హోమ్ / వ్యవసాయం / మత్స్య సంపద / కార్ప్ చేపలకు వచ్చే వ్యాధులు - నివారణ పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కార్ప్ చేపలకు వచ్చే వ్యాధులు - నివారణ పద్ధతులు

కార్ప్ చేపలకు వచ్చే వ్యాధులు - నివారణ పద్ధతులు.

తెలంగాణ రాష్ట్రంలో కేవలం మంచి నీటి వనరులకు అవకాశం ఉండుటవలన మత్స్య రైతులు మంచి నీటి వనరుల్లో పెంచడానికి అనువైన చేపలు - దేశవాలీ కార్ప్ జాతులైన బంగారు తీగ, వెండి చేప, గడ్డి చేపలను పెంచుతున్నారు. పెరుగుతున్న అవసరాలకు తగినంత సహజ సిద్ధ చేపల ఉత్పత్తి ఇందాకపోవటం చేత, కొరతను పూడ్చుటకు మత్స్య రైతులు చేపల సాగుపై దృష్టి పెడుతున్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహార భద్రతకు అనుగుణంగా నాణ్యమైన మరియు వ్యాధులు కోకాకుండా చేపల సాగు చేయుట వలన అధిక లాభం పొందుటకు సాధ్యమవుతుంది. మంచి నీటికి పెరిగే చేపలకు చాలా రకాల వ్యాధులు సోకె ఆస్కారముంటుంది. ఆ వ్యాధి లక్షణాలను మరియు నివారణ పద్దతుల గురించి అవగాహనా ఉన్నట్లయితే చేపల సాగులో అత్యత్తమ ఫలితాలను పొందవచ్చు. చేపల శరీర ఉష్ణోగ్రత చెరువు నీటి ఉష్ణోగ్రతను బట్టి మారుతుంది. సాదారణంగా శీతాకాలంలో జీవక్రయ రేటు తక్కువగా ఉంటుంది కావున తక్కువ మొత్తంలో చేపలకు ఆహారం అవసరం అవుతుంది. కానీ రైతులు అవగాహనా లేక అధిక ఉత్పత్తిని సాధించటం కొరకు అదనపు ఆహారంగా నూనె తీసిన తాడు, వేరుశనగ చెక్క, ప్రత్తి చెక్క, ప్రొద్దు తిరుగుడు చెక్క మెదలైనవి దాణా రూపంలో ఇస్తున్నారు. దీనితో పాటు చేపల సాంద్రత పెరిగేకొద్దీ, చేపలకు కావలసిన సహజసిద్ధమైన ఆహారము ఉత్పత్తికి సేంద్రియ, రసాయన ఎరువులను మరియు వివిధ రకాల కృత్రిమ దానాలను అధిక మొత్తంలో చేపల చెరువుల్లో ఉపయేగిస్తున్నారు. వీటి వలన చెరువులోని నీరు మరియు మట్టి గుణాలలో గణనీయంగా మార్పు సంభవిస్తుంది. దీనివలన చేపలు ఒత్తిడికిగురై వ్యాధులు సోకడం మరియు వ్యాధులు సోకిన చేపల నివారణకు మందులు వాడటం వలన ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. కావున చేపలతో శీతాకాలంలో వచ్చే వ్యాధులను మరియు ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన ఉన్నట్లయితే చేపల సాగులో అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చు.

చేపలకు వ్యాధి సోకుటకు గల కారణాలు:

 • అధిక సాంద్రతలో చేపలను పెంచటం.
 • చేపలు ఒత్తిడికి గురి కావటం.
 • నీటి గుణాలలో మార్పులు వచ్చుటవలన (నీటిలో కలిగియున్న ఆక్సిజన్ తగ్గడం వలన విషవాయువులు ఎక్కువై నీరు కాలుష్యం అవడం).

చేపలలో శీతాకాలంలో వచ్చే వ్యాధులు

 1. తాటాకు తెగులు (కాలుమనారిస్)
 2. కురుపు / పుండు వ్యాధి
 3. లెర్నియా వ్యాధి
 4. హెల్మందిస్ వ్యాధులు

తాటాకు తెగులు (కాలుమనారిస్)

ఈ వ్యాధి "ఫ్లేక్సీబాక్టర్ కల్మనారిస్" అనే బ్యాక్టీరియం వలన వస్తుంది. ఇది చేపలలో శీతాకాలంలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా బొచ్చ, శిలావతి చేపలకు సోకుతుంది. శరీరం, తల రెక్కల పైన తెలుపు, బూడిద రంగు మచ్చలు  ఏర్పడతాయి. తర్వాత దశలో మెప్పాల కణజాలం రక్తహీనమై తెలుగు లేక ఎండిన తాటాకు రంగు చారలు ఏర్పడతాయి. అందువల్లనే దీన్ని "తాటాకు తెగులు" అంటారు. ఈ వ్యాధి ప్రత్యకించి రోహుజాతి చేపలకు శీతాకాలంలో ఉధృతంగా సోకుతుంది. ఈ వ్యాధి తక్కువ సమయంలోనే తీవ్ర స్ధాయిలో వ్యాపించే అంటువ్యాధి.

నివారణ : చేపల చెరువులో హెక్టారుకు లీటరు బ్రోమిన్ ద్రావణం (5%) చల్లడం లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం హెక్టారుకు అర లీటరు చల్లాలి. ఇవి లేని యెడల సల్పమైనస్సిజోల్ లేక సల్షాడైజిన్ తో ట్రైమీడియం మిశ్రమంలో ఉన్న యాంటిబయాటిక్ మందులను 8-10 గ్రాములు వంద కిలోల మేతలో కలిపి వరసగా 7-10 రోజుల వరకు వాడాలి.

కురుపులు / పుండువ్యాధి

మంచినీటి చేపలకు సోకే అనేక వ్యాధుల్లో పుండు వ్యాధి అతి భయంకరమైనది. అలాగే ఇది అత్యంత ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ వ్యాధి సోకడం వలన ఎక్కువ మొత్తంలో చేపలు మరణించే అవకాశం ఉంది. ఇది ప్రదాహంగా మంచి నీటి చేపలకు శీతాకాలంలో సోకుతుంది. దీన్ని ఇంగ్లీఘులో పాడిజోరు ఏపీజుటిక్ అల్సరేటన్ సిండ్రోమ్ (ఇ.యు.ఎస్) అని అంటారు. బ్యాక్టీరియా, శిలీముద్రం మరియు వైరస్ ల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి మొదట పరిగెలు, జల్లచేపలు, మట్టగుడిసెలు, కొర్రమీను, ఇంగిలాలు వంటి రకాల చేపలకు సోకుతుంది. ఫలితంగా ఈ చేపలు పుండు వ్యాధితో చనిపోవడం జరిగుతోంది. ఆ తర్వాత పెంపల చేపలైన బొచ్చ, శిలావతి, మేసు, గద్దిచేప, బంగారు తీగ మొదలగు వాటికీ సోకుతుంది. ఈ వ్యాధి తొలి దశలో చేపలు శరీరంపై అక్కడక్కడా బూడిద రంగు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు ఏర్పడిన భాగంలో పొలుసులు ఊడిపోయి చర్మం ఉబ్బి, చిన్న కురుపులు ఏర్పడతాయి. క్రమంగా కురుపులు పెద్దవై కండరాలు కుళ్ళి లోతైన పుండ్లుగా మారి రక్తం కారుతోంది. అలాగే ఈ పుండ్లు పై తెల్లని దూదివలె శిలీముద్రం కూడా పెరుగుతుంది. దీనిని పుండు ముదిరిన దశ అంటారు. ఈ వ్యాధిని తొలి దశలోనే నివారించుకోవాలి. ముదిరిన దశ చాలా ప్రమాదకరమైనది.

నివారణ : చెరువు నీటిలో వ్యాధిని తగ్గించడానికి సాధారణ ఉప్పును హెక్టారుకు 70-100 కిలోలు ద్రావణంగా చేసి చెరువంతా సమానంగా పడేట్లు చల్లాలి. నీటి నాణ్యత లోపించిన చెరువులలో పుండు వ్యాధి త్వరగాను, ఉద్రుతంగాను సోకుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గించడానికి (వాటర్ శానిటైజర్స్) నీటి పరిశుద్ధ రసాయనాలైన అయిడిన్, బ్రోమిన్, గ్లుటారాల్డిహైడ్ ను హెక్టారు నీటి విస్తీర్ణంలో అర లీటరు నుండి లీటరు వరకు చెరువు నీటిలో చల్లాలి.

లెర్నియా వ్యాధి

లెర్నియా బాహ్యపరాన్న జివి. దీనిని సాధారణంగా లంగరు పురుగు లేదా యాంకర్ వార్మ్ అని పిలుస్తారు. ఈ పరాన్న జివి పుడక ఆకారంలో ఉండి 5 నుండి 20 మీ.మీ. పొడవు ఉంటుంది. ఈ పరాన్న జివి తల భాగం లంగరు మాదిరిగా చేప శరీరంలో చొచ్చుకొని పోయి అక్కడ కండరాలలో స్ధిరపడి కణజాలమును తినివేస్తూ ఉంటుంది. ఈ పరాన్న జివి జీవితకాలంలో 1000 నుండి 1500 వందల గ్రుడ్లను పెడుతుంది. శీతాకాలంలో ఈ వ్యాధి ఉదృతంగా ఉండి ఎక్కువగా చేపపిల్లలకి సోకుతుంది.

నివారణ : మలాథియాన్ ఒక హెక్టారుకు 75 నుండి 100 మీ.లి. నీటిలో చల్లాలి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వడం వలన ఈ వ్వాధి నివారించవచ్చును.

హెల్మందిస్ వ్యాధులు

ఇవి గైరోదకథెలాస్, దక్తేలోగైరాస్ వంటి బాహ్యపరాన్న జీవుల వల్ల కలుగజేయును. ఈ పరాన్న జీవులు చేపల చర్మం పైన, మెప్పులలోను జీవిస్తాయి. వీటి సంఖ్య అధికమైనప్పుడు అధిక జిగురు (మ్యూకస్) స్రవించబడి చేపలకు అవసరమైన ప్రాణవాయువు అందక ఇబ్బందులు వస్తాయి. ఫలితంగా చేపలు, అధిక సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వ్యాధి శీతాకాలంలో ఎక్కువగా తక్కువగా తీసుకుంటాయి. ఇవి శంఖువులో కణజాలాన్ని తిని వేస్తాయి. కావున వీటిని శంఖు జలగలు అంటారు.

నివారణ:

 • మేతలో ఉప్పు 50-75 కిలోల వరకు టన్ను మేతకి వారం రోజుల పాటు ఇవ్వడం డేట్లమైత్రిన్ ద్రావణం 80-100 మీ.లి. చల్లాలి.
 • వీలైనంత వరకు చెరువులో పెరుకుపోయిన సేంద్రియ పదార్ధాలను తొలిగించాలి.

వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • చెరువు నీటిలోతు శీతాకాలంలో 4 అడుగులు, వేసవి కాలంలో 5 అడుగులు తగ్గకుండా రైతులు చూసుకోవాలి.
 • రైతులు ఎప్పటికప్పుడు చేపల ఆరోగ్యానికి, నీటి గుణాన్ని (నీటి రంగు, పి.హెచ్. మరియు ఆక్సిజన్) జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
 • పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మాత్రమే వాడాలి. వీలైనంత వరకు మేత వృధా కాకుండా చర్యలు తీసుకోవాలి.
 • వీలైతే నీటి మార్పిడి చేసుకోవాలి లేదా నీటిని కరల్రతో చెరువంతా కదలికలు చేయాలి. దీని వల్ల కొంత వరకు వాటికీ ప్రాణ వాయువు లభిస్తుంది.
 • వ్యాధి కారక జీవులను వాహకాలుగా పనిచేసే నత్తలు, కప్పలు, పశులు మొదలగు వాటిని వీలైనంతవరకు నిర్ములించాలి.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.16666666667
Manikrishna Aug 27, 2019 03:18 PM

Sir pdf uploade

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు