অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కార్ప్ జాతి మంచినీటి చేపల పెంపకం (చెరువులలో నీటి కుంటలలో చేపల పెంపకం)

కార్ప్ జాతి మంచినీటి చేపల పెంపకం (చెరువులలో నీటి కుంటలలో చేపల పెంపకం)

వాణిజ్య స్థాయిలో పెంచే కార్ప్ చేపజాతి రకాలు

భారతదేశంలో చేపల పెంపకంలో కార్ప్ జాతి చేపలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. మనదేశంలో చేపల పెంపకం ద్వారా జరిగే మొత్తం ఉత్పత్తిలో 85 % ఈ కార్ప్ కల్చర్ చేపలదే. మూడు ప్రధాన దేశీయ రకాలైన కట్ల, రోహు, మృగాల్ మంచినీటి చేపలతోపాటు, విదేశీ రకాలైన సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్, కామన్ కార్ప్ ఈ కోవకు చెందుతాయి.

కడచిన మూడు దశాబ్దాలలో చేపట్టిన సాంకేతిక ప్రక్రియలవల్ల, మనదేశంలో నీటి కుంటలు, చేపల చెరువులలో చేపల సాలుసరి సగటు ఉత్పత్తి, హెక్టారుకు దాదాపు 600 కిలోల నుంచి హెక్టారుకు 2000 కిలోల స్థాయికి పైగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఎందరో రైతులు, పారిశ్రామికవేత్తలుహెక్టారుకు ఏడాదికి 6-8 టన్నుల స్థాయి అధిక దిగుబడులు కూడా సాధిస్తున్నారు. చేపల జాతులు, నీటి వనరులు, ఎరువుల అందుబాటు, దాణా నిల్వలతో పాటు రైతుల పెట్టుబడి స్థాయిలకు అనుగుణంగా, కార్ప్ చేపల పెంపకం విషయంలో మనదేశంలో వివిధ రకాల మిశ్రమ పద్ధతులు అమలులోకి వచ్చాయి. చేపల పెంపకం ఇతర వ్యవసాయ పద్ధతులతో ఎంతో సమన్వయం కలిగివుండడమే కాకుండా, సేంద్రియ వ్యర్ధ పదార్థాల పునర్వినియోగ సామర్ధ్యం కూడా కలిగి వుంది .

కార్ప్ పోలీ కల్చర్ (వివిధ ప్రక్రియలతో కూడిన పెంపక విధానాలు)

భారత్ లో, కార్ప్ పోలీ కల్చర్ లో భాగంగా ఆవుపేడ, కోళ్ళ విసర్జితాలవంటి సేంద్రియ వ్యర్ధపదార్థాలను భారీఎత్తున వినియోగిస్తున్నారు. కేవలం సేంద్రియ ఎరువులు, సేంద్రియేతర ఎరువులను ఉపయోగించడంద్వారానేహెక్టారుకు

ఏడాదికి 1-3 టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుంది . తగిన దాణాను అందించడంవల్ల చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది ; ఇటు దాణా, అటు ఎరువుల విషయంలో అనువైన మిశ్రమ పద్ధతులు పాటించి,హెక్టారుకు ఏడాదికి 4-8 టన్నుల ఉత్పత్తి కూడా సాధిస్తున్నారు. పరిశోధన కేంద్రంలో రూపొందించిన మిశ్రమ పెంపకం పద్ధతులను పాటించి,మనదేశంలోని అనేక ప్రాంతాలలో , 0.04 నుంచి 10హెక్టా ర్ల విస్తీర్ణం, 1 నుంచి 4 మీటర్లలోతు వరకు రకరకాల పరిమాణాల నీటికుంటలలో , వివిధ స్థాయిలలో ఉత్పత్తి సాధిస్తున్నారు. చిన్న నీటికుంటలు, లోతు తక్కువగా వుండే నిల్వనీటి కుంటలలో చేపల ఎదుగుదలను దెబ్బతీసే ఎన్నో సమస్యలు ఎదురుకావడం సర్వసాధారణం ; అయితే, నిర్వహణపరంగా పెద్ద నీటికుంటలు, లోతైన కుంటలకు కూడా వాటి సమస్యలు వాటికి వున్నాయి. 0.4హెక్టారుకు నుంచి 1.0హెక్టారుకు విస్తీర్ణం, 2 నుంచి 3 మీటర్లలోతు కలిగిన నీటి కుంటలను నిర్వహణపరంగా అత్యుత్తమమైనవిగా గుర్తించారు. పరిసర వాతావరణపరంగా, జీవ శాస్త్ర పరంగా కార్ప్ పోలీ కల్చర్‌లో అనుసరించే యాజమాన్య పద్ధతులు మూడు దశలుగా విభజించవచ్చు. అవి నీటి కుంటలలో చేపలు వదలడానికి ముందు, వదిలే సమయంలో, వదిలిన తర్వాత తీసుకోవలసిన చర్యలు.

చేపలు వదలడానికి ముందు చేపల చెరువును సిద్ధం చేయడం

చేపల చెరువును సిద్ధంచేయడం అంటే, ఆ చెరువులో వదిలే చేపలలో అధికశాతం చేపలు బతికి, బాగా ఎదిగి, అధికోత్పత్తి సాధించగలిగే విధంగా; ఆ చెరువులో కలుపు రకాల చేపలు , పరాన్నజీవులు లేకుండా చూడడం; చేపలకు తగినంతగా సహజసిద్ధమైన ఆహారం లభించేలా చూడడం. ఆ నీటిలోని కలుపు చేపలను, వుండకూడని జీవ పదార్ధాలను తొలగించడం ; నేల, నీటి నాణ్యతను పెంచడం అనేవి ఈ దశలో చెరువు నిర్వహణకు సంబంధించి చేపట్టవలసిన ముఖ్యాంశాలు. చేపలను తినే ఇతర చేపలను, కలుపు చేపలను నియంత్రించడానికి సంబంధించిన వివరాలను నర్సరీ యాజమాన్యం విభాగంలో చర్చించడం జరిగింది.

చెరువులు, కుంటలలో చేపలను వదలడం

తగిన పరిమాణంలో వుండే చిరుచేపలను( చేప విత్తనాలను-ఫిష్ సీడ్), కొత్త ఆవాసానికి అలవాటుపడేవిధంగా, వాటికి అనుకూలవాతావరణాన్ని కల్పించిన తర్వాత, ముందుగానే సిద్ధంచేసుకున్న చెరువులో / కుంటలో వదలాలి. అధిక దిగుబడి రావాలంటే, చేప పిల్లల సైజు, మరియు సంఖ్య ముఖ్యమైన అంశాలు. చేపల పెంపకం కోసం ప్రత్యేకించిన చెరువులు / కుంటలలో 100 మిల్లీ మీటర్ల పైగా పరిమాణం కలిగిన చిరుచేపలను వదలాలని సిఫారసు చేయడం జరిగింది.ఇంతకంటె తక్కువ సైజువున్న చేపలను వదిలితే, పెంపకం మొదటి నెలలలో ఎక్కువచేపలు చనిపోవడానికి, పెరుగుదల తగ్గడానికి ఆస్కారం వుంది. పాలీ కల్చర్ విధానాన్ని అనుసరించే చెరువులు / కుంటలలో 50-100 గ్రాముల సైజు చేపలను వదలడం మేలు. ఈ సైజు చేపలలో 90 % వరకు బతుకుతాయి, వాటి ఎదుగుదలకూడా బాగా వుంటుంది. కార్ప్‌పాలీ కల్చర్‌లో సాధారణంగా, ఒకహెక్టారుకు విస్తీర్ణంగల చెరువులో 5,000 చిరుచేపలను వదులుతారు. దీనిద్వారా, ఏడాదికి 3-5 టన్నుల చేపల దిగుబడి వస్తుంది. ఒకహెక్టారుకు , ఏడాదికి 5-8 టన్నుల దిగుబడికోసం 8,000-10,000 చిరుచేపలను వదలవలసి వుంటుంది. 10-15 టన్నుల దిగుబడి రావాలంటే, 15,000 నుంచి 25,000 చిరుచేపలు అవసరమవుతాయి. కార్ప్ పాలీ కల్చర్‌లో , ఒక చెరువులోని వివిధ తలాలమధ్య అనగా పైభాగాన వుండే ఉపరితల జలాలు, మధ్య భాగంలోని జలాలు, అడుగున వుండే జలాలు మధ్య చేపపిల్లలకు ఆహారం విషయంలో ఏర్పడే పోటీని దృష్టిలో వుంచుకుని, వివిధ జాతుల చేపపిల్లలను తగిన నిష్పత్తిలో వదలవలసి వుంటుంది. చెరువులోని వివిధ ప్రదేశాలలో లభ్యమయ్యే ఆహారం సక్రమంగా ఉపయోగపడడానికి వీలుగా, చెరువునీటిలోని వివిధ తలాలలో తిరుగాడే రెండు లేదా మరిన్ని జాతుల చేపలను వదలాలి. మన దేశంలో కార్ప్ పాలీ కల్చర్ చేపల పెంపకం విషయంలో, కట్ల, సిల్వర్ కార్ప్, రోహు , గ్రాస్ కార్ప్ , మృగాల్ , కామన్ కార్ప్ అనే ఆరు జాతులను కలగలిపి పెంచడం ఆచరణీయమైన మిశ్రమంగా రుజువైంది. అయితే, ఏఏ జాతుల చేపల మిశ్రమాన్ని ఉపయోగించాలనేది చాలావరకు ఆయా జాతుల చిరుచేపల లభ్యతనుబట్టి, ఆ జాతి చేపలకు మార్కెట్లో వుండే డిమాండ్‌నుబట్టి నిర్ణయించుకోవలసి వుంటుంది. ఈ ఆరు జాతులలో; కట్ల, సిల్వర్ కార్ప్ చెరువునీటి పైభాగంలోని (ఉపరితల) ఆహారాన్ని తినేవి; రోహుజాతి చెరువులో నిలువుగా పెరిగే లేదా వుండే ఆహారాన్ని తీసుకుంటుంది, గ్రాస్ కార్ప్ ఎక్కువగా చెరువులోని గడ్డి, ఆకు అలము మీదనే ఆధారపడే రకంకాగా; మృగాల్, కామన్ కార్ప్ జాతిచేపలు చెరువు అడుగుభాగంలోని ఆహారంపై ఆధారపడతాయి. చెరువునుంచి ఆశించే ఉత్పత్తినిబట్టి, సాధారణంగా, ఉపరితల ఆహార జీవులైన కట్ల, సిల్వర్ కార్ప్ రకాలను 30-40 % , మధ్యభాగంలోని ఆహారాన్ని తినే రోహు , గ్రాస్ కార్ప్ రకాలను 30-35 % , చెరువు అడుగుభాగంలోని ఆహారంపై ఆధారపడే మృగాల్ , కామన్ కార్ప్ రకాలను 30-40 % కలగలిపి పెంచుతారు. (పెంచాలి)

చిరుచేపలను వదిలిన తర్వాత చెరువు నిర్వహణ

చెరువు సారాన్ని పెంచడం : చెరువు అడుగునవుండే మట్టిలోని పోషకాల స్థాయినిబట్టి చేపల చెరువులను మూడు రకాలుగా పేర్కొనవచ్చు. కార్ప్ రకాల చేపలను పెంచే చెరువుల సారాన్ని పెంచడానికి సిఫారసుచేసిన పద్ధతులు ఇవీ: చెరువులో చేపలను వదలడానికి 15 రోజులముందు, మొదటి విడతగా, మొత్తం సేంద్రియ ఎరువులో 20-25 % వేయాలి. మిగతా ఎరువును సమాన భాగాలుగా రెండునెలలకొకసారి వేయాలి. కోళ్ల, బాతుల విసర్జితాలు, పంది పెంట , రోజూ ఇంటిలో వచ్చే మురుగు మొదలైనవి సాధారణంగా వినియోగించే సేంద్రియ ఎరువులు. నత్రజనిని స్థిరీకరించే అజోలా అనే ఫెర్న్ జాతి మొక్కను చేపల పెంపకంలో వాడతగిన జీవ రసాయనిక ఎరువుగా నిర్ధారించారు. కార్ప్ కల్చర్‌కు అవసరమయ్యే మొత్తం పోషకాలను ( 100 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 90 కిలోల పొటాషియం , 1,500 కిలోల సేంద్రియ పదార్ధాలు ) దృష్టిలో వుంచుకుని, ఒక హెక్టేరు విస్తీర్ణంగల చెరువులో ఏడాదికి 40 టన్నుల అజోలా వాడాలని నిర్ధారించారు . నీటిలో కుళ్లిన ఈ పదార్ధాలు కార్ప్ చేపలకు, రొయ్యలకు ఆహారంగా ఉపయోగపడాతాయి. జీవపదార్ధాలతోకూడిన సేంద్రియ ఎరువును, బయోగ్యాస్ తయారీలో మిగిలే పదార్ధాన్ని కార్ప్ కల్చర్‌లో ఉపయోగించదగిన ఎరువుగా నిర్ధారించారు. వీటిని హెక్టేరుకు ఏడాదికి 30-45 టన్నుల మేరకు వుపయోగించవలసి వుంటుంది. తక్కువ ఆక్సిజన్‌ను వినియోగించుకుని, పోషకాలను వేగంగా విడగొట్టడం వీటివల్ల చేకూరే నిర్దిష్ట ప్రయోజనం.

పోషక పదార్ధం

తక్కువ ఉత్పత్తి

మధ్యరకం ఉత్పత్తి

ఎక్కువ ఉత్పత్తి

సేంద్రియ కర్బనం ( %)

0.5 - 1.5

1.5

> 2.5

లభ్యమయ్యే నత్రజని
(100 గ్రాముల భూసారం /
మిల్లీ గ్రాములు)

25-50

50- 75

>75

లభ్యమయ్యే భాస్వరం
(100 గ్రాముల భూసారం /
మిల్లీ గ్రాములు)

<3

3-6

>6

సిఫారసుచేసిన ఎరువుల పరిమాణాలు

ఆవు పేడ
(హెక్టారుకు / ఏడాదికి/ టన్నులు)

20

15

10

నత్రజని / యూరియా
(హెక్టారుకు / ఏడాదికి / కిలోలు)

150 న
(322 యూ)

100 న
(218 యూ)

50 న
(104 యూ)

భాస్వరం / ఎస్ ఎస్ పి
(హెక్టారుకు / ఏడాదికి / కిలోలు)

75 భా
(470 ఎస్)

50 భా
310(ఎస్)

25 భా
( 235 ఎస్)

అదనపు ఆహారం : కార్ప్ కల్చర్‌లో సాధారణంగా, వేరుశనగ / ఆముదం చెక్క , వరి తౌడు మిశ్రమాన్ని మాత్రమే అదనపు లేదా అనుబంధ ఆహారంగా వేయాలన్న నిబంధనను పాటిస్తారు. అయితే, ఇప్పుడు వివిధ రకాల చేపలపెంపకానికి మళ్ళడంతో, మొక్కలు, జంతువులకు సంబంధించిన మాంసకృత్తులు వుండే ఇతర పదార్ధాలనుకూడా జోడిస్తున్నారు. ఆహారంలో ఈ పదార్ధాలన్నిటిని కలగలిపి వుంచడంకోసం వాటిని గుళికలుగా మారుస్తారు. నీరు నిలకడగా వుండడానికి, ఆహారం వ్యర్ధం కాకుండా నివారించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. గ్రాస్ కార్ప్స్‌కు ఆహారంగా, చెరువులో ఎంపికచేసిన మూలలలో , కొన్ని గొట్టాలు మొదలైనవాటిలో హైడ్రిల్లా, నజాస్, సెరటోఫైలం , డక్ వీడ్స్ వంటి నీటి మొక్కలను పెంచుతారు. నీటి ఉపరితలంపైన పెరిగే మొక్కలు, నేలపై పెరిగే గడ్డి, అరటి ఆకులు, కూరగాయల, ఆకుకూరల వ్యర్ధాలనుకూడా వీటికి ఆహారంగా ఉపయోగించవచ్చు. చేపలకు దాణా అందించడానికి సంబంధించి, దాణా మిశ్రమాలను పిండి రూపంలో ట్రేలలోనో , గోనె సంచులలోనో వుంచి, చెరువులోని వివిధ ప్రదేశాలలో వేలాడదీస్తారు.రోజుకు రెండుసార్లు దాణా అందించడం మంచిది.ఎంత పరిమాణంలో దాణా అందించాలనేది కూడా ముఖ్యమే; ఎందుకంటే, దాణా పరిమాణం తగ్గితే చేపలలో పెరుగుదల క్షీణిస్తుంది,దాణా పరిమాణం ఎక్కువైతే, ఆహారం వ్యర్ధమవుతుంది .చెరువులో చేపలను వదిలిన మొదటి నెలలో, చేపల ప్రాథమిక బరువులో 5 % వంతున దాణా ఇవ్వాలి. ఆ తర్వాతి నెలలలో క్రమంగా తగ్గిస్తూ, ప్రతినెల అంచనావేసిన చేపల బరువుకు అనుగుణంగా, 3-1 % మేరకు దాణా ఇవ్వవలసి వుంటుంది.
చెరువు నీటికి ఆక్సిజన్ అందించడం (ఏరేషన్), నీటిని మార్చడం: చేపల చెరువులు, కుంటలలో, ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచే కార్ప్ కల్చర్ వంటి పద్ధతులలొ, నీటిలో కరిగివున్న ఆక్సిజన్ గాఢతను పెంచడంకోసం యాంత్రాల సహాయంతో ఆక్సిజన్ అందించవచ్చు. పాడిల్ వీల్ ఎరేటర్స్, యస్పిరేటర్ ఎరేటర్స్, సబ్‌మెర్సిబుల్ ఎరేటర్స్ అని ఈ ఆక్సిజన్ అందించే పరికరాలు సాధరణంగా మూడు రకాలు. సమీకృత చేపలపెంపకంలో,హెక్టేరు నీటిచెరువుకు 4-6 ఎరేటర్లు అవసరమవుతాయి.

చేపల ఆరోగ్య సంరక్షణ : చెరువులో వదలడానికి ముందు చిరుచేపలను 15 సెకండ్లపాటు 3-5 % పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలొ వుంచాలి. ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచే ప్రక్రియలలో వ్యాధులు సోకడం సహజమే. చక్కగా నిర్వహించే చెరువులలో చేపలు చనిపోవడం అరుదే అయినప్పటికి, పరాన్న జీవులు సోకి చేపల ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ సమస్యను జాగ్రత్తగా ఎదుర్కోవడం అవసరం.

చేపలు పట్టడం (హార్వెస్టింగ్)

సాధారణంగా, కల్చర్ కాలపరిమితి ముగిసిన తర్వాత, అంటే 10 నెలలనుంచి ఒక ఏడాదిపాటు పెంచిన తర్వాత, చేపలను పడతారు.అయితే, మార్కెట్‌కు తగిన సైజులో పెరిగిన చేపలను ఎప్పటికప్పుడు పట్టడంవల్ల, చెరువులో చేపల సంఖ్య తగ్గి, మిగతా చేపలు చక్కగా పెరగడానికి తగినంత వెసులుబాటు దొరుకుతుంది.

కార్ప్స్ పోలీ కల్చర్ ఆదాయ వ్యయాలు

క్రమ సంఖ్య

అంశం

మొత్తం (రూపాయలలో)

I. ఖర్చు

ఎ. చర విలువ

1.

చెరువు లీజు విలువ

10,000

2.

బ్లీచింగ్ పౌడర్ (10 పిపిఎం క్లోరిన్) / ఇతర టాక్సికెంట్లు

2,500

3.

(8,000) చిరుచేపలు

4,000

4.

సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు

6,000

5.

అదనపు (అనుబంధ) ఆహారం
(వరి తౌడు, వేరుశనగ చెక్క మిశ్రమం) 6 టన్నులు (టన్ను రూ. 7,000 వంతున)

42,000

6.

కూలీలు (చెరువు నిర్వహణకు, చేపలు పట్టడానికి ఒక్కొక్క పనిదినానికి రూ.50 వంతున 150 పనిదినాలకు)

7,500

7.

ఇతర ఖర్చులు

2,000

 

ఉప మొత్తం

74,000

బి. మొత్తం వ్యయం

1

చర వ్యయం

74,000

 

2.

ఆవృత వ్యయంపై వడ్డీ 
అర్ధ సంవత్సరానికి 15 %

5,500

 

మొత్తం వ్యయం

79,550 (80,000)

II.

మొత్తం ఆదాయం (కిలో 30 రూపాయల వంతున 4 టన్నుల చేపల అమ్మకంవల్ల వచ్చే రాబడి)

1,20,000

 

 

III.

నికర ఆదాయం ( మొత్తం ఆదాయం-మొత్తం వ్యయం)

40,450

ఆధారము: మంచినీటి చేపల పెంపకం కేంద్రీయ సంస్థ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్) భువనేశ్వర్ , ఒరిస్సా

మంచి నీటి చేపల మరియు రొయ్యల పెంపకం

చేపల, రొయ్యల పెంపకం విస్తరించడానికి మన దేశంలో ఎన్నో అవకాశాలు వున్నాయి. తీర ప్రాంతం 8,129 కి.మీ. పొడవునా వుంది. ఆక్వా కల్చర్‌కు నదుల సముద్ర సంగమ ప్రాంతం (ఎచ్యూరీస్‌), ఉప్పు భూములు, మడ అడవులు అనుకూలం. ఇదేకాక భూభాగం లో ఆక్వా కల్చర్‌కు అనుకూలమైన ఉప్పు భూములు న్నాయి. వీటిలో జీవవైవిధ్యం ఎక్కువగా వుంది. ఇంత విస్తారంగా సముద్ర తీరప్రాం తం వున్నప్పటికీ మొత్తం చేపల ఉత్పత్తిలో సముద్ర చేపల వేట నుండి లభించేది 41% మాత్రమే. మిగతా చేపలు, రొయ్యలు కృత్రిమంగా పెంచబడుతున్నాయి.

  • అగ్రిస్ నెట్ వారు ప్రతీ సంవత్సరం విడుదల చేసే వ్యవసాయ పంచాంగంను అనుసరించి మంచి నీటి చేపల మరియు రొయ్యల పెంపకం పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రొయ్యల పెంపకంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు మరియు మెళకువల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అగ్రిస్ నెట్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate