ఉద్యానవన పంటల సాగు మరియు పంటకోత అనంతర యాజమాన్య నిర్వహణ పద్ధతులను అమలు పరచడం ద్వారా ఈ పంటలసాగు పెంపుదలను వాణిజ్య స్థాయికి తీసుకెళ్ళడం పథకంలో ఉపవిభాగాలు మరియు సహాయం అందించే పద్ధతులు.
పంటల ఉత్పత్తి సంబంధిత ఉప విభాగాలు
క్రింద పేర్కొన్న అత్యాధునిక (హైటెక్ ) పద్ధతులతో పరికరాలతో వాణిజ్య స్థాయిలో పంటల ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల స్థాపకుల స్థాపనకు, పరపతితో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల వివిధ ఉప విభాగాలకు ఆర్ధిక సహాయంఅందించబడుతుంది.
- అత్యధిక నాణ్యత కలిగిన వాణిజ్య ఉద్యానవన పంటలు సాగుకు.
- స్వదేశీ ఉద్యానవన పంటలు/ఉత్పత్తులు, మూలికలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులకు
- పరిమాణ ద్రవ్యాల నిచ్చే మొక్కలు, వైద్యానికి ఉపయోగించే మొక్కలు
- విత్తనాలు మరియు సర్సరీలు
- జీవసాంకేతిక విజ్ఞానం, సూక్ష్మ జీవశాస్త్రం, జీవరసాయన శాస్త్రం, ;జీవవైవిధ్యం మరియు టిష్యూకల్చర్ సంబంధిత ప్రాజెక్టులు
- రక్షిత వ్యవసాయదారులు
- జీవ ఎరువులు
- సహజ ఎరువులు & ఆహార పదార్థాల జీవావరణ అనుకూల వ్యవసాయం, వర్మికంపోస్టు.
- ఉద్యానవన సంబంధిత చీడల నివారణ క్లినిక్ లు /పరిశోధనాశాలలు
- తేనెటీగల పెంపకం మరియు సంబంధిత ఉత్పత్తులు
- పుట్టుగొడుగులు మరియు సంబంధిత ఉత్పత్తులు
- పప్పు దినుసులు మరియు సంబంధిత ఉత్పత్తులు
ఆర్ధిక సహాయం అందించే విధానం లేక పద్ధతులు
పరపతి మొత్తంలో ముడిపడిన సబ్సిడీని ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు ఇవ్వబడుతుంది. రూ.25 లక్షల లోపు విలువ గల ప్రాజెక్టులకే ఈ సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ పరమితి ఈశాన్య రాష్ట్రాలలో 30లక్షల రూపాయల వరకు ఉంది. డేట్ ఫామ్, ఆలివ్, కుంకుమ పువ్వు, వంటి ఓపెన్ ఎయిర్ వ్యవసాయదారులకు, మూలధనం తక్కువగా అవసరమైన, అతి విలువైన పంటల సాగు ప్రాజెక్టులకు సబ్సిడీ ప్రాజెక్టు వ్యయంలో 25 % ఇవ్వబడుతుంది. అయితే ఈ మొత్తం రూ.50 లక్షల గరిష్ట పరిమితి మించరారు. (కొండ ప్రాంతాలలో, షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఈ సబ్సిడీ 33% ఇవ్వబడుతుంది. గరిష్ట పరిమితి రూ.60లక్షలు)
సాధారణమైన కొన్ని షరతులు
- పైన పేర్కొన్న ఆర్ధిక సహాయం, ఓపెన్ కల్టివేషన్ లో 4 హేక్టార్ల (10 ఎకరాలకు పైగా) కు మించిన విస్తీర్ణంలో, మరియు రక్షిత వ్యవసాయంలో 1000 చదరపు మీటర్లకు మించిన విస్తీర్ణంలో చేస్తున్న వారికే ఇవ్వబడుతుంది.
- ప్రాజెక్టు మొత్తం వ్యయంలో అప్పు ద్వారా సమకూరే మొత్తం సబ్సిడీ మొత్తం కంటే 15 % ఎక్కువ ఉండాలి. ఈ రుణం టర్మ్ లోను రూపంలో బ్యాంకుల నుండి గాని లేక ఇతర ఆర్ధిక సంస్థల నుండి గాని సమకూర్షుకొనేదై ఉండాలి.
- కొత్తగా ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభించే ప్రాజెక్టులు అత్యవసరమైన హైటెక్ యంత్ర పరికరాలను ఉపయోగించాలి. ఈ యంత్రాలు పంటల సాగులో విత్తనాలు నాటడం, నీటి పారుదల, ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ కు సంబంధించిన మౌలిక వనరుల కల్పనకు సంబంధించినదై ఉండాలి.
- ప్రాజెక్టులోని ఉపవిభాగాల క్రింద నియమాలకు లోబడిన ప్రాజెక్టు వ్యయాన్ని ఉద్యానవన బోర్డు నిర్ధేశిస్తుంది.
కోత అనంతర యాజమాన్య నిర్వహణ/ప్రాథమిక స్థాయిలో ప్రాసెసింగ్ కు సంబంధించి ప్రాజెక్టు ఉపవిభాగాలు
పరపతి తీసుకోవడం ద్వారా ప్రారంభిస్తున్న మరియు క్రింద పేర్కొన్న అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే ఈ పథకం క్రింద సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నాయి
- కడగటం, ఆరబెట్టడం, విడదీయడం, గ్రేడింగ్ , పంటకోయుడం, ప్యాకింగ్ , ఫ్రీజింగ్ యూనిట్లు మొదలైనవి.
- ఫ్రీకూలింగ్ యూనిట్లు/కూల్ స్టోర్స్
- రెఫర్ వాహనం/కంటెనర్లు
- ప్రత్యేకమైన రవాణా వాహనం
- అమ్మకపు షాపులు
- వేలం వేసే ప్లాట్ ఫారమ్ లు
- పండడానికి నిల్వ చేసే ఛాంబర్లు
- మార్కెట్ యార్డులు/రోప్ వేలు
- రదియేషన్ నివారణ
- ఉత్పత్తుల ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ (వడపోయడం, వేరుచేయడం, పళ్ళరసాల అమ్మకం, గుజ్జు తీయడం, తోలు వలుచుట, ముక్కలు చేయుట, చెక్కడం, నిర్జలీకరణం మొదలైన ప్రాసెసింగ్ ప్రక్రియలు)
- సహజ రంగులు, డైలు తయారుచేయుట
- ఉద్యానవన సంబంధమైన అత్యవసర నూనెలు, పరిమళ ద్రవ్యాలు మరియు సౌందర్య సాధనాలు మొ|| నవి.
- ఉద్యానవన ఉత్పత్తుల వ్యర్థ పదార్ధాలు
- ఉద్యానవన ఉత్పత్తుఅల్ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి వలన స్వదేశీ పరిజ్ఞానంతో, ఉద్యానవన సాగు యంత్రాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, ప్యాకేజింగ్ యంత్రాల తయారీ పెరుగుతుంది.
- నాణ్యత ప్రమాణాలకు పూచీ ఇచ్చే విధానాలను అమలు చేయుట(HACCP,TQM,ISO,EURO GAP మొదలైనవి)ప్లాస్టిక్ క్రేట్లు, డబ్బాలు, కార్టన్లు, ప్రత్యేక ప్యాకేజింగ్ వస్తువులు, నెట్ లు.
ఆర్థిక సహాయం అందించే పద్ధతులు
రుణంతో ముడిపెట్టిన సబ్సిడీ(credit linked back – ended subsidy) ప్రాజెక్టు విలువలో 40% వరకు ఇవ్వబడుతుంది. ఈ మొత్తం గరిష్టంగా రూ.50లక్షలకు మించరాదు. కొండ ప్రాంతాలలో, షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఈ సబ్సిడీ 55% వరకు గరిష్టంగా రూ.60లక్షల వరకు ఇవ్వబడుతుంది. ప్లాస్టిక్ క్రేట్స్ తయారు చేసే ప్రాజెక్టు వ్యయంలో సగం వరకు ఆర్ధిక సహాయంగా ఇవ్వబడుతుంది
ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు మరియు ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ ప్రాజెక్టులకు వర్తించే సాధారణమైన షరతులు
- ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు, మరియు ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ ప్రాజెక్టులకు ఆర్ధిక సహాయం లభిస్తుంది. ఈ ప్రాజెక్టులు, వ్యక్తులకు సంబంధింకిన వాణిజ్య స్థాయి ఉద్యానవన ప్రాజెక్టుల సమూహం కావచ్చు. వేటికైనా ఈ సౌకర్యం లభిస్తుంది.
- ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులలో నూతన యంత్రాలను ప్రవేశపెట్టడానికి, ఆధునిక ప్రాసెసింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టే ప్రాజెక్టులకు సహాయం లభిస్తుంది. అయితే, వాడుతున్న యంత్రాల సాధారణ మరమ్మత్తులకు, పాత యంత్రాల స్థానంలో అదే రకం కొత్త యంత్రాలను ప్రవేశపెట్టడానికి అయ్యే ఖర్చులను మాత్రం కలుపరాదు. పంట ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ పద్ధతులలో ఉదాహరణకు ప్యాక్ హౌజ్ లాంటి ప్రాజెక్టులు, అధిక సబ్సిడీ పొందడానికి అర్హత కలిగి ఉన్నాయి. కానీ ఈ ప్రజెక్టుల్లో బోర్డ్ నిర్ధేశించిన ప్రామాణిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి ఉండాలి.
- క్రేట్స్ , వలలు కొనే వాణిజ్య స్థాయి ఉద్యానవన పాజెక్టులకి 50% వరకు సబ్సిడీని ఒకే విడతలో పొందే అర్హత కలిగిఉన్నాయి. సాధారణంగా కాయలు కాసే సమయంలో గానీ, కోతసమయంలో గానీ ఈ సబ్సిడీ ఇవ్వబడుతుంది.
- ప్లాస్టిక్ క్రేట్స్ కొనడానికి ఉద్యానవన ఉత్పత్తిదారులకు ఆర్ధిక సహాయం అందించడంలో ముఖ్య ఉద్దేశ్యం ఉద్యానవన ఉత్పత్తిదారులకు వినియోగదారు నుండి లభించే ధరలో వాటా పెంచడమే. ఈ ప్లాస్టిక్ డబ్బాల కిచ్చే ఈ ఆర్ధిక సహాయం అప్పుతీసుకొని నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్యాక్ హౌజ్ లకు ఇవ్వడానికి పరిగణించబడుతుంది. ఉద్యానవన ఉత్పత్తులను పక్వానికి తెచ్చేగదులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ లు, ప్రాథమికస్థాయి ప్రాసెసింగ్ యూనిట్ లు, రిజిష్ట్రర్ అయిన తోటల పెంపకం దారుల సంఘాలు, ప్రభుత్వ రంగసంస్థలు పైన పేర్కొన్న ప్రాజెక్టులకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తాయి. ఒక ప్రాజెక్టుకోని అనుకూల అంశాల ప్రాతిపదికగా అంగీకరించ బడతాయి. ఈ అంశాలు ప్రాజెక్టు వ్యాపార నమూనా, వాటా వ్యయంలో భాగంగా పరిగణించాలి. అప్పుతో ముడిపడిన ప్రాజెక్టు వ్యయా లను మదింపుచేసెటప్పుడు, అప్పు ఇచ్చే బ్యాంకు ఇలాగే పరిగణించాలి. అయితే ఒక ప్రాజెక్టులో వాస్తవంగా ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు/క్రేట్స్ అవసరమౌతాయో నిర్ణయించడానికి జాతీయ ఉద్యానవన బోర్డు నియమించిన కమిటీ ఒక ఫార్ములాను రూపొందిస్తుంది.
- షెడ్ నెట్స్ మరియు యాంటి హెయిల్ నెట్స్ లను ఉపయోగించే పరపతితో ముడిపడిన ప్రాజెక్టులను ఒన్ టైం అసిస్టెన్స్ అందించడానికి పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన ప్రస్తుతం వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న పండ్లతోటలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ నిబంధన 4 హెక్టార్ల విస్తీర్ణాన్ని మించిన సాగు ప్రాజెక్టులకే వర్తిస్తుంది. క్రొత్తగా ప్రారంభించదలచిన ఉద్యానవన ఉత్పత్తుల ప్రాజెక్టులకు, వాటి సి.ఎఫ్ .బి. కార్టన్స్ కు Aseptic packaging, Punnts పాలీ బ్యాగుల కొరకు ప్రాజెక్టుల లోని అనుకూలాంశాల ప్రాతిపదికగానే ఆర్ధిక సహాయం అందించబడుతుంది. అది కూడా ప్రారంభం సం||లో మాత్రం ఇవ్వబడుతుంది. అలాగే,ఉద్యానవన ఉత్పత్తుఅలను మార్కెట్ లో ప్రవేశ పెట్టడానికి కూడా సహాయాన్ని అందించబడుతుంది.
- కోల్డ్ స్టోరేజ్ విభాగాలకు ప్రత్యేకంగా ప్రయోజనం కలిగే పథకం కూడా ఉంది. వాణిజ్య స్థాయిలో ఉద్యానవనాల పథకం క్రింద, ఉత్పత్తి అనంతర యాజమాన్య నిర్వహణ ఉపవిభాగాలను ఉత్పత్తి చేసే ప్రాజెక్టులకు అపరిమితంగా సహాయం ఇవ్వబడుతుంది.
- అంశం 2(xvi) లోని పేర్కొన్న ఉత్పత్తులనుస్వదేశంలో ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించడానికి కొన్ని ఉద్యానవన యూనిట్లు ఎంపిక చేయబడతాయి. ఈ యూనిట్లను వాటి మెరిట్ పై ఆధారపడి జాతీయ ఉద్యానవనాల బోర్డు నియమించిన కమిటీ నిర్ణయిస్తుంది.
- ఆర్థిక సహాయంలో కొంత భాగం అప్పుగా ఇవ్వబడుతుంది. ఈఅప్పు టర్మ్ లోనుగా ఇవ్వబడుతుంది. ఈ అప్పు మొత్తం కనీసం అనుమతించిన సబ్సిడీ కంటే 15% ఎక్కువగా ఉండాలి.
- నూతనంగా స్థాపించబోయే ప్రాజెక్టులు లేక ఉత్పత్తి యూనిట్లు సాంకేతిక మరియు ఆర్థిక అంశాలను పరిశీలించి సమీక్షించాలి. తద్వారా నూతన యూనిట్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరా లను, ఉత్పత్తిదారులు ఉపయోగించేలా చూడవచ్చు. అలాగే, ఉత్పత్తి వ్యయాలను తగ్గించడానికి, ఉత్పత్తుఅల నాణ్యతను పర్యవేక్షించవచ్చు. ఇంధన పొదుపును పర్యావరణ పరిరక్షణ అంశాలను కూడా పరిశీలించవచ్చు.
- ఈ పథకంలో భాగంగా ప్రారంభిస్తున్న విభాగాలను లేక యూనిట్లను, నూతన ఉత్పత్తి సంబంధ ప్రాజెక్టులుగా పరిగణించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న ఉత్పత్తి సంబంధిత ప్రాజెక్టులో కలపివేయడంలో గాని లేక జాతీయ ఉద్యానవనబోర్డు పథకాల క్రింద సహాయం పొందిన లేక ఉత్పత్తి సంబంధిత విభాగంలో పరిగణించవచ్చు. వీటిలో కొన్ని వ్యవసాయ సంబంధమైనవి ఉన్నాయి. కొన్ని వ్యవసాయేతర సంబంధమైన విభాగాలు ఉన్నాయి. వీటికి తోడు కొన్ని ప్రాజెక్టులను, సేవా సంస్థలు/వర్తక సంస్థలు/ప్రాసెసింగ్ సంస్థలు సరైన తాజా ఉత్పత్తులతో సంబంధం కలిగినవి కూడా కావచ్చు.
- వివిధ విభాగాలకు సంబంధించిన నిర్ధేశిత వ్యయాలను జాతీయ ఉద్యానవన బోర్డు ఎప్పటికప్పుడు నిర్ణయిస్తూ ఉంటుంది.
ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం