ఇందులోని విభాగాలు
- నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం
- అభ్యుదయ రైతులను సందర్శించడం
- ప్రోత్సాహక మరియు విస్తరణ కార్యకలాపాలు
- భారత్ లోను/విదేశాలలోను అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం
- సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన
- సదస్సులలో, చర్చావేదికలలో, ప్రదర్శనలలో పాల్గొనడం, వాటిని ఏర్పాటు చేయడం
- ఉద్యాన పండిట్
- ప్రచారం చేయడం మరియు ఫిల్ముల ప్రదర్శన
- సాంకేతిక నైపుణ్యాలను, మార్కెట్ ను వినియోగించుకోవడం పై అవగాహన కల్పించడ
- సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా బదిలీ జరగడానికి శాస్త్రవేత్తలకు గౌరవ వేతనాలివ్వడం
- ఉద్యానవన మొక్కల పెంపక కేంద్రాలకు గుర్తింపుకు రేటింగ్ ను ఇవ్వడం.
- పళ్ళజాతిమొక్కలకు, తల్లిమొక్కలను అందించే మొక్కలపెంపక కేంద్రాలను ఏర్పాటుచేయడం
- ఉద్యానవన సంబందిత పార్కులకు వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల మండళ్ళకు సౌకర్యాల ఏర్పాటు కోసం సహాయం చేయడం మొదలైనవి
పథకం లోని వివిధ అంశాలుమరియు ఆర్థిక సహాయం అందించే పద్ధతులు
నూతన సాంకేతిక నైపుణ్యాలను ప్రవేశపెట్టుట
(ఎ)నూతన వ్యవసాయ వనరులను ప్రవేశపెట్టడానికి, అలాగే నాణ్యమైన వాణిజ్య స్థాయి ఉత్పత్తుఅలను ప్రోత్సహించే నూతన మరియు అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పేట్టడానికి, మొక్కల వృద్ధిని క్రమబద్దీకరించే, మొక్కలను రక్షించే పైలట్ ప్రజెక్టులను చేపట్టడం.
(బి)వాణిజ్య స్థాయిలో వెసులు బాటు/గిట్టుబాటు అనేది పైలట్ ప్రాజెక్టుల ప్రధాన ప్రాతిపదిక కావాలి.
- ఈపైలట్ ప్రాజెక్టులు క్రింది అంశాలలో ఒకటి కలిగి ఉండాలి.
- వాణిజ్య స్థాయిలో అమలు చేయడానికి ఈ ప్రజెక్టు ఒక మోడల్ గా ఉండాలి.
- నూతన వ్యవసాయ వనరులపై, సాంకేతిక పరిజ్ఞానం పై. పరికరాలపై ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
- సాంకేతిక పరిజ్ఞానాలను, భావనలను అమలు చేయాలి.
- విత్తనాలను మరియు సాగు మొక్కల వనరులను (స్వదేశీ/దిగుమతి చేసుకొన్నవి) వీలైనంత వరకు రైతుల పొలాలలోనే పరీక్షించాలి. ఇలా పరీక్షించిన తరువాతే ఆమోదించి
- వాణిజ్య స్థాయిలో వినియోగించాలి.
- ప్రతి అంశానికి నిధుల వినియోగం సముచితంగా, న్యాయబద్ధంగా ఉండాలి
(బి)పంటల ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ కోల్డ్ చైన్ , ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ , జీవ సాంకేతిక విజ్ఞానములకు సంబంధించిన నూతన ప్రోటోకాల్స్ ను పరిచయం చేయడం, అభివృద్ధి పరచడం, మరియు నూతన పనిముట్లను/ పరికరాలను యంత్రాలను (పంట ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించినవి)స్టోరేజీలకు సంబంధించిన కోల్డ్ చైన్ సిస్టమ్ ఏర్పాటు నిర్వహించ డాన్ని పరిచయం చేయాలి.
పైన పేర్కొన్న ప్రాజెక్టులను ఉత్తమ పనితీరు ప్రాతిపదికన క్రింద పేర్కొన్న విస్తృత అంశాలలో ఒక దాన్నైనా పరిగణలోకి తీసుకోవాలి.
- క్షేత్రస్థాయి కార్యకలాపాల సామర్థ్యాల పెంపు, ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ, స్టోరేజీ మరియు నిర్వహణ కార్యాకలాపాలు
- ఉత్పత్తి అనంతర నష్టాలను తగ్గించుకోవడం, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం. సెల్ఫ్ లైఫ్ కాలాన్ని పెంచడం.
- ఉత్పాదకత పెంపుకు దోహదపడడం, ఉత్పత్తుల నాణ్యతను మెరుగు పరుచుకోవడం, తద్వారా ధరలను పెంచుకోవడం.
- ప్రస్తుతం ఉన్న స్థాయిని పెంచుకోవడానికి తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలి.
- సంబంధిత అత్యాధునికమైన పనిముట్లను, యంత్రాలు మరియు పరికరాలను మాత్రమే వినియో గించాలి.
(సి) ఉత్పత్తి సంబంధించిన ప్రత్యేక సమస్యలను పరిష్కరించే పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టులు మరియు ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణలో ప్యాకేజింగ్ లో, స్టోరేజీలో, రవాణాలో ఎదురౌ తున్న సమస్యలను పరిష్కరించే, పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టులు స్వదేశీ ఫలాలు, కూరగాయలు, పువ్వులు, వైద్యరంగ మరియు పరిమళ ద్రవ్యాలనిచ్చే మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ మార్కెట్ ను ఎగుమతులను ప్రోత్సహించడం
(డి)తేనెటీగల పెంపకం మరియు తేనె ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ మరియు నిల్వలకు సంబంధించిన పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యాల కల్పన. ఈ పథకం క్రింద ప్రధానంగా అనువర్తిత పరిశోధన & అభివృద్ధి ప్రాజెక్టులకు మాత్రమే ఆర్థిక సహాయం లభిస్తుంది. మామూలు పరిశోధన & అభివృద్ది ప్రాజెక్టులకు ముఖ్యంగా భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు లేక ఏ ఇతర అభ్యర్థిత పరిశోధకులకు గానీ ఈ పథకం క్రింద సహాయం ఇవ్వబడదు. ప్రభుత్వేతర సంస్థలు ఏవైనా, ఈ పథకం క్రింద పరిశోధన & అభివృద్ధి కార్యక్రమంలకు సహాయం లభించదు.
సహాయం అందించే పద్ధతులు
- అంతర్గత కృషి ద్వారా జాతీయ ఉద్యానవనాల బోర్టు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి.
- బోర్డు నియమించిన కమిటీ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టే కార్యక్రమంలో భాగస్వామిగా ఉండదగిన సంస్థను గుర్తించి ప్రాజెక్టు వ్యయంలో 100%ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అయితే ఇలా ఇచ్చు నిధుల పరిమాణంపై క్రింద పేర్కొన పరిమితులు విధించ బడతాయి.
- ‘ఎ’ కేటగిరీలోని పరిశోధనా ప్రాజెక్టులకు 10లక్షల రూపాయలకు మించి సహాయం ఇవ్వబడదు
- ‘బి’, ‘సి’ మరియు ‘డి’ కేటగిరి ప్రాజెక్టులకు ఇచ్చే సహాయం గరిష్ట పరిమితి 25 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.
- రాష్ట్ర వ్యవసాయ/ఉద్యానవన విశ్వవిద్యాలయాలు, జాతీయ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ఉద్యానవన శాఖలు / వ్యవసాయ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఇతర రాష్ట్రాల ఏజన్సీలు సాధారణంగా నిరూపించ బడిన కార్యక్రమాలలో భాగస్వాములుగా ఉంటాయి.
- ఈ పరిశోధనా ప్రాజెక్టులకు సహాయం మంజూరు చేసేటప్పుడు, అవసరమనిపిస్తే నిపుణుల సేవలను, జాతీయ ఉద్యానవనాల బోర్డు ఉపయోగించుకొంటుంది.
వీటిలో పాల్గొనడానికి గల నిబంధనలు
- క్షేత్రస్థాయి ప్రదర్శనలకు చేసే పర్యటనల ఉద్దేశ్యాలపై శిక్షణ మరియు నిర్మాణ స్వరూపంపై,
- జాతీయ ఉద్యానవనాల బోర్డు ఒక వార్షిక కార్యచరణ ప్రణాళికను తయారు చేస్తుంది.
- 20 నుండి 55 సం|| ల మధ్య వయస్సుగల రైతులనే ఎంపిక చేయాలి. ఈ రైతులు తమ స్వంత భూమిలో ఆ ప్రత్యేక ఉద్యానవన పంటను సాగుచేస్తున్నవాడై ఉండాలి. లేదా ఒక ఉద్యానవన వ్యవసాయ క్షేత్రాన్ని తోటను లేక పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సహాయం కోసం,జాతీయఉద్యానవన బోర్డుకు దరఖాస్తు చేసుకొని ఉండాలి. ఈ దరఖాస్తు కూడా మొదటి లేక రెండవ నంబరు పథకాల కోసమే అయిఉండాలి.
- పాల్గొనే వారిని ఎంపిక చేసేటప్పుడు, చిన్న, సన్నకారు రైతులకు, మహిళా రైతులకు జాతీయ ఉద్యానవన బోర్డు ద్వారా (NHB, NHM&TMINE Schemes) సహాయం పొందిన లబ్ది దారులకు, ప్రాధాన్యం ఇవ్వాలి.
- వర్క్ షాప్ లలో, సదస్సులలో చర్చా వేదికలలో తమ అనుభవాలను ఇతరులతో పంచకోవా లని కోరుకొనే రైతులనే జిల్లా స్థాయి రిసోర్సు పర్సన్స్ గా ఎంపిక చేయాలి.
- రాష్ట్ర వ్యవసాయ శాఖ/ఉద్యానవన శాఖ లేక రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఒకరు లేక ఇద్దరు రైతులను గ్రూపులుగా ప్రదర్శనలకు తీసుకొని వెళ్ళొచ్చు.
- శిక్షణలో ఉండవలసిన గరిష్ట సభ్యుల సంఖ్యను బోర్డు నిర్ణయిస్తుంది. శిక్షణా కేంద్రంతో సంప్రదించి సంఖ్యను నిర్ణయిస్తుంది. సాధారణంగా, ఈ సంఖ్య, ప్రభుత్వ అధికారులతో కలుపు కొని 30మందికి మించరాదు.
- రైతులను ఎంపిక చేసి, గ్రూపులుగా ఏర్పరచడం రాష్ట్ర ప్రభుత్వాల పని, లేకపోతే ఈ పనిని ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని జాతీయ ఉద్యానవన బోర్డు, అధికారులు చేయ వచ్చు. వీరే శిక్షణ కార్యక్రమాలను, పర్యటనలను ఏర్పాటు చేస్తారు.
- పెద్ద సంఖ్యలో రైతులు ఈ శిక్షణా కేంద్రాలకు చేరుకొనేందుకు వీలైన రవాణా సాధనాలపై, దగ్గరి రహదారి మార్గం గురించి ఒక ప్రణాళికను రూపొందించాలి.
సహాయం పొందే పద్ధతులు
భారత రైల్వేలలో స్లీపర్ తరగతిలో లేక నౌకాయానం ద్వారా రెండో తరగతిలో కూర్చొని ప్రయాణించడానికి(అండమాన్ నికోబార్ మరియు లక్ష్యదీవుల రైతులకు) అయ్యే రాకపోకల ఖర్చులను బోర్డు సహాయంగా ఇస్తుంది. బోర్డింగ్ చార్జీలుగా రోజుకు ఒక్కరికి 0150 రూపాయలను ఇస్తుంది. సిక్కింతో కలుపుకొని, ఈశాన్య రాష్ట్రాల రైతులకు, వారికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం నుండి విమానంలో ప్రయాణించ డానికి ఖర్చులను ఇస్తుంది
ప్రోత్సాహక మరియు విస్తరణ కార్యక్రమాలు
- ఆధునిక శాస్త్ర సంబంధ మెళకువల గురించి సాంకేతిక పరిజ్ఞానం గురించి, ఆయా ప్రాంతాలకు అనుగుణమైన ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ మరియు ఉత్పత్తుల ప్యాకేజింగ్ పద్ధతుల గురించి ప్రదర్శనలు ఏర్పాటు చేయుట.
- మెరుగు పరచబడిన అధిక దిగుబడినిచ్చే ఫలాలు, కూరగాయలు, పూవులు, అలంకరణ మొక్కలు రకాల గురించి బోర్డు ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంది
అమలు చేసే విధానం
- ఇలాంటి ప్రతిపాదనలను బోర్డు నియమించిన కమిటీ పరిశీలిస్తుంది
- క్షేత్రస్థాయి ప్రదర్శనలను బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమాలను మార్కెట్ వృద్ధి గురించి ఇతర సంస్థలు, నిపుణుల సహకారంతో గానీ, లేకుండా గానీ ఈ ప్రదర్శ నలను బోర్డు ఏర్పాటు చేస్తుంది.
- ఉద్యానవన ఉత్పత్తులను ప్రోత్సహించుటకు మరియు మార్కెట్ అభివృద్ధికి సంబంధించి ప్రదర్శన మరియు వ్యవసాయ యంత్రాలు & పరికరాలు ప్రదర్శనలు బోర్డు ఉద్యానవన సంతలలో ఏర్పాటు చేస్తుంది. దీనివలన పాల్గొన్నవారు వారి వస్తువులను అమ్ముకోవడానికి కూడా వీలుంటుంది. ఈ ఏర్పాట్ల వలన ఉద్యానవన వ్యవసాయ దారులు, ఒకరి అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది
ఇలాంటి సంతలలో పాల్గొనే టార్గెట్ గ్రూపులలో “ఎంపిక చేసిన ఉద్యానవన వ్యవసాయదారులు వ్యవసాయ దారుల సంఘాలు మరియు ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ సంస్థలు, ప్యాకేజింగ్, స్టోరేజ్ మరియు రవాణాకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బోర్డు పర్యవేక్షణ లో అభివృద్ధి పరుచుకొన్న స్వయం సహాయక సంఘాలు లేక రైతులను సంఘటిత పరుస్తు న్న ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అయినా సభ్యులుగా ఉంటాయి
అలాగే, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలు /రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మరియు ఏ ఇతర పరిశోధన మరియు ;అభివృద్దికి సంబంధించిన సంస్థలు మరియు ఉద్యాన వన సంబంధిత వ్యవసాయ యంత్రాల పరికరాలు, పనిముట్లుతయారుచేసే ఉత్పత్తి దారులను కూడా సంతలలో పాల్గొనే టార్గెట్ గ్రూపులో చేర్చారు. అయితే ఆయా వస్తువులు లేక యంత్రాలను ప్రోత్సహించవలసిన అవసరాన్ని బట్టి ఈ సభ్యులను నిర్ణయిస్తారు. ఉద్యానవన రంగం అభివృద్ధికి తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మరియు బదిలీ అనే బోర్డు యొక్క పథకంలో భాగంగా ఈ సంతలను ఏర్పాటును పరిగణించాలి.
ఈ సంతలలో, ప్రదర్శనలో, స్టాళ్ళను ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించడం, వస్తువుల నిల్వ చేసుకొనే సౌకర్యం కెల్పించడం దీనికి అద్దె లేక పన్నులను వసూలు చేయక పోవడం ద్వారా సంతలలో పాల్గొనే ఉత్పత్తి దారులను బోర్డు ప్రోత్సహిస్తుంది.
ప్రదర్శనలలో, సంతలలో పాల్గోన్న టార్గెట్ గ్రూప్ సభ్యులు, స్టాళ్ళు ఏర్పాటు చేసిన వారికి వారి ఉత్పత్తుల శాంపిళ్ళను ఉచితంగా వినియోగదారులకు ఇవ్వడానికి, వారి ఉత్పత్తులను ;ప్రదర్శన శాలలకు రవాణా చేసుకోవడానికి బోర్డు ఆర్థిక సహాయం ఒకే మొత్తంగా అందిస్తుంది. ఈ సహాయాన్ని వారి గ్రూపు ద్వారాగానీ/సంఘం ద్వారా లేక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ వంటి పబ్లిక్ ఏజన్సీద్వారా/రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా /వ్యవసాయ పరిశ్రమల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందించడం జరుగుతుంది. వ్యవసయ పరిశోధన సంస్థలు/వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/హాస్టళ్ళు, ఇతర డార్మిటరీలలో రైతులకు లాడ్జింగ్ , బోర్డింగ్ సౌకర్యం కల్పించబడుతుంది. ప్రదర్శనలు జరిగే ప్రదేశానికి సాళ్ళు ఏర్పాట్లకు, భద్రతకు, లైటింగ్ ఏర్పాట్లకు, నీటి సరఫరాకు, ఉత్సవాలకు ప్రచారానికి అయ్యే వ్యయాలను బోర్డు ఈ పథకంలో భాగంగా భరిస్తుంది.
భారత్ / విదేశాల నుండి నిపుణుల సేవలు
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మరియు బదిలీకి సంబంధించి అవసరమయ్యే స్వదేశంలో మరియు విదేశాలనుండి నిపుణులను బోర్డు సంప్రదిస్తుంది
విదేశాల నుండి నిపుణుల సేవలు
- ఉద్యానవన రంగం యొక్క సాంకేతిక పరిజ్ఞానం అవసరాల పైఆధారపడి విదేశీ నిపుణుల ఎంపిక ఉంటుంది.
- ఈ నిపుణుల సేవలను మొదటి రెండు సంవత్సరాలలో, ఒక్కో ప్రాజెక్టుకు ఒక సం|| 15 రోజుల పాటు సేవలను స్వీకరించడం జరుగుతుంది.
- సహాయం అందించే పద్దతి: భారత ప్రభుత్వం ఆమోదించిన రేట్ల ప్రకారం సేవలు అందించే నిపుణులకు ప్రయాణ మరియు ఇతర ఖర్చులను చెల్లిస్తారు.
భారత్ లోని నిపుణుల సేవలు
భారత్ లోని నిపుణులను సలహాదార్లుగా నియమించుకోవడం, ఇప్పటికే భారత ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం, రేట్ల ప్రకారం జరుగుతుంది. ఉద్యానవన రంగంలోనిఉత్పత్తి, సస్యరక్షణ, ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ పద్ధతులు, స్టోరేజీ, కోల్డ్ చైన్, మౌలిక సదుపాయాలు నిర్వహణ, మార్కెటింగ్ మరియుఎగుమతులు మొ|| అంశాలలోని సాంకేతిక పరిజ్ఞానం అవసరాలకు అనుగుణంగా, నిపుణుల ఎంపిక జరుగుతుంది.
సాకేంతిక పరిజ్ఞానంపై అవగాహన
ఈ విభాగం క్రింద, విస్తరణ సంబంధ కార్యకలాపాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించడానికి, మదింపు చేసి విస్తరించడానికి ఉద్దేశించారు.
అమలు చేసే విధానం
- ఉత్పత్తులు పెంచే విస్తరణ చేపట్టడం, పళ్ళు కూరగాయలు, మరియు పువ్వులను ఎగుమతి చేయడానికి వీలైన నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి వీలుగా కంపెనీ నిర్వహణ, పంటల అభివృద్ధి, సస్యరక్షణ, చీడల నియంత్రణ, సమగ్ర పోషకాల నిర్వహణ, సమగ్ర చీడల నివారణ, వివిధ రకాల విత్తనాలను ఉత్పత్తిచేయడం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం మరియు ధృవీకరణం, నర్సరీలనిర్వహణ, సాగు పద్ధతుల యాంత్రీకరణ, పంటకోత అనంతర యాజమాన్య నిర్వహణ విధానాలు, వస్తువులనిల్వ చేసే పద్దతులు, వర్క్ షాప్ లు, సెమినార్ ./ ప్రదర్శనలు జిల్లా బ్లాక్ స్థాయిలో నిర్వహించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తారు.
- పైన పేర్కొన్న కార్యక్రమాలను జాతీయ ఉద్యానవన బోర్డుగాని, లేక భారత వ్యవసాయ పరిశోధనా సంస్థల ద్వారా/రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా/రాష్ట్ర ప్రభుత్వాల శాఖల ద్వారా/ప్రభుత్వరంగ సంస్థల ద్వారా/ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా/ ATMA సంఘాల ద్వారా/ ప్రాథమిక పెంపకదారుల సంఘాల ద్వారా ఏర్పాటు చేయవచ్చు.
- ఒక ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయబడిన మొత్తాలను, అదే ఆర్థిక సంవత్సరంలో పున రామోదం పొందితే తప్ప సమంజసమైన పద్ధతిలో ఖర్చు చేయాలి.
సహాయం చేసే పద్ధతులు
ఒక కార్యక్రమానికి 50,000/-రూపాయల వరకు ఇవ్వబడుతుంది. అయితే ఈ మొత్తంలోనే రైతులు పాల్గొనే సాంకేతిక పరిజ్ఞానంపై క్షేత్రస్థాయి ప్రయోగాలు చేయాలి. కార్యక్రమాల నిర్వ హణ తీరును సమీక్షించాలి. దీనిపై ఒక అంచనా నివేదిక తయారు చేయాలి. నిర్వాహకులు ఈ నివేధికలను బోర్డుకు సమర్పించాలి.బోర్డు నియమించిన కమిటీ ఈ ప్రతిపాదనలను ఈ విభాగం క్రింద సహాయం చేయ డానికి ఆమోదిస్తుంది.
అమలుపరిచే విధానం
- రాష్ట్ర/జాతీయ /అంతర్జాతీయ స్థాయిలో ఉద్యానవన రంగ అభివృద్ధికి తోడ్పడే సెమినార్లను/ వర్క్ షాప్ లను /ప్రదర్శనలను ఏర్పాటు చేయుట.
- రాష్ట్రస్థాయిలో పైన పేర్కొన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసేటప్పుడు ఆయా రాష్ట్రాలలో జాతీయ ఉద్యానవన బోర్డు /ఎన్ హెచ్ ఎమ్ /టి.ఎమ్ ఎన్ ఇ. ల లబ్దిదారులను కనీసం 50 మందిని జాతీయ ఉద్యానవన బోర్డును మరియు రాష్ట్ర ఉద్యానవన కమీషన్ ను సంప్రదించి, ఆహ్వానించాలి.
- జాతీయస్థాయి కార్యక్రమాలకు, జాతీయ ఉద్యానవన బోర్డు/ జాతీయ ఉద్యానవన కమీషన్ /టి.ఎమ్ ఎన్ ఇ. ల లబ్దిదారులను, ఉత్పత్తి చేసిన రాష్ట్రాలను, అలాగే, ఉత్పాదక రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంనుండి 50 మందిని లబ్దిదారులను ఆహ్వానించాలి.
- పై విధంగా ఆహ్వానించినవారి నుండి రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేయరాదు. ఫీజు చెల్లించిన వారికి ఇక్చినట్లుగా అన్ని సౌకర్యాలు కల్పించాలి
- ఏ సంవత్సరానికి మంజూరు చేసిన మొత్తాలను ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆమోదం పొందితేనే మరుసటి సంవత్సరానికి తరలించాలి
సహాయం అందించే పద్ధతులు
- ఈ రకమైన సహాయం ఒక రాష్ట్రస్థాయి కార్యక్రమానికి గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ఇస్తారు. జాతీయ స్థాయి కార్యక్రమానికి 5 లక్షల రూపాయల వరకు ఇవ్వబడుతుంది.
- అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు. (3-5రోజులు)స్వల్పకాలిక సెమినార్లకు (1-2రోజులు) ఆర్థిక సహాయం రాష్ట్రస్థాయిలో లక్ష రూపాయల వరకు, అలాగే జాతీయ స్థాయి కార్యక్రమానికి 2 లక్షలు గరిష్టంగా ఇస్తారు. అంతర్జాతీయ కార్యక్రమానికి 3లక్షల రూపాయల వరకు ఇస్తారు. (భారత్ లో నిర్వహించే, లేక భారత్ పాల్గొనే అంతర్జాతీయ కార్యక్రమాలకు మాత్రమే)
అమలు చేసే విధానం
- ఈ సెమినార్లు/వర్క్ షాప్ లు/ప్రదర్శనలను ప్రధాన, జాతీయ ఉద్యానవన బోర్డు/ జాతీయ ఉద్యానవన మిషన్/టి.ఎమ్ ఎన్ ఇ. పథకాల క్రింద లబ్దిదారులైన వారికోసమే నిర్వహించాలి. ఏ రాష్ట్రంలోనైనా తగిన సంఖ్యలో లబ్దిదారుల లేనప్పుడు ఇతర ఉద్యానవన ఉత్పత్తిదారులను ఆహ్వానించాలి.
- ఈ కార్యక్రమాలను, ఏ ఒక్క ఉద్యానవన పంటపై పరిశోధనా సంస్థలుగానీ, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలుగానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలుగానీ/కృషి విజ్ఞాన కేంద్రాలుగానీ./ రాష్ట్ర లేక జాతీయ సమాఖ్యలుగానె, ఇతర ఉద్యాన ఉత్పత్తిదారుల సంఘాలుగానీ ఏర్పాటు చేయాలి.
- ఆర్థిక సహాయం పొందకుండా రాష్ట్ర కేంద్రస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేసిన వారు రిజిష్టర్ అయిన ఉద్యానవన ఉత్పత్తిదారులకు 50% సబ్సిడీపై ప్రదర్శనలలో స్టాళ్ళ ఏర్పాటుకు అవకాశమిస్తారు. ఈ మొత్తం ఒక్కో స్టాలు ఏర్పాటుకు రూ.95,000/- లకు మించకుండా ఈ పథకం క్రింద సబ్సిడీగా ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలలో బోర్డు కొంత ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని, తన లబ్దిదారుల కోసం, రెజిష్టర్డ్ సంఘాలకు ఏ పన్ను ఫీజు వసూలు చేయకుండా కేటాయిస్తుంది. తద్వారా, ఉగ్యానవన ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తుంది. దీనివలన, దేశీయం గా ఉత్పత్తి అయ్యే “ఉద్యానవన తాజా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లభిస్తుంది. ఈ రకంగా పాల్గొనడం వలన కలిగే ఆర్థిక ప్రయోజనాలపై అయ్యే వ్యయాలపై ఆధారపడి ఇచ్చే ఆర్థిక సహాయం ఆధారపడి ఉంటుంది.
- ఉద్యానవన సంబంధిత ప్రదర్శనలకు, వర్క్ షాప్ లకు, సెమినార్లకు, శిక్షణా కార్యక్ర్మాలకు మాత్రమే ఈ ఆర్థికసహాయం అందించబడుతుంది. ఈ రకమైన సహాయం అందించే ముందు శిక్షణవలన, పాల్గొనేవారి అవసరాలు ఏ మేరకు తీరుతున్నాయో అంచనా వేయాలి.
- ఆయా ఉద్యానవన పంటల ఉత్పత్తిదారులకు ప్రత్యేకంగా, అలాగే ఆయాపంట కోత అనంతర యాజమాన్య నిర్వాహకులకు, ప్రాసెసింగ్ యూనిట్లకు, శీతలీకరణ కేంద్రాల నిర్వాహకు లకు, ప్రయోగశాలల నిపుణులు మొ|| న వారికి కూడా ఈ పథికం క్రింద శిక్షణ పొందడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది.
- ఒకరికి ఒకరోజుకు అయ్యే శిక్షణా వ్యయాన్ని అందించవలసిన సహాయాన్ని బోర్డు, అందిన దర ఖాస్తులోని సమాచారాన్ని బట్టి నిర్ణయిస్తుంది.
- ఒకరైతు సంఘానికి లేక గ్రూపుకు ఈ పథకం క్రింద సహాయం చేయాలంటే, వీరు పాల్గొనే సెమినార్లకు, వర్క్ షాప్ ల ప్రదర్శనలకు, శిక్షణల నిర్వాహకులకు ఈ పథికం క్రింద ముందే ఏలాంటి ప్రత్యక్ష సహాయం అంది ఉండరాదు.
- పైన పేర్కొన సెమినార్లు / ప్రదర్శనలు/శిక్షణలు/వర్క్ షాప్ ఏర్పాటుకు “అభ్యుదయ రైతుల సందర్శన కార్యక్రమ ఉపపథకం క్రింద లభించే ప్రయోజనాలను కూడ అందించవచ్చు
ఉద్యాన పండిట్ పోటీలు
- ఉద్యాన పండిట్ పోటీలను నిర్వహించడానికి ఆయా రాష్ట్ర ఉద్యానవన డైరెక్టరేట్ లు/వ్యవసాయశాఖ డైరక్ట్రేట్ లు సమర్పించవలసి ఉంటుంది.
- జాతీయ ఉద్యానవన బోర్డు కూడా జాతీయస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
- బోర్డు అందించే సహాయం గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు ఇవ్వబడుతుంది.
ప్రచార కార్యక్రమాలు
ముద్రణలు
- మీడియాకు ఇవ్వడం కోసం (దినపత్రికలు/వారపత్రికలు/ఆడియో/వీడియో సాధనాలు) రైతులు ఇతర లబ్దిదారులకు ఇవ్వడంకోసం, బ్రోచర్లను, ఇతర ప్రచార సామాగ్రిని బోర్డు డైరెక్టుగా తయారు చేసి ముద్రిస్తుంది. ఇవి ఇంగ్లీషు హిందీ భాషలలో ముద్రించ బడతాయి.
- బోర్డు వ్రాసే వర్తాలేఖలు.
- బోర్డు అంతర్గత అవసరాల కోసం ముద్రించే సామాగ్రి
- బోర్డు ఉద్యానవన అంబంధిత పుస్తకాలను కూడా ముద్రిస్తుంది
సహాయం అందించే విధానం
- (i),(ii),(iii)లలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన పనిని స్వయంగా బోర్డుచేపట్టడం గానీ ప్రత్యేక అనుభవంగల బయటి సంస్థలకుక్ (బోర్డు జాబితాలో ఉన్న సంస్థలకే) ముద్రించడానికి, నమూనా తయారీకి, డిజైన్ ల తయారీకి, ఆర్ట్ వర్క్ కోసం బోర్డు అప్ప్గిస్తుంది.
- (i),(ii)లోని అంశానికి సంబంధింకి బోర్డు ఒక్కో సంస్థకు ఒక లక్ష రూపాయల వరకు గరిష్టంగా సహాయం అందిస్తుంది. ఈ సహాయం గురించి ప్రచురించిన పుస్తకం మొదటి పేజీ లోగాని, చివరి పేజీలోగానీ ప్రకటించవలసి ఉంటుంది.
ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం