హోమ్ / వ్యవసాయం / మత్స్య సంపద / చేపల పెంపకం ద్వారా వ్యర్ధ జలాల శుద్ధి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

చేపల పెంపకం ద్వారా వ్యర్ధ జలాల శుద్ధి

దేశంలో పెరిగిపోతున్న జనాభావల్ల, ఇటీవలి సంవత్సరాలలో, వ్యర్ధ జలాల పరిమాణంకూడా శుద్ధిచేసే సామర్ధ్యాన్ని మించి పెరిగిపోతున్నది. అపరిమితంగా వెలువడే పారిశ్రామిక కాలుష్య పదార్ధాలు, వ్యర్ధ ఘన పదార్ధాలు వీటికి అదనం. ఇళ్ళలోని మురికి నీటిని సహజ జలవనరులలోకి వదలడానికి అనువుగా శుద్ధిచేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయతే చేపల పెంపకం ద్వారా ఏ విధంగా వ్యర్థ నీరు శుద్ధి చేయబడుతుందో ఈ శీర్షికలో తెలియజేయడం జరిగింది.

దేశంలో పెరిగిపోతున్న జనాభావల్ల, ఇటీవలి సంవత్సరాలలో, వ్యర్ధ జలాల పరిమాణంకూడా శుద్ధిచేసే సామర్ధ్యాన్ని మించి పెరిగిపోతున్నది.. అపరిమితంగా వెలువడే పారిశ్రామిక కాలుష్య పదార్ధాలు, వ్యర్ధ ఘన పదార్ధాలు వీటికి అదనం. ఇళ్ళలోని మురికి నీటిని సహజ జలవనరులలోకి వదలడానికి అనువుగా శుద్ధిచేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జీవ ప్రక్రియ ద్వారా శుద్ధి

 • జీవప్రక్రియ ద్వారా శుద్ధి చేయడం అంటే, సేంద్రియ పదార్ధాన్ని కార్బన్ డయాక్సైడ్ , నీరు, నత్రజని, సల్ఫేట్ లుగా విడగొట్టడంకోసం, సూక్ష్మ క్రిముల సహజ కార్యకలాపాలవల్ల జరిగే జీవరసాయన చర్యలను ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకోవడం.
 • ఇళ్లనుంచి వచ్చే మురికినీటిని శుద్ధి చేయడంలో చాలావరకు ఆ మురికినీటిని గాలితో ప్రేరేపించి, మలిన పదార్ధాలను తొలగించే పద్ధతులను పాటిస్తారు. ఇవి, యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, ట్రిక్లింగ్ ఫిల్టర్ పద్ధతి (వడబోత), ఆక్సిడేషన్ / చెరువులో మురికినీరు నిలకడగా వుండడంవల్ల మురికి అడుగునకుచేరడం, చెరువులోకి గాలిని పంపి శుద్ధిచేయడంతోపాటు, గాలి ప్రమేయం లేకుండా మురికి నీటిని శుద్ధిచేసే వివిధ ప్రక్రియలను కూడా వినియోగిస్తారు.
 • గాలి ప్రమేయం లేకుండా మురికి నీటిని శుద్ధి చేయడానికి అనుసరిస్తున్న సరికొత్త ప్రక్రియను " “అప్ ఫ్లో ఎన్రోబిక్ స్లడ్గ్ బ్లాంకెట్’’(యుఎస్ఎబి) పద్ధతి అంటారు. పంటలకు, పండ్లతోటలకు, చేపల పెంపకానికి మురికినీటిని వినియోగించే సాంప్రదాయిక జీవ సంబంధ ప్రక్రియలను అనేక దేశాలలో అనుసరిస్తున్నారు. కలకత్తాలోని '' భేరీ'' లనబడే మురికినీటి చేపలచెరువులు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యర్ధ జలాలనుంచి పోషకాలను తిరిగి పొందడమే ఈ పద్ధతులలోని ప్రధాన అంశం .
 • ఈ సాంప్రదాయిక పద్ధతులను, వ్యర్ధ జలాల నిర్వహణకు సంబంధించిన వివిధ నూతన ప్రక్రియలను దృష్టిలో వుంచుకుని, ఇళ్ళనుంచి వచ్చే మురికి నీటిని శుద్ది చేయడానికి ఒక కీలక రంగంగా , ఒక ప్రామాణికంగా చేపల పెంపక రంగాన్ని ప్రతిపాదిస్తున్నారు.

వినియోగ ప్రక్రియ

 

 


డక్‌వీడ్ చెరువు దృశ్యం

 

 

చేపల పెంపకం ద్వారా వ్యర్దజలాలను శుద్ధిచేసే ప్రక్రియలో, మురికినీటిని సేకరించే వసతి, , డక్‌వీడ్ కల్చర్ కాంప్లెక్స్ , మురికినీటిలో పెరిగే చేపల చెరువు, మలినాలను శుద్ధిచేసే చెరువు, ఆ నీటిని బయటకు పంపే నిర్మాణాలు వుంటాయి.

 • డక్‌వీడ్ అంటే, స్పైరోడెలా, వుల్ఫియా మరియు లెమ్నావంటి నీటిపై తేలుతూ, దాదాపుగా చెరువంతటిని కప్పేసినట్టు విస్తరించే వివిధ రకాల చిన్న మొక్కలు (పూల). డక్‌వీడ్ కల్చర్ కాంప్లెక్స్ అంటే, వరుసగా ఇలాంటి అనేక చెరువులు వున్న నిర్మాణం. ఈ చెరువులలోకి కాలవల ద్వారా, గురుత్వాకర్షణ ద్వారా లేదా పంపుచేయడం ద్వారానో వ్యర్ధ జలాలను తరలిస్తారు. ఆ నీటిని , ఈ చెరువులలో రెండు రోజులపాటు వుంచిన తర్వాత, చేపల చెరువుకు తరలిస్తారు.
 • ఒక ఎంఎల్‌డి (రోజుకు మిలియన్ లీటర్లు) వ్యర్ధజలాలను శుద్ధి చేయడానికి 25 మీటర్లు X 8 మీటర్లు X 1 మీటరు కొలతలుగల 18 డక్‌వీడ్ చెరువులను 3 వరుసలలో నిర్మిస్తారు. ఈ విధంగా, చేపల చెరువులలోకి వెళ్ళే ముందుగా, వ్యర్ధజలాలు డక్‌వీడ్స్ వున్న అనేక చెరువులగుండా ప్రవహిస్తాయి.
 • ఈ నిర్మాణ ప్రక్రియలో, 50 మీటర్లు X 20 మీటర్లు X 2 మీటర్ల కొలతలు కలిగిన 2 చేపల చెరువులు, 40 మీటర్లు X 20 మీటర్లు X 2 మీటర్ల కొలతలు కలిగిన 2 మురికినీటి శుద్ధి చెరువులు / మార్కెటింగ్ చెరువులు వుంటాయి. వ్యర్ధ జలాలలోని ఘనపదార్ధాలను తొలగించి, ప్రాథమికంగా శుద్ధిచేసిన మురికినీరు ఈ నిర్మాణాలకు చేరుతుంది.
 • అయితే, భువనేశ్వర్ నగరంలో రెండు చోట్ల 8 ఎమ్.ఎల్ డి వ్యర్ద జలాలను శుద్ధి చేస్తున్నారు కొన్ని మార్పుచేర్పులతో ఏర్పాటుచేసిన ఈ వ్యవస్థలు, భారీ స్థాయిలో వ్యర్ధజలాలను నిర్వహించడానికి అనువుగా వున్నాయి.
 • వ్యర్ధ జలాలను ఆశించిన విధంగా శుద్ధిచేయడానికి, గరిష్ఠంగా లీటరుకు 100-150 మిల్లీగ్రాముల బిఓడి (బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్) వంతున నీటిని తీసుకోవలసి వుండడంతో, సేంద్రియ భారం, బిఓడి స్థాయి చాలా ఎక్కువగా వున్నపుడు, ఒక ఎనరబిక్ యూనిట్‌నుకూడా ఏర్పాటుచేయడం అవసరం కావచ్చు.
 • కలుపు మొక్కలతోకూడిన చెరువులు (డక్‌వీడ్ కల్చర్) , వ్యర్ధజలాలలోని బరువైన లోహాలను, ఇతర రసాయనిక అవశేషాలను తొలగిస్తాయి. వీటిని తొలగించకపోతే, ఈ నీటిలో పెరిగే (కల్చర్డ్) చేపలద్వారా ఇవి మానవ ఆహార ప్రక్రియలోకి చొరబడే ప్రమాదం వుంది. ఇంతేకాక, ఈ మొక్కలు ఈ నీటికి పోషకాలను అందిస్తాయి, కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తాయి, పైగా, కిరణజన్య సంయోగక్రియవల్ల ఆ నీటికి ఆక్సిజన్ ను సమకూరుస్తాయి. లీటరుకు 100 మిల్లీ గ్రాముల బిఓడి5 స్థాయి వున్న నీటిని 5 రోజులపాటు ఈ చెరువులలో నిల్వవుంచితే, వాటిలోని బిఓడి 5 స్థాయి లీటరుకు 15-20 మిల్లీగ్రాములకు తగ్గుతుంది. అప్పుడు ఆ నీరు అన్నివిధాలుగా, సహజ నీటి వనరులలోకి వదలడానికి తగిన ప్రమాణాలు కలిగి వుంటుంది.
 • వ్యర్ధ జలాలకువున్న అధిక ఉత్పాదకత, నిర్వహణ సామర్ధ్యం అనే జంట ప్రయోజనాల ఫలితంగా, ఒక హెక్టేరు మురుగునీటి చేపల (కల్చర్) చెరువు లో 3-4 టన్నుల కార్ప్స్ చేపలను ఉత్పత్తి చేయవచ్చు. ఇటు చేపల రూపంలో, అటు డక్‌వీడ్ వంటి నీటి మొక్కల రూపంలో చక్కని వనరులను పొందే అవకాశాన్నికూడా ఈ జీవపరమైన ప్రక్రియ కల్పిస్తున్నది. అయితే, శీతాకాలంలోను, సాధారణమైన శీతోష్ణ పరిస్థితులు వుండే ప్రాంతాలలోను ఈ ప్రక్రియ సామర్ధ్యం కొంత తగ్గడం దీనికి వున్న ముఖ్యమైన పరిమితి. అయినప్పటికి, మిగతా ప్రక్రియలకంటె తక్కువ నేల (1 ఎంఎల్‌డి మురుగు నీటిని శుద్ధిచేయడానికి 1 హెక్టేరు ) సరిపోతుండడం, నిర్వహణ ఖర్చులను కనీసం పాక్షింగా నైనా తిరిగి పొందగలిగే విధంగా , ఈ ప్రక్రియ ద్వారా కొన్ని వనరులు లభిస్తుండడం వల్ల , సహజ నీటివనరులలోకి వదలడానికి ముందు వ్యర్ధ జలాలను శుద్ధిచేసే ప్రక్రియలలో, ఇది ఆదర్శ ప్రక్రియగా నిలుస్తున్నది.

ఎం.ఎల్‌.డి వ్యర్ధ జలాల శుద్ధి ఆర్ధికాంశాలు

క్ర సం

అంశం

వెల (లక్షల రూపాయలలో)

I

వ్యయం

 

ఎ.

స్థిర వ్యయం

 

1

డక్‌వీడ్ చెరువుల నిర్మాణం   (0.4 హెక్టేర్లు)

3. 00

2

చేపల చెరువుల నిర్మాణం    (0.2 హెక్టేర్లు)

1.20

3

నీటి శుద్ధి చెరువు నిర్మాణం (0.1హెక్టేరు)

0.60

4

పైప్ లైన్లు, గేట్లు, కాల్వల నిర్మాణం

5.00

5

పంపులు, ఇతర ఏర్పాట్లు, చెరువులకు లైనింగ్ మొదలైనవి

5.00

6

నీటి నాణ్యతను పరీక్షించే పరికరం

1.00

మొత్తం స్థిర వ్యయాలు:

15.80

బి.

నిర్వహణ వ్యయాలు

 

1

జీతాలు ( నెలకు 2,000 వంతున ఇద్దరికి)

0.48

2

విద్యుచ్చక్తి, ఇంధనం

0.24

3

చేప విత్తనాల ఖరీదు

0.02

4

ఇతర ఖర్చులు

0.10

మొత్తం నిర్వహణ వ్యయాలు

0.84

II

ఆదాయం

 

1

కిలో రూ. 30 వంతున 1,000కిలోల చేపల అమ్మకం

0.30

నిర్వహణ వ్యయంలో ఆదాయంశాతం

35 %

ఆధారము: మంచినీటి చేపల పెంపకం కేంద్రీయ సంస్థ , భువనేశ్వర్, ఒరిస్సా

3.00481637568
Maladasari Ramakrishna Oct 01, 2019 06:39 PM

Aqucultere study metereal kavali

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు