অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జాతీయ ఉద్యానవనాల బోర్డు

పరిచయం (ఉపోద్ఘాతం)

జాతీయ ఉద్యానవన బోర్దు (ఎన్.హెచ్.బి) ను ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సొసైటిగా, 1860 నాటి సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలో 1984 లో కేంద్రప్రభుత్వం స్థాపించింది. ఈ సంస్థ కేంద్ర కార్యాలయాన్నియర్యానా లోని గుర్గావ్ నగరంలో సెక్టార్ 18లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రధాన కార్యనిర్వాహకుడుగా మేనేజింగ్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. కేంద్ర ప్రవ్హుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ మరియు సహకార శాఖ మరియు (ఎన్.హెచ్.బి) బోర్డు డైరెక్టర్ల మార్గదర్శకత్వంలో మేనేజింగ్ డైరెక్టరు ఈ సంస్థ యొక్క వివిధ పథకాలను అమలు చేస్తారు.

(ఎన్.హెచ్.బి) అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలు

  1. ఉద్యానవనాల పంటల సాగు మరియు పంటజీత అనంతరం వాటి యాజమాన్య నిర్వహణ పద్ధతులు అమలు ద్వారా వాణిజ్య స్థాయిలో ఉద్యానవనాలను అభివృద్ధి చేయు
  2. ఉద్యానవన ఉత్పత్తులనునిల్వచేయడం కోసం కోల్డ్ స్ట్రోరేజ్ ల నిర్మాణానికి, పాత కోల్డ్ స్టోరేజీలను అధునీకరించడానికి, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సబ్సిడీపై మూలధనాన్ని సమకూర్చే పథకం
  3. ఉద్యానవనాల అభివృద్ధికి తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి మరియు సాంకేతిక విజ్ఞానం బదిలీ.
  4. ఉద్యానవన పంటలకు సంబంధిత మార్కెట్ సమాచార సేవలు అందించే పథకం
  5. ఉద్యానవాల అభివృద్ధి సంబంధిత సేవలు.

జాతీయ ఉద్యాన వనాల అభివృద్ధి బోర్డు పథకాల లక్ష్యాలు, ధ్యేయాలు

పైన పేర్కొన్న బోర్దు యొక్క వివిధ పథకాల లక్ష్యాలు, ధ్యేయాలు క్రింద పేర్కొనబడ్డాయి

  1. వాణిజ్య స్థాయిలో అత్యాధునిక ఉద్యానవనాలను అభివృద్ధి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించడం, గుర్తించిన ప్రాంతాలలో ఉద్యానవనాలను అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయడం, తద్వారా ఆ ప్రాంతాలను ఉద్యానవన అభివృద్ధి కేంద్రాలు (హబ్ లు) గా మార్చట
  2. ప్రస్తుతం ఉన్న ఉద్యానవనాల కేంద్రాల కార్యకలాపాల విస్తరణ ప్రాజెక్టులో భాగంగా పంటల ఉత్పత్తి అనంతరం యాజమాన్య నిర్వహణకు అవసరమైన మౌలిక వనరులను అన్ని ఉద్యానవన ప్రాజెక్టులకు ఉపయోగపడే విధంగా కల్పించడం.
  3. అప్పుడే ఉత్పత్తి అయిన తాజా ఉద్యానవన పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి, తక్కువ ఇంధనాన్నిమాత్రమే వినియోగించుకొనే సమగ్ర కోల్డ్ స్ట్రోరేజ్ సౌకర్యాలని అభివృద్ధి పరచుట.
  4. నూతనంగా గుర్తించిన సాంకేతిక పరికరాలను, సాంకేతిక నైపుణ్యాలను, వాణిజ్య స్తాయిలో వినియోగించుకొని పరిజ్ఞానాన్ని మదింపు చేసుకోవడానికి వీలుగా ప్రచారం చేయుట.
  5. మొక్కలు మరియు వేర్ల నిల్వ బ్యాంకులు ఏర్పాటు చేయటం ద్వారా మొక్కల పెంపకానికి అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుటకు సహకరించుట/తల్లి పెంపకం కేంద్రాలు అక్రెడిటేషన్ /మొక్కల పెంపకానికి అవసరమైన సామాగ్రిని దిగుమతి చేసుకొనుట మరియు ఉద్యానవన నర్సరీల యొక్క రేటింగ్
  6. ఉద్యానవన పంటల తాజా ఉత్పత్తుల అభివృద్ధికి మరియు వాటి మార్కెట్ సౌకర్యాల అభివృద్ధి కోసం ఉద్యానవన విస్త్రరణ కార్యకలాపాలను పెంచే చర్యలను అమలు చేయుట.
  7. ఉద్యానవన పంటలు సాగుకు సంబంధించిన వివిధ వనరులను, పరికరాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించడానికి కృషిచేయడం, ... మరియునూతనంగా కనుగొన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, అనువర్తిత పరిశోధన అభివృద్ధి పథకాల ద్వారా వాటిని వాణిజ్య స్థాయికి తీసుకొని వెళ్ళుట.
  8. బి.హెచ్.ఎమ్. ప్రోటోకాల్స్ కు సంబంధించిన ప్రమాణాలపై పరిశోధనను మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం,ఉద్యానవన త్పత్తులను భద్రంగా నిల్వచేసుకొనే అనుకూల పరిస్థితులను సూచించడం, కోల్డ్ స్ట్రోరేజ్ కేంద్రాల్ మౌలిక సౌకర్యాలను సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించడం
  9. ఉద్యానవన వ్యవసాయదారులకు, లేక ఉత్పత్తిదారులకు, వారికి సేవలందించే తోటపనివారికి, క్షేత్రస్థాయి నిపుణులైన ఉద్యానవన ఉత్పత్తుఅలను ప్రాసెసింగ్ చేసే మాస్టర్ ట్రైనర్స్ కు నూత సాంకేతిక నైపుణ్యాలను బదిలీ చేయుట.
  10. ఉద్యానవన ఉత్పత్తులను కాలయాపన లేకుండా, తాజాగా వినియోగదారులు వినియోగించు కోవడానికి తగిన చర్యలు తీసుకొనుట.
  11. ఉద్యానవన ఉత్పత్తులను, అమ్మేపార్క్ లు ప్రత్యేక ఎగుమతి మండళ్లలో అవసరమైన సౌకర్యాలను కల్పించుట.
  12. మార్కెట్ సమాచార వ్యవస్థను పటిష్ట పరచడం, మరింత మెరుగు పరచడం మరియు సమాచార సేకరణ, పంపిణీ చేసే డేటాబేస్ లను అభివృద్ధి పరచుట.
  13. ఉద్యానవన పంటల అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక, స్వల్పకాలికజ్ వ్యూహాలను తయారు చేయడం, ఇందుకు గల ఆటంకాలను గుర్తించడం, అవసరమైన, అధ్యయనాలను, సర్వేలను నిర్వహించడం, మరియు సాంకేతిక సేవలను, కన్సల్టెన్సీ సేవలను అందించుట.

ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate