অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గట్టి పెంకు పీతల (మడ్ క్రాబ్స్) పెంపకం

గట్టి పెంకు పీతల (మడ్ క్రాబ్స్) పెంపకం

మాంసాహారంగా పీతలను చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా వీటికి విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ వుంది. అంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల తీరప్రాంతాలలో, వాణిజ్యస్థాయిలో పీతల పెంపకం బాగా పుంజుకుంటున్నది.

పీతల్లో రకాలు

శాస్త్రీయంగా, స్కైలా అనబడే పీతలు, తీర ప్రాంతాలు, సరస్సులు, ఉప్పు నీటి కయ్యలలో పెరుగుతాయి.
i. పెద్ద రకాలు:

ii. చిన్న రకాలు:

 • చిన్న రకాలను రెడ్ క్లా (ఎర్ర కొండీలు) అంటారు
 • ఈ రకం పీతలకు పై పెంకు 12.7 సెంటీమీటర్ల వెడల్పు వరకు పెరుగుతుంది, ఇవి ఒక్కొక్కటి 1.2 కిలోల బరువు తూగుతాయి.
 • వీటి పై పెంకు మీద బహు భుజాకృతులు వుండవు. ఇవి (తాము వుండడానికి) గుంటలు తవ్వుకుంటాయి .
 • ఈ రెండు రకాల పీతలకు కూడా ఇటు దేశీయంగాను, అటు విదేశీ మార్కెట్లలోను మంచి గిరాకీ వుంది.
  చిన్న రకాలు

పెంపకం పద్ధతులు

గుడ్లను లేదా బాగా చిన్న పిల్లలను పెంచడం (గ్రో ఔట్ కల్చర్)

 • ఈ పద్ధతిలో పీత పిల్లలను 5-6 నెలలపాటు (కావలసిన సైజుకు పెరిగేవరకు) పెంచుతారు
 • సాధారణంగా వీటిని నీటి గుంటలలో పెంచుతారు. వీటిని పెంచే ప్రదేశాలలో మడ అడవులు (మ్యాన్ గ్రోవ్స్) వుండవచ్చు, వుండకపోవచ్చు
 • నీటిగుంట విస్తీర్ణం 0.5-2.0 హెక్టార్ల మధ్య రకరకాలుగా వుంటుంది. కుంట చుట్టూ గట్టి కట్ట వుండేలా, అలల ద్వారా నీరు మార్పిడికి వీలుగా గుంట నిర్మాణం వుండాలి .
 • నీటిగుంటలు చిన్నవైతే , చుట్టూ కంచె వుంటే మంచిది. పీతల పెంపకానికి పరిస్థితులు సహజంగానే అనుకూలంగావుండే పెద్ద గుంటల విషయంలో, నీరు వెలుపలికి వేళ్లే తూము తలుపులవద్ద కట్టుదిట్టం చేసుకోవాలి.
 • అడవులలో సేకరించిన 10-100 గ్రాముల బరువైన పీత పిల్లలను పెంపకానికి ఉపయోగించాలి
 • పెంపకం గడువు 3-6 నెలల వరకు వుంటుంది
 • గుంటలో చదరపు మీటరు విస్తీర్ణానికి సాధారణంగా 1-3 పీతలు మించకుండా, గుంటలో వదిలే పీతల సంఖ్యను నిర్ణయించుకోవాలి
 • స్థానికంగా లభ్యమయ్యే ఇతర పదార్ధాలతోపాటు, ఏవైనా మామూలు రకం నాటు చేపలను పీతలకు దాణాగా వేయవచ్చు. (పీత బరువులో 5% దాణా ఇవ్వాలి)
 • పీతల పెరుగుదల, ఆరోగ్య పరిస్థితి ఎలావున్నది తెలుసుకోవడంకోసం, రోజువారీ ఇచ్చే దాణా పరిమాణంలో మార్పుచేర్పుల అవసరాన్ని గుర్తించడంకోసం గుంటలో పీతల నమూనాను తరచు పరిశీలిస్తుండడం అవసరం
 • మూడవ నెలనుంచే , అమ్మకానికి అనువైన సైజు పీతలను విక్రయించడం మొదలుపెట్టవచ్చు. ఇలాచేయడంవల్ల గుంటలో పీతల సంఖ్య తగ్గి, మిగతా పీతలు మరింతగా ఎదగగలుగుతాయి. ఇంతేకాకుండా, ఒకదానిపై మరొకటి దాడిచేయడం, చంపుకోవడం వంటి వాటిని అరికట్టడానికి వీలవుతుంది.

ఒక మోస్తరు పిల్లలను బాగా పెద్దవిగా పెంచడం (ఫాటెనింగ్)

పీతలు చిన్నవిగా వున్నప్పుడు వాటి పై పెంకు మృదువుగా వుంటుంది. ఇలాంటి మృదువైన పైపెంకుగల పీతలను కొన్నివారాలపాటు పెంచితే,వాటి పైపెంకు గట్టిపడుతుంది. ఇలా గట్టి పైపెంకు కలిగిన పీతలను స్థానికంగా మడ్ (మాంసం) క్రాబ్స్ (పీతలు) అంటారు. మృదువైన పెంకు వుండే పీతలకంటె, గట్టి పెంకు పీతలు మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర పలుకుతాయి.

ఒక మోస్తరు పిల్లలను బాగా పెద్దవిగా పెంచే నీటిగుంటలు
 • కేవలం 0.025-0.2 హెక్టార్ల విస్తీర్ణం కలిగి, 1 నుంచి 1.5 మీటర్ల లోతున నీరుండే
 • చిన్న చిన్న అలల నీటి గుంటలను పీతలను బాగా పెద్దవిగా పెంచడానికి ఉపయోగించవచ్చు.
 • లేత పెంకుగల పీత పిల్లలను గుంటలో వదలడానికి ముందుగా, గుంటను తగిన విధంగా సిద్ధంచేసుకోవాలి. గుంటలోని నీటిని తొలగించి, గుంటను ఎండనిచ్చి, గుంట అడుగున తగినంత సున్నం చల్లి సిద్ధపరచాలి.
 • గుంట గట్టుకు రంధ్రాలుగాని, చీలికలు గాని లేకుండా జాగ్రత్త వహించాలి. పీతలు సహజంగా తూములగుండా తప్పించుకోవాలని చూస్తుంటాయి. అందువల్ల తూము చుట్టూ కట్టుదిట్టం చేసుకోవాలి. నీరు గుంటలోకి వచ్చే చోట, గుంట గట్టు లోపలివైపున తడికలతో గట్టును మరింత గట్టిపరచాలి .
 • ఇంతేకాకుండా, పీతలు గుంటనుంచి తప్పించుకు పోకుండా గట్టుచుట్టూ వెదురు గడలు పాతి, వాటికి వలలు కట్టాలి. ఆ వలలు గుంట లోపలికే వంగి వుండాలి.
 • స్థానిక చేపల వ్యాపారుల నుంచో / పీతల వ్యాపారుల నుంచో మృదువైన పై పెంకు పీత పిల్లలను కొనుగోలుచేసి, వాటి సైజుకు తగినట్టుగా, గుంటలో చదరపు మీటరు విస్తీర్ణానికి 0.5-2 పీత పిల్లల వంతున, ఉదయం పూట వదలాలి.
 • 550 గ్రాములు, అంతకు మించి బరువు కలిగిన పీతలకు మార్కెట్లో గిరాకీ ఎక్కువ, అందువల్ల ఈ సైజు పీతలను పెంచడం మంచిది. ఈ సైజువైతే, గుంటలో చదరపు మీటరుకు ఒక పీత మించకుండా జాగ్రత్తపడాలి.
 • గుంటవున్న ప్రదేశాన్ని, నీటి లభ్యతను దృష్టిలో వుంచుకుని, గుంటలో పీతలను వదులుతూ, పైపెంకు గట్టిపడిన పీతలను గుంటనుంచితొలగిస్తూ, మొత్తంమీద, పీతలను బాగా పెద్దవిగా పెంచే ప్రక్రియను సంవత్సరానికి 6-8 సార్లు సాగించవచ్చు.
 • గుంట పెద్దదైతే, దానిని కొన్ని అరలుగా విభజించుకుని, ఒక్కొక్క సైజు పీతలను ఒక్కొక్క అరలో పెంచవచ్చు. దాణాలో హెచ్చుతగ్గులను పాటించడానికి, సైజునుబట్టి పీతలను అమ్మకానికి తీయడానికి, నిర్వహణకు మరింత సులువుగా వుంటుంది.
 • గుంటలో పీతలను వదిలే విషయంలో, ఒకదఫాకు, మరో దఫాకు మధ్య వ్యవధి ఎక్కువగా వున్నప్పుడు, ఒకరకం సైజుల పీతల నన్నిటిని ఒకే అరలో పెంచవచ్చు.
 • మగ, ఆడ పీతలను వేరువేరు అరలలో పెంచడంకూడా మంచిదే. ఇందువల్ల మగపీతల దాడులను అరికట్టడానికి వీలవుతుంది. పీతలు సేదదీరడానికి పాత టైర్లు, బుట్టలు, పెంకులవంటివి గుంటలో వుంచడం మంచిది. ఒకదానిపై ఒకటి దాడిచేయడాన్ని, చంపుకోడాన్ని కొంత తగ్గించవచ్చు.


పీత పిల్లలను పెద్దవిగా పెంచే నీటిగుంట


గుంటలోకి నీరు వచ్చే చోట , తడికలతో కప్పడం

నీటిలో తేలియాడే బుట్టలలో, బోనులలో పీతల పెంపకం

నీటిలో తేలియాడే బుట్టలలో, బోనులలో ; లోతు తక్కువగా వుండే ఉప్పు నీటి కయ్యలలోను, పెద్ద సరస్సులు, చెరువులలో చుట్టూ వలలతో మూసిన అవరణలలో కూడా పీత పిల్లలను పెంచే ప్రక్రియ సాగించవచ్చు.

 • చుట్టూ మూసివేయడానికి హెచ్ డి పి ఇ, నెట్లాన్ లేదా వెదురు బద్దలను ఉపయోగించవచ్చు
 • బుట్ట, లేదా బోను సైజు 3 మీటర్లు x 2 మీటర్లు x1 మీటరు వుంటే మంచిది
 • ఈ బుట్టలు లేదా బోనులను ఒకే వరుసలో అమరిస్తే, దాణా వేయడానికి, గమనించుకోవడానికి సులభమవుతుంది
 • బుట్టలు, బోనులలో చదరపు మీటరుకు 10 పీతల వంతున; వలలతో మూసిన ఆవరణలలో ఐతే చదరపు మీటరుకు 5 పీతల వంతున పెంచాలి. బుట్టలు, బోనులలో ఎక్కువ పీతలు వుంటాయికాబట్టి , అవి ఒకదానిపై మరొకటి దాడి చేయకుండా, పిల్ల పీతలను వాటిలోకి వదిలేముందు వాటి కొండ్ల మొనలను విరిచివేయాలి.
 • కాని, నీటి గుంటలలో పెంచినంతగా ఈ పెంపకం పద్ధతులు వాణిజ్యపరంగా అనువైనవి కావు

పెంపకానికి (కల్చర్) పట్టే సమయం తక్కువగా వుండడం, మరింత లాభదాయకమైనది కావడంతో; ఈ రెండు పద్ధతులలో, లేత పెంకు గలిగిన పీత పిల్లలను పెంచే రెండవ పద్ధతే మరింత మేలైనది. అయితే, లేత పెంకుగలిగిన పీత పిల్లలు కావలసిన పరిమాణంలో లభ్యంకావడం అవసరం. పీత గుడ్లు, వాణిజ్య పరమైన దాణా తగినంతగా లభ్యంకాకపోవడంవల్ల ఇండియాలో పీత గుడ్లను తెచ్చి పెంచే పద్ధతి అంతగా వాడుకలో లేదు.

దాణా

పీతల బరువులో 5-8 % దాణాను రోజూ వాటికి ఇవ్వవలసి వుంటుంది. అంత ఖరీదుకాని నాటు చేపలు, ఉప్పునీటికయ్యలలో పెరిగే షెల్ ఫిష్ వంటి చేపలను, లేదా వుడికించిన కోడి మాంసం వ్యర్ధాలను పీతలకు దాణాగా వేయవచ్చు. దాణా రోజుకు రెండుసార్లుగా ఇవ్వాలనుకుంటే, సాయంత్రంపూట ఎక్కువ మోతాదులో ఇవ్వాలి.

నీటి నాణ్యత

ఈ కింద పేర్కొన్న విధంగా నీటి నాణ్యతకు సంబంధించిన ప్రమాణాలు

పాటించాలి:

నీటిలో ఉప్పు శాతం (శాలినిటి) 15-25%
ఉష్ణోగ్రత 26-30° సెంటిగ్రేడ్
ఆక్సిజన్ > 3 పి పి ఎం
ఆమ్లత్వం (ఫ్) 7.8-8.5

పెరిగిన పీతలను పట్టడం , మార్కెటింగ్

 • పీతల పైపెంకు ఎంతగా గట్టిపడుతున్నదో తరచు పరిశీలిస్తుండాలి
 • పెంకు తగినంతగా గట్టిపడిన పీతలను తెల్లవారిన వెంటనే(ఎక్కువ పొద్దుపోకుండా) , లేదా సాయంత్రం పూట పట్టాలి
 • పట్టుకున్న పీతలను, కొద్దిగా ఉప్పు కలిపిన నీటితో బాగా కడిగి, వాటికి అంటుకున్న మురికిని, మట్టిని వదిలించాలి. వాటిని జాగ్రత్తగా కట్టివేయాలి. అయితే ఇలాచేయడం లో వాటి కాళ్ళు విరగకుండా జాగ్రత్తపడాలి.
 • పట్టుకున్న పీతలను, తేమగావున్న చోట వుంచాలి. వాటికి ఎండ తగులనివ్వకూడదు.ఎండకుఅవిచచ్చిపోయేప్రమాదంవుంది
 •  

   

   

   


  పట్టుకున్న పీతలు   

   


  పట్టుకున్న గట్టిపెంకు పెద్ద పీత (>1కిలో)

పీతల ఫాటెనింగ్ ఆర్ధికాంశాలు (ఏడాదికి 6 పంటలు (0.1 హెక్టారు అలల గుంట)

ఏ. వార్షిక స్థిర వ్యయాలు రూ.
నీటి గుంట అద్దె 10,000
తూము తలుపు 5,000
గుంతను సిద్ధంచేయడం,
కంచె వేయడం, ఇతర ఖర్చులు 10,000

బి. నిర్వహణ వ్యయాలు
1. పీతల కొనుగోలు ఖర్చు
(400 పీతలు, కిలో 120 రూపాయల వంతున) 36,000
2. దాణా ఖర్చు 10,000
3. కూలీల ఖర్చు 3,000
మొత్తం ఒక పంటకు అయ్యే ఖర్చు 49,000
6 పంటలకు అయ్యే మొత్తం ఖర్చు 2,94,000

సి. మొత్తం వార్షిక వ్యయం 3,19,000

డి. దిగుబడి,ఆదాయం
ఒక్కొక్క దఫాకు పట్టే పీతలు(దిగుబడి) 240 కిలోలు
6 పంటలకు మొత్తం పీతలపై రాబడి
(కిలో 320 రూపాయల వంతున):
(6 x 240 x 360) 4,60,800

నికర ఆదాయం 1,41,800

 • చిన్న / ఒకమోస్తరు రైతులు సులువుగా నిర్వహించుకోవడానికి అనువైన సైజు నీటి గుంటను దృష్టిలో వుంచుకుని, ఈ ఆర్ధికాంశాలను పేర్కొనడం జరిగింది. కావానుకుంటే వారు మరింత చిన్న గుంటలో పీతల సాగు సాగించవచ్చు .
 • పెంచడానికి తీసుకున్న పీతలు ఒక్కొక్కటి దాదాపు 750 గ్రాములు వుంటాయి కాబట్టి, గుంటలో తక్కువ సంఖ్యలోనే (4 /చదరపు మీటరు) పీతలను వదలవలసి వుంటుంది.
 • మొదటి వారంలో పీత బరువులో 10 % , మిగిలిన రోజులలో 5% దాణా ఇవ్వాలి.దాణా వ్యర్ధంగా పోకుండా చూడడానికి, నీటి నాణ్యతను కాపాడడానికి దాణాను ట్రేలలో ఇవ్వడం మంచిది.
 • చక్కగా నిర్వహించే గుంటలలో, 80-85% పీతలు బతికే విధంగా, 8 పంటలు, కూడా తీయవచ్చు. ( ఇక్కడ, 75% పీతలు బతుకుతాయన్న అంచనాతో, 6 పంటలను మాత్రమే లెక్కించడం జరిగింది)

ఆధారము: సముద్ర జలచరాలపై పరిశోధనల కేంద్రీయ సంస్థ, కొచ్చిన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate