హోమ్ / వ్యవసాయం / మత్స్య సంపద / ఎండా కాలంలో చేపల చెరువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు - అవగాహన
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎండా కాలంలో చేపల చెరువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు - అవగాహన

ఎండా కాలంలో చేపల చెరువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు - అవగాహన.

సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు చేపల, రొయ్యల చెరువులలో అనేక దుష్బ్రరిణామాలు కలిగించి చెరువులో చేపలు, రొయ్యలు చనిపోవడానికి కారణమేతుంది. సమ్మర్ ఫిష్ కిల్స్ తక్కువ లోతు మరియు వృక్ష, జంత ప్లవకాలు, మొక్కలు ఉన్న చెరువులలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తద్వారా రైతులు ఈ వేసవి కాలంలో అంటే మర్చి, ఏప్రిల్, మే, జూన్ కాలంలో చల్ల అప్రమత్తంగా ఉండాలి.

చెరువులలో ప్రాణవాయువు (ఆక్సిజన్) లోపించడం

అధిక ఉష్ణోగ్రతల ద్వారా చెరువులో ప్రాణవాయువు తక్కువ మేతదులో కరుగుతుంది. తద్వారా నీటిలో అధిక సాంద్రతలో పెరుగుతున్న చేపలకు ఆక్సిజన్ అందక చనిపోవడం జరుగుతుంది. అలాగే వేసవి కాలంలో చెరువులలో వృక్ష, జంతుప్లవకాల ద్వారా చెరువును కప్పి ఉంచి (అంటే వేగంగా పెరిగే జీవక్రియల ద్వారా) చెరువు మొత్తం విస్తరించిపోతాయి. చెరువులోని చేపలతో ఆక్సిజన్ కు పోటీ పడతాయి.

అధికంగా నీటి మొక్కలు పెరుగుట

అధిక ఉష్ణోగ్రతల నీటిలోని నీటి మొక్కల (పైటోప్లొమాట్స్) జీవక్రియలను పెంచి, చేపల చెరువు మొత్తం వ్యాప్తి చెందేలా దోహదపడుతాయి.

చేపల, రొయ్యల జీవక్రియలు పెరుగుట

చెరువులో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉన్నప్పుడు చేపలు, రొయ్యల జీవక్రయాలు పెరిగి అధికంగా పెరుగుదలకు తోడ్పడుతాయి. కానీ చెరువులో వేసే దాణా (మేతను) సరియైన మేతదులో చేపలకు అందించాలి. మేతదుకు మించి మేతను చెరువులలో వేసే మేతలో ఉండే అమ్మేనియం, నత్రజని వంటి పోషకాలు చెరువు యెక్క సమతుల్యం దెబ్బతీస్తాయి. అంటే నీటిని విషపూరితంగా మర్చి వేస్తాయి. అలాగే వృక్ష, జంతుప్లవకాలు విపరీతంగా పెరిగి ఆల్గాల్ బ్లుమ్స్ ఏర్పడుతాయి.

ప్లంక్టన్ క్రాష్, (నీటి వృక్ష, జంతుప్లవకాలు చనిపోవడం)

అధిక ఉష్ణోగ్రతల ద్వారా నీటిలో ఉండే ప్లవకాలు విపరీతంగా పెరిగి చనిపోతాయి. ఈ విధంగా చెరువు పై భాగంలో ఒక తెట్టు వలె ఏర్పడి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటాయి. ఈ విధంగా చేపల చెరువులలో ఆక్సిజన్ శినించడం వల్ల చేపలు ఒత్తిడికి గురై మొదటగా పెద్ద చేపలు (మార్కెట్ సైజ్) చనిపోవడం జరుగుతుంది. తద్వారా రైతుకు అధిక నష్టం చేకూరుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు - నివారణ చర్యలు

సాధారణంగా చెరువులో వివిధ కారణాల వల్ల చేపలు, రొయ్యలు చినిపోతుంటాయి. కానీ వేసవి కాలంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒకసారి ట్రయల్ సెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమాణం,  రంగు, టర్బిడిటి, ప్లవకాల సాంద్రతను గమనించుకోవాలి, ఆహారం, మేత వృధా కాకుండా సరియైన మేతదులో చేపల ద్రవ్యరాశిలో నాలుగు శాతంగా ఇవ్వాలి. చెక్ ట్రేలను ఏర్పాటు చేసుకోవాలి. తక్కువలోతు గల చెరువులో నీటిని పంపుల ద్వారా ఏర్పరుచుకోవాలి. నీటి మొక్కలను తొలగించుకోవాలి.

ముఖ్యంగా చెరువులలో ఆక్సిజన్ తగ్గిన సమయంలో చెరువులలో మర పడవలు, తప్పుల ద్వారా చెరువంతా కలియతిరగాలి. సాధ్యమైనంత వరకు పెద్ద మార్కెట్ సైజ్ చేపలను పాశకంగా గని పూర్తిగా గాని చెరువునుండి వేరు చేసి అమ్ముకోవాలి.

వేసవి కాలంలో రైతులు చెరువులోని నీటైమెక్కలను చంపడానికి వివిధ రకాలైన గుల్మానాశకాలను ఉపయేగిస్తారు. వీటి విషపురక కరకం ద్వారా ఒత్తిడిలో ఉన్న చేపలు, రొయ్యలు మరణిస్తాయి. అందుకే కలుపు మొక్కలు బేతికంగా గాని గడ్డి చేపలను చెరువులలో వదులుకోవడం ద్వారా నీటిలో పెరిగే నాచు, గడ్డి మొక్కలను నియంతరించుకోవాలి.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.92452830189
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు