অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉద్యానవనాల అభివృద్ధికి అందిస్తున్న సేవలు

ఉద్యానవనాల అభివృద్ధికి అందిస్తున్న సేవలు

ఉప విభాగాలు

  1. ఒక ప్రత్యేక ప్రాంతం/రాష్ట్రంలో సాధించిన ఉద్యానవనాల అభివృద్ధి యొక్క ప్రస్తుత స్థితిని సమీక్షించాలి.
  2. ఉద్యానవనాల అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు, వాటిని పరిష్కరించే చర్యలను గుర్తించాలి.
  3. ఉద్యానవనాల రంగం ఒక క్రమపద్ధతిలో వృద్ధి చేందడానికి అవసరమైన దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యూహాలను తయారుచేయాలి.
  4. ఉద్యానవనాల అభివృద్ధిలో గల వివిధ అంశాలపై ప్రాథమిక మరియు మధ్య దశలకు సంబంధిం చిన గణాంకాలను సేకరించడం.
  5. కన్సల్టెన్సీ సేవలను, నిపుణుల సేవలను ;అంధించడం, ప్రయోగశాలలను ఏర్పాటుచేయడం చేయాలి.
  6. సాంకేతిక అంశాల పరిశీలనను నిర్వహించడం మరియు కోల్ మైన్ లకు సంబంధించిన మౌలిక సౌకర్యాలను ధృవీకరించడం, ఇలాంటి విధులను, అమలు చేసే కమిటీ నిర్ణయించిన సాంకేతిక ప్రమాణాల ప్రకారం నిర్వహించాలి.
  7. తాజా ఉద్యానవన ఉత్పత్తులకు, ఎగుమతి రంగంలో గల పోటీదారులకు సంబంధించిన నివేదిక లను తయారు చేయాలి. జాతీయ ఉద్యానవన బోర్డు గుర్తించిన రంగాలలో అవసరమైన నిపుణుల సేవలు అందిస్తుంద పైన పేర్కొన్న అంశాలన్నీ, చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నాయిగానీ, అపరిమతంగా లేవు.

సలహాదారు నియామకానికి ప్రాతిపదికలు మరియు కన్సల్టెన్సీ సంస్థలు

  1. సకహాదార్లు నియమించబడే సంస్థలు 3-5 సం|| ల అనుభవంతో బహుళ రకాలైన సేవలందించే వాటిలో రిజిష్టర్డ్ అయిన సంస్థలు మాత్రమే అయిఉండాలి.
  2. సలహాదార్లుగా నియమింపబడే వ్యక్తులు, ఆయా సబ్జెక్టులలో ప్రత్యేకించబడిన నిపుణులు లేక వ్యవసాయరంగంలో అనుభవంగల వారు/ అర్థశాస్త్రవేత్తలు/నిర్వహణా రంగ నిపుణులు/న్యాయశాస్త్ర నిపుణులు/వ్యక్తులు/ఆర్థిక నిర్వాహకులు/మార్కెటింగ్ నిపుణులు/సమాచార సాంకేతిక విజ్ఞాన నిపుణులు అయి ఉండాలి. ఆయా సంస్థల ప్రత్యేకా అవసరాలను సలహాదార్లు తీర్చేవారై ఉండాలి.
  3. సలహాదార్లుగా నియమించ బడేవారు ఉద్యానవనాల రంగంలో ఆర్థిక నిర్వహణలో ప్రాజెక్టు రిపోర్టుల తయారీలో ప్రాజెక్టుల పనితీరును సమీక్షించడంలో, పర్యవేక్షించడంలో తగిన అను భవం, నైపుణ్యం కలిగిన వారై ఉండాలి.
  4. వారివారి గత అనుభవాల నుండి సలహాదార్లు వ్యవసాయంలో /ఉద్యానవనాల పెంపకంలో/ ఉత్పత్తి/అనంతర యాజమాన్య నిర్వాహణలో/శీతలీకరణలో, ఎలక్ట్రానిక్ పరిపాలనా పద్ధతుల్లో మార్కెటింగ్ మరియు ఎగుమతులు చేయడంలో సామర్థ్యాలను సంపాదించినవారై ఉండాలి. వారివారి రంగాలను బట్టి సలహాదార్లుగా పని చేయడానికి అవసరమైన మౌలిక వనరులు కలిగినవారై ఉండాలి.
  5. ఆయా రంగాలను సంబంధించిన పరిస్థితులలో, పనిచేసిన వారికి, సర్వేలు నిర్వహించిన వారికి సలహాదార్లుగాని నియమించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి.
  6. ఒక ప్రత్యేక అంశం లేక బహుముఖమైన అంశాలపై అధ్యయనానికి అవసరమైన నిపుణులను జాతీయ ఉద్యానవన బోర్డు యొక్క కమెటీ నిర్ణయిస్తుంది. ఇలా నిర్ణయించేటప్పుడు వారి వృత్తి నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది

నోడల్ సంస్థలు

  1. జాతీయ ఉద్యానవనాల బోర్డు రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి పరిధిలోని సంస్థలు.
  2. కేంద్రప్రభుత్వ సంస్థలు/ఏజన్సీలు
  3. భారతీయ నాణ్యతా ప్రమాణాల మండలి మరియు ఎన్ హెచ్ డి.ఎఫ్ ఇంటి ఇతర సంస్థలు

అధ్యయనాలు మరియు సర్వేలలోని వివిధ అంశాలు

  1. రాష్ట్రాలలో /కేంద్రపాలిత ప్రాంతాలలో మండలులు మొ|| వాటిలో ఉద్యానవనాల అభివృద్ధి గలఅవకాశాలు తెలిపే ఆర్థిక మరియు సాంకేతిక సర్వేలు.
  2. మార్కెట్ అధ్యయనాలు/ప్రత్యేక సమస్యలు/ప్రాంతం/వస్తువుల వారీగా అధ్యయనాలు/ఇతర అంశాలు.
  3. అనువైన ప్రాజెక్టులను గుర్తించడానికి అవసరమైన నిపుణుల సేవలు అందించడం, ప్రాజెక్టుకు ప్రతి పాదనలు తయారుచేయడం, అమలు చేయడం, పర్యవేసించడం మరియు సమీక్షించడం మొ|| నవి.
  4. జాతీయ ఉద్యానవనాల బోర్డు చేసే బహువిధానాలైన మరియు ప్రత్యేకమైన అధ్యయనాలు (ఈ సర్వేలు ఉద్యానవన ప్రాజెక్టులలో ఉపయోగిస్తున్న మౌలిక సౌకర్యాల కల్పన, పరికరాలు, ఇతర యంత్రాలు, పనితీరు రేటింగులకు సంబంధింధి ఉంటాయి.  అలాగే, ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ సంస్థలు స్థాపించడం, ఉత్పత్తులను నిల్వచేయడం, ఇతర ఉత్పత్తుల సంబంధిత ప్రోటోకాల్స్ కు సంబంధించినవి)
  5. మెరుగైన వ్యవసాయ విధానలకు సంబంచించిన అంశాలు, తాజా ఉద్యానవన ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు (కోడెక్స్ , ఇ.సి.ప్రమాణాలు)
  6. తాజా ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన పోటీ తత్వం
  7. జాతీయ ఉద్యానవనాల బోర్డు కార్యాలయ నిర్వహణకు సంబంధించిన కంప్యూటర్ ప్రోగ్రాములు.
  8. ఉత్పత్తికి సంబంధించి కన్సల్టెన్సీ సేవలను అందించడం, పంటల సంరక్షణ, ప్యాకేజింగ్ , నిల్వ చేయడం మార్కెటింగ్ మరియు ఎగుమతులు

అధ్యయనాలకు/సర్వేలకు లేక సలహా బాధ్యతలుఅప్పగించ బడిన సలహా దారులకు/బోర్డు రూపొందించిన జాబితాలోని సంస్థకు అవార్డులను బహుకరించే విధానం

  1. సలహాదారులు/సంస్థలు అవి చేసిన పనులను వాటి కాల వ్యవధి (నిర్ణీతకాల పరిమితిలోపు) మొ|| వివరాలతో బోర్డుకు ఆఫర్ పంపాలి.
  2. సలహాదారులు వారు చేసిన పనులలోకి సాంకేతిక అంశాలకు మరియు ఆర్థిక అంశాలకు సంబంధించిన ఆఫర్ కూడా ఇవ్వాలి.
  3. ఈ ఆఫర్లను బోర్డు నియమించిన కమిటీ పరిశీలిస్తుంది.
  4. బోర్డు నిర్ణయించిన సమయంలో, నిర్ణయించిన ప్రదేశంలో, సలహాదారులు/సంస్థలు  వారి యొక్క ఆఫర్లను, కమిటీకి వ్యక్తిగతంగా కూడా సమర్పించవచ్చు.
  5. ఒక్కొక్క సలహాదారుల అధ్యయన కలాపాలను విడివిడిగా బోర్డు నియమించిన కమిటీ నిర్ణ యిస్తుంది.
  6. ఈ కమిటీ చేసిన సిఫారసు ప్రకారం బోర్డు అధ్యయనాలను అవార్డులను బహుకరిస్తుంది.

బహుమానం చెల్లించే పద్ధతి

  1. అవార్డు పొందిన పని విలువలో 25 శాత
  2. డ్రాప్ట్ నివేదికలో చెప్పిన మొత్తంలో 50 శాతం
  3. తుదినివేదికకు బోర్డు/సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం/సంస్థ ఆమోదిస్తే 25 శాతం చెల్లిస్తారు
గమనిక

ముందుగా చెల్లింపులు చేయాలంటే సలహాదారు/సలహాదారు యొక్క కంపెనీ ఒక ఇండెమ్నిటీ బాండ్ ను మరియు వ్యక్తిగత పూచీకతుఉ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. డ్రాప్ట్ నివేదికను సమర్పించడంలో ఆలస్యమైతే ప్రతినెల ఆలస్యానికి చెల్లించాల్సిన ఫీజుపై ఒక శాతం అధికంగా చెల్లించవలసి ఉంటుంది.

డ్రాప్ట్ సర్వే/సర్వే నివేదిక సమర్పణ

  1. నిర్ణీత సమయంలో సలహాదార్లు డ్రాప్ట్ నివేధికను సమర్పించవలసి ఉంటుంది.
  2. స్లైడ్లు ఇతర మార్గాల ద్వారా నిర్వహించిన సర్వేల నివేదికలను సలహాదార్లు, జాతీయ ఉద్యానవన బోర్డుకుగానీ /ప్రాయోజిత సంస్థకు గానీ సమర్పీంచవలసి ఉంటుంది.
  3. సలహాదార్లు నివేదికను రూపొందించడంలో సమన్వయంతో పనిచేయవలసి ఉంటుంది.

తుది నివేదిక సమర్పించుట

సలహాదార్లు వారి డ్రాప్ట్ నివేదికలను మరియు తుది నివేదికల కాపీలను కోరిన సంఖ్యలో సమర్పించాలి. ఈ నివేదికల సాప్ట్ కాపీలను కూడా పంపాలి.

జాతీయ ఉద్యానవన కన్సల్టెన్సీ సేవలను, ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటును, తన దగ్గర ఉన్న జాబితాలోని సలహాదారుల / సలహా సంస్థల సహకారంతో నిర్వహిస్తుంది

జాతీయ కోల్డ్ చైన్ ల అభివృద్ధి కేంద్రం

సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పరచడం కోసం, మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో, బోర్డు ఒక జాతీయ స్థాయి కోల్డ్ చైన్ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ ఉద్యానవన పంటల కోత అనంతర యాజమాన్య నిర్వహణ అవసరాలను, కోల్డ్ చైన్ మౌళిక వనరుల నిర్వహణ అవసరాలను తీరుస్తుంది. ఇంకా, కోత అనంతర యాజమాన్య నిర్వహణలో ఉద్యాన ఉత్పత్తులను నిల్వచేసుకోవడంలో ఉపయోగ పడే అనువర్తిత పరిశోధన & అభివృద్ధి అవసరాలను కూడా ఈ సంస్థ తీరుస్తుంది

  1. జాతీయ కోల్డ్ చైన్ ల అభివృద్ధి వ్యవస్థ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించడానికి ఉద్దేశించినది. జాతీయ కోల్డ్ చైన్ ల అభివృద్ధి సంస్థ వ్యవస్థాగతనిర్మాణం, ఉపవిధులు (బైలా) భారత ప్రభుత్వ కేంద్రమంత్రిత్వ శాఖ మరియు వ్యవసాయ మరియు సహకార శాఖల ఆమోదంతో రూపొందించ బడతాయి.
  2. 11వ ప్రణాళికా కాలంలో, జాతీయ కోల్డ్ చైన ల అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పడంలో భాగంలో, 25 కోట్ల రూపాయల ఒకే మొత్తంగా ఇచ్చిన గ్రాంటుతో నంగోలాయ్ లో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మించడం జరిగింది.  జాతీయ కోల్డ్ చైన ల అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహించడానికి, జాతీయ ఉద్యానవన బోర్డు ఎలాంటి వ్యయాన్ని భరించడం లేదు. కోల్డ్ చైన్ ల అభివృద్ధి కేంద్రం తన సేవల ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకొంటుంది.
  3. కోల్డ్ చైన్ ల సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించడంలో, ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ ప్రాజెక్టు ల మరియు కోల్డ్ స్టోరేజీల (శీతలీకరణ కేంద్రాలు) మౌలిక సౌకర్యాలు, వాటి సాంకేతిక అంశాల పరిశీలన, సమీక్షీంచడం, శీతలీకరణ కేంద్రాలకు ధృవీకరణ ఇవ్వడం, (ఆమోదించబడిన అమలు సంబంధిత ప్రోటోకాల్స్ సాంకేతిక ప్రమాణాల ప్రకారం) సమగ్ర కోల్డ్ చైన్ ల మౌలిక వనరుల ను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం, సమగ్ర కోల్డ్ చైన్ ల మౌలిక వనరుల ఏర్పాటు (జాతీయ హరిత గిడ్డంగి అభివృద్ధితో సహా) లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, కీలక ఉత్పత్తుల నిల్వల పరిస్థితులకు సంబంధిం చిన అనువర్తిత పరిశోధన & అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం, ఇంధన వినియోగ సామర్థ్యం పెంపు మరియు శీతలీకరణ పరికరాల పనితీరు రేటింగ్ను ఇవ్వడం వంటొ అనేకె కీలక బాధ్యతలను జాతీయ కోల్డ్ చైనల అభివృద్ధి కేంద్రం నిర్వహిస్తుంది.

“ఉత్పత్తి మరియు పంట నూర్పిడి తదుపరి నిర్వహణ ద్వారా వాణిజ్య ఉద్యానవనాల అభివృద్ధి”

వ.నెం

వివరములు

పేజి నెం

అధ్యాయము I

లెటర్ ఆఫ్ ఇంటెంట్ కొరకు దరఖాస్తు చేయు విధానము

అధ్యాయము ll

పూర్తయిన ప్రాజెక్టుల తనిఖీ/ఉమ్మడి తనిఖీ

అధ్యాయము lll

సబ్సిడీ క్లైయిము చేయుటకు మార్గదర్శకములు

అధ్యాయము IV

ప్రాజెక్టువారీ సబ్సిడీ గరిష్ట పరిమితుల మార్గ దర్శకములు

నమూనా I

లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఆసక్తి కనబరుచుట)కొరకు దరఖాస్తు

నమూనాII

అఫిడవిట్

నమూనా III

సంయుక్త తనెఖీ/నివేదిక మరియు ముందస్తు తనిఖీ నమూనా

నమూనా IV

అఫిడవిట్

నమూనా V

బ్యాంకు లేక చార్టెర్డ్ అకౌంటెంట్ చే సర్టిఫై చేయబడిన ఖర్చుల పట్టిక

నమూనా VI

ఆర్ .టి.జి.యస్ . నమూనా

నమూనా VII

డాక్యుమెంట్లతో పాటు పత్రమును బ్యాంకుకు ముందుగ పంపు విధానము

నమూనా VIII

వినియోగ దృవీకరణ పత్రము

అనుబంధము I

జాతీయ ఉద్యానవన బోర్డు కార్యాలయముల పట్టిక

అనుబంధము II

ఖర్చు నిబంధనలు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate