অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విత్తనాలు

ఏమి చేయాలి?

  • స్థానిక వాతవరణ పరిస్థిరులకు అనుకూలంగా సిఫారసు చేసిన విత్తన రకాలను వినియోగించాలి. సిఫారసు చేసిన విధంగా విత్తన మోతాదును, మరియు యాజమాన్య పద్దతులను పాటించాలి.
  • గోధుమ, వరి, బార్లీ, పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తనాలను (ఆవాలు, పొద్దుతిరుగుడు మినహాయించి), మూడేళ్ల కొకసారి మార్చాలి. మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కందులు, కుసుమ, ఆవాలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను రెండు సంవత్సరములకొక సారి మరియు హైబ్రిడ్ / బెటి విత్తనాలను సంవత్సరమునకు ఒకసారి మార్చాలి.
  • ఎల్లప్పుడు ధృవీకరించిన విత్తనాలను అనుమతించబడిన సంస్థలనుండే కొనుగోలు చేయాలి. విత్తనాలను పొడి, శుభ్రమైన, చల్లని ప్రదేశాలలో నిల్వచేసుకోవాలి.
  • విత్తనశుద్ధిని విధిగా పాటించాలి. విత్తేముందు స్వచ్చత, నాణ్యత, మొలక శాతాలను పరీక్షించుకోవాలి.

నీవు ఏమి పొందుదువు?

క్రమ సంఖ్య పంట ధృవీకరణ విత్తనముల సరఫరా పై సహాయము పధకం / భాగం
ఏ. విత్తనముల పంపిణి సహాయము
1 (1) గోధుమలు మరియు వరి అధికోత్పత్తి విత్తనములు
(2) హైబ్రిడ్ వరి విత్తనములు
(1) కిలో రూ.10/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా
(2) కిలో రూ.50/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా
జాతీయ ఆహార భద్రతా మిషన్ (యన్.యఫ్.యస్.యం.)
2 (1) ముతక తృణ ధాన్యాలు (1) హైబ్రిడ్ విత్తనములు
(2) అధికోత్పత్తి విత్తనములు
(1) కిలో రూ.50/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా
(2) కిలో రూ.15/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా
యన్.యఫ్.యస్.యం.
3 పప్పు ధాన్యాలు (కందులు, పెసలు,మినుములు, అడవి బఠాణి, రాజ్మా మరియు చిమ్మటలు) అధికోత్పత్తి విత్తనములు కిలో రూ. 25/-లు లేక ధరలో50 శాతము, మించకుండా యన్.యఫ్.యస్.యం.
4 పప్పు ధాన్యాలు (కందులు, పెసలు,మినుములు, అడవి బఠాణి, రాజ్మా మరియు చిమ్మటలు)
నూనెగింజలు (వేరుశనగ, పొద్దుతిరుగుడు, టోరి, కుసుమ, ఆవాలు/ రేప్ సీడ్ , నువ్వులు మరియు ఆముదము)
ధరలో 50 శాతము లేక కిలో రూ. 12/- లు మించకుండా. అవి పది సంవత్సరముల కన్నా పై బడని రకరకములైన విత్తనములు.
హైబ్రిడ్ : ధరలో 50 శాతము, పరిమితి కిలో రూ. 25/-లు హైబ్రిడ్ లకు అవి పది సంవత్సరముల కన్నా పై బడని రకము.
యన్.యఫ్.యస్.యం.
5 ఆయిల్ పామ్ మొలకలు రతుకు వున్నభూమి మొత్తంలో నాటే మొక్కల ధరలో 85 శాతం, రూ. 8000/- లు హెక్టారుకు పరిమితి. యన్..యం.ఓ.ఓ.పి
అన్ని పంటలకు: నాణ్యమైన విత్తనములు ఉత్పత్తి చేయుటకు మూల/ ధృవీకరణ విత్తనములను పంపిణిచేయుటకు తృణ ధాన్యాల విత్తనముల ధరలో 50 శాతము, నూనె విత్తనములు, పప్పుధాన్యములు,పశువుల మేత, పచ్చి రొట్టఎరువు విత్తనములు మొదలగువాని ధరలో 60 శాతము, రైతుకు ఒక ఎకర భూమికి పరిమితము. జాతీయ వ్యవసాయ విస్తరణ మరియు సాంకేత మిషన్ (యన్ .యం. ఏ.ఇ.టి),విత్తనము మరియు నాటు మొక్కల (యస్ .యం. యస్ . పి.) మరియు గ్రామ విత్తన కార్యక్రమములపైన ఉప మిషన్.
7 మూల విత్తనముల/ ధృవీకరణ విత్తనములను నూనె గింజలు, పప్పుధాన్యాలు, పశువుల మేత, పచ్చిరొట్టఎరువుల పంటలు మొదలగునవి రైతులకు, యస్ . హెచ్ .యఫ్ .పి. ఓలుకు పంపిణి. (భారత ప్రభుత్వ భాగము 75శాతము మరియు రాష్ట్ర భాగము 25 శాతము) ధరలో 75 శాతము, నూనె విత్తనములు, పప్పుధాన్యములు, పశువుల మేత పచ్చిరొట్టఎరువు మొదలగు పంతలకు జాతీయ వ్యవసాయ విస్తరణ మరియు సాంకేత మిషన్ (యన్ .యం. ఏ.ఇ.టి),విత్తనము మరియు నాటు మొక్కల (యస్ .యం. యస్ . పి.) మరియు గ్రామ విత్తన కార్యక్రమములపైన ఉప మిషన్.
8 ఆయిల్ పామ్ లపెరుగుదలకు సాగు ఖర్చు కంకివచ్చిన సమయము, మూడు సంవత్సరముకు, ధరలో 50 శాతము పరిమితి రూ. 14,000/-లు హెక్టారుకు. యన్ .యం. ఓ .ఓ .పి
9 జనుము మరియు మెస్థా గ్రామ విత్తన కార్యక్రమములు ధృవీకరణ విత్తమనముల ఉత్పత్తికి రూ.5500/_లు ఒక క్వింటాలుకు. యన్.యఫ్.యస్.యం.
10 ఐసిఏఆర్/ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయముల నుండి తయారుగుచున్న ఫౌండేషన్ బ్రీడర్ విత్తనములు కొనుగోలు చేయుట. డి. ఏ.సి విత్తనవిభాగము నిర్ణయించిన పూర్తిధర ఫౌండేషన్ విత్తనములకు. యన్ .యం. ఓ .ఓ .పి
బి. మూల మరియు ధృవీకరణ విత్తనముల ఉత్పత్తికి సహాయము.
11 ఐసిఏఆర/ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయముల నుండి తయారుగుచున్న పప్పుధాన్యముల బ్రీడర్ విత్తనములు కొనుగోలు చేయుట. విత్తన విభాగము నిర్ణయించిన బ్రీడర్ విత్తనములకు పూర్తిధర. యన్.యఫ్.యస్.యం.
12 విత్తన ఉత్పత్తి పెంచుటకు విత్తనము ఉత్పత్తి చేసే ప్రయివేట్ సంస్థలు, వ్యక్తులు/ స్వయం సహాయ సంఘాలకు సహాయము చేయుటకు. సాధారణ ప్రాంతములలో ప్రాజెక్టు ధరలో 40 శాతము అనగా పరపతి సంబంధములో అంతమయ్యే రాయితీలకు. కొండ ప్రాంతములకు 50శాతము, ఒక పాజెక్టుకు గరిష్టపరిమితి రూ.150 లక్షలు. జాతీయ వ్యవసాయ విస్తరణ మరియు సాంకేత మిషన్ (యన్ .యం. ఏ.ఇ.టి),విత్తనము మరియు సి అన్ని నునె విత్తనముల పంటలకు
సి అన్ని నునె విత్తనముల పంటలకు
13 మూల విత్తనముల ఉత్పత్తికి సహాయము. గత 10 సంవత్సరములలో విడుదలైన రకములు / హైబ్రీడ్లకు క్వింటాలుకు రూ.1000/-లు మరియు గత 5 సంవత్సరములలో విడుదలైన రకములు / హైబ్రీడ్లకు క్వింటాలుకు రూ.100/-లు అధికము. 75శాతము రాయితీ సొమ్ము అనగా రైతుకు మరియు 25 శాతము విత్తన ఉత్పత్తికి. (ఎస్ డి ఏ /యన్ . యస్ . సి./ యస్ యఫ్సి/నాఫెడ/క్రిబ్ కో/ఇఫ్కో/హెచ్ ఐ ఎల్ / ఇఫ్డిసి మొదలగునవి. కేంద్ర అనేక రాష్ట్ర సహాకారములు అనగా యన్ . సి. సి. యఫ్ .) యన్ .యం. ఓ .ఓ .పి
14 ధృవీకరణ విత్తనముల ఉత్పత్తి పైన చెప్పినదే యన్ .యం. ఓ .ఓ .పి
15 విత్తన మౌళిక అభివృద్ది విత్తన మౌళిక వసతులకు ఇసోఫామ్ కింద రాష్ట్రాలకు/ సంస్థలకు 11వ పంచవర్ష ప్రణాలిక కాలములో మద్దతు కొనసాగింపునకు అనుమతి పొందనది. కేటాయింపులు 1 శాతము మెత్తం ఖర్చులో మిని మిషన్ 1 నూనెవిత్తనములు ఎస్ ఎంఓబిపి క్రింద 100శాతము సధారంగా అమల్ల్ల్లు జరుగును 12వ పంచవర్ష ప్రణాలికలో. యన్ .యం. ఓ .ఓ .పి
16 వివిధ రకాల నిర్ధిష్ట లక్ష్యంగా విత్తన ఉత్పత్తి (వి.యస్ .టి.యస.పి) యన్ .యస్ .సి./యస్ .యఫ్ .సి. ఈ/ఎన్నుకున్న యస్ . యస్ .సిలు/ రాష్ట్ర ప్రభుత్వసంస్థలు/ సంస్థలు/ఐసిఏఆర్ / ఎసేయా మరియు వాని కెవికె ఫారములు, అంర్జాతీయ సంస్థలు మెదలగువానికి, ప్రాజెక్టు పద్దతిలో ఫెడరేషన్ ధృవీకరణ విత్తన ఉత్పత్తి ధరలో 75 శాతము. 5 సంవత్సరములు కాని విత్తనములు, ధృవీకరణతొ కావలసినవి. యన్ .యం. ఓ .ఓ .పి

ఎవరిని సంప్రదించాలి?

  • జిల్లా వ్యవసాయ అధికారి/ జిల్లా ఉద్యానవన అధికారి/ ప్రాజెక్టు డైరక్టరు, ఆత్మా.
  • ఆదారము: వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate