অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ ఉత్పత్తి పరిజ్ఞానాలు

వ్యవసాయ ఉత్పత్తి పరిజ్ఞానాలు

  1. చలువ పందిరి (షేడ్ హౌస్)
    1. ఈ షేడ్ హౌస్ యొక్క ఉపయోగాలుః
    2. షేడ్ హౌస్ నిర్మాణానికి ప్రణాళిక
    3. సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం.
      1. నిర్మాణం ఉండే దిశ
      2. నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి
      3. షేడ్ హౌస్ రూపకల్పన మరియు నిర్మాణం
      4. నీడనిచ్చే పందిరి-I
      5. సామగ్రి జాబితా (షేడ్ హౌస్ -II)
    4. విత్తన శుద్ధి
      1. విత్తన శుద్ధివల్ల ప్రయోజనాలు
        1. విత్తన శుద్ధికి అనుసరించవలసిన విధానం
      2. వివిధ పంటలలో సిఫారసు చేయబడిన విత్తన శుద్ధి విధానాలు
    5. పంటల ఉత్పాదన కొరకు సాంకేతిక పద్ధతులు
      1. ఆహార ధాన్యాలు
        1. వరి
        2. నివారణ నిర్వహణ పద్ధతులు :-
      2. వాణిజ్య పంటలు
        1. చెఱకు
          1. చెరకు విత్తన పంట పెంపకం
          2. ప్రధాన పంటను నాటడానికి కావలసిన మొలకలను తయారు చేయుట
          3. సరి అయిన చెరకు విత్తనం
        2. పండ్ల మొక్కలు
          1. జామతోటల్లో ఫెరోమోన్ ఎరలతో పండు ఈగ పురుగు నిర్మూలన
        3. ఈశాన్య రాజస్థాన్ కోసం కన్జర్వేషన్ బెంచ్ టెర్రెసింగ్ విధానం
          1. సీబీటీ ద్వారా ఈ ఫలితాలు పొందవచ్చు.
        4. కంపోస్టు తయారుచేయు పధ్ధతి
          1. ఉపోద్ఘాతం
        5. కంపోస్టింగ్ అనువైన వ్యర్ధ పదార్ధాలు
          1. కంపోస్టు గుంట పరిమాణము
        6. కంపోస్టింగ్ పద్ధతి
        7. కంపోస్టింగ్ త్వరగా జరగడానికి అనువైన పరిస్ధితులు
          1. పంటవ్యర్ధ పదార్ధాల ఎంపిక
          2. వ్యర్ధ పదార్ధాల పరిమాణం
          3. గుంటలో తేమ
          4. కంపోస్టింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు
          5. స్ధలం ఎంపిక
          6. వేడిమి
          7. గాలి
          8. ఉదజని సూచిక
          9. కంపోస్టు వాడడం వల్ల లాభాలు
          10. కంపోస్టు తయారయ్యేటప్పుడు ఉత్పన్నమయ్యే కొన్ని సమస్యలు – కారణాలు – పరిష్కారాలు
        8. తెగుళ్ళ సమీకృత యాజమాన్యం (ఐ పి ఎం): ప్రధాన అంశాలు
          1. ఐ పి ఎం లోని ప్రధానాంశాలు
            1. యాంత్రిక పద్ధతులు
            2. వంశపారంపర్య (జెనెటిక్) పద్ధతులు
            3. నియంత్రణ పద్ధతులు
            4. జీవ పద్ధతులు
            5. పరాన్న జీవులు (పారాసైటాయిడ్స్)
            6. ఇతర జీవులను తినే జీవులు (ప్రిడేటర్స్)
            7. పాథోజెన్స్ (వ్యాధి కారక సూక్ష్మజీవులు)
            8. జీవ నియంత్రణ పద్ధతులు
            9. ప్రవేశం
            10. సంరక్షణ
            11. రసాయనిక పద్ధతులు
            12. బెండ లో వ్యూహాత్మకమైన సమగ్ర సస్య రక్షణకై విధానం
            13. కీలకమైన చీడ, పీడలు
          2. వంగసాగుబడిలో సమగ్ర సస్య రక్షణ పధ్దతులు
            1. ముఖ్యమైన చీడ,పీడలు
          3. బిందు సేద్యంతో అరటి కణజాలవర్ధనం
            1. కణజాల వర్ధనం అంటే ఏమిటి ?
              1. వ్యవసాయ శీతోష్ణస్థితి
            2. నేల
              1. రకాలు
              2. నేలని సిద్ధపరచడం
              3. నాటే పదార్థాలు
            3. కణ వర్ధన నారు యొక్క ప్రయోజనాలు
              1. నాటే సమయం
              2. నాటే పద్ధతి
              3. నీటి నిర్వహణ
            4. ఎరువులు
              1. వినియోగంలో నియమిత కాల వివరణ
              2. అంతర్వర్ధన కృషి
              3. ప్రత్యేక ప్రక్రియలు
            5. తెగుళ్లు , వ్యాధులు రాకుండా నిర్వహణ
              1. అరటి ఫల సాయం
              2. దిగుబడి
            6. సమగ్ర వ్యవసాయం

చలువ పందిరి (షేడ్ హౌస్)

షేడ్ హౌస్ అనేది ఒక నీడనిచ్చే పందిరి వంటిది – నాలుగు ప్రక్కలా అగ్రోనెట్ (సాధారణంగా ఆకుపచ్చని రంగులో కనిపించే వలలు) తో గానీ లేక ఇతర విధంగా నేయబడిన వలల వంటి వాటితో గాని, కప్పివేయబడివుండి, అవసరమైన మేరకు సూర్యరశ్మి, తేమ మరియు గాలి, ఆ వలలోని సందులగుండా ప్రసరించే విధంగా ఉంటుంది. ఇది మొక్కల పెరగుదలకు అనువైన సూక్ష్మ వాతారవరణాన్ని కల్పిస్తుంది. దీనినే షేడ్ నెట్ లేక నెట్ హౌస్ అని కూడా అంటారు.

ఈ షేడ్ హౌస్ యొక్క ఉపయోగాలుః

  • పూలమొక్కలు, గుబురు ఆకులు గల మొక్కలు, ఔషధగుణాలు గల మొక్కలు, కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల మొక్కలు పెంచడానికి పనికివస్తుంది.
  • పళ్లు మరియు కూరగాయ మొక్కల నర్సరీలకు, అలాగే అడవుల పెంపకానికి పనికి వచ్చే జాతుల మొక్కలను పెంచడానికి కూడా ఉపయోగించబడుతుంది
  • వివిధ వ్యవసాయోత్పత్తులను నాణ్యమైన విధంగా ఆరబెట్టడానికి కూడా ఇది పనికివస్తుంది.
  • చీడపురుగుల, తెగుళ్ల బారినుండి రక్షణకై ఉపయోగించబడుతుంది.
  • సహజంగా వాతావరణంలో సంభవిస్తూ వుండే ఒడిదుడుకులనుండి - అంటే గాలులు, వర్షం మరియు మంచు వంటి వాటినుండి రక్షణ కల్పిస్తుంది.
  • అంటుమొక్కల పెంపకానికి మరియు వాటిని అధికమైన వేసవికాలపు వేడినుండి కాపాడడానికీ ఉపయోగింపబడుతుంది.
  • కణజాల ప్రవర్ధన విధానం (టిష్యూ కల్చర్) లో పెంచబడే లేత మొక్కలను గట్టిపరచడానికి ఉపయోగించబడుతుంది.

షేడ్ హౌస్ నిర్మాణానికి ప్రణాళిక

పెంచబడే మొక్కల రకాలను, స్థానికంగా లభించే సామాగ్రి మరియు స్థానిక వాతావరణ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని ఇటువంటి షేడ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలి. భవిష్యత్తులో దీనిని ఇంకా విస్తృతపరచే వీలు ఉండాలి.

సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం.

ఈ షేడ్ హౌస్ మార్కెట్ కు దగ్గరగా ఉండాలి - కావలసిన వనరులు (ఇన్ పుట్స్) అందుబాటులో వుండడానికి మరియు దాని ఉత్పత్తులను అమ్మడానికి కూడా అనువుగా ఉంటుంది. దీని నిర్మాణాన్ని భవనాలు మరియు చెట్లు ఉన్నచోటుకి దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి, అలాగే పారిశ్రామిక ప్రాంతం నుండి, వాహనాల నుండి వెలువడే కాలుష్యానికీ కూడా దూరంగా ఉండాలి. ఈ ప్రదేశం మురుగు నీటి పారుదల కలిగి ఉండాలి. విద్యుత్తు మరియు మంచి నాణ్యత కలిగిన నీరు కూడా అందుబాటులో ఉండాలి. అయితే, ఈ షేడ్ హౌస్ నిర్మాణానికి గాలి అవరోధాలు కూడా 30 మీటర్లకు దూరంగానే ఉండాలి.

నిర్మాణం ఉండే దిశ

ఈ షేడ్ హౌస్ ని ఏ దిశగా నిర్మించాలి అన్న దానికి ముఖ్యంగా రెండు ప్రామాణకాలున్నాయి. ఒకటి ఈ పందిరిలోకి వచ్చే వెలుతురు ఒకే విధంగా ఉండడం. రెండవది గాలి ప్రసరించే దిశ. ఒకే ఒక అడ్డదూలంతో ఉండే షేడ్ హౌస్ తూర్పు-పడమర దిశలో గాని లేక ఉత్తర-దక్షిణ దిశలో గాని నిర్మితమై ఉండాలి. వెలుతురు ఒక క్రమ పధ్దతిలో, సమ తీవ్రతతో పడే లాగ చూడడానికి అవి ఉత్తర-దక్షిణ దిశలో వుండాలి.

నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి

ఇటువంటి షేడ్ హౌస్ నిర్మాణం ప్రధానంగా రెండు అంశాలతో ముడిపడి ఉంటుంది. అవి చట్రం (ఫ్రేమ్) మరియు చుట్టూ కప్పడానికి ఉపయోగించే వస్త్రం. ఈ షేడ్ హౌస్ యొక్క ఫ్రేమ్, చుట్టూ కప్పబడినదానికి సపోర్టుగా ఉండి, గాలి నుండి, వర్షం నుండి కాపాడే విధంగా రూపకల్పన చేయబడి ఉంటుంది. ఈ షేడ్ హౌస్ నిర్మాణానికుపయోగించే ఎమ్.ఎస్. స్టీల్ యాంగిల్ ఫ్రేము ఒక క్రమమైన కాలవ్యవధితో తుప్పును నిరోధించే పధ్దతిని అనుసరించినట్లయితే 25 ఏళ్ల దాకా ఉంటుంది. కానీ, గెడబొంగులతో నిర్మించబడినట్లయితే, అది ఒక మూడేళ్ల కాలం వరకూ ఉండవచ్చు. ఈ వ్యవసాయ సంబంధిత షేడ్ హౌస్ వాతావరణ పరిస్థితులననుసరించి మూడు నుండి ఐదేళ్ల వరకూ ఉండవచ్చు. ఈ షేడ్ నెట్స్ అనేవి వివిధ రంగులలో, 25, 30, 35, 50, 60, 75 మరియు 90 శాతం రంగుతో విస్తృతమైన రంగులశ్రేణిలో లభిస్తాయి. ఈ పందిరి యొక్క ఫ్రేముల రూపకల్పన అవసరాన్ని బట్టి మరియు ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. నిర్మాణానికి ఉపయోగపడే క్వోన్ సెట్ (అర్ధచంద్రాకారంలో), వాలుగా ఉండే ఇంటి కప్పు ఆకారంలో లేక విల్లు వంపు ఆకారం, లేక స్వల్ప మార్పులతో ప్రాంతీయ పరిస్ధితులకు అనువుగా ఉండే ఫ్రేములు ఒరిస్సా వంటి అత్యధిక వర్షపాతం ఉండే ప్రదేశాలకు సిఫార్సు చేయబడుతున్నాయి.

షేడ్ హౌస్ రూపకల్పన మరియు నిర్మాణం

ఒరిస్సా వ్యవసాయ మరియు సాంకేతిక విశ్వవిద్యాలయం, భువనేశ్వర్, లోని సూక్ష్మమాన సేద్య అభివృధ్ది కేంద్రంలో రెండు రకాలైన షేడ్ హౌస్ డిజైన్లకు రూపకల్పన చేయడం జరిగింది. ఇటువంటి షేడ్ హౌస్ ల ప్రధాన లాభం ఏమిటంటే నిర్మాణం జరిగే ప్రదేశంలో వీటిని నిర్మించడానికి ఏ విధమైన వెల్డింగ్ చేయవలసిన అవసరం లేదు. మరొక లాభం ఏమిటంటే, పునాది స్తoభాలు చెదల బారి నుండి కాపాడే రీతిలో ఎంచుకోబడి ఉంటాయి.
ఈ షేడ్ హౌస్ ల యొక్క వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

నీడనిచ్చే పందిరి-I

ఈ డిజైన్ (చిత్రం-1) లో నిర్మాణ చట్రంగా ఎమ్.ఎస్. (మైల్డ్ స్టీల్) యాంగిల్ (35 మి.మి. x 35 మి.మి .x 6 మి.మి.) మరియు గెడబొంగు వాడబడ్డాయి. ఈ స్ధంభం చివరి పై భాగం గెడబొంగును గట్టిగా పట్టుకుని వుండే విధంగా ‘U’ క్లిప్ ను కలిగివుంటుంది. గెడబొంగును అడ్డంగాను మరియు పైకప్పు నిర్మాణానికి, ఉభయత్రా ఉపయోగించవచ్చు. లే అవుట్ ప్లాన్ లో ఉన్న విధంగా ఈ పందిరిని నిర్మించడానికుపయోగించే స్ధలాన్ని చదును (లెవెలింగ్) చేసిన తరువాత లే అవుట్ ప్లాన్ గీయడం జరుగుతుంది. పునాది స్ధంభాలను నిలువుగా పాతడానికి గోతులు తీయడం జరుగుతుంది. ఈ గోతులు కొంతవరకు ఇసుక, కంకరతో నింపి గట్టి చేయబడతాయి. అటు తర్వాత స్ధంభాలను సమానాంతరంగా ఉండే మూడు వరుసలలో, ఎత్తు సమాన స్ధాయిలో ఉండే విధంగా, సిమెంట్ మరియు కాంక్రీటుతో నిలబెట్టడం జరుగుతుంది.
గెడబొంగులను నీటితో తడిపిన తరువాత, సరైన సైజునకు ముక్కలుగా చేసి పై కప్పుకు అడ్డంగాను, విల్లు ఆకారంలో ఒంగదీసి ఆర్చ్ గానూ ఉపయోగించి, గట్టిగా కట్టివేయడం జరుగుతుంది. ముందుగా తయారుచేయబడిన వెనుక ఫ్రేము మరియు ద్వారబంధాలున్న ఫ్రేము, నట్లు, బోల్టులతో ప్రధాన నిర్మాణానికి బిగించబడతాయి తరువాత 50 – 75 శాతం వరకు వుండే ఆగ్రో షెడ్ నెట్ పైకప్పు భాగానికి బిగించబడుతుంది. అలాగే, ఫ్రేమ్ పక్క భాగాలకు 30 శాతం వరకూ కప్పగలిగి ఉండే వలలను బిగించడం జరుగుతుంది. వెనుక వైపు, ముందు వైపు ఉండే ఫ్రేములు, తలుపులు కూడా షేడ్ నెట్ తో కప్పబడి ఉంటాయి. చివరిగా, ఈ నిర్మాణానికి మధ్యభాగంలో నడవడానికి వీలుగా ఉండే చిన్న కాలిబాట వంటి దారిని నిర్మించడంతో బాటుగా ఈ మొత్తం నిర్మాణానికి చుట్టూ కూడా ఇటుకలతో ఒక గట్టు వంటిది సరిహద్దులాగ కట్టబడుతుంది.

సామగ్రి జాబితా (షేడ్ హౌస్ -I)

క్రమ
సంఖ్య
వివరాలు ఐటమ్ కొలతల వివరాలు
(స్పెసిఫికేషన్స్)
పరిమాణం
(క్వాంటిటీ)
1. పునాది స్ధంభాలు ‘U’ క్లిప్పుతో ఎమ్.ఎస్.యాంగిల్ ఇనుము మరియు ఎమ్.ఎస్. ఫ్లాట్ 35 ఎమ్.ఎమ్.x35 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్.
25 ఎమ్.ఎమ్ x 6 మి.మి.
209 కి.గ్రా.
7 కి.గ్రా.
2. ద్వారబంధాలు మరియు వెనుక వైపు ఫ్రేమ్ ఎమ్.ఎస్.యాంగిల్ ఇనుము 35 ఎమ్.ఎమ్.x35 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 71 కి.గ్రా.
3. పైకప్పు నిర్మాణం గెడబొంగు 75 ఎమ్.ఎమ్.- 100 ఎమ్.ఎమ్ వ్యాసం (డయా) 20 నంబర్లు
4. పైకప్పు మరియు సైడ్ కవరు వ్యవసాయ సంబంధిత, నీడనిచ్చే వల (ఆగ్రోషేడ్ నెట్) 50%- 70% &30% 328 చ.మీ.
5. పునాదిని తవ్వడం, సిమెంట్ మోర్టర్ తో నింపడం సిమెంట్ కాంక్రీట్ 1:2:4 12 ఎమ్.ఎమ్. సైజు చిన్న రాళ్లతో 1.3 మీ3
6. తుప్పు పట్టకుండా తీసుకునే వివారణ చర్యలు ఎనామెల్ పెయింట్ మరియు తిన్నర్

---

4 లీటర్లు
7. నిర్మాణాన్ని నిలబెట్టడం (ఎరక్షన్ ఆఫ్ స్ట్రక్చర్) (1) నట్లు మరియు బోల్టులు 3/8 x 1” 1 కి.గ్రా.
(ii) జి.ఐ. వైరు 4 ఎమ్.ఎమ్. 2 కి.గ్రా.
8 కాలిబాట (పేవ్ మెంట్) ఇటుక కట్టడం సిమెంట్ మోర్ట్రర్ (1:6) 2.4 ఎమ్3
సామగ్రి జాబితా (షేడ్ హౌస్ -II)

ఈ డిజైన్ (చిత్రం-2) లో పునాది స్ధంభాలు, పైకప్పుకు సరిపోయే అడ్డంగా ఉండే దూలం, వెనుక వైపు ఫ్రేమ్ మరియు షేడ్ హౌస్ యొక్క తలుపుల కోసం ఎమ్.ఎస్. యాంగిల్ (40 ఎమ్.ఎమ్ x40 ఎమ్.ఎమ్ x 6 ఎమ్.ఎమ్)ను ఉపయోగించడం జరుగుతుంది. నాలుగుపక్కలా కప్పడానికి ఉపయోగించే సామగ్రికి సపోర్టునిచ్చే చట్రాలకి (హుప్స్) ఎమ్.ఎస్. ఫ్లాట్ ఉపయోగించబడుతుంది. పునాది స్ధంభాలపై ఈ చట్రం వంటి దానిని మరియు పైకప్పు దూలాన్ని నట్స్ తోను, బోల్ట్స్ తోను బిగించడానికి వీలు కలిగివుంటుంది. అదే విధంగా, ఎమ్.ఎస్. ఫ్లాట్ ను ఉపయోగించే ఈ చట్రాలు ఈ అడ్డు దూలాన్ని బిగించడానికి వీలును కలిగివుంటాయి. నిర్మాణం జరుగుతూ వుండే ప్రదేశంలో భూమిని చదును (లెవెలింగ్) చేయడం, ప్లాన్ లే అవుట్, వగైరా ఇంతకు ముందు వివరించిన మాదిరిగానే ఉంటుంది. పునాది స్ధంభాలను గోతులలో నిలబెట్టి, సిమెంట్ మరియు కాంక్రిట్ తో వాటిని నింపడం జరుగుతుంది, అలాగే వరుసగా 7 రోజులపాటు నీటితో వీటిని తడుపుతూ ఉండడం కూడా చేయబడుతుంది. నట్లను, బోల్టులను ఉపయోగిస్తూ, అడ్డు దూలాలను, చట్రాన్ని, వెనుక వైపు ఫ్రేమును మరియు తలుపుల ఫ్రేమును బిగించడం జరుగుతుంది.
అటు తరువాత, ఈ నిర్మాణానికి వలలు బిగించబడతాయి. చివరిగా నిర్మాణానికి మధ్యలో కాలిబాట నిర్మింపబడుతుంది, మొత్తం నిర్మాణానికి చుట్టూ ఒక గట్టువంటిది, సరిహద్దులాగ ఇటుకలతో కట్టబడుతుంది. ఈ మాదిరి నీడనిచ్చే పందిరి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఒక యూనిట్ కు ఇంచుమించుగా. రు. 500/చ.మీ. అవుతుంది ఇటువంటి నిర్మాణానికి ఉపయోగించవలసిన సామగ్రి వివరాలు టేబుల్-II లో ఇవ్వబడ్డాయి.

సామగ్రి జాబితా (షేడ్ హౌస్ -II)

క్రమ
సంఖ్య
వివరాలు ఐటమ్ కొలతల వివరాలు
(స్పెసిఫికేషన్స్)
పరిమాణం
(క్వాంటిటీ)
1. పునాది స్ధంభాలు ఎమ్.ఎస్.యాంగిల్ 40 ఎమ్.ఎమ్.x40 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 336 కి.గ్రా.
2. అడ్డు దూలాలు మరియు
వెనుక వైపు ఫ్రేములు
ఎమ్.ఎస్.యాంగిల్ 40 ఎమ్.ఎమ్.x40 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 305 కి.గ్రా.
3. తలుపుల ఫ్రేములు ఎమ్.ఎస్.యాంగిల్ 40ఎమ్.ఎమ్.-40 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 41 కి.గ్రా.
4. ఇనుప చట్రాలు ఎమ్.ఎస్.ఫ్లాట్ 30ఎమ్.ఎమ్.x6 ఎమ్.ఎమ్. 159 కి.గ్రా.
5. పైకప్పు మరియు సైడ్ కవర్ ఆగ్రో షేడ్ నెట్ 50 శాతం- 70 శాతం
మరియు 30 శాతం.
328 చ.మీ.
6. పునాదిని తవ్వడం మరియు నింపడం సిమెంట్, కాంక్రీట్ 1:2:4, 12 ఎమ్.ఎమ్. చిన్న రాళ్లతో 1.8 ఎమ్3
7. కాలిబాట (పేవ్ మెంట్) ఇటుకతో కట్టడం సిమెంట్ మోర్టర్ (1:6) 2.4 ఎమ్3
8 నిర్మాణాన్ని నిలబెట్టడం (ఎరక్షన్ ఆఫ్ స్ట్రక్చర్) (1) నట్లు మరియు బోల్టులు, (ii)జి.ఐ.వైర్ 3/8x 1”

4 ఎమ్.ఎమ్.

4 కి.గ్రా.

4 కి.గ్రా.

9. తుప్పు పట్టకుండా తీసుకునే వివారణ చర్యలు ఎనామెల్ పెయింట్ మరియు తిన్నర్ 8 లీటర్లు

ఆధారము: http://www.ncpahindia.com

విత్తన శుద్ధి

విత్తన శుద్ధివల్ల ప్రయోజనాలు

  • భూమిలో, విత్తనాలలో వుండే, సూక్ష్మ క్రిములనుంచి, మొలకెత్తే విత్తనాలను, చిరుమొక్కలను కాపాడుతుంది
  • ఎక్కువ విత్తనాలు మొలకెత్తుతాయి
  • త్వరగా, ఒకే రీతిలో మొలకలు వచ్చి, ఎదుగుతాయి
  • పప్పు జాతి పంటలలో ఎక్కువ కణుపులు రావడానికి తోడ్పడుతుంది
  • భూమిలో  కాని, మొక్కలకు కాని మందుచల్లడం కంటె మెరుగైనది
  • ప్రతికూల పరిస్థితులలో కూడా (గాలిలో తేమశాతం తక్కువగా / ఎక్కువగా వున్నప్పుడు కూడా) పంట ఒకే తీరులో వుంటుంది
విత్తన శుద్ధికి అనుసరించవలసిన విధానం

విత్తన శుద్ధి అనే మాట ఇటు ఉత్పత్తులకు, అటు ప్రక్రియలకు రెండిటికీ వర్తిస్తుంది. విత్తనాలను ఈ కింది విధానాలలో శుద్ధిచేయవచ్చు.

  1. విత్తనాలకు పైపూత: ఇది సర్వ సాధారణంగా అనుసరించే విత్తన శుద్ధి విధానం. తడి లేదా పొడి పదార్ధాలను విత్తనాలకు పైపూతగా వాడవచ్చు. పొలంలోను, పరిశ్రమలలోను కూడా ఈ పైపూతను వేయవచ్చు. విత్తనాలను, క్రిమిసంహారక ( పురుగు ) మందులను కలపడానికి చౌకగా లభించే మట్టి కుండలను రైతులు వాడవచ్చు. లేదా విత్తనాలను ఒక పాలిథిన్ షీటుమీద పరచి, తగిన పరిమాణంలో రసాయనికాలను ఆ విత్తనాల రాశిపై చల్లి , యంత్రాల సహాయంతో వాటిని బాగా కలపవచ్చు.
  2. విత్తనాలకు దళసరి పైపూత ( సీడ్ కోటింగ్ ): శుద్ధిచేసే పదార్ధం విత్తనానికి అంటుకుని వుండడంకోసం, ఒక ప్రత్యేక జిగురు లాంటి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. కోటింగ్‌కు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
  3. విత్తనం చుట్టూ గుళికను ఏర్పాటుచేయడం (సీడ్ పెల్లెటింగ్): మిక్కిలి అధునాతనమైన విత్తన శుద్ధి ప్రక్రియ. దీనివల్ల విత్తనపు స్వరూపం మారుతుంది. యంత్రాల ద్వారా విత్తడం తేలికవుతుంది.అయితే, ఈ పెల్లెటింగ్ ప్రక్రియకు ప్రత్యేక యంత్రాలు, ప్రత్యేక పరిజ్ఞానం అవసరం. విత్తనాల శుద్ధిలో ఇది అన్నిటికంటే ఖరీదైన పద్ధతి.

వివిధ పంటలలో సిఫారసు చేయబడిన విత్తన శుద్ధి విధానాలు

పంట

తెగులు / వ్యాధి

విత్తన శుద్ధి విధానం

వివరణ

చెరకు

వేరు కుళ్ళు తెగులు,
ఎండు తెగులు

కార్బెంఢాజిం (0.1%)
2 గ్రాములు / కిలోవిత్తనానికు
ట్రైకోడెర్మా ఎస్‌పిపి.
4-6 గ్రాములు/కిలో విత్తనాని కి

విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు /
మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు

వరి

వేరు కుళ్ళు తెగులు

ట్రైకోడెర్మా 5-10 గ్రాములు/ కిలోవిత్తనాలకు
(నారు నాటడానికి ముందు)

 

 

 

విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు /
మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు

ఇతర క్రిములు / తెగుళ్ళు

క్లోరో పైరిఫాస్ 3 గ్రాములు / కిలో విత్తనంకు

 

ఎండు తెగులు

సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 0.5% డబ్ల్యు . పి. 10 గ్రాములు / కిలో విత్తనానికు

వేరు ముడుత తెగులు

0.2 % మోనోక్రోటోఫాజ్ లో 6 గంటలపాటు విత్తనాలను నాననివ్వాలి

పొడ తెగులు

0.2 % మోనోక్రోటోఫాజ్ లో విత్తనాలను నాననివ్వాలి

మిరప

నారుకుళ్ళు తెగులు

విత్తన శుద్ధి : ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు / కిలో విత్తనాలకు
కార్బెండజైం 1గ్రాము / 100 గ్రాముల విత్తనాలకు

విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు /
మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు

భూమి నుండి సంక్రమించే ఫంగస్ కుళ్ళు తెగులు

ట్రైకోడెర్మా విరిడే 2 గ్రాములు / కిలో విత్తనాలకు ;
సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10 గ్రాములు / కిలో విత్తనాలకు ;
కాప్టాన్ 75డబ్ల్యు ఎస్ 1.5-2.5 గ్రాములు ఏ ఐ / లీటరు

రసం పీల్చు పురుగు,
పచ్చ దోమ, తెల్లనల్లి, తామరపురుగులు

ఇమిడాక్లోరోఫిడ్ 70 డబ్ల్యు ఎస్ 10-15 గ్రాములు ఏ ఐ / కిలో విత్తనాలకు

కంది

ఎండు తెగులు ,
వేరు కుళ్ళు తెగులు

ట్రైకోడెర్మా రకాలు 4 గ్రాములు / కిలో విత్తనానికు

వేరుశనగ

వేరుకుళ్ళు తెగులు

విత్తన శుద్ధి :
బాసిల్లస్ సబ్ట్ లిస్
; సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్
భూమిలో వేయడానికి: 2.5-5.0 కిలోల / వందగ్రాముల పశువుల పెoటలో …
లేదా
కార్బెండాజిం లేదా కాప్టాన్
2 గ్రాములు/కిలో విత్తనానికి

తెల్ల మచ్చ

థైరాం+కార్బెండజైం2 గ్రాములు / కిలో విత్తనాలకు
కార్బెండజైం లేదా కాప్టాన్ 2 గ్రాములు / కిలో విత్తనాలకు

బెండ

వేరు ముడుత తెగులు

పేసిలో మైసెస్ లిలాసినస్ +
సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10 గ్రాములు / కిలో విత్తనాలకు ...పైపూతగా

విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు /
మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు

టొమాటో

మొదలుకుళ్ళు తెగులు
ఎండుతెగులు
బూజుతెగులు
నారుకుళ్లు తెగులు

 

టి.విరైడ్ 2 గ్రాములు / 100 గ్రాముల విత్తనాలకు
కాప్టాన్ 75డబ్ల్యు ఎస్ 1.5-2.0 గ్రాములు ఏ ఐ / లీటరుకు
సూడోమొనాస్ ఫ్లోరసెన్స్ +
వి. క్లమైడో స్పోరియం 10 గ్రాములు / కిలో విత్తనాలకు.....పైపూతగా

ధనియాలు

ఎండుతెగులు

ట్రైకోడెర్మా విరైడ్ 4 గ్రాములు / కిలో విత్తనాలకు

వంకాయ

బాక్టీరియా ఎండుతెగులు

సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10గ్రాములు / కిలో విత్తనాలకు

పఫ్పుజాతి (లెగ్యూమినస్) పంటలు

నేల ద్వారా సంక్రమించే తెగులు

ట్రైకోడెర్మా విరైడ్ 2 గ్రాములు / 100 గ్రాముల విత్తనాలకు

వేరు ముడుత తెగులు

కార్బోఫ్యురాన్/ కార్బోసల్ఫాన్ 3% (డబ్ల్యు /డబ్ల్యు)

పొద్దు తిరుగుడు

విత్తనం కుళ్ళు

ట్రైకోడెర్మా విరైడ్ 6 గ్రాములు / కిలో విత్తనాలకు

రసం పీల్చు పురుగు,
తెల్ల దోమ

ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ ఎస్ 5-9 గ్రాములుఏ ఐ/ కిలో విత్తనాలకు
ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యు ఎస్
7గ్రాములుఏఐ/కిలో విత్తనాలకు

గోధుమ

చెదపురుగులు

విత్తడానికి ముందుగా, ఈ కిందపేర్కొన్న పురుగు మందులలో దేనితోనైనా విత్తనాలను శుద్ధి చేయాలి.
క్లోరోపైరిఫాస్ 4 మి.లీ/కిలో విత్తనాలకు లేదా
ఎండోసల్ఫాన్ 7 మి.లీ/కిలో విత్తనానికు

విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు /
మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు

నల్ల వెన్ను తెగులు/
నల్ల గింజ తెగులు

థైరాం 75 % డబ్ల్యు పి
కార్బాక్సిన్ 75 % డబ్ల్యు పి
టెబ్యుకోనజోల్ 2 డి ఎస్ 1.5-1.87 గ్రాములు ఏఐ / కిలో విత్తనాలకు
టి. విరైడ్ 1.15 % డబ్ల్యు పి
4 గ్రాములు / కిలో విత్తనాలకు

క్యాబేజి, కాలీ ఫ్లవర్, నూల్‌కోల్, ముల్లంగి, బ్రొకోలి
(క్రూసిఫెరస్ కూరగాయలు)

భూమికి / విత్తనానికి సంబంధించిన తెగుళ్ళు (బూజు తెగులు)
వేరు ముడత తెగులు

ట్రైకోడెర్మా విరైడ్ 2 గ్రాములు / 100 గ్రాముల విత్తనాలకు
కాప్టాన్ 75%డబ్ల్యు ఎస్ 1.5-2.0 గ్రాములు ఏఐ/ లీటరుకు భూమిని తడపడానికి
సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ +
వర్టీసీలియం క్లామిటోస్పోరియం 10గ్రాములు / కిలో విత్తనాలకు

శనగ

ఎండుతెగులు,
కుళ్లు తెగులు

ట్రైకోడెర్మా విరైడి1 % డబ్ల్యు పి
9 గ్రాములు/కిలో విత్తనాలకు +

కార్బెండజైం + కార్బోసల్ఫాన్ 0.2%
కార్బెండజైం + థైరాం + కార్బోసల్ఫాన్0.2%
క్లోరోపైరిఫాస్20 ఇ సి
15-30 మి.లీ ఏ ఐ / కిలో విత్తనాలకు


విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు /
మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు

బంగాళా దుంప లేదా ఆలు

భూమి దుంప ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు

నిల్వచేయడానికి 20 నిమిషాల ముందు ఈ క్రింది రసాయనాలు దేనితోనైనా విత్తన శుద్ధి చేయాలి ఎం ఇ ఎం సి 3% డబ్ల్యు ఎస్ 0.25 % లేదా
బోరిక్ ఆమ్లము 3%

బార్లీ

నల్ల వెన్ను తెగులు/
నల్లగింజ తెగులు
ఆకులకు పొడలు

చెదపురుగులు

కార్బాక్సిన్ 75 % డబ్ల్యు పి
థైరాం 75 % డబ్ల్యు పి 1.5-1.87 గ్రాములు ఏ ఐ / కిలో విత్తనాలకు
క్లోరోపైరిఫాస్ 4 మి.లీ / కిలో విత్తనాలకు

కాప్సికం

వేరు ముడత తెగులు

సూడోమొనాస్ ఫ్లోరసెన్స్
1% డబ్ల్యు పి ,పేసిలో మైసెస్ లిలాసినస్ + వర్టీసీలియం క్లామిటోస్పోరియం 1% డబ్ల్యు పి 10గ్రాములు / కిలో విత్తనాలకు

ఆధారము: http://ppqs.gov.in

పంటల ఉత్పాదన కొరకు సాంకేతిక పద్ధతులు

ఆహార ధాన్యాలు

వరి

వరికాండం ను తొలిచే పురుగు నివారణా నిర్వహణా

వరి కాండం తొలిచే పురుగు, మొలకల సంఖ్యను తగ్గించడమే కాక, దిగుబడి తక్కువగా ఉండేటట్లు చేస్తుంది. వరిసాగుకు, దాదాపు ఆరు ముఖ్యమైన కాండం తొలిచే పురుగుల జాతులు హాని కలిగిస్తున్నాయి. కావేరీ డెల్టా ప్రాంతంలో నాలుగు రకాల కాండం తొలిచే పురుగుల జాతులు హాని కలిగిస్తున్నాయి. అవి ఇన్సెర్ట్యులస్ ( scirpophaga incertuces) - పసుపు రంగు కాండం తొలిచే పురుగు), ఛిలో సప్రెస్సాలిస్ ( chilo suppnessalio - చారల పురుగు), చిలో ఆరిసిల్లస్ ( chilo suppnessalio- బంగారు అంచుల పురుగు), మరియు సెసామియా ఇన్ఫెరెన్స్ ( sesamia inferns - గులాబి రంగు పురుగు ) ఇవి, ఒక పంట సంవత్సరకాలంలో, పంట ఎదుగుతున్న వివిధ దశలలో, వివిధ స్థాయిలలో హాని (నష్టం) చేస్తున్నట్లు, తమిళనాడు వరి పరిశోధనా సంస్థ, అడుతురై, చేసిన అధ్యయన మూలంగా తెలిసిన విషయాలు, కాండం లోపలే లార్వా తినెయ్యడం వలన కాండంలోని తంతువుల వ్యవస్థ ఛిన్నాభిన్నమై, పూతపూయక ముందే డెడ్ హార్ట్ ( dead heart- మధ్య ఆకు భాగముకున కోక గోధుమ రంగు లోకి మారి, వడలిపోయే లక్షణం) లక్షణం, పూవుపూసిన తరువాత తెల్లమచ్చ ( white head or white ear) ఆశించడం సంభవిస్తుంది.

దోహదం చేసే కారణాలు : తెగుళ్ళు వివిధ వాతావరణ పరిస్థితులకు తట్టుకుని జీవించడానికి గల ముఖ్య కారణాలు, అధిక నత్రజని (నైట్రోజన్), నేలలలో తగినంత సిలికా ( sillica) లేకపోవడం, అధిక తేమ తో కూడిన చల్లని పొడి వాతావరణం మరియు తక్కువ ఉష్ణోగ్రత్తలు అంతకు ముందు వేసిన పంట యొక్క అవశేషం లో ఉండిపోయిన తెగులు.

నివారణ నిర్వహణ పద్ధతులు :-
  1. సమగ్రమైన తెగులు నిర్మూలనకు, సాంస్కృతిక, జీవశాస్త్ర సంబంధమైన, మరియు ప్రవర్తనా సంబంధమైన మార్గాలు క్రింద సూచింపబడినవి.
  2. ఆయా పంటల కాలాలలో, త్వరగా ఎదిగి, అధిక దిగుబడి నిచ్చే వంగడాలను ఎంచుకోవాలి.
  3. 2.5 కేజీల సూడోమొనాస్ ఫ్లోరిసెన్స్ ( ps eudomonas flourescens) pgpr కన్సోర్టియా తో పాటు, 25 కేజీల వేప రొట్టెను మరియు పంటపొలాలలో బాగా కుళ్ళిపోయిన 250 కేజీల ఎరువును కలిపి, ఒక హెక్టారు పొలానికి నేల సారం ph 7 కంటే ఎక్కువగా గాని ఉంటే వాడాలి. అదే విధంగా నేలసారం ph, ఆఖరి దుక్కి తరువాత 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు ట్రైకోడెర్మా విరిడె ( trichoderma viridie) ను వాడాలి.
  4. విత్తనశుద్ధి :- విత్తనాలను, సూడోమొనాస్ ఫోరీసెన్స్ ( ps eudomonas flourescens) pgpr కంసోర్టియాను ఒక కేజీ విత్తనాలకు 10 గ్రాముల చొప్పున ఉపయోగించి శుద్ధి చేయాలి. లేక ఒక హెక్టారుకు వాడవలసిన నారును 25 కేజీల కన్సోర్టియా పి. ఫ్లోరిసెన్స్ లో ముంచాలి ( consortia p. floreseens).
  5. నారును తిరిగి నాటే ముందు, కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల సముహాలను సమూలంగా నిర్మూలించాలి.
  6. పంట యొక్క ఎదిగే దశలలోని బలహీన స్థితులలో పంటను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, తెల్లమచ్చ ( white ear) ‘డెడ్ హార్ట్ ’ ( dead heart - ప్రధానమైన ఆకు వడలిపోవడం) లు సోకకుండా కనిపెట్టి వ్యవహరించాలి.
  7. నారు నాటిన 28 రోజుల తరువాత, వారానికి మూడు సార్లు చొప్పున, గుడ్లను నిర్మూలించే పేరాసిటాయిడ్ ట్రైకోగ్రామా జపోనికమ్ ను విడుదల చేయడం మొదలు పెట్టె, 37, 44 , 51 రోజులప్పుడు ట్రైకోగ్రామా చిలో నిక్స్ ను విడుదల చేయాలి.

ఆధారం : The Hindu

నారుమడి ప్రధాన పొలం తయారీ
రకాలు నాట్లు
ఎరువులు ఇతర విషయాలు
నీటి యాజమాన్యం మార్కెటింగ్
తెగుళ్ళు పురుగులు
కలుపు యాజమాన్యం యాంత్రీకరణ

వాణిజ్య పంటలు

చెఱకు

చెరకు విత్తన పంట పెంపకం

వాణిజ్య చెరకు పంటని ఉపయోగించి, చెరకు విత్తనాలను ఉత్పత్తి చేయడం, ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో, అమలు లో ఉన్న పద్ధతి శ్రేష్టమైన లక్షణాలు ఉన్న విత్తనం గురించి అరుదుగా పట్టించుకుంటారు. చాలా మంది రైతులు, విత్తన ప్రమాణాన్ని పట్టించుకోరు. అలా పట్టించుకున్న రైతులు కూడా, మొలకలను కత్తిరించి నాటే స్దితిలోనే ఎంపిక చేసుకుంటారు. ఇది సరిపోదు. ఒక రైతు, శ్రేష్టమైన, రోగగ్రస్తం కాని చెరకు విత్తనాలను కోరుకున్నప్పుడు, వాటిని చెరకు విత్తన పంటగా ప్రత్యేకంగా పండించాలి. ఈ పంటను, ఎటువంటి తెగుళ్ళు, చీడపీడల బారిన పడకుండా, పంటనాటిన నాటి నుండి నిరంతరం పర్యవేక్షించాలి.

అంతేకాకుండా, విత్తన శ్రేష్టత అంటే, కేవలం తెగుళ్ళు, వ్యాధులు లేనిది అని అర్థం కాదు. విత్తనంలో నీటి పరిమాణం అధికంగా ఉండడం, పోషక స్థితి సరిగా ఉండడం కూడ ముఖ్యం. ప్రపంచమంతా కూడ, చెరకు విత్తన పంట పెంపకాన్ని నిర్లక్ష్యం చేయడమే చెరకు వ్యవసాయం లో ఉన్న అతి పెద్ద లోపం.

వాణిజ్య పంట నుండి , చెరకు విత్తనాలను తీసుకుని ఉపయోగించడం వలన, పెద్ద సంఖ్యలో వ్యాధులు వేగంగా వృద్ధి చెందడానికి కారణమవుతున్నది. రెడ్ రాట్ (ఎర్రగా కుళ్ళించే తెగులు), విల్ట్ (వాడిపోవడం), స్మట్ (కాటిక తెగులు), రటూన్ స్టంటింగ్ (మొలకలు గిడసబారి పోవడం) మరియు గ్రాసీ ఘాట్ (గడ్డిపోచల వంటి కొమ్మలు, రెమ్మలు) ఇవన్నీ చెరకు పంట దిగుబడి, శ్రేష్టత పై దుష్ప్రభావం చూపుతాయి. అందువలన, విత్తనాల కోసం చేసే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన చెరకు పంటల పెంపకం ఎంతో ముఖ్యమైనది మరియు అనుసరించదగ్గది.

  1. ఎత్తులో ఉన్న పొలాన్ని, విత్తనపంట పెంపకం గురించి ఎంపిక చేసుకోవాలి. నేలలో లోపాలు లేకుండా (ఉప్పునేలలు, క్షారనేలలు, నీరు నిలిచే నేలలు మొదలైనవి) మరియు తగినంత నీటి పారుదల సదుపాయం ఉండేటట్లు చూసుకోవాలి.
  2. నేలను సమగ్రంగా తయారు చేసుకోవాలి (పంటకు అనువుగా) మొలకలను నాటడానికి 15 రోజుల ముందు 20 – 25 టన్నులు / హెక్టారుకు FYM ( ఎఫ్. వై.ఎమ్ -) ను నేలకు అందించాలి. (చేర్చాలి).
  3. పంటకాలువలు, తూములను ఏర్పాటు చేసి, వాన నీరు ప్రక్క పొలం నుండి రాకుండా అడ్డుకట్టవేసి, ఆ విధంగా రెడ్ రాట్ అనే, మొలకను కుళ్ళించే తెగులును వ్యాపించకుండా నిరోధించాలి.
  4. విత్తన పెంపకం కేంద్రంలో ఇంతకు ముందు పెంచబడిన విత్తన పంట నుండి విత్తన ముడి సరుకును ఎంపిక చేసుకుని, మొలకలను ఉత్పత్తి చేసుకోవాలి. శుద్ధి చేయబడిన మొలకలనే ఉపయోగించాలి. ఆ విధంగా చేయడం వలన RSD ( ఆర్. ఎస్. డి- ) GSD ( జి.ఎన్.డి - ) వంటి వ్యాధులను అరికట్టవచ్చు.
  5. విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులను నిరోధించడానికి, ఉష్ణ శుద్ధి ( ఉష్ణ చికిత్స) చేయడం, మొలకలకు ఆర్గానోమెర్కురియల్ (మొలకలను పాదరసం ద్వారా చేసే శుద్ధి) ప్రక్రియలో చేసే శుద్ధి వలన, నేల నుండి సంక్రమించే వ్యాధులను నిర్మూలించడం వంటి పద్ధతుల ద్వారా మేలైన మొలకలను ఉత్పత్తి చేయవచ్చు.
  6. దగ్గర దగ్గరగా, అనగా 75 సెం.మీ దూరం మాత్రమే ఉండేటట్లు మొలకలను నాటడం వలన, ఒక ప్రమాణ స్ధలానికి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి జరుగుతుంది.
  7. సాధారణ చెరకు పంట కంటే 25 శాతం అధిక విలువ కలిగిన విత్తనాలను ఉపయోగించాలి.
  8. అధిక పోషకాల మోతాదు, అంటే 250 కేజీల N(నత్రజని) , 75 కేజీల P2O5 ( ఫాస్పేట్) 250 కేజీల (పోటాషియం డై ఆక్సైడ్) హెక్టారుకు అందించాలి.
  9. పంట లక్షణాలు, పంట పెరిగే వివిధ దశలలో, వాతావరణ పరిస్థితులననుసరించి ఆవిరి అయ్యే నీటిని బట్టి ( evaporative demand of the atmosphere) పంట జీవిత కాలంలో నీటి ఎద్దడి ( వత్తిడి) కి గురికాకుండా నీటి పారుదల వ్యవస్థ అత్యంత అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలి.
  10. కలుపు మొక్కలు లేని మరియు తెగుళ్ళు, వ్యాధులు సోకని మేలైన పెరిగే వాతావరణాన్ని కలుగజేయాలి.
  11. చీడలు, వ్యాధులు, పంటకు సోకకుండా, సరైన సమయానికి వాటిని నియంత్రించే విధంగా పర్యవేక్షణ జరగాలి.
  12. వ్యాధిగ్రస్తమైన యితర రకాల మొక్కలను మరియు పొదలను నిర్మూలించాలి.
  13. పంటని. గాలి దుమారాల నుండి, తీగ జాతి కలుపు నుండి వచ్చే తెగులు నుండి రక్షించాలి.

7 – 8 మాసాలలో పంట చేతికి వస్తుంది. ఇటువంటి పంట నుండి తీసుకున్న మొలకలు ఆరోగ్యంగా, బలంగా ఉండే అంకురాలుగా ఉండి, వాటిలో అధిక తేమ పరిమాణం, చాలినంత పోషకాలు, అధిక మొత్తంలో చక్కెర శాతాలు ఉంటాయి. అందువలన, అవి త్వరగా నాటుకుని, బలంగా ఎదిగి ప్రధానమైన శ్రేష్టమైన వాణిజ్య పంటను తప్పకుండ అందిస్తాయి.

ప్రధాన పంటను నాటడానికి కావలసిన మొలకలను తయారు చేయుట
  1. పంటను నాటడానికి ఒక రోజు ముందే, మొలక పంటను కోతకోయాలి. ఆ విధంగా చేయడం వలన, అధిక శాతంలో మరియు ఒకేరకమైన అంకురాలు లభిస్తాయి.
  2. ఎప్పుడూ నాటడానికి ఒక రోజు ముందే, మొలకలను శుద్ధి చేసి సిద్ధం చేయాలి.
  3. నాటే మొలకలు లేక చెరకు విత్తనాలను, పల్చని వేర్లు మరియు చీలికలు లేని వాటినే ఉపయోగించాలి.
  4. మొలకలను కత్తిరించినప్పుడు వాటి అంకురాలను నష్టం వాటిల్లకుండ జాగ్రత్త పడాలి.
  5. ప్రతీ రెండు నుండి మూడు పంటల కాలానికి, విత్తన ముడి పదార్ధాన్ని మార్చివేయాలి. ఒక వేళ, వృద్ధి చెందిన చెరకునే విత్తనంగా వాడవలసి వస్తే చెరకు గడ పై భాగంలోని 1/3వభాగాన్ని ఉపయోగించవచ్చు.
సరి అయిన చెరకు విత్తనం
  1. విత్తన చెరకును ఎప్పుడూ 7 – 8 మాసాల వయసు కల విత్తన పంట నుండి గ్రహించాలి.
  2. తెగుళ్ళు మరియు వ్యాధులైన, ఎర్రగా కుళ్ళడం, వడలిపోవడం, కాటిక తెగులు, గిడసబారిపోవడం మొదలైనవి సోకకుండా ఉండాలి.
  3. మొలకలను పట్టుకోవడంలోనూ, రవాణా చేయడంలోనూ హాని జరగని ఆరోగ్యవంతమైన మొలకలుగా ఉండాలి.
  4. అంకురాలు, అధికమైన తేమ పరిమాణం, చాలినన్ని పోషకాలు, అధిక మోతాదులో చక్కెరలు కలిగి , మరియు ఎటువంటి పరిస్థితి నైనా తట్టుకోగలవై ఉండాలి.
  5. పల్చటి వేర్లు మరియు చీలికలు లేనివై ఉండాలి.
  6. మొలకలు, స్వచ్ఛమైన ప్రమాణం కలిగి ఉండాలి.

ఆధారం : జాతీయ పండ్ల పెంపక సంఘం

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం తో సహా, జమ్ము& కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మరియు ఉత్తరఖండ్ తప్ప అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సంఘం పరిధిలోనికి వస్తాయి. ఈ పరిధిలోనకి రాని పైన పేర్కొన్న ప్రాంతాలన్నీ ఈశాన్య రాష్ట్రాలలో సమగ్ర పండ్ల తోటల పెంప అభివృద్ధి సాంకేతిక సంఘం క్రిందకు వస్తాయి

పండ్ల మొక్కలు

జామతోటల్లో ఫెరోమోన్ ఎరలతో పండు ఈగ పురుగు నిర్మూలన

ఐపీఎమ్ ప్రయోగ విధానంతో...రైతులను భాగస్వామ్యులను చేయడంద్వారా జామతోటల్లో ఫెరోమోన్ ఎరలను ఉపయోగించడాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. ఇథనాల్, మిథైల్ యూజెనాల్ మరియు మలాథియాన్ లను 6:4:1 నిష్పత్తిలో కలపడంద్వారా ఫెరోమోన్ ద్రావకాన్ని తయారుచేస్తారు. 2”x2” పరిమాణంలో, నీటిని పీల్చుకునే ప్లైవుడ్ చెక్కముక్కలను తీసుకుని పై ద్రావకంలో ముంచి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో(1వ బొమ్మ) అమర్చారు. ఆ డబ్బాకు పైభాగాన ఎదురెదురుగా 1.5సెం.మీ. వ్యాసంతో నాలుగు రంధ్రాలు చేసి తోటలో ఎకరానికి ఒకటి చొప్పున పెట్టారు.

మొదటి పంట సమయంలో 50-60శాతం ఉండే పండు ఈగ ఇప్పుడు పదిశాతానికి తగ్గింది. ఈ పురుగుకోసం రైతులు గతంలో వినియోగించే పురుగుమందుల పరిమాణం కూడా 80-90శాతం తగ్గింది.

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారి కృషి వలన అబోహర్ ప్రాంతంలోని సుమారు 1500 హెక్టార్లలో ఈ శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జామ తోటల్లో పండుఈగ నియంత్రణకు ఈ విధానం ఒక మంచి పరిష్కారంగా రుజువయింది.

feromone net
పండుఈగ చీడకు సెక్స్ ఫెరోమోన్ వల

jonata
జొనాటా
karectta
కరెక్టా

ఆధారము: సీఐపీహెచ్ఇటి, లూధియానా

ఈశాన్య రాజస్థాన్ కోసం కన్జర్వేషన్ బెంచ్ టెర్రెసింగ్ విధానం

అతితక్కువ మరియు అస్థిరమైన పంటల దిగుబడి, తీవ్రంగా తరిగిపోతున్న భూగర్భజలాలు మొదలైనవి వర్షాధార మెట్టభూములలో ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు. ఈశాన్యరాజస్థాన్ లో అస్తవ్యస్త వర్షపాతం, నేలల్లో తక్కువ సారం కారణంగా నీరు ఇంకకపోవడం, నేల కోసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతంలో కన్జర్వేషన్ బెంచ్ టెర్రెస్(సీబీటీ) విధానం ద్వారా వాననీటిని సంరక్షించవచ్చు.

ఈ సీబీటీ విధానంలో నేలలో వాలుగా ఉన్న ప్రాంతాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తారు. కింద ఉన్న మూడోవంతు భాగాన్ని చదునుచేసి పైనున్న 2/3వంతు నేలనుంచి జారేనీటిని సేకరిస్తారు. ఖరీఫ్ సమయంలో పైనున్న భూమిలో జొన్న+కంది అంతరపంటలుగా లేక సోయాచిక్కుడు ను పండిస్తారు. కింద ఉన్న మూడోవంతు భూమిని వర్షాకాలంలో బీడుగా ఉంచేసి...రబీ కాలంలో ఆవాలుగానీ శనగలుగానీ పండిస్తారు. రెండుశాతం వాలుపై సీబీటీ నిర్మించడానికి హెక్టారుకు రూ.3,022 ఖర్చవుతుంది.

సీబీటీ ద్వారా ఈ ఫలితాలు పొందవచ్చు.

  • పంట నాటుసమయంలో వాననీరు వృధా కాకుండా 50శాతం తగ్గించవచ్చు.
  • నేలల కోతను ఏడాదికి హెక్టారుకు 3.8-11టన్నుల నుంచి ఏడాదికి హెక్టారుకు సుమారు 2.2-3.2 టన్నులకు తగ్గించవచ్చు.
  • జొన్న, లేక అలాంటి ఏ ఇతర పంటకైనా గింజలు లేదా గడ్డి దిగుబడి 78.1శాతం పెరుగుతుంది.
  • ఈ విధానంలో ఖర్చు : లాభం నిష్పత్తి 1.4:1
  • నేలను, పోషకాలను కూడా సంరక్షించవచ్చు.

మెట్టప్రాంత వాతావరణంలో తగినంత లోతు ఉన్న నేలల్లో, స్వల్ప వాలు ఉన్న ప్రాంతాలలో నేలకోత నియంత్రణకు, తేమ పరిరక్షణ, పంట దిగుబడి అభివృద్ధికి ఈ సీబీటీ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారంకోసం, సంప్రదించండి.
సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, 218, కౌలాగర్ రోడ్డు,
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)248 195
ఇ మెయిల్:

కంపోస్టు తయారుచేయు పధ్ధతి

ఉపోద్ఘాతం

సాధారణంగా గ్రామాల్లో రైతులు పశువుల పేడను, వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను కుప్పలుగా వేస్తారు. ఇట్లు చేయుట వల్లన అవి ఎండకు ఎండి, వానకు తడిసి సహజ పోషకాలను చాలావరకు కోల్పోతాయి. రైతులు కొంత శ్రమపడి సేంద్రీయ పదార్ధాలను సేకరించి ఒక గుంటలో వేసి కుళ్ళటానికి తగిన పరిస్ధితులు కల్పిస్తే అవి త్వరగా కుళ్ళి మంచి ఎరువుగా తయారవుతుంది. సాధారణ పరిస్ధితులలో సేంద్రీయ పదార్ధాలు కుళ్ళటానికి చాలా నెలలు పడుతుంది. కుళ్ళే ప్రక్రియ చాలా త్వరగా జరగటానికి అనువైన పరిస్ధితులను కల్పించడాన్ని కంపోస్టింగ్ అని అంటారు. ఇలా తయారయిన ఎరువును కంపోస్టు అంటారు.

కంపోస్టింగ్ అనువైన వ్యర్ధ పదార్ధాలు

ఎండుగడ్డి / గైరిసీడియా లేత కొమ్మలు / ఎండుఆకులు / కలుపు మొక్కలు / వివిధ నూర్చిన తర్వాత వచ్చిన వ్యర్ధ పదార్ధాలు / కంచెల్లో పెరుగుతున్న తంగెడు, దిరిశెన, కానుగ, వావిలి మొదలయిన మొక్కల ఆకులు, కొమ్మల భాగాలు / పశువుల పేడ, గొర్రెల / కోళ్ళ పెంట, మూత్రములు / గోబర్ గ్యాస్ ప్లాంట్ స్లర్రీ మొదలయిన వాటిని కంపోస్టు ఎరువు తయారుచేయటానికి వాడుకోవచ్చును.

కంపోస్టు గుంట పరిమాణము

5.2మీ x 2 మీ x 1 మీ

కంపోస్టింగ్ పద్ధతి

5.25.2 మీటర్ల పొడవు, 2 మీ వెడల్పు మరియు 1 మీ లోతు గుంటను పొలంలో ఒక మూల వీలయితే చెట్ల నీడలో త్రవ్వాలి.

  • ఇలా త్రవ్విన గుంటలో నీరు నిలువకుండా సులభంగా ఇంకిపోవడానికి దిబ్బ అడుగున రాళ్ళు, పెంకులు వంటివి 6 అంగుళాల మందము పరవాలి.
  • సేకరించిన వ్యర్ధ పదార్ధాలను, చెత్తను 6 అంగుళాల మందము వరకు నింపి దానిపైన పేడను ఆపైన సూపర్ ఫాస్పేట్ సుమారు 1 కిలో చిలకరించాలి. ఈ పద్ధతిన పొరలు, పొరలుగా వ్యవసాయ, పశువుల వ్యర్ధ పదార్ధాలపై సూపర్ ఫాస్పేట్ ను చిలకరించి ఈ విధముగా భూమట్టానికి 12 ఎత్తువరకు అమర్చిన తర్వాత అందులో తేమ పెంచటానికి నీళ్ళు చిలకరించవలయును.
  • ఆ తర్వాత గాలి సోకకుండా మట్టి మరియు పేడ మిశ్రమంలో పూత పూయవలయును.
  • ఈ విధముగా కూర్చిన తరువాత గుంతలో వేసిన సేంద్రీయ పదార్ధాలు క్రుళ్ళి సుమారు 75 – 90 రోజులలో మంచి సారవంతమయిన కంపోస్టు తయారవుతుంది.
  • ఈ ప్రక్రియలో గుంతలో ఉత్పన్నమయిన వేడికి (40 – 50 సెంటీగ్రేడ్) అందులోని హానికారక శిలీంధ్రాలు, రోగకారక క్రిములు, కీటకాలు నశించును.

కంపోస్టింగ్ త్వరగా జరగడానికి అనువైన పరిస్ధితులు

పంటవ్యర్ధ పదార్ధాల ఎంపిక

పంటవ్యర్ధ పదార్ధాలలలో వుండే కర్బన, నత్రజని మోతాదులను బట్టి కుళ్ళటానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది. కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్ధాలలో ఎక్కువ ఉంటుందో అవి త్వరగా కుళ్ళుతాయి.

ఉదా : గైరిసీడియా లేత కొమ్మలు, ఆకులు, గడ్డి ఆకులు, పశువుల మల మూత్రాదులు, మొదలయిన వాటిలో కర్బన, నత్రజని మోతాదు ఎక్కువ ఉండడము వలన త్వరగా కుళ్ళుతాయి.

కర్బన, నత్రజని నిష్పత్తి తక్కువగా వుండే చెక్కపొడి, రంపపు పొట్టు, వరిగడ్డి మొదలయినవి త్వరగా కుళ్ళవు.

కనుక కంపోస్టు త్వరగా 3 నెలలలోపు తయారవాలంటే కర్బన, నత్రజని మోతాదు ఎక్కువ వున్న వ్యర్ధ పదార్ధాలు ఎన్నుకోవాలి.

కంపోస్టు దిబ్బలో ఎక్కువ ఎండుపుల్లలవంటివి ఉన్నట్లయితే యూరియా 1 కిలో గుంతలో చల్లడం వలన త్వరగా కుళ్ళుతుంది.

వ్యర్ధ పదార్ధాల పరిమాణం

పంటల వ్యర్ధ పదార్ధాలు చిన్నవిగా వున్నట్లతే త్వరగా కుళ్ళి ఎరువు తయారవుతుంది.

గుంటలో తేమ

గుంతలో తేమ ఎప్పుడూ తగినంత ఉండాలి.

తేమ ఉండడము వలన సేంద్రీయ పదార్ధాలు కుళ్ళడానికి దోహదపడే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెంది వ్యర్ధ పదార్ధాలు త్వరగా కుళ్ళుతాయి. అందువలన దిబ్బపై తరచుగా నీటిని చిలకరిస్తూండాలి.

ఎట్టి పరిస్ధితులలోను కంపోస్టు గుంతలో నీరు నిల్వ ఉండకూడదు.

నీరు నిల్వ ఉన్నట్లతే దిబ్బలో గాలి సోకక, హానికారక సూక్ష్మజీవులు (ప్రాణవాయువు అవసరంలేనివి) పెరుగుతాయి. తెగుళ్ళకు సంబంధించిన సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇటువంటి పరిస్ధితుల్లో గుంత నుండి చెడు వాసన రావడం మొదలవుతుంది.

సాధ్యమైనంత వరకు తేమ త్వరగా ఆరిపోకుండా ఉండడానికి కంపోస్టు గుంటను చెట్ల నీడలో వేసుకోవాలి. తరుచుగా నీరు చిలకరించాలి.

కంపోస్టింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు
స్ధలం ఎంపిక

నీరు ఇంకే, నీరు నిలువకుండా కొంచెం వాలుగా వున్న స్ధలం మంచిది. ఎంపిక చేసుకున్న స్థలం ఇళ్ళకు దూరంగా, లేదా పొలం దగ్గర చెట్ల క్రింద ఉండాలి.

వేడిమి

కుప్పలో వేడిమి 60 – 90 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు గడ్డి మొలకలు, గడ్డి విత్తనాలు, రోగకారక సూక్ష్మజీవులు చనిపోతాయి.

గాలి

కంపోస్టు కుప్పలోని అన్ని భాగాలకు గాలి బాగా ఆడాలి. అందువల్ల సూక్ష్మజీవులకు అవసరమయిన ఆక్సిజన్ లభించడమే కాకుండా ఉత్పత్తి అయిన కార్బన్ – డై – ఆక్సైడ్ బయటికి వెళ్ళే అవకాశముంటుంది. బెడ్ లో వేసే వ్యర్ధ పదార్ధాలను 1 – 2 అంగుళాల సైజు ముక్కలుగా చేసి వేస్తే గాలి బాగా ఆడుతుంది.

ఉదజని సూచిక

కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి కుప్పలో పి హెచ్ (Ph) ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్యలో వుండేట్లు చూసుకోవాలి.

కంపోస్టు వాడడం వల్ల లాభాలు
  • నత్రజని, పొటాష్, భాస్వరం వంటి పోషకాలే కాకుండా కాల్షియం, మెగ్నీషీయం, బోరాన్, జింక్, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకు అందుతాయి.
  • యూరియా, డిఎపి, పొటాష్ వంటి ఎరువులు వాడనక్కరలేదు.
  • పంటకు తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అందువల్ల క్రిమినాశక మందులకు అయ్యే ఖర్చు బాగా తగ్గుతుంది.
  • కంపోస్టు వాడితే పంటకు నీరు తక్కువ పట్టి నీరు ఆదా అవుతుంది.
  • నేలలోకి గాలి బాగా వీచేలా, నీరు బాగా ఇంకేలా చేస్తుంది. నీటిని నిల్వ ఉంచే సామర్ధ్యాన్ని పెంచుతుంది.
  • కంపోస్టు ఎరువులోని జిగురు పదార్ధాలు మట్టిని పట్టుకొని వుండడం వల్ల మట్టికోత తక్కువగా ఉంటుంది.
  • నేలను సారవంతం చేసే సూక్ష్మక్రిములు సంఖ్యను బాగా పెంచుతుంది. భూమికి సేంద్రీయ కర్బనం లభిస్తుంది.
  • భూమి సారవంతమై పంట దిగుబడి ఎక్కువవుతుంది.
  • ప్రతి ఏటా పంట దిగుబడి నిలకడగా ఉంటుంది.
  • పండిన పంట త్వరగా చెడిపోదు. మంచి రుచిగా ఉంటుంది.
కంపోస్టు తయారయ్యేటప్పుడు ఉత్పన్నమయ్యే కొన్ని సమస్యలు – కారణాలు – పరిష్కారాలు

కనుగొన్న విషయం

సమస్య

కారణాలు

పరిష్కారం

1 . దిబ్బవేడెక్కదు

సూక్ష్మజీవులు పెరగటం లేదు

వ్యర్ధ పదార్ధాలు బాగా తడిగా లేదా పొడిగా ఉండి ఉండవచ్చును. దిబ్బలో గాలి ప్రసరణ బాగా తక్కువ

కర్బన, నత్రజని నిష్పత్తి

సరిగా లేదు

మట్టి బాగా ఎక్కువగా ఉండి ఉండవచ్చు.

దిబ్బను నీటితో గాని, మూత్రంతో గాని తడపాలి.

 

 

దిబ్బలోని సేంద్రీయ పదార్ధాలను కలిపి కదలించాలి. దిబ్బకు నత్రజని ఎక్కువ ఉండే పచ్చని ఆకులు లేదా పశువుల పేడ కలపాలి.

కొద్ది పరిమాణంలో యూరియా సూపర్ ఫాస్ఫేట్ చిలకరించాలి.

2 . దిబ్బ అకస్మాత్తుగా చల్లబడిపోతుంది

సూక్ష్మజీవుల చర్య ఆగిపోతుంది

సేంద్రీయపదార్ధాలు బాగా పొడిగాఉండి ఉండవచ్చు.

నత్రజని అంతా అయి పోయి ఉండవచ్చు.

దిబ్బను నీటితో గాని, మూత్రంతో గాని తడపాలి.

దిబ్బను నత్రజని ఎక్కువ ఉండే పచ్చ ఆకులు కలపాలి.

3 . దిబ్బలోని

సేంద్రీయపదార్ధాలపై

తెల్లని బూజు

అంటినట్లుంది

బూజు చాలా ఎక్కువగా వృద్ధి చెందటము అయిఉంటుంది.

సేంద్రీయ బాగా పొడిగా ఉండవచ్చు.

దిబ్బలోని పదార్ధాలను కలియ తిరగబెట్టి చాలా కాలం అయి ఉండవచ్చు.

దిబ్బను తిరగతోడి మరలా తయారు చేయాలి.

దిబ్బను నీటితో గాని, మూత్రంతో గాని తడపాలి.

నత్రజని ఎక్కువ ఉండే సేంద్రీయ పదార్ధాలు కలపాలి.

4 . సేంద్రీయపు

ఎరువు నల్లగా, పచ్చగా

తయారయింది

దిబ్బ దుర్వాసనగా ఉంటుంది.

దిబ్బ గుల్లగా లేకపోవడం

వలన గాలి ప్రసరణ సరిగ్గా లేదు

నత్రజని పదార్ధాలు మరీ

ఎక్కువగా ఉండి ఉండవచ్చు

దిబ్బలో నీరు నిలిచి

ఉండవచ్చు

దిబ్బను సరిగ్గా కలియబెట్టి ఉండకపోవచ్చు.

కర్బన మోతాదు ఎక్కువగా ఉన్న పదార్ధాలతో దిబ్బను తయారు చేయాలి.

దిబ్బ వేడెక్కే దశలో తరచుగా ఎక్కువసార్లు కలియబెట్టాలి.

తెగుళ్ళ సమీకృత యాజమాన్యం (ఐ పి ఎం): ప్రధాన అంశాలు

ఐ పి ఎం లోని ప్రధానాంశాలు

తెగుళ్ళను నిర్మూలించడానికి, లేదా వాటివల్ల ఆర్ధిక నష్టం కలుగకుండా నివారించడానికి పొలంలో ఎప్పటికప్పుడు తీసుకునే చర్యలను సాంప్రదాయిక పద్ధతి అంటారు. వివిధ సాంప్రదాయిక పద్ధతులను, ఈ క్రింది విధంగా వర్గీకరించడం జరిగింది.

  • మొక్కల అవశేషాలను తొలగించడం, కాలువ గట్లను సరిచేయడం, భూసార నిర్వహణ, వేసవి దుక్కులవంటి వివిధ చర్యల ద్వారా, తెగుళ్ళ వివిధ దశలను నివారించి, నారుమళ్ళను, పొలాన్ని తెగులు సోకకుండా కాపాడుకోవడం. సక్రమమైన నీటిపారుదల వ్యవస్ధలో పొలంలో ఏర్పాటు చేయడం.
  • రసాయనిక ఎరువులను ఏ మోతాదులో వాడాలో నిర్ధారించుకోవడంకోసం, భూమిలోని పోషక పదార్ధాల లోపాన్ని పరీక్షించి, తెలుసుకోవడం
  • విత్తనాలను నాటే ముందు తెగులు సోకకుండా, ధ్రువీకరింపబడిన, పరిశుభ్రమైన విత్తనాలను ఎంపికచేసుకోవడం, ఆ విత్తనాలను శిలీంధ్రనాశిని, జీవ క్రిమిసంహారకాలతో శుద్ధిచేయడం
  • కొంతవరకు, తెగుళ్ళను తట్టుకుని నిలిచే, విత్తన రకాలను ఎంపికచేసుకోవడం వలన అవి తెగుళ్ళను అణచి వేయడంలో ముఖ్యభూమిక ను పొషిస్తాయి.
  • తెగుళ్ళు విజృంభించే కాలం తప్పిపోయేవిధంగా, విత్తనాలు వేసే సమయాన్ని, పంటకోత సమయాన్నితగినట్టు మార్చుకోవడం
  • తెగుళ్ళకు ఆశ్రయమివ్వని పంటలతో, పంటమార్పిడి పాటించడం. భూమి ద్వారా సోకే తెగుళ్ళ నివారణకు ఇది తోడ్పడుతుంది.
  • మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి, తెగుళ్ళకు లోబడకుండా వుండడానికి వీలుగా, మొక్కకు - మొక్కకు మధ్య తగినంత ఎడం పాటించడం
  • ఎరువులను తగినంతగా వాడడం. పశువుల ఎరువు , జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం
  • చాలా కాలం పాటు నేలలో తేమ ఎక్కువగా వుంటే, తెగుళ్ళు, ముఖ్యంగా, నేలద్వారా సంక్రమించ వచ్చే తెగుళ్ళు వృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల, నీటి నిర్వహణ సరిగా వుండాలి. (అంటే, పొలంలో నీరు నిలువకుండా, పొలాన్ని తడపడం, ఎండనివ్వడం ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తుండాలి).
  • కలుపు నివారణ నిర్వహణ సరిగా వుండాలి. చాలా కలుపు మొక్కలు, సూక్ష్మ పోషకాలను తీసుకోవడంలో పంట మొక్కలతో పోటీ పడడమే కాకుండా, తెగుళ్ళకు ఆశ్రయమిస్తాయనేది కూడా జగమెరిగిన సత్యం.
  • తెల్ల నల్లి, పచ్చ నల్లి వంటి పురుగులను పట్టుకోవడానికి, జిగురుపూసిన పసుపురంగు పళ్ళాలను, పందిరికంటె బాగా ఎక్కువ ఎత్తులో అమర్చాలి
  • సమన్వయంతో, కలసికట్టుగా విత్తడం. అంటే, ఎక్కువ విస్తీర్ణంలో, ఒకేసారి, సామూహికంగా విత్తడం అన్నమాట. ఇలాకాకుండా , చుట్టుపక్కల వివిధ దశలలోని పంటవుంటే, చీడపురుగుల తెగులు హాని కలిగించే స్ధాయిలో ఉన్నట్లేతే సంఖ్య త్వరత్వరగా మొత్తం విస్తీర్ణం పై పెరిగిపోతుంది. ఈ రకమైన సామూహిక విత్తన కార్యక్రమం వల్ల, తెగులు నివారణ చర్యలను తీసుకోవడం కూడా సులభమవుతుంది.
  • పొలం సరిహద్దులలోను, పంటచుట్టూ ఎర పంటలను వేయడం. ఒక్కొక్క రకం తెగులు లేదా చీడపురుగులు ప్రత్యేకంగా కొన్ని పంటలకు ఎక్కువగా సోకుతాయి. ఈ పంటలను ఆ తెగుళ్ళకు ఎర పంటలు అంటారు. పొలం సరిహద్దులలో అలాంటి పంటలు వేయడంవల్ల, అక్కడ పెరిగే చీడపురుగులను వాటి సహజ శత్రుకీటకాలు ప్రకృతి సిద్ధంగా చంపివేస్తాయి. లేదా పురుగుమందులతో చంపివేయవచ్చు, లేదా ఆ పంటపైనే పెరగనిచ్చి అదుపు చేయవచ్చు.
  • తెగులు సోకిన ప్రాంతంలో, మొక్కలకు వేరు శుద్ధి ( రూట్ డిప్) నారు శుద్ధి చేపట్టడం
  • వీలునుబట్టి అంతర పంటలు, లేదా అనేక పంటలు వేయడం. ప్రతి తెగులు అన్ని పంటలకూ సోకదు. కొన్ని పంటలు, కొన్ని తెగుళ్ళను సోకనివ్వవు. అందువల్ల మనం, తెగులు ఇష్టపడే ప్రధాన పంటను తెగులుకు దూరం చేసి, తెగులుసోకడాన్ని నివారించవచ్చు.
  • పంటను వీలున్నంతగా నేలకు సమాన మట్టంలో కత్తిరించాలి. ఇలాచేయడం ఎందుకంటే, వివిధ పెరుగుదల దశలలోని చీడపురుగులు, తెగుళ్ళు, వ్యాధికారక క్రిములు ఈ మొక్కల భాగాలలో వుండిపోయి, తర్వాతవేసే పంటలకు సోకే ప్రమాదం వుంటుంది. అందువల్ల, మొక్కను ఎంతగా నేలమట్టానికి కత్తిరిస్తే, కొత్తపంటకు తెగుళ్ళుసోకే ప్రమాదాన్ని, అంతగా తగ్గించవచ్చు.
  • మొక్కలను నేల ద్వారా సోకే తెగుళ్ళబారినుంచి సంరక్షించడంకోసం, నాట్లువేయడానికి ముందుగా నారుమొక్కలపై శిలీంధ్ర నాశిని ద్రావణాలను లేదా జీవ రసాయనాలను చల్లడమో లేదా, మొక్కలవేళ్ళను ఈ ద్రావణాలలో ముంచడమో చేయాలి.
  • పండ్ల చెట్ల కొమ్మల కత్తిరింపు చేపట్టి, దట్టంగా అల్లుకున్న / ఎండిన / విరిగిన / తెగులుసోకిన కొమ్మలను తొలగించి, వాటిని నాశనం చేయాలి. అలాకాకుండా, పొలంలోనే వాటిని కుప్పగా వేస్తే, అవి తెగుళ్ళ వ్యాప్తికి కారణంగా మారవచ్చు.
  • కొమ్మను కత్తిరించడంలో, చెట్టు ఎక్కువగా కోతకు గురైతే, ఆ గాట్లు తెగుళ్ళకు లేదా వ్యాధికారక క్రిములకు ఆశ్రయంగా మారవచ్చు. అవి అలా మారకుండా, ఆ గాట్లపై బోర్డెక్స్ ద్రావణాన్నో, లేపనాన్నో పూయాలి.
  • ఎక్కువ పిందెలు వేయడంకోసం, పండ్ల తోటలలో, పుప్పొడి ని అందించే మొక్కలను, కావలసిన పరిమాణంలో పెంచాలి. పొలంలో తేనెపట్టులను పెంచడం, తగినంత పుప్పొడిని ఇచ్చే ప్రత్యేక మొక్కల పూలగుత్తులను పొలంలో అక్కడక్కడా వుంచడం వల్ల, పరాగ సంపర్కం చక్కగా జరిగి, పిందెలు ఎక్కువగా వేస్తాయి.
యాంత్రిక పద్ధతులు
  • సాధ్యమైనంతగా, పెద్ద సంఖ్యలో ఉన్న గుడ్ల లార్వా , ప్యూపా (కోశస్థ), దశలలోని, రోగకారక క్రిములను, ఎదిగిన క్రిములను, తెగులుసోకిన మొక్క భాగాలను తొలగించి, నాశనం చేయాలి.
  • పొలంలో, వెదురుతో, పక్షుల పంజరాలను, పక్షి గూళ్ళను ఏర్పాటుచేసి, తెగుళ్ళ జాతులు వృద్ధి చెందకుండ కాపాడడానికి గుడ్ల సమూహాలను వుంచడంవల్ల, వాటిలో సహజ శత్రు కీటకాలు పెరగడానికి వీలవుతుంది.
  • దీపం ఎరలు(లైట్ ట్రాప్)లను ఉపయోగించడం; ఎరలలో చిక్కుకున్న కీటకాలను నాశనం చేయడం
  • ఆకులను తినే లార్వాను, ఆకుల దొన్నెలో పెరిగే లార్వాను తాడుతో తరిమివేయడం
  • పొలంలో అవసరమైన చోట్ల, పక్షులకు బెదురుకలిగించే గడ్డి బొమ్మలు మొదలైనవి (బర్డ్ స్కేరర్స్) పెట్టడం.
  • రోగకారక క్రిములను, వాటి గుడ్లు, లార్వా, ప్యూపాలను అవి ఎదగని దశలలోనే పక్షులు తినడానికి వీలుగా, పొలంలో, అవి వాలడానికి అనువైన ఏర్పాట్లు (బర్డ్ పెర్చెస్) చేయడం.
  • చీడపురుగులు జతకూడడాన్ని నివారించడానికి, తెగుళ్ల స్థాయిని గమనించడానికి, సామూహికంగా ఎరలలో పడడానికి వీలుగా, ఫెరమోన్ ఎరలను ఉపయోగించడం.
వంశపారంపర్య (జెనెటిక్) పద్ధతులు

చెప్పుకోదగిన దిగుబడులు సాధించగలిగి, తెగుళ్ళను తట్టుకుని నిలిచే / తెగుళ్ళను సహించగలిగే పంట జాతులను (వంగడాలను) ఎంపికచేసుకోవడం.

నియంత్రణ పద్ధతులు

తెగులు సోకిన విత్తనాలను లేదా మొక్కలను, వాటి భాగాలను దేశంలోకి రానివ్వకుండా, దేశంలోనే ఒకచోటినుంచి మరొకచోటికి రవాణా చేయకుండా నివారించే ప్రభుత్వ నిబంధనలను అమలుచేయడం ఈ కోవలోకి వస్తుంది. వీటిని వెలి పద్ధతులంటారు. ఇవి రెండు రకాలు: దేశీయమైన వెలి, విదేశీ వెలి

జీవ పద్ధతులు

జీవ పద్ధతుల ద్వారా, తెగుళ్ళకు మూలమైన చీడపురుగుల, క్రిముల జీవ నియంత్రణ, ఐ పి ఎం విధానంలో చాలా ముఖ్యమైన అంశం. స్థూలంగా చెప్పాలంటే, జీవ నియంత్రణ అంటే, పంటలను నష్టపరిచే జీవులను (తెగుళ్ళను) అదుపుచేయడానికి, మరికొన్ని రకాల జీవులను ప్రయోగించడం.

జీవ నియంత్రణ జీవులలో కొన్ని:

పరాన్న జీవులు (పారాసైటాయిడ్స్)

ఇవి, తాము ఆశ్రయించుకున్న క్రిమికీటకాల శరీరంలో లేదా, శరీరం పైన గుడ్లుపెట్టి, అక్కడే పెరిగి పెద్దవవుతాయి (తమ జీవన చక్రాన్ని పూర్తిచేసుకుంటాయి). ఈ పరిణామ క్రమంలో, ఆ క్రిమికీటకాలు చనిపోతాయి. ఆశ్రయమిచ్చిన క్రిమి కీటాకాల శరీరంలో లేదా శరీరం పైన ఇవి దశలవారీగా పెరిగే తీరునుబట్టి, ఈ పరాన్న జీవులు అనేక రకాలు. ఉదాహరణకు: గుడ్డు పరాన్నజీవి, లార్వా పరాన్నజీవి, ప్యూపా (కోశస్థ) పరాన్నజీవి, ఎదిగిన పరాన్న సూక్ష్మజీవి, గుడ్డు - కోశస్థ పరాన్నజీవి, కోశస్థ-ప్యూపా పరాన్నజీవి .
ఈ సూక్ష్మ జీవులకు ఉదాహరణలు: ట్రైకోగ్రామా, అపాంటలిస్ , బ్రేకన్ , చెలోనస్, బ్రకమేరియా, సూడో గొనోటోపస్ మొదలైనవి. ( ఇవి ముఖ్యంగా, వివిధ జాతుల కందిరీగ, గండుచీమ రకానికి చెందిన కీటకాలు)

ఇతర జీవులను తినే జీవులు (ప్రిడేటర్స్)

ఇవి ఇతర జీవులను తిని బతికే జీవులు. వివిధ జాతులకు చెందిన సాలెపురుగులు, తూనీగలు, మిడతలు, ఆరుద్ర పురుగులు, గొల్లభామ పురుగులు, పక్షులు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

పాథోజెన్స్ (వ్యాధి కారక సూక్ష్మజీవులు)

ఇవి ఏ జీవికి సోకితే వాటిలో వ్యాధులను కలిగించి, క్రమేణా వాటి చావుకు మూలమవుతాయి. వీటిలో ముఖ్యమైనవి బూజు , పుట్టగొడుగులు మొదలైనవి, (ఫంగి); వైరస్ కలిగించే సూక్ష్మ జీవులు ; బాక్టీరియా . కాగా, కొన్ని రకాల నెమటోడ్స్ వంటివి, కొన్ని చీడపురుగులలో వ్యాధిని కలిగిస్తాయి.
ఫంగైకి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు :
హిర్సుటెల్ల , బియోవేరియా, నోమ్యూరే, మెటారిజియం
వైరస్ లకు కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు :
న్యూక్లియర్ పోలి హెడ్రాసిస్ వైరస్ (ఎన్ వి పి), గ్రాన్యులోసిస్ వైరస్
బ్యాక్టీరియా కు కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు : బేసిల్లస్ తురింగిన్సిస్ (భి టి) , బి. పొపిల్లే

జీవ నియంత్రణ పద్ధతులు

తెగుళ్ళను నిర్మూలించే బయో ఏజెంట్‌లను (సూక్ష్మజీవులను) ప్రయోగశాలలలో, తక్కువ ఖర్చుతో గుంపులు గుంపులుగా ఉత్పత్తిచేయవచ్చు. ఇవి ద్రవరూపంలోనో లేదా పొడి రూపంలోనో ఉత్పత్తి చేయవచ్చు. వీటిని జీవ రసాయనిక పురుగు మందులు (బయో పెస్టిసైడ్స్) అంటారు. సాధారణమైన రసాయనిక పురుగుమందుల మాదిరే, వీటిని చల్లవచ్చు. జీవ నియంత్రణకు సంబంధించిన వివిధ పద్ధతులను ఈ క్రిందివిధంగా, వర్గీకరించారు:-

ప్రవేశం

ఈ పద్ధతిలో, తాను అశ్రయించుకున్న తెగులును క్షీణింపజేసేవిధంగా, దానిపై కుదురుకునే ఒక కొత్త జాతి బయో ఏజెంట్‌ను, అక్కడ ప్రవేశపెడతారు. ఆ బయో ఏజెంట్ సామర్ధ్యాన్ని ప్రయోగశాలలో క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్ర పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వీటిని ప్రవేశపెడతారు.

సంఖ్య పెంచడం

ఈ పద్ధతిలో ఆ ప్రదేశంలో అప్పటికే వున్న, సహజ శత్రువుల సంఖ్యను అధికం చేస్తారు. ప్రయోగశాలలో ఉత్పత్తిచేసిన లేదా పొలాలలో సేకరించిన బయో ఏజెంట్లను వదలడం ద్వారా , అవి అధిక సంఖ్యలో ఆ ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా చూస్తారు. ఆ ప్రదేశంలోని చీడపురుగులను అణచివేయడానికి అవసరమైన సంఖ్యలో ఒకే జాతి బయో ఏజెంట్లను వదులుతారు.

సంరక్షణ

జీవ నియంత్రణ ప్రక్రియలో, ఇది చాలా ముఖ్యమైన అంశం. చీడలను అదుపుచేయడంలో ఇది చాలా ప్రముఖపాత్ర వహిస్తుంది. ఈ ప్రక్రియ కారణంగా, ప్రకృతిలోని సహజ శత్రు కీటకాలు చనిపోకుండా శ్రద్ధ వహిస్తారు. సహజ శత్రువుల సంరక్షణకు అనుసరించే, వివిధ పద్ధతులను ఈ కింద వివరించడం జరిగింది.

  • పరాన్న జీవుల గుడ్లను సేకరించి, వాటిని పక్షులు నిలిచే వెదురు బోనులలో వుంచి, పరాన్న జీవులు అధిక సంఖ్యలో పెరిగి, చీడపురుగుల లార్వాలను నిర్మూలించేలా చూడడం.
  • ఏవి చీడపురుగులో, ఏవి సహజ శత్రు కీటకాలో వేరుచేసి చూడగలిగే అవగాహనను, పొలంలో పురుగు మందులను చల్లేటప్పుడు ఈ సహజ శత్రు కీటకాలకు హానికలగకుండా చల్లి అవగాహనను కలిగించడం
  • రసాయనిక పురుగు మందులను చల్లడమనేది చిట్టచివరి ప్రయత్నంగా మాత్రమే వుండాలి. అదికూడా, చీడపురుగులు-సహజ శత్రువుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని, ఆర్ధికంగా నష్టదాయకం ( ఇ టి ఎల్ ) కాకుండా కూడా జాగ్రత్త వహించాలి.
  • హానికరమైన పురుగులనే కాకుండా, అనేక రకాల పురుగులను చంపే (బ్రాడ్ స్పెక్ట్రం) రసాయనికాల వాడకానికి స్వస్తిచెప్పాలి.
  • అవసరమైనచోట, అవసరమైనమేరకు, పర్యావరణానికి వీలున్నంత అనుకూలంగావుండే (ఆర్ ఇ ఎఫ్), ఎంపికచేసిన రసాయనిక పురుగుమందులనే వాడాలి.
  • సాధ్యమైనంతవరకు, రసాయనిక పురుగు మందులను , పొలంలో ఎంతమేరకు తెగులు సోకితే, అంతమేర మాత్రమే; మొక్క ఏ భాగంలో తెగులు సోకితే ఆ భాగంలో మాత్రమే (స్ట్రిప్ లేదా స్పాట్ పద్ధతిలో) పిచికారి చేయాలి.
  • తెగుళ్ళు విజృంభించే కాలం తప్పిపోయేవిధంగా, విత్తనాలు వేసే సమయాన్ని, పంటకోత సమయాన్నితగినట్టు మార్చుకోవాలి.
  • ప్రధాన పంటను విత్తక ముందే, చీడపురుగులను ఆకర్షించి పట్టివేయడానికి, సహజ శత్రువులను పెంపొందింపజేయడానికి, ప్రధాన పంటపొలం చుట్టూ ఎర పంటలు వేయాలి.
  • గాల్ మిడ్జ్ తెగులుసోకే ప్రాంతాలలో, వేరు / మొక్క శుద్ధి చర్యలు చేపట్టాలి.
  • మిత్ర కీటకాలను సంరక్షించడంలో, పంట మార్పిడి, అంతర పంటలు వేయడం కూడా ఉపకరిస్తుంది.
  • రసాయనిక పురుగుమందులను వాడాలనుకుంటే, సిఫారసు చేసిన మోతాదులో, సిఫారసుచేసిన సాంద్రత కలిగినవి మాత్రమే వాడాలి.
రసాయనిక పద్ధతులు

చీడపురుగుల సంఖ్యను, పంటకు ఆర్ధికంగా నష్టదాయకంకాని( ఎకనమిక్ త్రెషోల్డ్….ఇ టి ఎల్) స్థాయికి పరిమితం చేయడంలో మిగతా అన్ని పద్ధతులు విఫలమైనపుడు, కేవలం ఆఖరి ప్రయత్నంగా మాత్రమే, రసాయనిక పురుగు మందులను వాడాలి. మిగతా మందులను తట్టుకుని తెగులు నిలవడాన్ని బట్టి, ఇ టి ఎల్ స్థాయినిబట్టి, అవసరానికి అనుగుణంగా, అవసరమైన మేరకు మాత్రమే, రసాయనిక పురుగు మందులను వాడాలి. ఇందువల్ల ఖర్చు పరిమితం కావడమే కాకుండా, తదనంతర సమస్యలుకూడా పరిమిత మవుతాయి. రసాయనిక పురుగు మందుల ద్వారా తెగుళ్ళను నియంత్రించాలనుకుంటే, ఈ క్రింది అంశాలను దృష్టిలో వుంచుకుని, ఏ మందు చల్లాలి, ఎప్పుడు చల్లాలి, ఎక్కడ చల్లాలి, ఎలా చల్లాలి అనే విషయాలపట్ల మనం స్పష్టమైన అవగాహన కలిగి వుండాలి.

  • ఇ టి ఎల్ ను, తెగులు-పంట సంరక్షకాల నిష్పత్తి (పెస్ట్ అండ్ డిఫెండర్ రేషియో) ని పాటించాలి.
  • మిగతావాటితోపోలిస్తే, సురక్షితమైన పురుగు మందులను ఎంచుకోవాలి. ఉదాహరణకు వేప ఉత్పత్తులు, జీవ రసాయనిక పురుగుమందులు.
  • పొలంలో కొద్ది ప్రదేశంలోనే, లేదా అక్కడక్కడ, తెగులుసోకిన మొక్కలు వుంటే, పొలం మొత్తానికి పురుగుమందు స్ప్రే చల్లకూడదు.

కూరగాయల, పండ్ల తోటల సాగు విషయంలో , ఐ పి ఎం పద్ధతులకు మరింత ప్రాధాన్యం వుంది; ఎందుకంటే, మనం వీటిని దాదాపు నేరుగా వినియోగిస్తాం కనుక. ఎక్కువగా విషపూరితమైన, విషపదార్ధాల అవశేషాలను మిగిల్చే పురుగు మందులను ఇష్టం వచ్చినట్టు సిఫారసుచేయకూడదు. వ్యవసాయ ఉత్పత్తులపై పురుగుమందుల ప్రభావం తగ్గేంతవరకు రైతులు వాటిని అమ్మకుండా వుండలేరు. మరింత ఆదాయంపొందడంకోసం రైతులు, పంటనుకోసిన వెంటనే మార్కెట్‌కు తరలించడం సర్వసాధారణం. ఈ కారణంగా, పురుగుమందులు విషప్రభావంచూపడం, దీర్ఘకాలికమైన ప్రభావం చూపడం, కొన్ని సందర్భాలలో ఆఖరుకు మరణాలు సంభవించడంకూడా జరుగుతున్నది.
అందువల్ల, పంటపొలాలలో, తెగుళ్ళ నివారణ చర్యలుచేపట్టడంలో,మనం మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం.

బెండ లో వ్యూహాత్మకమైన సమగ్ర సస్య రక్షణకై విధానం

అనేక రకాల కూరగాయ పంటలలో బెండ పంట మనదేశంలో విస్తారంగా పండించబడుచున్నది. ఈ పంటను కీటకాలు,తెగుల్లు,నులి పురుగులు ఆశ్రయించుట పెరిగినందువలన ఎంతో కొంత దిగుబడి తగ్గుచున్నది.ఈ మొక్క మెత్తగా,నున్నగా ఉండుట వలన మరియు తేమ ప్రదేశాలలో పండించుట వలన బెండ పంటను ఎక్కువ చీడ, పీడలు ఆశ్రయించుట జరుగుచున్నది. దీని వలన 35-40 శాతం దిగుబడి తగ్గిపోతున్నది.

పురుగు మందుల వాడకం ఎక్కువ వలన కలిగే సమస్యలు

దిగుబడి తగ్గటానికి కారణమైన చీడ, పీడలను నిరోధించడానికి ఎక్కువ మొత్తంలో పురుగు మందులను ఉపయోగించుట జరుగుచున్నది.

  • అతి తక్కువ వ్యవధిలో కోసే కూరగాయ పంటలు పురుగుమందుల అవశేషాలు ఎక్కువ నిల్వ ఉంచుకుంటాయి.,కనుక వినియోగదారులకు అవి విషతుల్యంగా మారే అవకాశముంది.
  • ఎక్కువగా క్రిమిసంహారక పురుగుమందులు వాడడం వలన పురుగులు ఈ మందులను తట్టుకొనే నిరోధక శక్తి పెంపొందించుకొవటంతో బాటుగా వాతావరణ కాలుష్యం,అవశేషాల ఆధిక్యత ఎక్కువగు చుండును
కీలకమైన చీడ, పీడలు

దీపపు పురుగులు :

చిన్న,పెద్ద పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండును ఇవి ఆసయించిన ఆకులు పసుపు పచ్చగా మారి,ముడుచుకొని పోవును. ఇవి ఎక్కువ సంఖ్యలో ఆశ్రయించుట వలన ఆకులు ఇటుక రంగు లోనికి మారును.

మొవ్వు మరియు కాయతొలుచు పురుగు :

 

పైరు తొలిదశలో గొంగళిపురుగు చిగురు కొమ్మలలోకి రంధ్రము చేసికొనిపోయి లోపలి పధార్థాన్ని తినివేస్తూ ఉంటుంది.దీని వలన కొమ్మలు ఎండి,వాడి పోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. తరువాత గొంగళి పురుగు కాయలలోకి రంధ్రాలు చేసి లోపలి గుజ్జును తినుట వలన కాయలు వంకర టింకరగా మారి అమ్మకానికి పనికిరావు.

 

ఎర్ర నల్లి :

గొంగళి పురుగులు,పిల్ల పురుగులు పచ్చ ఎరుపులో, పెద్ద పురుగులు ఇటుక రంగులో ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చటం వలన ఆకులు మెలికలు తిరిగి, ముడుచుకొనిపోయి,నలిగిపోయి కనిపిస్తాయి.

 

శంఖు/ పల్లాకు తెగులు :

ఆకుల ఈనెలు పసుపు రంగుగా ఉండి మధ్య మధ్య లో పచ్చని కణజాలం ఉంటుంది. తరువాత ఆకు మొత్తం పసుపుపచ్చగా మారుతుంది. ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.

 

నులి పురుగులు :

ఈ పురుగులు చిన్నవిగా ఉండి వేర్లను తినటం వలన వేర్లపై వేరు బుడిపెలు ఎర్పడతాయి.ఇవి ఆశ్రియించిన మొక్కలు ఎత్తు తక్కువగా పెరిగి పేలనంగా, ఆకులు పసుపుపచ్చగా మారును

 

 

సమగ్ర సస్య రక్షణకై వ్యూహాత్మకమైన విధానం

  • శంఖు/ పల్లాకు తెగులు తట్టుకునే రకాలైన మఖమలి,తులసి,అన్నపూర్ణ-1 మరియు సన్-40 మొదలగునవి వర్షాకాలం పంటగా జల్లుకోవాలి.
  • పొలం చుట్టూ మొక్కజొన్న/ జొన్న పంటను కంచెగా వేయడం వలన మొవ్వు మరియు కాయతొలుచు పురుగుల తీవ్రత తగ్గుతుంది.

 

  • పొలంలో అక్కడక్కడ పసుపు రంగు పూసిన రేకులను అమర్చి తెల్లదోమ ఉధృతిని తగ్గించవచ్చు.
  • ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి

 

  • దీపపు పురుగులు,తెల్లదోమ ,ఎర్రనల్లి ,పేనుబంక నివారణ కొరకు 2-3 సార్లు 5 శాతం వేపగింజల కషాయాన్ని క్రిమి సంహారక మందుల పిచికారిల మధ్యలో పిచికారి చేయాలి.దీపపు పురుగులు మొక్కకు 5 కంటే ఎక్కువ ఉంటే ఇమిడక్లోప్రిడ్ 17.8 సెమి లిక్విడ్ 150 మిల్లీ.లీటర్లు హెక్టారుకు పిచికారి చేయాలి. ఇది అన్ని రసం పీల్చుకునే పురుగలను నివారించ గల్గుతుంది.
  • కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు ,ఆకర్షించటానికి ఎకరానికి 2 చొప్పున లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి.
  • మొవ్వు మరియు కాయతొలుచు పురుగుల నివారణకు ట్రైకోగ్రామ చిలొనిస్ బదనికలు హెక్టరుకి లక్ష నుంచి లక్షన్నర వరకు విత్తనాలు జల్లిన 30-35 రోజుల తరువాత వారానికి ఒకసారి చొప్పున 4-5 సార్లు విడుదల చేయాలి.
  • మొవ్వు మరియు కాయతొలుచు పురుగు 5.3 శాతం కాయలను ఆశించిన ఎడల సైపర్ మెత్రిన్ 25 ఈ. సీ 200 గ్రాములు ఎ. ఐ. హెక్టారుకు పిచికారి చేయాలి.
  • శంఖు/ పల్లాకు తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి పారవేయాలి.
  • కాయ తొలుచు పురుగు సొకిన మొవ్వు మరియు కాయలను ఎప్పటికప్పుడు తీసివేసి నాశనం చేయాలి
  • దీపపు పురుగులు,తెల్లదోమ,ఎర్రనల్లి,పేనుబంక,కాయతొలుచు పురుగు నివారణ కొరకు అవసరమైనప్పుడు హెక్టారుకు ఇమిడక్లోప్రిడ్ 17.8 సెమి లిక్విడ్ 150 మిల్లీ.లీటర్లు, సైపర్ మెత్రిన్ 25 ఈ. సీ 200 గ్రాములు, క్వినాల్ ఫాస్ 25 ఈ. సీ. 0.05 శాతం లేదా ప్రాపర్ గైట్ 57 ఇ. సీ. 0.1 శాతం పిచికారి చేయాలి.

చేయ వలసిన పనులు మరియు చేయ కూడని పనులు

చేయ వలసిన పనులు

చేయ కూడని పనులు

  • సకాలంలో విత్తనాలు జల్లుట
  • పరిశుభ్రమైన పొలం.
  • తాజా వేప గింజల కషాయం ఉపయోగించుట.
  • అమ్మకానికి ముందు కాయలను నీటిలో కడుగుట
  • సిఫార్సు చేసిన మోతాదు కంటే పురుగుమందులు ఎక్కువ వాడకూడదు.
  • వరుసగా ఒకే పురుగుమందు వేయకూడదు.
  • పురుగుమందుల మిశ్రమాన్ని వేయకూడదు.
  • కూరగాయలలో విషపూరితమైన మోనోక్రోటోఫోస్ లాంటి క్రిమిసంహారక మందులు వేయకూడదు
  • పురుగుమందులు వేసిన 3-4 రోజుల వరకు ఉత్పత్తిని వాడరాదు.

ఆధారము: Extension leaflet of National Centre for Integrated Pest Management (ICAR) Pusa Campus, New Delhi 110 012

వంగసాగుబడిలో సమగ్ర సస్య రక్షణ పధ్దతులు

అనేక రకాల కూరగాయ పంటలలో వంగ పంట మనదేశంలో విస్తారంగా పండించబడుచున్నది. ఈ పంటను కీటకాలు, తెగుళ్లు, నులి పురుగులు ఆశ్రయించుట పెరిగినందువలన ఎంతో కొంత దిగుబడి తగ్గుచున్నది.ఈ మొక్క మెత్తగా,నున్నగా ఉండుట వలన మరియు తేమ ప్రదేశాలలో పండించుట వలన వంగ పంటను ఎక్కువ చీడపీడలు ఆశించుట జరుగుచున్నది, ఫలితంగా 35-40 శాతం దిగుబడి తగ్గిపోతున్నది.

పురుగు మందుల వాడకం ఎక్కువ వలన కలిగే సమస్యలు

దిగుబడి తగ్గటానికి కారణమైన చీడ, పీడలను అధిగమించడానికి ఎక్కువ మొత్తంలో పురుగు మందులను ఉపయోగించుట జరుగుచున్నది.

  • అతి తక్కువ వ్యవధిలో పండించబడే కూరగాయ పంటలు పురుగుమందుల అవశేషాలు ఎక్కువ నిల్వ ఉంచుకుంటాయి.,కనుక ఇవి వినియోగదారులకు విషతుల్యంగా మారే అవకాశముంది.
  • ఎక్కువగా క్రిమిసంహరక పురుగుమందులు వాడడం వలన ఈ మందులను తట్టుకొనే నిరోధక శక్తి పెంపొందించు కొవటంతో బాటుగా వాతావరణ కాలుష్యం ,అవశేషాల ఆధిక్యత ఎక్కువ ఉంటుంది.
ముఖ్యమైన చీడ,పీడలు

అక్షింతల పురుగు :

పెద్ద పురుగులు లేత పసుపు వర్ణం కలిగి నల్లటి చుక్కలు కలిగిన రెక్కలు కలిగిఉంటాయి. గ్రుడ్లు పసుపు వర్ణం లో మొనదేలి గుంపులు గుంపులుగా ఉంటాయి తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులపైన ఉన్న ఆకుపచ్చ పదార్ధమును గోకి, తిని ఆకులను జల్లెడల మాదిరిగా తయారుచేస్తాయి.

 

పేనుబంక

పిల్ల పురుగులు ,పెద్ద పురుగులు ఆకులనుండి రసాన్ని పీలుస్తాయి.దీని వలన మొక్కలు పసుపు రంగుకు మారి,ఆకారం కోల్పోయి, ఎండిపోతాయి. ఇవి తేనె వంటి పధార్థము విసర్జించుట వలన మసి తెగులు వృద్ధి చెందుతుంది..ఇది కిరణజన్య సంయోగ క్రియను తగ్గిస్తుంది.

 

మొవ్వ మరియు కాయతొలుచు పురుగు :

పైరు తొలిదశలో గొంగలిపురుగు చిగురు కొమ్మలలోకి రంధ్రము చేసికొని పోయి లోపలి పధార్థాన్ని తినడం వల్ల.కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది.దీనివలన కొమ్మలు వాడి ,ఎండిపోతాయి, కృశించపోతాయి.తరువాత గొంగలి పురుగు కాయలలోకి రంధ్రాలు చేసి లోపలి గుజ్జును తినివేస్తూ వుండడం వల్ల అవి తినడానికి పనికిరావు.

ఎర్ర నల్లి :

గొంగళి పురుగులు, పిల్ల పురుగులు,పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగులు ఆశ్రయించిన ఆకులు మెలికలు తిరిగి తరువాత కురచ బారి పోతాయి.

ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు

ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి.తెగులు సోకిన కాయలు కుళ్లిపోతాయి. తరువాత కాయలమీద పాలిపోయిన మచ్చలు ఏర్పడతాయి

వెర్రితల ఆకు :

చాలా చిన్న ఆకులు ఉండటం ప్రధాన లక్షణం.అకుల తొడిమలు పొట్టిగా ఉంటాయి. మొక్కల ఆకులు సన్నగా, నున్నగా, మెత్తగా ఉండి పసుపు రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా కనిపిస్తాయి.. కాయలు అరుదుగా కాస్తాయి.





నులి పురుగులు :

ఈ పురుగు ఆశ్రయించిన మొక్క ప్రధాన లక్షణం వేర్ల పై వేరు బుడిపెలు ఉండడం. ఇవి ఆశయించిన మొక్కలు ఎత్తు తక్కువగా పెరుగుతాయి.




సమగ్ర సస్య నిర్వహణ పద్ధతులు

నారు పెంపకం

  • నీరు నిలవకుండా ఉండటం కోసం ,నారు కుళ్ళు, తెగులు నివారించుటకు ఎల్లప్పుడు 10 సెం. మీ ల ఎత్తైన నారుమళ్లను తయారు చేసుకోవాలి.
  • నారుమళ్లకు 45 గేజీ ల పొలిథీన్ షీట్ కప్పి జూన్ నెలలో మూడు వారాల వరకు సూర్యరశ్మి ద్వారా అధిక వేడిమికి గురిచేయడం వల్ల నేల లోని శిలీంథ్రములు,నులిపురుగులు చాలా వరకు తగ్గించవచ్చను. అయితే అవసరమైనంత తేమ నేలలో ఉండేట్లు చూసుకోవాలి.
  • ౩ కిలోల పశువుల ఎరువుకి 250 గ్రాముల ట్రైకోడర్మ విరిడే కలిపి 7 రోజుల తరువాత ౩ స్క్వేర్. మీటర్ల నారమడిలొ కలపాలి.
  • జులై మొదటి వారంలో సంకరజాతి విత్తన రకం ఎఫ్1-321 నారుమడిలొ విత్తాలి. విత్తేముందు 4 గ్రాముల ట్రైకోడర్మ విరిడేతో కేజీ విత్తనానికి విత్తనశుద్ధి చేయాలి. ఎప్పటికప్పుడు కలుపు తీయాలి. తెగులు సోకిన మొక్కలను నారుమడి నుంచి పీకి వేయాలి.

ముఖ్య పంట

  • ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
  • ఎకరానికి 2-3 చొప్పున పసుపు రంగు పూసిన రేకులను పెట్టి పేనుబంక,తెల్లదోమ, పచ్చదోమను ఆకర్షింపచేయాలి.
  • రసం పీల్చు పురుగుల నివారణకు 2-3 సార్లు 5 శాతం వేప గింజలతో కషాయాన్ని పిచికారి చేయవలెను.
  • వేప గింజల కషాయం పిచికారి వలన కాయతొలుచు పురుగులు ఆశ్రయించడం తగ్గుతుంది. 2 శాతం వేపనూనె పిచికారి చేయడం వలన కాయతొలుచు పురుగు ఆశించటము తగ్గుతుంది. పచ్చదోమ ,ఇతర రసం పీల్చు పురుగులు ఎక్కువ ఉంటే ఇమిడక్లొప్రిడ్ 17.8 సెమి ద్రనాన్ని 150 మిల్లీ.లీటర్ హెక్టారుకు పిచికారి చేయాలి.
  • మొవ్వు మరియు కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు, ఆకర్షించటానికి ఎకరానికి 5 చొప్పున లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి.
  • మొవ్వు మరియు కాయతొలుచు పురుగుల నివారణకు ట్రైకోగ్రామ బదనికలు హెక్టరుకి లక్ష నుంచి లక్షన్నర వరకు వారం వ్యవధిలో 4-5 సార్లు విడుదల చేయాలి.
  • హెక్టారుకు 250 కేజీల వేపపిండిని మొక్కల వరుసలలో విత్తిన 25 ,60 రోజులలో వేయుట వలన నులిపురుగులు, కాయ తొలుచు పురుగులను తగ్గించవచ్చు. ఎక్కువ గాలి, 30 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్నప్పుడు వేపపిండిని వేయకూడదు.
  • తలనత్త ఆశ్రయించిన కొమ్మలను తుంచి నాశనము చేయాలి.పురుగు ఆశ్రయించిన కొమ్మలను, కాయలను తుంచి నాశనము చేయాలి.
  • కాయతొలుచు పురుగు 5 శాతం కాయలను ఆశ్రయించిన ఎడల సైపర్ మెత్రిన్ 25 ఈ. సీ 200 గ్రాములు ఏ. ఐ. లేదా కార్బారిల్ 50 డబ్ల్యూ. పీ. ౩ గ్రాములు లీటరు నీటికి లేదా ఎండోసల్ఫాన్ 35 ఈ. సీ.0.07 శాతం హెక్టారుకి పిచికారి చేయాలి.
  • ఎక్కువ కాలము ఒకే భూమిలో వంగ పంటను పండించుట వలన కాయతొలుచు పురుగు, మాగుడు తెగులు తీవ్రతి ఎక్కువగా ఉండును.
  • అప్పుడప్పుడు అక్షింతల పురుగుల గ్రుడ్ల సముదాయాలను, పిల్ల పురుగులు,పెద్ద పురుగులను ఏరి నాశనము చేయాలి.
  • వెర్రి తెగులు సోకిన మొక్కలను పీకి పారవేయాలి.

 

 

 

 

 

 

చేయ వలసిన పనులు మరియు చేయ కూడని పనులు

చేయ వలసిన పనులు

చేయ కూడని పనులు

  • సకాలంలో విత్తనాలు జల్లుట
  • పరిశుభ్రమైన పొలం.
  • తాజా వేప గింజల కషాయం ఉపయోగించుట.
  • అమ్మకానికి ముందు కాయలను నీటిలో కడుగుట
  • సిఫార్సు చేసిన మోతాదు కంటే పురుగుమందులు ఎక్కువ వాడకూడదు.
  • వరుసగా ఒకే పురుగుమందు వేయకూడదు.
  • పురుగుమందుల మిశ్రమాన్ని వేయకూడదు.
  • కూరగాయలలో విషపూరితమైన మోనోక్రోటోఫోస్ లాంటి క్రిమిసంహారక మందులను వాడకూడదు
  • పురుగుమందులు వేసిన 3-4 రోజుల వరకు ఉత్పత్తిని వాడరాదు.

ఆధారము: Extension leaflet of National Centre for Integrated Pest Management (ICAR) Pusa Campus, New Delhi 110 012

ఆదారము : www.ppqs.gov.in

బిందు సేద్యంతో అరటి కణజాలవర్ధనం

కణజాల వర్ధనం అంటే ఏమిటి ?

నియంత్రించిన పరీక్ష నాళికలో మొక్క పునరుత్పత్తి కొరకు మొక్క భాగాన్ని లేదా, ఏక కణాన్ని లేదా కణ సమూహాన్ని వర్ధనం చేయడాన్ని కణ వర్ధనం అంటారు.

వ్యవసాయ శీతోష్ణస్థితి

అరటి ప్రధానంగా ఉష్ణమండలపు పంట. 13-38 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రత, 75-85గాలి లో తేమ శాతం‌ఉన్నప్పుడు అరటి బాగా పెరుగుతుంది. గ్రేండ్‌ మెన్‌ వంటి అరటి రకాలను భారతదేశంలో సాగు చేయడానికి తేమ గల ఉష్ణ ప్రాంతం నుండి తక్కువ పొడిగాగల ఉప ఉష్ణ మండల ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. 12 డిగ్రీల సెంటిగ్రేడ్‌లోపు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు శీతలం తాకిడి ఉంటుంది . 18 డిగ్రీలసెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అరటి సాధారణ పెరుగుదల ప్రారంభమై 27 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు పూర్తిస్థాయి పెరుగుదలకు చేరుతుంది. తర్వాత పెరుగుదల తగ్గి 38 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉన్నప్పుడు స్థిరపడుతుంది. అధిక ఉష్ణోగ్రతలో కమిలి పోతుంది. అధికమైన గాలుల వేగానికి అంటే గంటకు 80 కిలో మీటర్ల వేగానికి మించి ఉంటే పంట దెబ్బ తింటుంది.

నేల

మురుగు నీటి పారుదల ఉండి ,సారవంతమగు తేమ నేలలు, 6 - 7.5 మధ్యలో పి.హెచ్‌ ఉన్న లోతైన బురద నేలలు అరటి సాగుకి ఆశించదగిన లక్షణాలు. పారుదల సౌకర్యం బాగు లేని, గాలి చొరబడని, పోషక లోపం గల నేలలు అరటి సాగుకి సరిపడవు. ఉప్పు నీటి చెలమలు, సున్నపు రాయి నేలలు సాగుకి సరిపడవు. లోతు తక్కువ గల, ఇసుక అధికంగా గల, నల్ల రేగడితో మురుగు పారుదల సక్రమంగా లేని ప్రాంతాలు అరటి సాగుకి వినియోగించరాదు.
ఆమ్ల, క్షార తత్త్వాలు ఎక్కువగా లేని, ఎక్కువ నత్రజని సంబంధితమైన అధిక సేంద్రియ పదార్థాలతో, భాస్వర స్థాయి తగినంత ఉండి, ఎక్కువ పొటాష్‌గల నేల అరటి పంటకు బాగుంటుంది.

రకాలు

విభిన్న పరిస్థితులలో, ఉత్పత్తి విధానాలకు అనువుగా భారతీయ అరటి సాగుబడి ఉంటుంది. పెద్ద సంఖ్యలో రకాలను అనేక రకాల అవసరాలకు పరిస్థితులకు తగినట్లుగా ఎంచుకోవాలి. 20 రకాలలో ఉదా|| పొట్టికేవెండిష్‌, రొబుస్టా, మొన్తన్‌, పూవన్‌, నెన్‌డ్రాన్‌, ఎర్రఅరటి, సేఫ్‌డ్‌వెల్చి, బసరాజ్‌, అర్ధపురి, రస్తలి, కర్పూరవల్లి, కర్తలి, గ్రేండ్‌నైన్‌ మొదలగునవి. జీవ సంబంధిత ఒత్తిళ్ళను తట్టుకోగల్గి నాణ్యమైన అరటి గెలలను ఇచ్చే గ్రేండ్‌నైన్‌ రకం బహుళ ఆదరణ పొందింది. విశాలమైన పెడలతో, నిర్దిష్ట దిశగా తిరుగుతూ పెద్ద పరిమాణంలో ఇతర రకాల కన్నా ఎక్కువ కాలం మన్నగల్గేవి, ఏకరీతి సాగులో నాణ్యత గల పండ్లు ఏర్పడతాయి.

నేలని సిద్ధపరచడం

అరటిని నాటే ముందు ధైంచా, లెగ్యుమినాసే మొక్కలు మొదలగు వాటిని నేలలో వేయాలి. 2 నుండి 4 సార్లు, భూమిని దున్ని సరిచేయాలి. ఇనుప ముళ్ళతో కూడిన బరువైన చట్రంతో మట్టి బడ్డలను పగులగొట్టి వ్యవసాయానికి సిద్ధపరచాలి. నేలను తయారుచేయడంలో ఎఫ్‌.వై.ఎమ్‌ (FYM)ను తగిన మోతాదుతో మట్టిలో కలపాలి. సాధారణంగా గుంత పరిమాణం 45సెం.మీ, 45 సెం.మీ, 45 సెం.మీ కావాలి. ఈ గుంతలలో పై మట్టి పొరలో 10 కిలోల ఎఫ్‌.వై.ఎమ్‌ ( బాగా కుళ్ళిన), వేప పిండి చెక్క 250 గ్రాములు మరియు 20 గ్రాముల కాన్బొఫ్యురాన్‌ను వేయాలి. ఇలా సిద్ధం చేసిన గుంతలను సూర్య వికిరణానికి గురయ్యేటట్లు ఉంచాలి. హానికరమైన కీటకాల నుంచి నేల ద్వారా వచ్చే వ్యాధులనుండి కాపాడడమే గాక గాలి చొరబడడానికి వీలుగా తోడ్పడుతుంది. లవణ క్షార స్వభావం గల నేలలో ఆవ్లుత్వం 8 కన్నా ఎక్కువ ఉంటే గుంతలో గల మిశ్రమం సేంద్రియ పదార్థంగా మార్పు చెందుతుంది.

నాటే పదార్థాలు

నాటడానికి వినియోగించే పదార్థాలు.
స్వోర్డ్‌ సక్కర్లు ప్రధాన కాండం నుంచి కొద్ది దూరంలో పాకిన వేరు నుంచి మొలకలేసిన మొలకలు. రమారమి 500-1000గ్రా||బరువును కల్గిన పదార్ధాలతో ఉన్న వాటిని సర్వసాధారణంగా పునరుత్పాదనకు వినియోగిస్తారు. వ్యాధి కారక జీవులు, నిమటోడ్లు సాధారణంగా సక్కర్లపై ప్రభావం చూపిస్తాయి. సక్కర్ల వయస్సు, పరిమాణంలోని మార్పుల వలన ఏకరీతి పంటగా కాక పోవడం వలన దీర్ఘకాలంగా కొనసాగి పంట చేతి కందడం ఆలస్యం అవడం వలన నిర్వహణ కష్టమౌతుంది.
కాబట్టి గాజువంటి పారదర్శక పరికరంలో ఉత్పత్తి చేసిన అంటు మొక్కలు ఉదా|| కణ వర్ధనంతో వచ్చిన నారు వేయాలి. రోగ నిరోధకతకల్గి, ఆరోగ్యవంతమైన ఏకరీతిగా పెరిగే స్వచ్చమైనమొక్కలు, దృఢమైన ద్వితీయ మొలకలు మాత్రమే నాటుటకు వినియోగించాలి.

కణ వర్ధన నారు యొక్క ప్రయోజనాలు

  • తల్లి మొక్క నుంచి వచ్చిన మొక్కను బాగా పెంచవచ్చు.
  • వ్యాధులు , తెగుళ్లు రాని మొలకలు వస్తాయి.
  • ఏకరీతి పెరుగుదలవల్ల (ప్రామాణికంగా) అరటి దిగుబడి పెరుగుతుంది.
  • పల్లపు ప్రాంతాలు గల్గిన భారత దేశంవంటి దేశాలలో అధిక మొత్తంలో నేల వినియోగం చెంది, ముందస్తుగనే పంట కాపుకి వస్తుంది. మొలకలు లభించే అవకాశాన్నిబట్టి సంవత్సరం పొడుగునా నాటవచ్చు.
  • కోసినపంట వేర్ల నుంచి పుట్టే మొలకలను వేసి వెనువెంటనే రెండుసార్లుగా తక్కువ కాలంలోనే అతి తక్కువ ఖర్చుతో అరటి సాగును చేయవచ్చు.
  • ఫల సాయం నిలకడగా ఉంటుంది.
  • అరటి మొక్కలకు 95-98 శాతం వరకు గెలలు ఏర్పడతాయి.
  • తక్కువ కాల వ్యవధిలోనే గణనీయంగా కొత్త రకాలను ప్రవేశ పెట్టవచ్చు.
నాటే సమయం

అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద తప్ప కణవర్ధనం చెందిన అరటి మొక్కలను సంవత్సరం పొడుగునా నాటుకోవచ్చు. బిందు సేద్య సౌకర్యం ముఖ్యమైనది. మృగశిర కార్తె (ఖరీఫ్‌) జూన్‌ - జూలై నెలలు, కన్నా (రబీ) అక్టోబర్‌ నెలలు భారతదేశంలోని మహారాష్ట్రకు అనుకూలమైన ఋతువులు.

వ్యవసాయ క్షేత్రం

సాంప్రదాయికంగా అరటి సాగుచేసే రైతులు 1.5మీ X 1.5మీ దూరం తో అధికసాంద్రత ఉండేట్లుగా అరటిసాగుబడి చేసినప్పటికి సూర్యరశ్మి సోకేరీతివల్ల పెరుగుదల, దిగుబడి తగ్గుతోంది. వివిధరకాల కృషి ద్వారా ఆర్‌ అండ్‌ డి పరిశోధనా భీవుత్త వ్యవసాయంతో జైన్‌ నీటి పారుదల విధానంతో గ్రాండ్‌నైన్‌ రకాన్నిసాగు చేయవచ్చు. 1.82 మీ, 1.52 మీ దూరంలో సాగు చేయాలని సూచించడంతో ఎకరానికి 1452 మొక్కలను (హెక్టార్‌ కి 3630 మొక్కలు) పెంచవచ్చు. ఉత్తర దక్షిణ దిశలో, వరుసల మధ్య దూరం 1.82 మీ|| ఉండేటట్లు చూడాలి. తేమ అధికంగాను, 5-7 సెం||మీ||అల్ప ఉష్ణోగ్రతగల ఉత్తరభారతం, కోస్తాతీర ప్రాంతంలో మధ్య దూరం 2.1మీ||, 1.5మీ|| తగ్గకుండా నాటాలి.

గ్రాండ్‌ నైన్‌ రకపు వ్యవసాయ క్షేత్రం

నాటే పద్ధతి

వేరు తొడుగునకు భంగం కల్గిం చకుండా మొక్క నుండి బహుళ కోశాలను విడదీసిన తర్వాత నేలలో 2 సెంటీ మీటర్లకు దిగువున మిధ్యాపాదం ఉండేటట్లు గుంతలను తీసి మొక్కలను నాటాలి. మొక్కలను లోతుగా నాటకుండా నాటిన మొక్కల చుట్టూ మట్టిని వదులుగా కప్పాలి.

నీటి నిర్వహణ

అరటి నీటిని కోరుకునే మొక్క. నీటి పరిమాణం పెరిగిన కొద్దీ ఉత్పాదకత ఎక్కువ అవుతుంది. కాని అధిక నీటిని తొలగించే సామర్ధ్యం అరటి వేర్లకు తక్కువగా ఉంటుంది. భారత దేశపు వాతావర ణానికి అనుకూలంగా బిందు సేద్యపు విధానం చలిఆయినదిగ ప్రోత్సహించడం జరిగింది.
అరటి సాగుకి వార్షికంగా 2000మీటర్ల నీరు అవసరమౌతుంది.
బిందు నీటి సేద్యంతో, తడిపిన ఎండుగడ్డి, ఆకుల ఎరువుతో కప్పిన వేళ్లతో కూడిన సాంకేతికతను ఉపయోగించి నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచడం వల్ల 56శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా 23-32 శాతం పంట దిగుబడి పెరుగుతుంది.
నాటిన తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలి. క్షేత్ర సామర్ధ్యాన్ని బట్టి నీటిని అందించాలి. అధిక నీటి వలన మట్టిలోని సూక్ష్మరంధ్రాలలోని గాలి తొలగింపబడి వేరు ప్రాంతంలో నీరు నిలిచి ఉండడం వల్ల మొక్క దెబ్బతింటుంది. పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అరటి సాగుకి నీరందించడంలో బిందు సేద్యం అత్యావ స్యకతం .

మాసం (ఖరీఫ్‌)

పరిమాణం (ఎల్‌ పిడి)

మాసం (రబీ)

పరిమాణం (ఎల్‌పిడి )

జూన్‌

06

అక్టోబర్‌

04 -06

జూలై

05

న వంబ ర్‌

04

ఆగస్టు

06

డిశంబర్‌

04

సెప్టెంబర్‌

08

జనవరి

06

అక్టోబర్‌

10-12

ఫిబ్రవరి

08-10

నవంబర్‌

10

మా ర్చి

10-12

డిశంబర్‌

10

ఏప్రిల్‌

16-18

జనవరి

10

మే

18-20

ఫిబ్రవరి

12

జూన్‌

12

మార్చి

16-18

జూలై

12

ఏప్రిల్‌

20-22

ఆగస్టు

14

మే

25-30

సెప్టెంబర్‌

14-16

ఎరువులు

ద్రవ రూపంలో ఎరువుల వాడకం
అరటికి పెద్ద మొత్తంలో పోషకాలు కావాలి. తరచుగా నేల నుండి పోషకాలు తీసుకుంటాయి. భారతదేశం యావత్తును దృష్టిలో పెట్టుకుని పోషకావసరాన్ని గురించి చేసిన కృషి ఫలితంగా ఒక మొక్కకు 20కిలో గ్రాముల ఎఫ్‌.వై.ఎమ్‌., 200 గ్రాముల నైట్రోజన్‌; 60-70 గ్రాముల భాస్వరం; 300 గ్రాముల పొటాషియం కావాలని గుర్తించారు. ప్రతి మెట్రిక్‌ టన్ను దిగుబడికి 7-8 కిలోగ్రాముల నైట్రోజన్‌, 0.7-1.5 కిలో గ్రాముల భాస్వరం మరియు 17 - 20 కిలో గ్రాముల పొటాషియం కావాలి. అందించిన పోషకాలకు అరటి చురుకుగా స్పందిస్తుంది. రైతులు సాంప్రదాయికంగా ఎక్కువ యూరియాను, భాస్వరం, పొటాషియమ్‌ను తక్కువగా వినియోగిస్తున్నారు.
సాంప్రదాయిక ఎరువులతో నష్టపోయిన పోషకాలను వడపోత ద్వారా శుద్ది చేసినప్పుడు ఆవిరైన నత్రజని, ఆవిరితో పోగొట్టుకున్న భాస్వరం మరియు నేలలో స్థిరీకరింప బడిన పొటాషియమ్‌ను నీటిలో కరగించిన లేదా ద్రవ రూపంలో ఎరువులను బిందు సేద్యంతో అందించడాన్ని ప్రోత్సహించడం. ద్రవ రూప ఎరువుల వాడకం వల్ల 25-30 శాతం వరకు దిగుబడిలో పెరుగుదలను గమనించవచ్చు. ఇంకను శ్రమ, సమయము ఆదా కావడమే కాక పోషకాలు ఏకరీతిగా పంపిణీ అవుతాయి.

వినియోగంలో నియమిత కాల వివరణ

గ్రేండ్‌నైన్‌ రకపు కణవర్ధనమునకు ఘన, ద్రవ రూప ఎరువుల వాడకములో నియమిత కాల వివరణ పట్టిక, కింద ఇవ్వబడింది.

గ్రేండ్‌నైన్‌ అరటికి ఘన రూప ఎరువుల వాడకంలో నియమితకాల వివరణ పట్టిక

సంపూర్ణ పోషకాల ఆవశ్యకత

భాస్వరం 60-70 గ్రా/మొక్క

పొటాష్‌ - 300 గ్రా/మొక్క

ఎకరానికి పూర్తి పరిమాణంలో కావలసిన ఎరువు(మొక్కకు మొక్కకు మధ్య ఖాళీ 1.8మీ X 1.5మీ; 1452మొక్కలు)

యూరియా(నత్రజని)

సెంగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ ఎస్‌.ఎస్‌.పి (భాస్వరం)

మూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎమ్‌.ఒ.పి (పొటాషియం)

431.0

375.0

500గ్రా/మొక్క

625.0

545.0

726 కి.గ్రా/ఎకరానికి

 

వినియోగ కాలం

మూలం

పరిమాణం(గ్రాములు/మొక్కకు

నాటే సమయంలో

ఎస్‌ .ఎస్‌.పి.

100

ఎమ్‌.ఒ .పి.

50

నాటిన 10వరోజుకి

యూరియా

25

నాటిన 30వరోజుకి

యూరియా

25

ఎస్‌ .ఎస్‌.పి.

100

ఎమ్‌.ఒ.పి.

50

సూ క్ష్మ పో షకాలు

25

మెగ్నీషియమ్‌ సల్ఫేట్‌

25

గంధకం

10

నాటిన 60వ రోజుకి

యూరియా

50

ఎస్‌.ఎస్‌.పి.

100

ఎమ్‌.ఒ.పి.

50

నాటిన90వరోజుకి

యూరియా

65

ఎస్‌.ఎస్‌.పి.

100

ఎమ్‌.ఒ.పి.

50

సూక్ష్మపోషకాలు

25

గంధకం

30

మెగ్నీషియమ్‌ సల్ఫేట్‌()

25

నాటిన 120వరోజుకి

యూరియా

65

ఎమ్‌.ఒ.పి.

100

నాటిన150వ రోజుకి

యూరియా

65

ఎమ్‌.ఒ.పి.

100

నాటిన180వరోజుకి

యూరియా

30

ఎమ్‌.ఒ.పి.

60

నాటిన 210వరోజుకి

యూరియా

30

ఎమ్‌.ఒ.పి

60

నాటిన 240వరోజుకి

యూరియా

30

ఎమ్‌.ఒ.పి.

60

నాటిన270వరోజుకి

యూరియా

30

ఎమ్‌.ఒ.పి.

60

నాటిన300రోజుకి

యూరియా

30

ఎమ్‌.ఒ.పి.

60

కాల నిర్ణయ వివరణ, నాటే ఋతువుల మార్పును బట్టి, సారవంతమైన నేలస్థితిని బట్టి (నేల విశ్లేషణ) ఉంటుంది.
&ఎస్‌.ఎస్‌.పి - సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌; ఎమ్‌.ఒ.పి - మూరియేట్‌ ఆఫ్‌ ఫాస్ఫేట్‌.

నీటిలో కరిగే ఘన రూప ఎరువులు

నీటిలో కరిగే ఎరువుల వినియోగంలో నియమిత కాల వివరణ

కాలవ్యవధి

గ్రేడు

ప్రతి 4వ రోజు ఆధారంగా పరిమాణం-1000 మొక్కలకి (కిలో గ్రాములలో)

మొత్తంపరిమాణం
(కిలోగ్రాములలో)

నాటిన65రోజుల వరకు

యూరియా

4.13

82.60

12:61:00

3.00

60.00

00:00:50

5.00

100.00

65నుండి 135రోజులు

యూరియా

6.00

120.00

12:61:00

2.00

40.00

00:00:50

5.00

100.00

135నుండి 165రోజులు

యూరియా

6.50

65.00

00:00:50

6.00

60.00

165నుండి 315రోజులు

యూరియా

3.00

150.00

00:00:50

6.00

300.00

కాల నిర్ణయ వివరణ నాటే ఋతువుల మార్పును బట్టి సారవంతమైన నేల స్థాయిని బట్టి (నేలవిశ్లేషణ) ఉంటుంది. ఇది ఒక సూచన మాత్రమే.

అంతర్వర్ధన కృషి

పైపైన ఉండే వేరు వ్యవస్థ గల అరటి, సాగులో సులభంగా పాడవుతుంది. కావున దీనికి అంతర కృషి పంట యుక్తమైనది కాదు. స్వల్పకాలిక పంటలుగా (45-65రోజులు) పచ్చి ఎరువులుగా పెసలు, లెగ్యుమినాసే, ధైంచా వేయవచ్చు. వైరస్‌లను వ్యాప్తి చేసే కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన మొక్కలను వేయరాదు.

కలుపు తీయడం

గ్లైఫాస్ఫేట్‌ను పూర్తిగా హెక్టారుకి 2లీటర్ల చొప్పున నాటడానికి ముందుగానే వేయడం వల్ల కలుపు లేకుండా ఉంటుంది. ఒకటి రెండు సార్లు కలుపు తీయడం అవసరమౌతుంది.

సూక్ష్మ పోషకాలను మొక్కలలోని అన్ని భాగాలకు చేరేటట్లు వెదజల్లేవిధానం

ZnSo4 ( 0.5 శాతం) , FcSo4 (0.2 శాతం ), CuSo4 (0.2 శాతం)మ రియు H3Bo3 (0.1 శాతం)లను ప్రతిభాగానికి అందే విధంగా ఇచ్చి అరటి బాహ్య, అంతర ధర్మాల లక్షణాలు మరియు దిగుబడి లక్షణాలు మెరుగు పరచవచ్చు. 100 లీటర్ల నీటిలో ఈ సూక్ష్మ పోషకాలు వెదజల్లే ద్రావణాన్ని క్రింది విధంగా తయారుచేయవచ్చు.

జింక్‌ సల్ఫేట్‌

500 గ్రాములు

 

చల్లడానికి ప్రతీ10 లీటర్ల మిశ్రమానికి 5-10 మిల్లీలీటర్ల స్టిక్కరు ద్రావణానికి అంటే టీపోల్‌ కలపాలి.

ఫెర్రోమ్‌ సల్ఫేట్‌

200 గ్రాములు

కాపర్‌ సల్ఫేట్‌

200 గ్రాములు

బోరిక్‌ ఆవ్లుము

100 గ్రాములు

ప్రత్యేక ప్రక్రియలు

ప్రత్యేక ప్రక్రియల ద్వారా అరటి పంట ఉత్పాదకతను, నాణ్యతను పెంచడం

సక్కర్లను తొలగించడం
తల్లి మొక్క మరియు పిలకల మద్య అంతర్గత పోటిని తగ్గించడం కోసం అవసరం లేని పిలకలను తొలగించడం అరటిలో క్లిష్టమైన ప్రక్రియ.
పిలకలను తొలగించడం అనేది కాండం వచ్చేదాక క్రమ బద్దంగా చేయాలి. అయినప్పటికి వేరు నుండి వచ్చే కొత్త మొలకల రెండవ పంట, పుష్పవిన్యాసం వచ్చే అనుసరణ పంటల, మొక్కల మధ్య దూరాన్ని పాటిస్తూ నిర్వహణలో సమర్ధత చూపించాలి. ప్రధాన మొక్కకు ఎడం కాకూడదు.
పుష్పాలను తొలగించడం
కీలాన్ని, పరి పత్రాన్ని తొలగించడం సామాన్యంగా చేయరు. కాబట్టి పండ్ల గెలకు అతికి ఉంటాయి. పంట చేతికి వచ్చిన తర్వాత తొలగించడం వల్ల పండ్లు దెబ్బతింటాయి. పువ్వులు ఏర్పడిన వెంటనే తొలగించడమనే సూచన ఇవ్వడం జరిగింది.
అవసరం లేని ఆకులను తీసి వేయడం
ఆకులు రాసుకుంటూ ఉండడం వల్ల పండ్లు దెబ్బ తింటాయి. ప్రతి సారి గమనించి అలాంటి ఆకులను తీసివేయాలి. పాత ఆకులను, వ్యాధికి గురైన ఆకులను తొలగించాలి. ఆకుపచ్చ ఆకులను తొలగించకూడదు.
మట్టిని పైకి తీయడం
ప్రతి సారి నేలను వదులు చేస్తూ దున్నడం. నాటిన తర్వాత నేలను 3-4 నెలలకొకసారి సరిజేయాలి. అంటే మొక్క వద్ద 10-12 అంగుళాల వరకు మట్టి స్థాయిని పెంచాలి. బిందు నీటికి 2-3 అంగుళాల ఎడంగా పెంచిన మట్టిని ఉండేటట్లు చేయాలి. ఇది గాలి తాకిడికి, ఉత్పత్తికి కొంత మేరకు నష్టం కాకుండా సహాయపడూతుంది.
పురుష మొగ్గలను తొలగించడం
(Denavelling) పురుష మొగ్గలను తొలగించడం వల్ల పండ్ల అభివృద్ధి, గెల బరువు పెరుగుతుంది. గెల చివరి 1-2 చిన్న పెడల నుంచి పురుష మొగ్గలను తొలగించి చివరి పెడలో ఒకే పండు ఉండే లాగ కోయాలి.
గెలపై మందు చల్లడం
క్రిముల బారిన పడకుండా 0.2 శాతం మోనో క్రోటోఫాస్‌ను అన్ని పెడలు ఏర్పడిన గెలపైన జల్లాలి. క్రిముల బారి న పడ్డ పండు పైతొక్క రంగు మారి ఆకర్షణీయంగా ఉండదు.
గెలను కప్పడం
పొడి ఆకులతో గెలను కప్పడం వల్ల మొక్కకు లాభదాయకమే కాక, సూర్యరశ్మి నేరుగా తగలదు. పండ్ల నాణ్యత పెరుగుతుంది. వానాకాలంలో ఈ పద్ధతి చేయకూడదు.
భాగాలను ఆచ్చాదింప చేయడం వల్ల పండ్లను దుమ్మునుండి, జల్లిన పదార్ధ అవక్షేపముల నుండి, కీటకాలు, పక్షుల నుండి రక్షిస్తుంది. నీలి ప్లాస్టిక్‌ స్లీవ్‌లు వాడాలి. దీని వలన గెల చుట్టూ ఉష్ణోగ్రత మెరుగవడంతో బాటు త్వరితంగా పక్వానికి రావడం జరుగుతుంది.
విరుద్ధమైన పెడలను గెల నుంచి తీసి వేయడం
పూర్తిగా ఏర్పడని పెడలు గెలలో ఉంటే నాణ్యత తగ్గుతుంది. గెల ఏర్పడుతున్నప్పుడే వీటిని తీసివేయాలి. ఇతర పెడల బరువు పెంచడానికిది దోహదమవుతుంది. సామాన్య పద్ధతికి విరుద్ధంగా పెరిగే పెడల కు కొద్దిగా పైన ఉన్న పెడను కూడ కొన్నిసార్లు తొలగించాలి.
ఊత నివ్వడం
గెల బరువవడం వల్ల మొక్క సమతుల్యత లేకపోవడం, నాణ్యత ఉత్పాదకత దెబ్బతి ంటుంది. కాబట్టి రెండు వెదురు బొంగులను త్రికోణాకారంగా, వంగుతున్న కాండాలకు ఎదురుగా కట్టాలి. ఇది ఆధారం ఇస్తుంది. గెల ఏకరీతిగా అభివృద్ధి చెందడానికి సహాయపడ్తుంది.

తెగుళ్లు , వ్యాధులు రాకుండా నిర్వహణ

అధిక సంఖ్యలో శిలీంధ్రాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాతో వ్యాధులు, మరియు కీటకాల తెగుళ్లు నిమటోడ్లతో అంటు వ్యాధులు సోకి అరటి ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత తగ్గుతుంది. అరటికి కల్గే ప్రధాన తెగుళ్లు, వ్యాధులతో బాటు నియంత్రణ పద్ధతుల సంగ్రహ వివరాలు క్రి ంద ఇవ్వ బడినవి.

వరుస సంఖ్య పేరు ల క్ష ణా లు ని యం త్ర ణ విధానాలు

తెగులు

1 రైజోమ్‌వీవిల్‌ (కాస్మోపొలైటిస్‌ సోరిడిడస్‌)
(కాండంతొలిచేపురుగు)
అ)పెద్దవలవంటి
గూళ్ళతోఉన్న రైజోమ్‌ మరియు మొక్క బలహీనం అవుతుంది.
అ)ఆరోగ్యకరమైన నాట్లు
ఆ) పరిశుభ్రమైన తోట
ఇ)ప్రౌఢదశ పురుగులను ఆకట్టుకొనేందుకు మిద్యా కాండాన్ని లేదా రైజోమ్‌ ముక్కలను వేయాలి.
మొక్కకు 2 గ్రాముల చొప్పున నేలలోకార్బోఫ్యురాన్‌ కలపాలి.
2 మిధ్యాకాండంపురుగు (సూడొస్టెమ్‌వీవి ల్‌) (ఒడై పోరస్‌లాంగికోలిస్‌) అ)మిధ్యాకాండములో గల సన్నని రంధ్రాలనుండి పారదర్శకమైన జిగురువంటి
ద్రవముఊరుతుంది
అ) రైజోమ్‌వీవిల్‌కి నిర్వహణ విధానం సరిపోలుతుంది.
ఆ) ఆకు ఒరను తొలిచి వేయడం, కుళ్లినట్లుచేయడం ఆ)రెండవది, సున్నపుద్రావణాన్ని ఎక్కించడానికి(150మిల్లీలీ టర్ల ద్రావణాన్ని 350 మిల్లీ లీటర్ల నీటిలో కలిపిన ద్రావణం) కాడానికి ఉపయోగించే గొట్టాన్ని భూస్థాయికి 4 అడు గుల ఎత్తుకి 30 డిగ్రీల కోణంలో వినియోగించాలని సూచించారు.
ఇ) పెడలు రాలి పోవడం చెట్టు మొద్దుపైనున్న తలం లేదా దీర్ఘంగా విడదీసిన (30సెం||మీ పొడవు) హె||కి100 చొప్పున ఏర్పరచి విడదీయబడినభాగం భూమివైపుకి ఉండేట్లుఉంచాలి పురుగులనుపోగుచేసిచంపాలి
3) హాని కల్గించే క్రిములు
(కెంటనఫోట్రిప్స్‌, సైనిపెన్నిస్‌,హీలియోత్రి ప్స్‌కొడాలిఫిలస్‌)
అ)ఏ మొక్కపై దాడిచేస్తాయో దానిభాగాలను ముఖ్యంగా పళ్లను గోధుమరంగులోకి మారుస్తాయి. పుష్పం కింది ఆకువిచ్చుకోక ముందే పుష్పవిన్యాసంపై 0.05 శాతం మోనోక్రోటొఫాస్‌ ను పిచికారితో లోపలికి చిమ్మాలి
4) పండ్లపైమచ్చలుకల్గించేది(బెసిలెఎ్టాసబ్‌కాస్టటమ్‌) అ)ప్రౌఢజీవి అప్పుడే విచ్చుకుంటున్న లేత ఆకులు, పండ్లపైఆశిం చడం వలనవాటిపై మచ్చలు ఏర్పడతాయి ఆరోగ్య రక్షణ కొరకు 0.05 శాతం మోనోక్రోటొఫాస్‌ లేదా 0.1శాతంకార్బైల్‌ను కొత్త ఆకులువచ్చే ముందు మరియు పండ్లు వచ్చేనాటి కి వెంటనే మొక్క ప్రధాన భాగంలో పిచికారి చేయాలి.
ఆ)మొక్కతన బలాన్ని కోల్పోతుంది. నాణ్య మైన గెల రాదు.
5) కుమ్మరి పురుగు జాతులు
(పెంటలోనియాని గ్రొనెర్వస)
మిధ్యాకాండము యొక్క పత్రమూలం దిగువున రోగకారక క్రిములు (బిబిటివి) గుమిగూడి ఉంటాయి. ఏ ఆకులపై ఆశించి ఉన్నయో వాటిపై 0.1శాతం మోనోక్రోటోఫాస్‌ లేదా 0.03 శాతం ఫాస్ఫోనిడాన్ను పిచికారి చేయాలి.
6) దారపుపోగులవంటి క్రిములు (నిమటోడ్లు) అ)ఎదుగుదల లేకపోవ డం అ)నాటేటప్పుడు, నాటిన 4 నెలల తర్వాత మొక్కకు 40 గ్రాముల చొప్పున కార్బఫ్యు రాన్‌ వేయాలి.
ఆ)చిన్న ఆకులు
ఇ)వ్రేళ్లుతెగిపోవడం ఆ) వేపపిండి చెక్కను సేంద్రియ ఎరువుగా వినియోగించాలి.
వ్రేళ్లుహానికరమైన గాఢమైన
ఊదారంగులోకి మారడం,చీలి పోవడం
ఆశించే పంటగా బంతి మొక్క ను వేయాలి.

శిలీంధ్ర వ్యాధులు

7) పనామావిల్ట్‌
(ఫురేరియమ్‌ ఆక్సిస్పోరియమ్‌)
అ)పాత ఆకులు పసుపు రంగులో మారిపోతుంటాయి. అ)లేత ఆకులతో కూడిన వంగడాన్ని సాగు చేయడం (కేవెండిష్‌ సమూహము)
ఆ)ఆకు మొదలు వద్ద వ్యాధికిగురైన ఆకులు వ్రేలాడుతుంటాయి.
ఇ)మిధ్యాకాండం విడిపోవడం చాలా సాధారణం. ఆ)నాటడానికి ముందుగా 0.1శాతం బెవిస్టిన్‌తో సక్కర్లను సంసిద్ధత చెందించాలి.
ఈ)వేరు, భూగర్భ కాండ ం అడ్డుకోతలో ఎరుపు గోధుమ రంగులో రంగు కోల్పోయినట్లు ఉంటుది. ఇ)సేంద్రియ ఎరువుతో బాటు ట్రై కోడెర్మా, సూడో మొనాస్‌ ప్రతిదీప్తులను వాడాలి.
ఈ)పొలంలో అధిక సేంద్రియ ఎరువులను వేసి పారుదల సౌకర్యం కల్పించాలి.
8) మొదలుకుళ్లడం
(ఎర్వీని¸క రోటొవోర)
అ)మొదలు కుళ్లడం, వ్యాధిగ్రస్తమైన ఆకులు ఉండడం. అ)నాటడానికి ఆరోగ్యవంతమైన పదార్ధాలను వినియో గించడం.
ఆ)వ్యాధికిగురైన మొక్కను కుదిపితే మొదలు నుండి ఒరిగిపోతు వేరుతో కూడిన భాగాన్ని నేలలో ఉంచుతుంది. ం.1శాతంఎమిసన్‌తో ఆ)మొక్కలను తడిపి మళ్లీ 3 నెలల తర్వాత తడపాలి.
మొదలుప్రాంతాన్ని తెరిచి చూస్తే పసుపు నుండి ఎరుపులోకి మారే ద్రవము కన్పిస్తుంది. రాతి నేలలు, పొడారిన నేలలలో సాగు చేయరాదు.
9) సిగ తోక ఆకుమచ్చ (మైకోస్పరెల్లా ఎస్‌ .పి .పి) అ)చిన్నగాయాల వంటివి ఆకులపై కన్పి స్తాయి.అవిపాలిపోయిన పసుపురంగు నుంచి ఆకుపచ్చని పసుపులో గల చారలు ఆకుపై, అ డుగుభాగాలపైన చారలు గల లక్షణాలు ఏర్పడతాయి. అ)వ్యాధి సోకిన ఆకులను తొలగించి నశింపచేయాలి.
ఆ)తర్వాత గోధుమ రంగు నుంచి నలుపు రంగుచారలుకన్పిస్తా యి. ఆ)సరియగు మురుగు నీటి సౌకర్యం ఏర్పరచి నీరు నిలిచి పోకుండాచూడాలి.
ఇ)చార మధ్య భాగం పొడారినట్లుగా మారి క్రమంగాకంటిచుక్కవలె కన్పిస్తుంది. ఇ)డైథెన్‌ఎమ్‌-45 (1250గ్రా/హె) లేదా బవిస్టీన్‌ 500గ్రా/హె||కు చల్లాలి.
ఈ)కొన్నిసార్లు ముందస్తుగా పక్వానికి రావడం గమనిస్తాము.

వై ర ల్‌ వ్యాధు లు

1 అరటి గెల మొదలుకు సోకే వైరస్‌ (బి బి టి వి) అ)క్రమరహిత ముదురు ఆకుపచ్చ మోర్స్‌ కోడ్‌ చారలు ద్వితీయ ఈనెలపై లోపలి వైపున ఆకులలో ఏర్పడతాయి. అ)వైరస్‌సోకనినాట్లను (కణవర్ధనం) ఉపయోగించాలి.
ఆ)ఆకుపరిమాణంతగ్గి,అసాధారణంగా నిటారుగా ఉండి , పెళుసు బారుతుంది. ఆ)వ్యాధి సోకిన మొక్కలను వెదికిక్రమంగా నాశనంచెందించాలి.
ఇ) ఆకులు పొట్టిగా మారి ఒకదానితో నొకటి దగ్గరగాచేరి పైభాగాన గుత్తిగా ఉంటాయి. ఇ)రోగకారక కీటకాలను ముఖ్యంగా కుమ్మరి పురుగు( ఎఫిడ్స్‌), నల్లి ( మీలి బ గ్స్‌)ను నియంత్రించాలి.
ఈ)పురుష మొగ్గల పుష్ప పుచ్చాల కొనలు ఆకుపచ్చగా మారిపో తాయి. ఈ)లెక్క లేని హెచ్చింపుతో ఉండే వీటికి అనుక్రమ ణిక ఉండాలి.
ఉ)కుమ్మరిపురుగువంటి(ఎఫిడ్స్‌)వాటిద్వారా వైరసులువ్యాపిస్తాయి. ఉ) వ్యాధి బారి న పడ్డ మొక్కల భాగాలను ఆరో గ్యవంతమైన మొక్కలుగల ప్రాంతానికి చేరనీయకుండా చేయాలి.
ఊ) రోగనిరోధకత గల్గిన మొక్కలను వినియోగించాలి.
ఎ)ఏకాంతర మిశ్రమపంటలు లేదా దగ్గర ప్రాంతాలలో పెరుగుతున్న వాటిని నిరోధించాలి.
2) బనాన మొజాయిక్‌ వైరస్‌ (బి.ఎమ్‌.వి) అ)పలుచని ఆకుపచ్చని చారలు ఈనెల పొడవునా ఏర్పడి, నిర్జీవము కాని మొక్కలోని ఆకుపచ్చని భాగాలు పాలిపోయి ఉంటాయి. అ)వ్యాధి సోకని మొక్కలను వినియోగిస్తూ, వ్యాధి బారిన పడిన మొక్కలను తొలగించాలి. ఉదా||కణవర్ధన నారు
3) బనాన బ్రేక్ట్‌ మొజాయిక్‌ వైరస్‌ (బి బి ఎమ్‌ వి) మిధ్యాకాండం, మధ్య ఈనె, ఆకుకాడ ఆకు పొరలపై కండె ఆకారపు గులాబి రంగు నుండి ఎరుపురంగు లోనికి మారేచారలు కన్పిస్తా యి. అ) వ్యాధి సోకని కణవర్ధన నారు వినియోగం
4) బనాన స్ట్రేక్‌ వైరస్‌ (బి ఎస్‌ వి) అ) అస్పష్టంగా ఆకుప చ్చదనాన్ని కోల్పోయిన నిర్జీవపదార్ధముతో నున్నవి, పసుపు గోధుమ, నల్లనిచారలు, వర్తుల స్తంభాకారంతో గల ఆకులు ఏర్పడడం వల్ల అంతర్గత చీలికతో బాట అంతర్గతంగా నిర్జీవంగా మారి రూపరహిత చిన్నపాటి గెలలు ఏర్పడడం. అ)రోగరహితమొక్క భాగాల (ఉదా||కణవర్ధననారు) వినియోగం.
అరటి ఫల సాయం

అరటి కాపుకివచ్చే కాలంలో బాహ్యంగా పరిపక్వ దశకు చేరుకుంటుంది. పండు సంకట స్థితి నుంచి వినియోగానికి వీలుగా మారుతుంది.
పరిపక్వదశకు సూచన లు
పండు ఆకారం, కోణీయత, శ్రేష్టత, రెండవ రకపు మధ్యస్థ ఆకృతి , పిండి పదార్థాన్ని బట్టి, పువ్వుఏర్పడిన తర్వాత పక్వానికి వచ్చినరోజుల సంఖ్య వంటి సూచికలను ప్రతిపాదించి పక్వతను నిర్ధారిస్తారు. అమ్మకాలు కొనుగోళ్లల్లో ఈ సూచికల ప్రభావంతో నిర్ధారించిన పండ్ల పక్వతను కొద్ది తేడాతో నిర్ణయిస్తారు.
గెలలను కోయడం
రెండవ పెడనుంచి పై వరకు వర్తులంగా పండిన గెలను పదునైన కొడవలితో మొదటి పెడకు 30 సెం||మీ|| పైన కోయాలి. మొదటిది ప్రారంభించిన తర్వాత పక్వానికి రావడానికి 100-110 రోజులు ఆలస్యమవుతుంది.
దెబ్బ తగలకుండా మెత్తతో ఉంచిన తట్టలోగాని, బుట్టలో గాని పండిన గెలను తీసుకుని సేకరణ తావుకి తెస్తారు. పక్వ గెలకు సూర్యరశ్మి తగలకుండా ఉంచడం వల్ల పండ్లుమంచి స్థితిలోకి వస్తాయి.
స్థానిక వాడకానికి గెలల నుంచి పెడలను తీసి చిల్లర వర్తకానికి ఇవ్వడం.
4-16 కట్టలుగా పెడలను కోసి జతలుగా చేసి పొడవు, చుట్టు కొలతలతో శ్రేష్టతనుకొలిచి పెట్టెలో అనేక పొరలతో భద్రపరచి ఎగుమతికి అవసరమగు విధంగా భిన్నమైన బరువు ఎగుమతి కొరకు చేయాలి.
గెల కోసిన తర్వాత చేపట్టే ప్రక్రియ
గెలలనుసేకరించే తావులో దెబ్బతిన్న, బాగా మగ్గిన పండ్లను తీసెయ్యగా మిగిలిన గెల లను, స్థానిక అమ్మకానికి లారీలు, సరుకుల ను మోసుకెళ్లే వాహనాల ద్వారా పంపించాలి. కృత్రిమత్వంగా నాణ్యతను ప్రధానంగా ఎంచుకొని, ఎగుమతి వ్యాపారానికి గెలలలోని పళ్లను తీసి, నీళ్లధారలో కడిగి లేదా సజల సోడియంహైపోక్లోరేట్‌ ద్రావణంలో కడిగి లేటెక్స్‌ను తొలగించి థయో బెండసోల్‌ను కలిపి; గాలి చొరకుండా ముందుగానే పండ్ల పరిమాణంతో శ్రేష్టతను గుర్తించి 14.5 కిలో గ్రాముల సామర్ధ్యాన్ని కల్గిన లేదా కావలసిన విధంగా పొలిథీన్‌ పొరతో వెంటిలేషన్‌ గల్గిన సి.ఎఫ్‌.బి పెట్టెలలో13-15 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ శీతల ఉష్ణోగ్రత , 80-90-శాతం ఆర్‌ .హెచ్‌. ఉండేటట్లు చూడాలి.

దిగుబడి

నాటిన అరటి పంట ఫలసాయానికి రావడానికి 11-12 నెలల కాలం పడుతుంది. వేరు నుండి పుట్టిన కొత్త మొలకల పంట ప్రధాన పంట నుంచి చేతికి రావడానికి 8-10 నెలలు పడుతుంది. రెండవ పంట నుండి రెండవ కొత్త మొలకల పంట ఫల సాయానికి 8-9 నెలలు పడుతుంది.

28-30 నెలల కాల వ్యవధిలో, మూడు పంటలు ఉదా|| కు ప్రధాన పంట రెండు అదనపు పంటలు బిందు నీటి సేద్యంతో బాటు మొత్తం ఆకులపై జల్లడం ద్వారా 100టి / హె|| దిగుబడి కణ జాలవర్ధన సాంకేతికత ద్వారా పొందవచ్చు. వేరు మొలకల ద్వారా చక్కటి నిర్వహణ ద్వారా ఈ విధంగానే పొందవచ్చు.

ఆధారము: జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, జాల్‌గాన్‌

సమగ్ర వ్యవసాయం

రైతు జీవనాధార సుస్థిర - సూచనలు

వ్యవసాయం సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సహకారంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ సమగ్ర వ్యవసాయం - రైతు జీవనాధార సుస్థిర సూచనలు పుస్తకాన్ని విడుదల చేసారు.

ఈ పుస్తకంలో సమగ్ర వ్యవసాయం, ప్రధాన పంటల సాగు - ముఖ్య సూచనలు, మెట్ట సాగులో మెళకువలు, కూరగాయల సాగు, పంటలలో జీవన ఎరువులు, జీవన క్రిమి మరియు చీడ నాశకాలు, సేంద్రియ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ తయారీ, పశువుల పెంపకంలో మెళకువలు, గొర్ర్రెల పెంపకంలో మెళకువలు, పెరటి కోళ్ళ పెంపకం, పశుగ్రాసాల సాగు, అజోల్లా, పశువులకు సంపూర్ణ సమీకృత ఆహారం తయారీ, మన సంపూర్ణ ఆరోగ్యానికి పోశాఖాహారం పాత్ర మొదలగునవి అందుబాటులో ఉంటాయి. పుస్తకాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి...

ఆధారము: ఫార్మర్.గావ్.ఇన్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate