অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సబ్సిడీ క్లెయిములను చేయుటకు మార్గదర్శకాలు

అంత్య సబ్సిడీ క్లెయిము చేయుటకు బోర్డు వారికి సమర్పించవలసిన పత్రములు /పేపర్లు

ప్రాజెక్టుకు సబ్సిడీ మంజూరు చేయు అధికారాల దత్తత ప్రకారం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయన్నందించిన సంబంధిత ఆర్ధిక సహాయ సంస్థ/ బ్యాంకు వారు జాతీయ ఉద్యానవన బోర్డు వారికి సబ్సిడీ క్లెయిము లను నేరుగా పంపవచ్చును. సంబంధిత బ్యాంకు బ్రాంచి నుండి అధికృత సర్టిఫికెట్ కలిగియున్న లేక గుర్తింపు దృవీకరణ కలిగియున్న మెసెంజరుచే లేక స్పీడు పోస్టు లేక రిజిష్టరు పోస్టు ద్వారా సబ్సిడీ క్లెయిములు ఈ క్రింద పద్ధతిలో పంపబడవలెను. కొన్ని రాష్ట్రాలలో జరిగినట్లుగా పదేపదే తప్పుడు సబ్సిడి క్లెయిములు చేయబడకుండా ఉండుటకు ఈ ప్రక్రియ దోహదపడును. అప్పు మంజూరును ఆన్ లైన్ ద్వారా చేయుట, అప్పు తాలూకు వాయిదాల విడుదల, ప్రాజెక్టు అమలు పురోగతి సమీక్ష, సబ్సిడి క్లెయిములు చేయుట మొదలగు విషయాలలో జాతీయ ఉద్యానవన బోర్డు వారు ఆర్ధిక సహాయ సంస్థకు కొన్ని సూచనలను చేయుచున్నారు.దీనివలన సంతకం చేయబడిన మరియు దృవీకరించబడిన పత్రాలు రాకముందే జాతీయ ఉద్యానవన బోర్డు అధికారి ప్రోసెస్ చేయుటకు వీలగును.

అర్హమగు ప్రాజెక్టు వ్యయం

పూర్తయిన ప్రాజెక్టు యొక్క తణిఖీ / ఉమ్మడి తణిఖీలో మదింపు చేయబడిన లేక సూచించ బడిన ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం సబ్సిడీగా మంజూరు చేయబడునని లబ్దిదార్లు మరియు అభి ప్రాయ పడుచున్నారు. ఇది వాస్తవం కాదు. అరహతమగు ప్రాజెక్టు వ్యయంలో 40శాతం మొత్తం సబ్సిడీగా మంజూరు చేయబడునని వివరింపబడినది. కాంపౌనెంటు (విభాగం) వారీ వ్యయం ప్రాతిపదిక యూనిట్ ఏరియా ప్రాజెక్టు వ్యయం లెక్కకట్టబడును. పాజెక్టు తనిఖీ/ఉమ్మడి తనిఖీలో మదింపు చేయబడిన వ్యయం, బ్యాంకు/ఆర్థిక సహాయ సంస్థచే మదింపు చేయబడిన వ్యయం ప్రాజెక్టురిపోర్టులొ సూచించిన వ్యయం కంటె విభాగాల వారీగా అర్హమగు వ్యయం తక్కువగా ఉండాలి. అర్హమగు ప్రాజెక్టు వ్యయాన్ని లెక్కించుటకు ప్రాజెక్టురిపోర్టులొ సూచించన విభాగాలు అర్హము కావు. జాతీయ ఉద్యాన వన బోర్డు వారి అనుమతి లేకుండా ప్రాజెక్టు స్థలం లేక విభాగం యొక్కమార్పును చేసిన ట్లయిన సదరు విభాగం లేక ప్రాజెక్టు సబ్సిడీని పొందుటకు అనర్హమగును. ఆర్ధిక సహాయసంస్థ/బ్యాంకరు యొక్క మార్పు కూడా జాతీయ ఉద్యానవనబోర్డు వారి పూర్వానుమతితోనే జరుగవలెను. కాలిక అప్పు యొక్క కనీస శాతంమొత్తం నిబంధన అమలు జరుప బడవలెను. లేన్బట్లైన సబ్సిడీక్లైము తిరస్కరింపబడును.

సబ్సిడీ క్లెయిములతో సమర్పించవలసిన పత్రములు

పై విషయాలను దృష్టియందుంచుకొని బ్యాంకు వారు తనిఖీ రిపోర్టుతో బాటు ఈ క్రింది పత్రములతో సబ్సిడీ క్లెయిములు నిర్ణీత నమూనాలో సమర్పించబడును

  1. బ్యాంకువారిచే ఇవ్వబడిన ప్రాజెక్టు పూర్తయినట్లు సర్టిఫికేట్
  2. పెట్టుబడి విభాగాలుల్ మరియు వాటి వ్యయం సూచించే వివరాలతో బాటు సంస్థకు ఆర్ధిక వనరుల లభ్యత మొ|| విషయాలతో కాలిక అప్పు మంజూరుకు ముందు బ్యాంకువారు రూపొందించిన ఆర్ధిక మదింపు పత్రము అప్పు మంజూరుకు ముందు ప్రాజెక్టు స్థలాని ఆర్ధిక సంస్థ/బ్యాంకు వారు తనిఖీ చేసినట్లయిన సబ్సిడీ క్లెయిముతొ బాటు సంబంధిత దస్తావేజుల ప్రతులు కూడా సమర్పించబడాలి.
  3. ఏ కార్యకాలాపాలకు అప్పు మంజూరు చేయబడినదో ఆ వివరాలు, కాలిక అప్పుయొక్క ఉద్దేశం, తిరిగి చెల్లింపు కాలపరిమితి, షరతులు మొదలగు వివరాలతో లబ్దిదారుకు బ్యాంకు వారిచే  ఇవ్వబడిన అప్పు మంజూరు పత్రము.
  4. ప్రాజెక్టుకు తేదీల వారీగా బట్వాడా చేసిన కాలిక అప్పు వివరముల
  5. ప్రాజెక్టుకు సంబందించి వ్యవస్థాపకుని యొక్క అప్పు ఖాతానకలు
  6. లబ్దిదారుచే అప్పు పత్రానికి జతపరచబడిన ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన హక్కు పత్రం తాలూకు నకలును, సెర్చు రిపోర్టును ఆర్ధిక సంస్థ/బ్యాంకు వారు పొందాలి. దానిని జత పరచాలి. అంగీకార పత్రం కోసం దరఖాస్తుతో బాటు లబ్దిదారు జాతీయ ఉద్యానవన బోర్డు వారికి సమర్పించిన రికార్డు ప్రతితో ఈ రికార్డును సదరు బోర్డు వారు సరిచూచుకొనుటక
  7. బ్యాంకు అధికారి మరియు వ్యవస్థాపకునిచే సంతకాలు చేయబడినజ్ ప్రాజెక్టు తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు హెచ్) ప్రాజెక్టు తాలూకు ముఖ్య విభాగాలు ఫోటోలలో ప్రతిబింబింప బడాలి.
  8. ఉమ్మడి తనిఖీ ప్రాజెక్టు యొక్క్ వ్యయాన్ని అంచనావేసిన మొత్తనికి సాక్ష్యంగా జాతీయ ఉద్యానవనబోర్డు వారిచే నిర్ధేశింపబడిన నమూనాలో చార్టర్డు అకౌంటెంట్ చే సర్టిఫికేట్ లేక బ్యాంకుచే ధృవీకరింపబడిన వ్యయం తాలూకు స్టేటుమెంట్ (ఓచర్లు/బిల్లుల ఆధారంగా తయారు చేసినది)
  9. సబ్సిడీ విడుదలకు బ్యాంకువారు ఆర్ టి.జి.యస్ . ను ఎంచుకొన్నట్లయిన సంబంధిత సబ్సిడీ క్షేమ నిధిఖాతా యొక్క వివరములతో దరఖాస్తు.

ఋణ గ్రహీత యొక్క ఖాతాను సర్దుబాటుచేయు విధానము

జాతీయ ఉద్యానవన బోర్డువారిచే బ్యాకు/ఆర్ధిక సంస్థ వారికి ప్రాజెక్టు యొక్క సబ్సిడీ విడుదల చేయబడినప్పుడె “సబ్సిడీ క్షేమనిధి” అను ప్రత్యేక ఖాతాలో ఉంచవలెను. సబ్సిడీ మొత్తాన్ని అంత్య సబ్సిడీ కాలిక అప్పు ఖాతాకు సర్ధుబాటు చేయవలెను. లబ్దిదారు యొక్క మార్జిన్ మనీ తప్ప సబ్సిడీతో సహా ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం బ్యాంకుచే అప్పుగా బట్వాడా చేయబడవలెను. బ్యాంకు యొక్క అప్పు మొత్తం (సబ్సిడీ కాకుండా) తిరిగి చెల్లింప బడిన తరువాత సబ్సిడీని సర్దుబాటు చేసే విధంగా అప్పు యొక్క తిరిగి చెల్లింపు షేడ్యూలు రూపొందింపబడవలెను.కాలిక అప్పును విడుదల చేసిన తరువాత 36 మాసాలకు ముందుగా కాకుండా లబ్దిదారు యొక్క అప్పు చివరి వాయిదాకు సబ్సిడీ మొత్తం సర్ధుబాటు చేయబడవలెను. బ్యాంకు వారిచే సబ్సిడీ మొత్తం పొందబడిన తేదినుండి లబ్దిదారు యొక్క అప్పు ఖాతాపై వడ్డీ లెక్కింపబడరాదు.

ఆర్ధిక సంస్థ/బ్యాంకుచే వినియోగపత్రం సమర్పణ

లబ్దిదారుకు కాలిక అప్పు చివరవాయిదా విడుదల చేసిన తేదీ నుండి 36 మాసాలలోపున కాకుండా చెలించవలసిన అప్పు చివరి వాయిదా మొత్తాన్ని సబ్సిడీ సర్ధుబాటు చేసిన తరువాత అతని అప్పు ఖాతాను ముగించిన తరువాత ప్రాజెక్టు పూర్తయిన పిమ్మట ఆర్ధిక సంస్థ/బ్యాంకు వారు నిర్ణీత నమూనా (8వ నమూనా)లో జాతీయ ఉద్యానవనబోర్డు వారికి వినియోగ పత్రాన్ని సమర్పించాలి.

ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate