অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మంచినీటి చేపల చెరువులో కలుపు మొక్కల నిర్ములన

చేపల చెరువుల యజమాన్యము శాస్త్రీయ సాంకేతిక పరిజనంతో సమయానుకూలంగా నామయస్ఫూర్తితో, నిర్వహించినప్పుడే చేపల దిగుబడి ఉన్నతంగా ఉంటుంది, నీటిలో, నెలలో లభించే పోషక పదార్ధాల అభ్యత, వాటి వివిధ రసాయనిక మార్పులు, చెరువు నీటిలో పెరిగిన మొక్కలు, ప్లవకాలు, చెప్పాలి విసర్జముచే, విడుదలచేసే పదార్ధాల ప్రభావం వలన నిరంతరం చేపల వాతావరణము మార్పు చెందుతుంది. చేపలకు, వృక్ష, జంతు ప్లవకాలు అనువైన జలవాతావరణము కలిగించుటలో నేర్పు, నీటి మార్పు మరియు తగిన యాజమాన్యపు చర్యలు అవసరమౌతాయి. చేపల చెరువులో కలుపు మొక్కలు అల్జేజాతి ఎదగొనియం, క్లామిదోమేనన్, యుగాలైనా ఉన్నప్పుడు పగటి పూత కిరణజన్న సామ్యేగక్రియ ద్వారా ప్రాణవాయువు విడుదలై, రాత్రి పూత విడుదల ఉండదు. రాత్రి సమయాలలో 12 గంటల నుండి ప్రాణవాయువు లభ్యత తగ్గుతూ వచ్చి తెల్లవారుజామున 3-5 గంటల సమయంలో ప్రాణవాయువు 2 పి.పి.యం. లేదా అంతకంటే తక్కువ అయిపోతుంది. ఈ సమయంలో చేపలు ప్రాణవాయువు అందక మరణిస్తాయి లేదా చెరువు నీటి ఉపరితలంలో తిరుగుతాయి. స్పైరోగైరా నాచు మొక్కలు బొచ్చె, శిలావతి వంటి చిరు చేపల శంఖులలో చేరి చేపల శ్వసక్రియను నిర్బంధం చేసి మరిణింపచేస్తాయి.

చేపల చెరువు యజమాన్యము సక్రమంగా నిర్వహించుటకు కలుపు మొక్కల నివారణ

కొత్తగా త్రివ్వకము చేసిన చెరువు నేల పై పెరిగి ఉన్న మొక్కలు, వృషలు, పొదలు, గుల్మాలు వెళ్ళతా సాహసమూలంగా తీసికెయ్యాలి. చేపల చెరువు నిర్మించిన స్ధలం నిట ముంపునకు గిరికబడి, వివిధ నీటి మొక్కలు, కాలువ, తామర, కారా పిచున్చు, మాఘ, జుమ్మా, గుర్రపుడెక్క, హైడ్రిల్లా తదితర జాతులను కలిగి ఉంటే సమూలంగా తొలగించి వేయాలి. నీటి మొక్కల నిర్ములనలతో పాటు దుంపలను కూడా పూర్తిగా తొలిగించి వేయాలి. చేపల పెంపకం చేపట్టే కాలంలో చెరువులో వివిధ రకాల అలాగే, నాచు పెరుగుతాయి. వీటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి.

చేపల చెరువుల్లో నీటి మొక్కలు

  1. నీటి అడుగున జీవించేవి.
  2. నీటిలో తెలియదేవి వివిధ రకాలుగా ఉంటాయి.

చెరువు నీటి అడుగుతలమున జీవించు మొక్కలు చెరువులో నీటి లోతు మూడు అడుగుల కంటే తక్కువ అయినప్పుడు విపరీతంగా పెరిగిపోతాయి. చెరువు నీటిలోతు ఆరు అడుగుల కంటే తక్కువకాకుండా ఉన్నపుడు నీటి అడుగుతలమున జీవించు మొక్కలు పెరగవు. చెరువు నీటిలో తెలియదు మొక్కలు దట్టంగా ఉన్నపుడు చెరువు నీటి లోపల వైపునకు సూర్యరశ్మి తగలక వ్యాధికారక సుషాంజీవిలా వ్యాప్తికి సహకరిస్తాయి. చెరువు నీటిలో తేలియాడే మొక్కలను మానవ (కూలి) సహాయంతో తొలగించి వేయాలి. నీటిలో మునిగి ఉన్న మొక్కలు కలుపు చేపలైన (పుంటియస్) పరిగ, బెదిశ సంతానోత్పత్తికి అనుకల వాతావరణం కలుగజేస్తాయి. కలుపు చేపల వ్యాప్తిని అరికట్టుటకు కూడా నీటి మొక్కల నిర్ములన అవసరం. చెరువు నీటి ఉపరితంలో తెలియదు అలాగే ప్లవకాలు కొన్ని విష పదార్ధాలను స్రవిస్తాయి. ఉదా: యాగ్లినా వీటిని నివారించుటకు గుడ్డు వల్ల లేదా గడ్డిని మెలిపెట్టి తయారుచేసిన "వెంట్" సహాయంతో చెరువు నీటిని తీయాలి. చెరువు నీటి ఉదజని సూచిక 8 కంటే తక్కువగా ఉన్నప్పుడు అలాగే, నాచు, కలుపు మొక్కల నివారణకు మైలుతుత్తుమును ఎకరంకు 2-4 డి లేదా సోడియం లవణములు చెరువు నీటికి కలిపినా ఒకటి రెండు రేంజుల తరువాత తదితర మొక్కలు చనిపోయి కుళ్ళటం వలన చెరువు నీరు మురుగు నీటి వాసన కలిగి ఉంటుంది. అందువలన చెరువు నీటిని అడుగునుండి తొలగించి కొత్త నీటికి తోడుకొని చెరువు నీటికి రాతి సున్నము కనీసం ఎకరానికి 20-25 కిలోల ప్రకారము కలుపుకోవాలి.

తీసుకోవాలిసిన జాగ్రత్తలు

  • చేపల చెరువు నీటిలో కలుపు మొక్కలు, చేపలకు అనువుగాని అలాగే, నాచు మొక్కలు అభివృద్ధి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.
  • కలుపు మొక్కలను చెరువు త్రవ్వకం చేసినప్పటి నుండి తొలగించివేయట, అలాగే జాతులు చెరువు  నోటిలోనికి ప్రవేశింపకుండా నీటిని వడగట్టిన తర్వాత వాడుకొనుట చేయాలి.
  • స్పైరోగైరా నాచు తీగలను శిలావతి చేపలు ఆహారంగా తీసుకోగలిగిన నివారించటం మంచిది.
  • చేపల చెరువులలో హైడ్రిల్లా, లేమా వంటి నీటి మొక్కలు దట్టంగా అభివృద్ధి చెందినప్పుడు ఎకరంకు 20-25 వరకు గడ్డి చేపలను పెంపలము చేయాలి. గడ్డి చేపలు హైడ్రిల్లా వంటి మెక్కలను తమ సహజ ఆహారముగా తీసుకుని వాటి నివారణకు సహకరిస్తాయి.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate