణ ప్రజలు దీనిమీద ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న పరిస్థితుల అనుగుణంగా యువత జీవనోపాధి కొరకు పట్టణాలకు వలస వెళ్ళుట వలన మరియు వివిధ ప్రభుత్వ పథకాల వలన గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత ఏర్పడింది. గత కొద్ది సం||లుగా ముఖ్యముగా కూలీల ఖర్చు మరియు ఎరువుల ఖర్చు విపరీతంగా పెరుగుట వలన వరి సాగు అంత లాభసాటిగా లేదు. వరిసాగులో కూలీల కొరతను అధిగమించుటకు మరియు సాగు ఖర్చును తగ్గించుటకు యంత్రములపై ఆధారపడవలసి వస్తుంది. అంతేకాకుండా వరి పంటను పండించేందుకు అయ్యే ఖర్చు తగ్గించి, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచి అధిక లాభాలు పొందాలంటే రైతులు ఆధునిక వ్యవసాయ పరికరాలను దుక్కిదున్నే దగ్గరనుండి పంట నూర్చి ఇంటికి చేర్చె వరకు ఉపయోగించవలసి ఉంటుంది. వరి యాంత్రికరణకు అవసరమైన యంత్ర పరికరాలను ఈ క్రింది విధముగా విభజించవచ్చును.

  • దుక్కి దున్నే పరికరాలు
  • దుక్కిని పదునుకు తెచ్చే పరికరాలు
  • లేజర్ సాయంతో భూమిని చదునుచేయు పరికరం
  • విత్తనము విత్తే పరికరాలు (మెట్ట వరి)
  • నాటువేయు యంత్రాలు
  • కలుపు తీయు యంత్రములు
  • వరికోత యంత్రము
  • వరి నూర్పిడి యంత్రములు
  • వరికోత మరియు నూర్పిడి యంత్రములు
  • వరి గడ్డి నిర్వహణ పరికరాలు
  • వరి ఆరబెట్టు యంత్రములు

దుక్కి దున్నే పరికరాలు

యమ.బి.ప్లవ్ (రెక్క నాగలి)

  • రెక్క నాగలి ట్రాక్టరుకు ఉన్న మూడు పాయింట్ల బంధనముకు తగిలించి అతిగట్టి నేలలను సైతము దున్నటకు అనువైన సాధనము. ఇది రెండు బోటములను ఒక్కొక్కటి 30 సెం.మీ వెడల్పు కలిగి మరియు ఒక్కొక్క బోటముల అరుగుదలను నిరోధించు ಸ್ಥಿಲು బోటములు, బార్ పాయింట్లు అమర్చబడినది. ఎక్కువలోతు వరకు పెళ్ళను పెకలించి, తలక్రిందులు చేయును.దీని ధర రూ.40,000/- నుండి రూ.95,000/- వరకు ఉంటుంది. హైడ్రాలిక్ సహాయంతో బోటములు తలక్రిందుల చేయు రెక్క నాగలి సాయంతో పొలంలో ఒక వరుస దుక్కి దున్నితే తరువాత ఆ చివరి నుంచే రెండో వరుస దుక్కిదున్నవచ్చును. నేల స్వభావమునుబట్టి 3–5 సం|నకు ఒకసారి కనీసం రెక్క నాగలిని వరి పండించే నేలలో ఉపయోగించవలెను.

పళ్ళెపు నాగలి

  • ఈ పరికరము సుమారు 60 నుండి 90 సెం.మీ వ్యాసము కలిగిన 2 పళ్ళెపు చక్రాలను ప్రామాణిక ఫ్రేమ్కు తగిలించి ఉంటాయి. ఈ ప్రేమ్ ట్రాక్టరు మూడు పాయింటల బంధనముకు గాని లేక డ్రా బార్కు గాని తగిలించి దుక్కిదున్నటకు ఉపయోగిస్తారు. ఈ పరికరము దాని బరువు మరియు భ్రమణము చక్రాల వలన వచ్చే శక్తి ద్వారా భూమిని దున్నేవిధముగా తయారుచేయబడినది. ఈ పరికరం రేగడి, మెరక, బీడు, రాళ్ళ నేలల్లో మరియు కోతకు గురయ్యే నేలల్లో దుక్కిదున్నటకు ఉపయోగించవచ్చును. అంతేకాక ఇసుక నేలలో కూడా దుక్కిదున్నటకు అనువైనది. దీని ఖరీదు పళ్ళెపు చక్రాల సంఖ్యనుబట్టి రూ.30,000/- నుండి రూ.4,00,000/- వరకు ఉంటుంది.

భ్రమణ నాగలి

  • ఈ పరికరము ట్రాక్టరు మూడు పాయింట్ల బంధనముకు తగిలించి మరియు ట్రాక్టరు పి.టి.ఓ నుంచి గేర్బాక్స్ ద్వారా భ్రమణ శక్తిని ఉపయోగించి పొడవాటి బ్లేడులు ద్వారా 25-30 సెం.మీ వరకు దుక్కిదున్ని మరియు మట్టిని గుల్లచేసి విత్తనములు విత్తుటకు కావలసిన పదునుకు తెచ్చును. ఈ పరికరము సుమారు 55 మరియు అంతకంటే ఎక్కువ అశ్వ శక్తిగల ట్రాక్టరుతో నడుచును. ఈ పరికరముతో ఒకేసారి దుక్కిదున్ని మరియు గుల్లచేయుట వలన పొలంలో ట్రాక్టరు తిరగవలసిన సంఖ్య తగ్గి భూమి లోపల పొరలలో గట్టిపడకుండా ఉ ంటుంది. పరికరములు బ్లేడుల సంఖ్యనుబట్టి దీని వెడల్పు ఆధారపడి ఉంటుంది. ఇది 8 నుండి 20 బేడుల వరకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది పశువుల ఎరువు లేదా జీవన ఎరువులను భూమిలోకలిపి దుక్కిదున్ని మరియు చదును చేయుటకు కూడ ఉపయోగపడును.దీని ఖరీదు బ్లేడుల సంఖ్యనుబట్టి రూ.1,00,000/- నుండి రూ.3,00,000/- వరకు ఉండును.

దుక్కిని పదునుకు తెచ్చే పరికరాలు

చక్రాల గుంటక (పళ్ళెపు గొర్రు)

  • ఈ పరికరం దుక్కి దున్నిన తరువాత ఏర్పడిన మట్టి గడ్డలను పగలగొట్టి భూమిని పదునుకు తెచ్చుటకు ఉపయోగించెదరు. ఈ పరికరములో రెండు చక్రాలు అమర్చిన గ్యాంగ్లు ఒకదాని వెనక ఒకటి ఉంటాయి. ముందు చక్రాలు మట్టిని బయటి వైపుకు మరియు వెనుక ఉన్న చక్రాలు మట్టిని లోపలకు పడేటట్లుగా దున్నుతాయి. మట్టిని రెండు దిశలలో దున్నటవలన పొలం దున్నకుండా వదిలివేయటం అంటూ జరగదు. దీని ధర చక్రాల సంఖ్యనుబట్టి సుమారు రూ.25,000/- నుండి రూ.2,00,000/- వరకు ఉంటుంది.

కల్టివేటర్

  • ఈ పరికరము అంతరకృషి కోసం తయారు చేసినప్పటికి రైతులు దుక్కి దున్నటకు ఉపయోగిస్తున్నారు. ఇది. 7,9,11,13 టైన్లతో లభించును. టైన్ల మధ్య దూరం మార్చుకొనుటకు వీలున్నది. టైన్ల చివర షావల్స్ అమర్చబడి ఉండును. షావెల్స్ హైకార్బన్ స్టీలుతో చేయబడి, త్రిప్పివేసుకొనువీలున్నది. ట్రాక్టరుకున్న మూడు పాయింట్ల బంధనముకు తగిలించి దుక్కి చేయుటకు ఉపయోగించెదరు. సమయము వృధాకాకుండ, అడ్డంకులను అధిగమించుటకు, డేమేజిని నిరోధించుటకు స్ప్రింగులు అమర్చిన కల్టివేటరు కూడా లభ్యమగును. దీని ధర రూ.15,000/- నుండి రూ.30,000/- వరకు ఉంటుంది.

రోటా వేటరు

  • ఈ పరికరం ಮೆಟ್ಟು నేలల్లో ಮೆಟ್ಟು దుక్కికి మరియు మాగాణి భూముల్లో ಬಿಮ್ಮಿ చేసేందుకు మిక్కిలి ఉపయోగపడుతుంది. ఈ పినిముట్టు 35 ਠੰ੦੦ అంతకన్నా ఎక్కువ అశ్వశక్తి గల ట్రాక్టరుతో పనిచేస్తుంది. రోటావేటరు వెడల్పునుబట్టి దీనిత్రి అవసరమయ్యే బ్లేడ్లు ಖಿಂ೩) నిర్ణయించటం జరుగుతుంది. పి.టి.ఓ షాఫ్ట్ ద్వారా రోటావేటర్ను ట్రాక్టరుకు కలిపి ప్రత్యేకమైన గేర్బాక్స్ ద్వారా రోటవేటరు బ్లేడ్లకు కావలసిన భ్రమణ వేగాన్ని అందిస్తుంది. రోజుకు 6-7 ఎకరాల్లో దుక్కిగాని, దమ్మగాని చేసుకోవచ్చు. ఈ పరికరం దుక్కి దున్నిన తర్వాత మేలైన విత్తనమడి తయారీకి ఉపయోగిస్తారు. దీని ధర రూ.85,000/- నుండి రూ.1,20,000/ —వరకు ఉంటుంది.

లేజర్ సహాయముతో భూమిని చదునుచేయు పరికరం

  • ఈ యంత్రము 45 లేదా ఆంతకంటే ఎక్కువ అశ్వశక్తి గల ట్రాక్టర్ సహాయంతో నడుస్తుంది. ఇందులో లేజరు ఎమిటరు యూనిట్ మరియు బకెట్ స్ర్కాపర్ యూనిట్ ఉంటాయి. ఈ పరికరాన్ని ఉపయోగించి పొలంలోవున్న ఎత్తుపల్లాలను సవరించడమే కాకుండా మనకు కావలసిన వాలు శాతాన్ని ఒకవైపుకు గాని లేదా రెండు వైపులకు గాని పొందవచ్చును. ఈ యంత్రంను ఉపయోగించి రోజుకు 3–4 ఎకరాలను (నేల భౌతిక స్థితినిబట్టి) చదును చేయవచ్చును. దీని ఖరీదు రూ.8.50 లక్షలు (ట్రాక్టరు లేకుండా).

దమ్మచేయు పరికరాలు

వరి చక్రాల గుంటక

  • ఈ గుంటకను ఉపయోగించి వరి పొలాలలో దమ్మను చాల మృదువుగా వేగవంతముగా చేయవచ్చును. దీనికి చదవరపు చట్టము, రెండు వరుసలలో ఇనుప చక్రాలు కలిగి ట్రాక్టరుయొక్క 3 పాయింట్ల లింకు ద్వారా లాగపడుతుంది.దీని వెనుక ఉన్న పలకమాను ద్వారా నేలను సమముగా చేయుటకు అవకాశం కలిగి ఉండను. దీని ధర రూ.20,000/-.

రోటోపచ్లర్

  • ఈ వరికరం రోటా వేటరులాగా వూ గాడి భూవుల్లో దవ్ము చేయుటకు ఉపయోగపడుతుంది. ఇది S ఆకృతి బ్లేడులు కలిగి ఉంటుంది. దీనిని పి.టి.ఓ షాఫ్ట్ ద్వారా ట్రాక్టరుకు జతచేసి ప్రత్యేకమైన గేర్బాక్స్ ఉ పయోగించి బ్లేడ్లకు కావలసిన భ్రమణ శక్తిని అందిస్తుంది. దీనిని నడపటానికి సుమారు 45 లేదా ఆంతకంటే ఎక్కువ అశ్వశక్తిగల ట్రాక్టరు కావలెను. దీనిని ఉపయోగించి తక్కువ నీటితో మాగాణి భూముల్లో దమ్మచేసుకొనవచ్చును. అంతేకాకుండా దాని వెనుక ఉన్న చదును చేసే లెవలింగ్ బ్లేడు వలన మాగాణి భూమిలో దమ్మతోపాటు చదును కూడా చేయవచ్చును. దీనితో గట్టుల ప్రక్కన కూడా మట్టిమీట వేయకుండా దమ్మచేసి చదును చేయవచ్చును.
    ఈ పరికరంతో దమ్మ చేయుటకు 1రోజు ముందు 1 సెం.మీ నీటిని పెట్టవలెను. ఈ పరికరం నడిపిన తర్వాత 4-5 రోజుల్లో గడ్డి మరియు ముందు పంట అవశేషాలు భూమిలో కుళ్ళిపోతాయి. 5 రోజుల తర్వాత ఈ పరికరంతో రెండోసారి దమ్మ చేసినచో మాగాణి భూమి నాటు వేసుకోవటానికి తయారు అవుతుంది. ఈ పరికరం వరి తరువాత వారినాటే ప్రాంతాలలో బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉ పయోగించి ఒక గంటలో ఒక ఎకరం దమ్మ చేసుకోవచ్చును. దీని ధర రూ. 1,00,000/ – .

విత్తనము విత్తే పరికరాలు (మెట్ట వరి)

  • ఈ మధ్యకాలంలో కోస్తా ప్రాంతములో కాలువలలో నీరు ఆలస్యముగా విడుదల చేయుటవలన మరియు సకాలంలో వర్షాలు లేనందున వరి నాట్లు బాగా ఆలస్యమవుతున్నాయి. దీనిని నివారించుటకు మెట్టవరి విత్తనాలను సకాలంలో విత్తి కాలువలో నీరు వచ్చినవెంటనే మాగాణి వరిగా మారవచ్చును. ఈ విధమైన మెట్ట వరిని విత్తుటకు ఈ క్రింద ఇవ్వబడిన రెండు రకాల విత్తన విత్తే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈవరిని మెట్టలో ఎదపెట్టుటవలన దిగుబడిలో ఎటువంటి తేడా లేకుండా మరియు సుమారు రూ. 5,100/- వరకు ఖర్చును తగ్గించవచ్చును.

పూటెడ్ రోటర్ఫీడ్ విత్తే పరికరాలు (విత్తన గొర్రు)

  • ఈ పరికరములో విత్తన డబ్బా మరియు ఫూ టేడ్ చక్రాల విత్తన నిర్దేశించే వ్యవస్థను కల్పివేటరుమీద అమర్చబడి ఉంటుంది. ఈ విత్తే పరికరములో విత్తనం డబ్బా క్రిందభాగాన కర్రుల సంఖ్యనుబట్టి విడి విడిగా ఫూటేడ్ రోటర్ (గుండ్రటి స్ఫూపాకారపు చక్రాన్ని) ఉపరితలంలో గనుపులు కలిగి ఒక పొడవాటి కడ్డీపై అమర్చబడి ఉంటాయి. విత్తే పరికరము వెనుకభాగాన ఆమర్చిన భూచక్రం తిరగటం వలన వచ్చే శక్తితో ఈ కడ్డీని తిప్పే విధంగా ఇనుపచైన్ల ద్వారా కలపబడి ఉంటుంది. ఈ పూటేడ్ రోలర్ విత్తనం డబ్బాలో తెరువబడిన సైజునుబట్టి విత్తే విత్తనం మోతాదు ఆధారపడి ఉంటుంది. ఈ యంత్రమును లాగుటకు సుమారు 35అశ్వ శక్తి లేదా అంత కన్నా ఎక్కువ ట్రాక్టరు కావలెను. ఈ పరికరముతో ఒకరోజులో సుమారు 4-5 హెక్టార్లలో వరిని ఎదపెట్టవచ్చును. దీని ఖరీదు రూ. 36,000/–. ఈ యంత్రముతో ఒక హెక్టారుకి వరిని విత్తేందుకు సుమారు రూ.1500/- వరకు ఖర్చు అవుతుంది. ఈ పరికరము ద్వారా కావలసిన సాళ్ళమధ్య దూరాన్ని పొందవచ్చును కానీ గింజకు గింజకు మధ్య నిర్దేశించిన ఎడం పొందటానికి వీలులేదు. ఈ పరికరముతో ఒక ఎకరానికి సుమారు 15-20 కేజీల వరకు వరి విత్తనాలను ఎదపెట్టవచ్చును.

ఒకేసారి విత్తనము మరియు ఎరువు విత్తే యంత్రము

  • ఈ పరికములో విత్తన మరియు ఎరువు డబ్బా మరియు విత్తన మరియు ఎరువు ನಿಡ್ವೆಶಿಂಪೆ వ్యవస్థ కల్లివేటరుమీద అమర్చబడి ఉంటుంది. ఈ పరికరములో విత్తనములు డబ్బా నుంచి ఒక చిన్నపాటి దోనెలోపడి వాటిని కప్పులతో కలిగిన చక్రం నిటారుగా తిరగటం ద్వారా విత్తనాలు నిర్దేశించిన మోతాదులో ఏ విధమైన రాపిడిగాని, ఒత్తిడిగానీ లేకుండా కల్టివేటర్ కర్రుల వెనుక అమర్చబడిన గొట్టాల ద్వారా కర్రులతో చేయబడిన సాళ్ళలో నిర్దేశించిన గింజకు గింజకు మధ్య దూరంలో విత్తవచ్చును. ఈ పరికరము వెనుకభాగాన అమర్చిన బద్ద సాయంతో సాళ్ళలో విత్తనములను మట్టితో కప్పబడును. ఈ పరికరముతో ఒక ఎకరానికి 8-12 కేజీల వరి విత్తనములను కావలసిన సాళ్ళ మధ్య మరియు కావలసిన గింజకు గింజకు మధ్య దూరములో ఎదపెట్టవచ్చును. ఈ పరికరముతో ఒక హెక్టారులో విత్తనములు ఎదపెట్టుటకు సుమారు రూ.1,500/- వరకు ఖర్చు అవుతుంది. ఈ పరికరమును లాగుటకు సుమారు 30ෂීයං ෂටඹී ఎక్కువ అశ్వశక్తి గల ట్రాక్టరు కావలెను. ఈ పరికరముతో ఒకరోజులో సుమారు 4–5 హెక్టారులో వరిని విత్తవచ్చును. దీని ధర సుమారు రూ. 45,000/–.

మొలకెత్తిన వరి విత్తనాలు సాళ్ళలో నాటు పరికరము (డ్రమ్ సీడర్)

  • ఈ పరికరము ద్వారా 8 సాళ్ళలో మొలకెత్తిన వరి విత్తనమును నాటవచ్చును. దమ్మ చేసిన భూమిలో వరుసలలో మెలకెత్తిన విత్తనాలు వేయటానికి డ్రమ్ సీడరు ఉపయోగపడుతుంది. మొలకెత్తిన విత్తనములను డ్రమ్లో సగంవరకు నింపవలెను. ఆ తర్వాత ఈ పరికరాన్ని బురదనేలలో (నీళ్ళు లేకుండా) లేదా 1 సెం.మీ కంటే తక్కువగా నీళ్ళుఉ న్ననేలలో లాగేటప్పుడు డ్రమ్ మీద ఉన్న రంద్రాల ద్వారా విత్తనాలు సాళ్ళలో పడతాయి. ఒక మనిషి ఈ పరికరము లాగుటకు మరియు ఒకరు వరి విత్తులు డ్రమ్లో నింపుటకు కావలెను. దీనితో గంటకు 0.25 ఎకరము వరకు వరి విత్తుకోవచ్చును. దీని ధర రూ.8,000/.

వరి నాటు యంత్రములు

వరినాటు ఖర్చు మరియు శ్రమను తగ్గించుటకు వరి నాటు యంత్రాలు ఈమధ్య కాలంలో ప్రాచూరం పొందుతున్నవి. మాములుగా రైతు పెంచుకునే వరినారుకాక ప్రత్యేక పద్ధతి ద్వారా పాలిథిన్ షీట్లమీద పెంచిన నారును (చాపనారు) నాటుకొనుటకు ఈక్రింద ఇవ్వబడిన యంత్రములు కలవు.

  1. మనిషి వెనుకనుంచి నడిపే నాటు యంత్రము.
  2. స్వయంశక్తితో నడిచే వరినాటు యంత్రము.

మనిషి వెనుకనుంచి నడిపే నాటు యంత్రము

  • ఈ యంత్రము 4 అశ్వ శక్తి డీజిల్ ఇంజనుతో నడుచును. దీనితో 4 నుండి 8 సాళ్ళలో వారి నాటుకోవచ్చును. దీని బరువు 320 కేజీలు. దీనిక్ల్లో సాళ్ళ మధ్య దూరం 25-30 సెం.మీ మరియు మొక్కకు మొక్కకు మధ్య 14 నుండి 17 సెం.మీ వేసుకొనుటకు వీలుకలదు. ఈ యంత్రంతో రోజుకు 4 ఎకరాలు నాటుకోవచ్చును. కేవలం ఇద్దరు కూలీలు ఈ యంత్రమును నడుపుటకు సరిపోతారు. దీని ధర సుమారు రూ.2,50,000/–.

స్వయంశక్తితో నడిచే వరినాటు యంత్రము:

  • ఈ యంత్రముతో 6 నుండి 8 వరుసలలో చాపనారును నాటుటకు ఉపయోగపడును. జపాన్, కొరియా మరియు చైనా దేశాల నుండి దిగుమతి చేసుకొన్నవి. పెట్రోల్ మరియు డీజిల్ సహాయంతో 15 నుండి 21 అశ్వ సామర్ధ్యముతో నడిచే యంత్రాలు వాడుకలో ఉన్నాయి. ఇందన వినియోగం 2 నుండి 3 లీటర్లు/గంటకు ఉంటుంది. వరుసల మధ్య 30 సెం.మీ మరియు మొక్కల మధ్యం దూరం 10–20 సెం.మీ దూరంతో నాట్లు వేసుకోవచ్చును. ఈ యంత్రాన్ని బరువైన నల్లరేగడి నేలల్లో కూడా ఉపయోగించుకోవచ్చును. నేల పరిస్థితి, స్వభావాన్ని బట్టి ఒక ఎకరం పొలాన్ని 1.5 నుండి 2 గంటలలో నాటవచ్చును. కాకపోతే నారును పెంచుటకు సాంకేతిక పరిజ్ఞానము మరియు ప్రత్యేకమైన మ్యాట్లు (చైనా యంత్రాలకు) మరియు ట్రేలు (జపాన్ యంత్రానికి) కావలెను. ఈ యంత్రము ఖరీదు నారు పెంచే పరికరము కలుపుకొని రూ.9.50 లక్షల నుండి 11-00 లక్షలు (ఆరు వరుసలు, పెట్రోలుతో నడిచేది) మరియు 16-18 లక్షల (రివరుసలు, డిజిల్తో నడిచేది).
వరి సాళ్ళలో కలుపు తీయు దంతి (కోనో వీడరు)
  • సుమారు 20 సెం.మీ మధ్య దూరం ఉన్న సాళ్ళు మధ్యలో కలుపు తీయుటకు కోనో ඕක්ත సమర్ధవంతముగా పనచేస్తుంది. ఈ పరికరము పనిచేసేందుకు తగు మోతాదులో నీరు ఉండాలి. లేని ఎడల వీడరుకు మట్టి చుట్టుకొని సరిగా పనిచేయదు. ఒక మనిషి దీనిని ఉపయోగించి ఒకరోజులో అరెకరంలో కలుపు తీసుకోవచ్చును. దీని ధర సుమారు రూ. 1,400/
మోటారుతో నడిచే కలుపు తీయు పరికరము
  • శ్రీ పద్ధతిలో మరియు సాళ్ళ పద్ధతిలో వరిని నాటినప్పుడు ఈ పరికరమును ఉపయోగించవచ్చును. ఈ పరికరము ఒక వరుసలో పనిచేసే దంతిలో 1-2 అశ్వ సామర్ధ్యం గల ఇంజను, రెండు లీటర్లు కెపాసిటి గల పెట్రోలు ట్యాంకు, హ్యాండ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టం, ఎనిమిది కట్టింగ్ బ్లేడ్లు గల తిరిగే చక్రాలు ఉంటాయి. సుమారు 20 సెం.మీ వెడల్పుగల సాళ్ళమధ్య ఇది పనిచేస్తుంది. ఈ పరికరం నీటిలో మునగకుండా ఉండేందుకు రెండు రేకుల లాంటి ప్లాట్స్ కలిగి ఉంటుంది. ఈ పరికరం ఎంతలోతు వరకు పనిచేయాలి అనేది ప్లాట్స్ను సరిచేసుకుంటూ నియంత్రించవచ్చును. దీనితో ఒక గంటకు 0.1 హెక్టారు విస్తీర్ణంలో కలుపు తీయవచ్చును. ఈ పరికరము 1, 2 మరియు 3 సాళ్ళలోకూడా కలుపు తీయుటకు లభ్యమగును. దీని ధర సుమారు రూ.18,000/
వరికోత యంత్రము
  • ఈ ఆధునిక వరికోత యంత్రం ద్వారా చిన్న చిన్న కమతాలలో వరికోయటం చాలా సులభం మరియు పంట నష్టము చాలా తక్కువ. ఈ యంత్రానికి క్రింద అమర్చబడిన రతికోణాకారపు బ్లేడులు వరి పంటను కోస్తాయి. ఈ కోసిన పంటను యంత్రం ముందు భాగానగల బెల్టులు క్రోన్స్టిన వరిని తీసుకొనివెళ్ళి యంత్రానికే కుడివైపున వరుసల్లో వేస్తాయి. యంత్రానికి కావలిసిన శక్తి ఇంజను నుండి బెల్లులు, చైన్ల ద్వారా యంత్రానికి క్రిందిభాగాన ఉన్న త్రికణాకారపు బ్లేడులోనికి చేరుతుంది. ఈ యంత్రాన్ని వెనుకకు, ముందుకు నడపటానికి అనుకూలంగా గేర్బాక్స్ బిగించబడినది. ఈ యంత్రాన్ని ఒక మనిషి సునాయాసంగా నడుపుతూ సుమారు గంట వ్యవధిలో ఒక ఎకరం విస్తీర్ణంలో వరి పంటను కోయవచ్చును. కోతకు నాలుగు లేక అయిదు రోజులు ముందుగా పొలంలో నీరు తీసివేసి బురద లేకుండా తేమ ఆరిన తరువాత ముందుగా పొలం గట్లవెంబడి చుటూతా అర్ధగజం వెడల్పున కొడవళ్ళతో కోత కోయాలి. వరికోత యంత్రాన్ని పొలంగట్లు చుటూతా వృత్తాకారంలో త్రిప్పుతూ కోత కోయాలి. ఈ యంత్రము డీజిలు మరియు కిరోసిన్తో నడిచేవి మార్కెట్లో దొరుకుతున్నాయి. దీని ధర రూ.91,000/- నుండి 1,10,000/- వరకు ఉంటుంది.
వరికోత మరియు కట్టలు కట్టు యంత్రము
  • ఈ యంత్రము వరికోత యంత్రములాగా వరిని కోయటమే గాక కట్టలు కూడా కట్టును. 10.2 అశ్వశక్తిగల డీజిల్ ఇంజన్ సాయంతో ఈ యంత్రం నడుస్తుంది. ఒక మనిషి ఈ యంత్రంపైన కూర్చొని ఒకసారి 1.2 మీటర్ల వెడల్పుతో భూమిమీద నుండి 2 నుండి 5 సెం.మీల ఎత్తువరకు కోవచ్చును. ఈ యంత్రములో ఒక లీటరు డీజిల్ ఉపయోగించి ఒక గంటలో ఒక ఎకరం వరినికోసి కట్టలు కట్టవచ్చును. దీని ధరసుమారు రూ.2,50,000/-.
వరి నూర్పిడి యంత్రము
  • ఈ యంత్రము వరి పంటను నూర్పటమేగాక, గింజలను జల్లెడబట్టి, శుభ్రపరచబడిన గింజలను వేరు చేస్తుంది. ఈ యంత్రం 5 అశ్వశక్తిగల ఆయిల్ ఇంజనుతోగాని, విద్యుత్ మోటారుతో గాని లేదా ట్రాక్టరు పి.టి.ఓ షాఫ్ట్ ద్వారా కాని పనిచేస్తుంది. ఈ యంత్రంలో వలయాకారంలో ఉన్న ఒక సిలెండరు బేరింగులపై ఒక షాఫ్ట్ ద్వారా బిగించడి ఉంటుంది. సిలెండరు క్రింద అర్ధవృత్తాకారంలో ఇనుప కడ్డీల కానేకేవ్ బిగించబడి ఉంటుంది. సిలెండర్, కానేకేవ్ల మధ్య పంట నూర్పిడి జరుగును. గింజలు గడ్డి నుండి వేరుచేయబడి, శుభ్రపరచబడి యంత్రమునకు ఒక ప్రక్కనుండి బయటకు వస్తాయి. వేరుచేయబడిన గడ్డి యంత్రం వెనుక భాగము నుంచి బయటకు వస్తుంది. ఈ యంత్రముతో వరి నూర్చటానికి అయిదుగురు మనుషులు అవసరమవుతారు. ఈ యంత్రంతో గంటకు 8 నుండి 10 క్వింటాళ్ళ వరి పంటను నూర్చవచ్చును. ఈ యంత్రమును ఒకచోట నుండి వేరొక చోటకు తీసుకువెళ్ళుటకు అనువుగా రెండు రబ్బరు టైర్లు చక్రములు బిగించబడి ఉంటాయి. దీని ధర మోడల్నుబట్టి రూ. 1,20,000/ — నుండి రూ. 4,00,000/- వరకు ఉంటుంది.
కంబైన్ హార్వెస్టరు
  • ఈ యంత్రము ద్వారా వరి పంటను కోయడం మరియు నూర్పిడి ఒకేసారి చేసుకోవచ్చును. పొలం పరిస్థితిని బట్టి ఒక ఎకరం పొలాన్ని 1 గంట నుండి 1.50 గంటలలో క్రోని నూర్పిడి చ్చే ధాన్యాన్ని శుభ్రపరుచును. ఈ యంత్రమును వరికోతకు ఉపయోగించుటవలన సుమారు రూ.3,400/- ఖర్చు తగ్గింవచ్చును. చక్రాలు మరియు ట్రాక్ మోడల్స్లో లభ్యమవుతున్నాయి. ట్రాక్టర్ మరియు స్వయంశక్తితో నడిచే ఈ యంత్రము 50 నుండి 110 అశ్వశక్తిలో లభిస్తున్నాయి. ట్రాక్టరుతో నడిచే ఈ యంత్రము ఖరీదు రూ.6-8 లక్షలు (ట్రాక్టరు లేకుండా) మరియు స్వయంశక్తితో నడిచే ట్రాక్ కంబైన్ ధర రూ.15 నుండి 24 లక్షలు.

వరిగడ్డినిర్వహణ పరికరాలు

  • ఒక హెక్టారులో కంబైన్డ్ హార్వెస్టర్తో కోసిన తరువాత సుమారు 5 టన్నుల ముక్కల గడ్డి వస్తుంది. ఈ గడ్డి పశువుల మేతకు పనికిరాదు అనేది ఒక అపోహ మాత్రమే. అందువలన ఈ గడ్డిని ఆర్ధికపరంగా మరియు ప్రకృతికి హానికలిగించకుండా రెండురకాలుగా ఉపయోగించవచ్చును. అవి భూమిలో కలియదున్నుట మరియు గడ్డిని కట్టలు కట్టుట. ఒకవేళ వరి తరువాత వేరే పంటవేసే పొలాలలో మరియు భూమిలో కలియదున్నుట కుదరని పొలాలలో కట్టలుకట్టడం ఉత్తమమైన మార్గం. ఈ గడ్డిని పేపర్ మిల్లుల్లో అట్టపెట్టెల తయారీకి, వస్తువులను మరియు పండ్లను ప్యాకింగ్ చేయుటకు, పుట్టగొడుగుల పెంపకంలో మరియు పశువుల మేతగా ఉపయోగించవచ్చు. కాబట్టి గడ్డిని చిన్నగా, సులభంగా రవాణా చేయగల ఆకారంలో కట్టలు కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

గుండ్రంగా కట్టలు కట్టే పరికరము

  • ఈ పరికరము చిన్నదిగా ఉండి తక్కువ నిర్వహన ఖర్చుతో సులభంగా నడుపుటకు మరియు చిన్నట్రాక్టర్లతో ఉపయోగించుటకు అనువుగా తయారుచేయబడినది. ఈ పరికరము డ్రా బార్ సాయంతో ట్రాక్టర్కు జతచేసి పి.టి.ఓ. షాఫ్ట్ ద్వారా కట్టలు కట్టుటకు కావల్సిన భ్రమణశక్తిని పొందుతుంది. ఈ పరికరముతో 60 సెం.మీల వ్యాసము మరియు 1 మీ. వెడల్పు ఉండి సుమారు 15 నుండి 25 కేజీల బరువుగల గడ్డిమోపును కట్టవచ్చును. ఈ పరికరముతో గంటకు ఒక ఎకరంలో గడ్డిని గుడ్రని కట్టలు కట్టవచ్చును. ఈ పరికరము ధర రూ.2,50,000/–.

చతురస్రాకారంలో కట్టలు కట్టే పరికరము

  • ఈ పరికరముతో 40X45 సెం.మీ సైజులో మరియు 40 సెం.మీ నుండి 1 మీటరు పొడవులో సుమారు 20 నుండి 25 కేజీల బరువులో కట్టలు కట్టవచ్చును. చతురస్రాకారపు కట్టలు రవాణాకు సులువుగా మరియు తక్కువ ప్రదేశములో భద్రపరుచుకోవచ్చును. ఈ పరికరమును ఉపయోగించుటకు నిమిషానికి 540 సార్లు తిరిగే పి.టి.ఓ కలిగి సుమారు 45 అశ్వశక్తి సామర్ధ్యం ఉన్నట్రాక్టర్ కావలెను. ఈ యంత్రములో కట్టలు కట్టుకు ప్రాలి ప్రొపిలిన్ దారం ఉపయోగించుట ద్వారా ఒక్కొక్క కట్ట కట్టుటకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ పరికరముతో గంటకు 250 కట్టలు అనగా 2.5 నుండి 4 ఎకరాలలో గడ్డిని కట్టలు కట్టవచ్చును. ఈ పరికరము ఖరీదు రూ. 6,00,000/-.

గడ్డిపోగుచేయు పరికరము

  • గడ్డి కట్టలు కట్టే పరికరాలు త్వరితగతిన పనిచేయుటకు 4 నుండి 5 వరుసలలో కంబైన్డ్ హార్వెస్టర్తో క్రాక్ష్సి నగడ్డిని ఒక వరుస లో పోగుచేయుటకు ఈ పరికరమును ఉపయోగిస్తారు. ఈ పరికరము 4 పుల్లల చక్రాలు ఒక్కొక్కటి 140 సెం.మీ వ్యాసము కలిగి సుమారు 2.5 మీటర్లు వెడల్పులో ఉన్న గడ్డిని ఒక వరుసలో పోగుచేస్తుంది. 8 పుల్లల చక్రముతో కూడిన పరికరాలు లభ్యమవుతుంది. చతురస్రాకారపు కట్టలు కట్టే పరికరముతో కలిపి ఈ యంత్రము ధర రూ.9,00,000/-.

వరి దుబ్బులు ముక్కలు చేయు పరికరము(రోటరీ శ్లేషర్)

  • ఈ పరికరము ఉపయోగించి కంబైన్డ్హార్వేస్టతో కోసిన తరువాత పొలంలో మిగిలిన గడ్డిని మరియు గడ్డిదుబ్బులను కత్తిరించి చెల్లాచెదురుగా పొలంలో చిమ్మవచ్చును. ఈవరికరము 25 లేదా అంతకంటే ఎక్కువ అశ్వశక్తిగల ట్రాక్టరు పి.టి.ఓ. సాయంతో నడుపబడును. ఈ పరికరముతో ఒక గంటలో 4 ఎకరాలలో గడ్డిదుబ్బులు కొట్టవచ్చును. దీని ధర మోడల్ను బట్టి సుమారు 45,000 - 80,000 వరకు కలదు.

గడ్డిని కోసి మరియు ముక్కులు చేసి ట్రాలీలోకి వేసే పరికరము

  • ఈ పరికరమును ఉపయోగించి కంబైన్డ్ హార్వెస్టర్తో కోసిన తరువాత పొలంలో పడి ఉన్న మరియు దుబ్బుల గడ్డిని కోసి ముక్కలుచేసి మరియు శభ్రపరిచి ట్రాక్టరు ట్రాలీలో లోడ్ చేసుకొనవచ్చును. ఈ పరికరము 45 లేదా అంతకంటే ఎక్కువ అశ్వశక్తి గల ట్రాక్టరు పి.టి.ఓ. సాయంతో నడుపబడును. ఈపరికారముతో ఒక ఎకరాలో గడ్డిని 1 నుండి 1.5 గంటలో ట్రాక్టరులోకి ఎత్తవచ్చును. దీని ధర సుమారు. రూ. 2,00,000/- వరకు ఉంటుంది.

గడ్డిని కోసి మరియు ముక్కలు చేసి పొలంలో పరిచే పరికరము

  • ఈ పరికరమును ఉపయోగించి కంబైన్డ్హార్వెస్టర్తో కోసిన తరువాత పొలంలో పడి ఉన్న మరియు దుబ్బులు గడ్డిని కోసి మరియు ముక్కులుచేసి పొలంలోసమాంతరముగా పరచవచ్చును. ఈ పరికరమును 45 లేదా అంత కంటే ఎక్కువ అశ్వశక్తి గల ట్రాక్టరు పి.టి.ఓ. సాయంతో నడుప వచ్చును. ఈ పరికరముతో ఒక గంటలో ఒక ఎకరములో గడ్డిని కత్తిరించి మరియు ముక్కలు చేసి పొలంలో పరచవచ్చును. దీని ధర సుమారు రూ. 3,00,000/- వరకు ఉంటుంది.

వరి ఆరబెట్టే పరికరము (ప్యాడీ డ్రయర్)

  • కంబైన్ హార్వెస్టర్తో కోసిన వరి గింజలలో తేమశాతము ఎక్కువగా ఉంటుంది. ధాన్యం నాణ్యతను కాపాడుకొనటానికి మరియు తేమశాతాన్ని తగ్గిచుకోటానికి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఈ యంత్రమును ఉపయోగించి తేమశాతాన్ని 22 శాతం నుండి 13-14 శాతానికి 5 గంటలలో తగ్గించ్చవచ్చును. దీని ధర రూ.15,00,000/

ఆధారము: ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, అఖిల భారతీయ సమన్వయ వ్యవసాయ పరికరాలు మరియు యంత్ర పరిశోధనా స్థానము,వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/28/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate