অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సబ్సిడి క్లెయిము చేయుటకు మార్గదర్శకాలు

సబ్సిడి క్లెయిము చేయుటకు మార్గదర్శకాలు

బోర్డుకు అంతిమ సబ్సిడీ క్లెయిము చేయుటకొరకు పత్రములు/కాగితముల సమర్పణ పద్దతి

ప్రాజెక్టుకు రుణసదుపాయమందచేసిన సంబంధిత ఆర్ధిక సహాయ సంస్థ/బ్యాంకు, సంబంధిత యన్.హెచ్.బి.కార్యాలయములో సబ్సిడీ క్లెయిములను నేరుగా ప్రాజెక్టు సబ్సిడీ మంజూరుకు అధికార మియ్యబడిన వారికి సమర్పించవలయును. అన్ని సందర్భములలోను సబ్సిడీ క్లెయిము లను దిగువ తెలిపిన విధంగా స్పీడుపోస్టు/రిజిస్టర్డు పోస్టు/లేక గుర్తింపు ఆధారము కలిగిన బ్యాంకు మెసెంజరు ద్వారాగాని లేక సంబంధిత బ్యాంకు బ్రాంచిచే అధికారమిస్తూ ఇచ్చిన సర్టిఫికేట్ పొందిన వ్యక్తి ద్వారా సమర్పించబడవలయును. ఇందువల్ల కొన్ని రాష్ట్రములలో సంభవించిన తప్పుడు సబ్సిడీ క్లెయిములను అరికట్టుటకు వీలవుతుంది. యన్.హెచ్.బి. ఆర్ధిక సహాయ సంస్థలు ఆన్లైన్ ద్వారా రుణమంజూరు, రుణ కంతుల విడుదల, ప్రాజెక్టు అమలులో పురోగతి మరియు తదుపరి కాలంలో యన్.హెచ్.బి.యొక్క సంబంధిత అధికారిచే, సబ్సిడీ క్లెయిములను మరియు ప్రాజెక్టు పురోగతి తెలియపరచుటకు మరియు సంతకం చేయబడి మరియు దృవీకరణజ్ పత్రములు అందని కారణంగా ఆపరిష్కృతంగా వున్న సబ్సిడీ క్లెయిములను నమోదు చేయుట కొరకు కావలసిన నిబంధనలను ప్రతిపాదిస్తున్నది

అర్హమైన ప్రాజెక్టు వ్యయము

ప్రాజెక్టు వ్యయము లేక పూర్తయిన ప్రాజెక్టు తనిఖీ/ఉమ్మడి తనిఖీలో మదింపు చేయబడిన మొత్తములో 20% నుండి 40% వరకు సబ్సిడి మంజూరు చేయబడుననే భావనతో రైతులు/లబ్ధిదారులు కొన్ని సందర్బాలలో బ్యాంకర్లు వున్నట్లు గమనించడమైనది. అది యదార్ధము కాదు. కాబట్టి దీనికి వివరణ ఏమనగా అర్హమైన ప్రాజెక్టు వ్యయంలో 20% లేక 40% సబ్సిడీగా మంజూరు చేయబడుననేది. అర్హమైన ప్రాజెక్టు వ్యయాన్ని యూనిటు వారీ ప్రాజెక్టు వ్యయాన్ని మరియు విభాగము వారి వ్యయనిబంధనలను దృష్టిలో వుంచుకొని లక్క వేస్తారు. దీనికి అదనంగా విభాగము వారి అర్హమైన వ్యయమనగా ప్రాజెక్టు రిపోర్టులో చూప బడినవాటి లో బ్యాంకు/ఆర్ధిక సహాయ సంస్థచే మదింపు చేయబడిన వ్యయము మరియు ప్రాజెక్టు తనిఖీ/ఉమ్మడి తనిఖీ సందర్బములో మదింపు చేయబడినదని అర్ధము.ప్రాజెక్టు రిపోర్టు/మదింపు నివేదికలో చూపబడని విభాగములు అర్హమైన ప్రాజెక్టు వ్యయాన్ని లెక్కించుటకు గాను చేర్చుటకు అర్హముకాదు. అదేవిధంగా, పంట లేక ప్రాజెక్టు స్థలము యన్.హెచ్.బి. ముందస్తు అనుమతి లేకుండా మార్పు చేయడం సందర్బాన్ని బట్టి ఆభాగము లేక ప్రాజెక్టు సబ్సిడీ పొందుటకు అర్హత కలిగివుండవు. ఆర్ధిక సహాయ సంస్థ/బ్యాంకు మార్పడిని కూడా యన్.హెచ్.బి.వారి ముందస్తు అనుమతితోనే చేయవలెను. ఇంకనూ నిర్ధేశింప బడిన కనీస శాతపు మొత్తాన్ని కాలపరిమితి రుణంగా కలిగి వుండాలి. లేని యెడల సబ్సిడీ క్లెయిములు తిరస్కరించబడును. పంటవారి మరియు విభాగమువరీ వ్యయ నిబంధనలు అనుబంధనలు అనుబంధము –II లో జతపరచబడినవి

సబ్సిడీ క్లెయిముతో పాటు సమర్పించవలసిన పత్రములు

పై విషయములన్నిటిని దృష్టిలో వుంచుకొని, సబ్సిడీ కెయిములు నమూనా –VII లో బ్యాంకు తనిఖీ నివేదికతో కలిపి దిగువ పత్రములతో సమర్పించవలయును

  1. ప్రాజెక్టు పూర్తయినట్లు బ్యాంకుచే జారీ చేయబడిన సర్టిఫిక.
  2. బ్యాంకుచే కాలపరిమితి రుణం మంజూరు చేయుటకు ముందు చేయబడిన ఆర్ధిక మదింపులో  చూపిన ఆర్ధిక వనరులు మరియు ఇతర పెట్టుబడి భాగాలు మరియు వాటి వ్యయాలు, ఆర్ధిక సహాయ సంస్థ/బ్యాంకుచే ప్రాజెక్టు సంస్థ స్థలం ముందుగా తనిఖీ చేయబడిన సందర్బములో వాటి దృవీకరించిన పత్రములను సబ్సిడీ క్లెయిముతో పాటు సమర్పించవలెను.
  3. కాలపరిమితి రుణ అవసరము సూచిస్తూ బ్యాంకు లబ్దిదారునికి జారీ చేసిన నియమ నిబంధన లతో కూడిన మంజూరు పత్రము, కార్యక్రమాలతో కూడిన చెల్లింపు గడువు ఉదా: పండ్ల మొక్కల ను నాటుట డ్రిప్ తో కలిపి స్ప్రింక్లర్ సిస్టమ్ , వాణిజ్యరకం పూల/ఉద్యానవన ఉత్పత్తులకొరకు హైటెక్ గ్రీన్ హౌస్ నిర్మాణం, టిష్యూకల్చర్ యూనిట్ , ఉద్యానవన ఉత్పత్తుల ప్రాథమిక ప్రాసెసింగ్, నాణ్యమైన మొక్కలు నాటు వస్తువులు, నర్సరీ మొ|| వేటికొరకు రుణం మంజూరు చేయబడినదో అవి.
  4. ప్రాజెక్టుకు చెల్లించిన కాలపరిమితి రుణం ఖాతా రోజువారి వివరాలు
  5. ప్రాజెక్టుకు సంబంధించి ప్రమోటరు యొక్క కాలపరిమితి రుణం ఖాతా నకలు
  6. యన్.హెచ్.బి. చే నిర్ధేశింపబడిన నమూనాలో (నమూనా- iv) రూ.20/-ల స్టాంపు పేపరుపై రైతుచే ఇవ్వబడు నోటరీ అఫిడవిట్
  7. లబ్దిదారునిచే రుణ పత్రమునకు జత చేయబడిన ప్రాజెక్టు భూమికి చెందిన యాజమాన్యపు రికార్డ్య్ మరియు ఆర్ధిక సహాయ సంస్థ/బ్యాంకుచే చేయబడిన సర్చ్ రెపోర్టు. దీనివల్ల యన్.హెచ్.బి. తనకు లబ్దిదారునిచే సమ్మతి తెలుపుతూ చేసుకొన్న దరఖాస్తుతో పాటు సమర్పించిన యాజమాన్యపు రికార్డుతో సరిపోల్చు కొనుటకు వీలగును.
  8. బ్యాంకు అధికారి మరియు ప్రమోటర్లచే సంతకం చేయబడిన ప్రాజెక్ట్ తనిఖీ సందర్బంలో తీసుకొన్న పోటోలు. బ్యాంకు అధికారితో పాతు ప్రమోటరు మరియు యన్.హెచ్.బి అధికారి/ఉమ్మడి తనిఖీ సందర్బంలో ఫోటోలో వుండు నట్లు చూచుట అవశ్యము.
  9. ప్రాజెక్టు యొక్క అన్ని ముఖ్యమైన భాగములు అనగా డ్రిఫ్ యిరిగేషన్ సిస్టమ్ పి.హెచ్ .యం. అవస్థానాంశములు, బధ్రపరచుగది, వాచ్ మెన్ /సేవకుల వేచివుండుగది, వాటర్ హార్వెస్టింగ్ పాండ్ , ట్యూబ్ వెల్ , ట్రాక్టరు మరియు ప్రాజెక్టు సైన్ బోర్డుతో పాటు పొలంలో నాటిన పంటను ఫోటోలలో బందించవలెను.
  10. బ్యాంకు లేక చార్టెర్డ్ అకౌంటెంటుచే యన్.హెచ్.బి నమూనాలో సర్టిఫై చేయబడిన వ్యయ వివ రాల పట్టికలు (ఓచర్లు/బిల్లుల ఆధారంగా తయారు చేయబడినవి) తనిఖీ/ఉమ్మడి తనిఖీ ‘సందర్బంగా మదింపు చేయబడిన వ్యయముల ఆదారములు.
  11. బ్యాంకుచే సబ్సిడీ విడుదల ఆర్ . టిజి.యన్ ద్వారా కోరినట్లైన అందుకొరకు చేసుకొన్న దరఖాస్తుతో పాటు సబ్సిడీ రిజర్వుఫండు ఖాతాతో పాటు (నమూనా- iv).

రుణగ్రస్తుని ఖాతాకు సర్దుబాటు చేయు పద్ధతి

L. బ్యాంకు/ఆర్ధిక సంస్థలకు ప్రాజెక్టు పేరు మీదుగా యన్.హెచ్.బి,చె విడుదల చేయబడిన సబ్సిడీని, సబ్సిడీ రిజర్వుఫండు అనుపేరుతో పిలువబడు ఖాతాలో వుంచవెలెను. సబ్సిడీ మొత్తముతో కలుపుకొని లబ్దిదారుని మార్జిన్ ధనాన్ని మినహాయించి బ్యాంకు రుణంగా చెల్లించవలెను. తెరిగి చెల్లింపుల కాలపరిమితులను సబ్సిడీ చివరిలో అనగా రుణం మొత్తం (సబ్సిడీ మినహా) తీరిపోవు సందర్బాన్ని దృష్టిలో వుంచుకొని నిర్ణయించవలెను.రుణ గ్రస్తుని కాలపరిమితి రుణఖాతాకు కాలపరిమితి రుణం మంజూరు చేయబడిన తేదీ నాటి నుండి 36 నెలల కాలం తీరిన తదుపరి మాత్రమే సబ్సిడీని చివరికంతు వసూలుగా మాత్రమే సర్ధు బాటుచేయవలెను. అందువల్ల బ్యాంకుచే సబ్సిడీ మొత్తం అందుకొన్న నాటి నుండి రుణంపై వడ్డీ వసూలు చేయబడదు

బ్యాంకు/ఆర్ధిక సహాయ సంస్థచే వినియోగ దృవీకరణ పత్రము సమర్పించబడుట

ప్రాజెక్టు పూర్తయిన తదుపరి మరియు రుణగ్రస్తుని కాలపరిమితి రుణం ఖాతా ముగింపుచేసిన వెంటనే మరియు కాలపరిమితి రుణ విడుదల తేదీనాటి నుండి 36 మాసముల తర్వాత సబ్సిడీ మొత్తాన్ని చివరి కంతుగా చెల్లించిన మీదట బ్య్తాంకు/ఆర్ధిక సహాయ సంస్థ యన్.హెచ్.బి. కి నిర్ధేశింపబడిన నమూనాలో (నమూనా-viii) సబ్సిడీ మొత్తం వినియోగింపబడినట్లుగా ఒక దృవీకరణ పత్రాన్ని సమర్పించ వలెను.

ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate