অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సబ్సిడీ పరిమితిని మరియు మార్గదర్శకాలు

సబ్సిడీ పరిమితిని మరియు మార్గదర్శకాలు

యన్.హెచ్.బి వారి పధకాలలోని అన్ని పరపతితో ముడిపడివున్న భాగాలు అనగా పి.హెచ్.యం మరియు కోల్డ్ స్టోరేజీ (శీతల గిడ్డంగి), మరియు ఉద్యానవన ఉత్పత్తుల గిడ్డంగులపై అనుమతించ దగు సబ్సిడీ పరిమితుల పద్దతులను ఉత్పత్తితో ముడిపడివున్న ప్రాజెక్టులకు వర్తింపునకు పాలకవర్గము తమచివరి సమావేశములో 03.12.2009 నాడు ఆమోదము తెలిపియున్నది.అయిన ప్పటికి ప్రాజెక్టుల ను ఉద్దేశ్య పూర్వకంగా విడగొట్టి ఎక్కువ సబ్సిడీ పొందాలను కొనేవారిని నిరోధించుటకు గాను యన్.హెచ్.బి. మార్గదర్శకాలను తయారుచేయవలెనని పాలకవర్గము కోరియున్నది. ఆవిధంగా సబ్సిడీని అనుమతించుట మరియు ఆమోదించుటకు దిగువ మార్గదర్శకాలు వర్తించబడును

ప్రాజెక్టు వ్యయగరిష్ట పరిమితి రూ.50.00లక్షలకు లోబడి (కొండ ప్రాంతాలు మరియు గుర్తింపబడిన ప్రాంతాలలో రూ.60.00 లక్షలు) సందర్బాన్ని బట్టి అనుమతించబడు సబ్సిడీ ఒక్కో ప్రాజెక్టుకు 20% లేక 25% లేక 40% నికి మించరాదు. రూ.50 లక్షాలకు లోబడిన (కొండ ప్రాంతాలు మరియు గుర్తింపబడిన ప్రాంతాలలో రూ.60.00 లక్షల వరకున్న ప్రతి ప్రాజెక్టుకు ప్రతిలబ్దిదారునికి) ప్రాజెక్టు వ్యయం కలిగివున్న వాటికి సబ్సిడీ కొరకు ప్రాజెక్టుల సంఖ్య మరియు కాలపరిమితి వర్తించదు.

లబ్దిదారుడు కొత్త ప్రాజెక్టులను నెలకొల్పి దిగువ నిబంధనలకు లోబది సబ్సిడీని ఎలాంటి నిర్బంధములు లేకుండా వినియోగించుకొన వచ్చును.

  1. ఏ భూభాగం పై నెలకొల్పిన ప్రాజెక్టుకు సబ్సిడీని వినియోగించు కొన్నాడో దానిపై మరో ప్రాజెక్టు నెల కొల్పరాదు. అయితే యింతకు మునుపు అందుకొన్న సబ్సిడీ ప్రాంతామును మించి విస్త్రీర్ణ మున్నట్లై న ఆమించిన పొలానికి మాత్రమే సబ్సిడీ అనుమతించబడును. ఇంకోవిధంగా చెప్ప్లా లంటే మొక్కలు నాటుటకు సహాయ మందజేయబడిన ప్రాంతములో కొత్త మొక్కల పెంపకానికి సబ్సిడీ అనుమ తించబడదు.
  2. కొత్త ప్రాజెక్టు ప్రత్యేక కాలపరిమితి రుణంను మరియు బ్యాంకుచే ప్రత్యేకంగా స్వయం పోషకత్వం కలిగినట్టిదిగా లెక్కవేయబదిన ఒకపూర్తి ప్రాజెక్టు. అది ఎక్కువ సబ్సిడీని పొందుటకుగాను ఉద్దే శ్యపూర్వకంగా విడతొట్టబడినదై వుండరాదు. అదేవిధంగా పరిమితికి మించి సబ్సిడీ పొందు ఉద్దే శ్యంతో ఒక సమగ్ర ప్రాజెక్టు విడగొట్టుట అనుమతించబడదు

వివరణలు

  1. ప్రత్యేక పాలీ హౌస్ /గ్రీన్ హౌస్ లలో రక్షిత వ్యవసాయం ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించబడును.
  2. కొత్తభూమిలో బహిరంగ వ్యవసాయపు ప్రాజెక్టులు ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించబడును.
  3. ఫ్రోజెన్ పియాస్ ను ఉత్పత్తి చేయు ప్రాజెక్టు/కట్వెజిటబుల్స్ ను ఐ.క్యూ.ఎఫ్.తో ప్రాసెసింగ్ ఒక యూనిట్ గా మరియు శీతలగిడ్డంగి రెండవ యూనిట్ గా చీల్చి నప్పుడు వాటిని రెండు ప్రత్యేక ప్రాజెక్టులుగా అనుమతించబడవు. అందుకు కారణం, ఐ.క్యూ.ఎఫ్ భాగాలతో గిడ్డంగి నిర్మాణాన్ని సున్నా ఉష్ణోగ్రతతో సమగ్రపరచాలి,. మరియు శీతల గిడ్డంగి సదుపాయం లేకుండా ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి ప్రాజెక్టుగా పరినణింపబడదు

ఒకే లబ్దిదారునిచే రెండవ మరియు తదుపరి ప్రాజెక్టు(లకు) సబ్సిడీని క్లెయిమ్ చేసినప్పుడు ముందలి ప్రాజెక్టులు తప్పనిసరిగా పూర్తయి పనిచేస్తూ వుండాలి మరియు అవి ప్రమోటరుచే వదలి వేయబడి వుందరాదు.

ప్రభుత్వ రంగ సంస్థలు/రాష్ట్ర ప్రభుత్వము లేక భాగస్వామిగా రాష్ట్ర ప్రభుత్వము కలిగిన ఒకేలబ్దిదారుని యొక్క వివిధ ప్రతిపాదనలుల్ ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య ఏర్పాట్లతో వాణిజ్య స్వయం పోషకత్వం కలిగిన తగు ఉత్పత్తులు అవసరమైన సందర్బాలలో అంగీకరించ బడును.

ఈ మార్గదర్శకాలు 03.12.2008 నుండి అమలులోనికి వచ్చినవి. తత్పలితంగా పైస్థాయి పరిమితిలో సబ్సిడీకి అర్హము చేస్తూ లబ్దిదారుని వారు యల్ .ఓ.ఐ. జారీచేయు ప్రతిపాదనలను పూర్తిగా తరిస్కరించడమైనది. మరియు దానిని కొత్తగా చేసిన మార్గదర్శకాల ప్రకారం నిర్ణయిస్తారు.అయిన ప్పటికీ, అర్హమైన సబ్సిడీ నిర్ణయించబడిన క్లెయిములకు, సబ్సిడీ విడుదల చేయకపోయినట్లైన వాటిని తిరిగి పునరుద్దరణ చేయరాదు. యింకనూ నిర్ణయం చేయబడని సబ్సిడీ క్లెయిములు నూతన మార్గదర్శాకాల దృష్ట్యా నిర్ణయించుటకు అర్హత కలిగి వుండును.

జాతీయ ఉద్యానవన బోర్డు వివిధ విభాగలకు అనుమతించిన సవరించిన వ్యయ ప్రమాణాలు

క్రమ సంఖ్య

విభాగములు

ప్రమాణాలు/నిర్ణయాలు

 

ఆచరించుటకు చివరి తేది

  • ఏ ప్రాజెక్టులకైతే టర్మ్ లోను 1-4-2008 తేదినాటికిగాని తరువాత గాని మంజూరు చేయబడి ఉంటే మార్పు చేయబడిన వ్యయ ప్రమాణాలు వర్తించబడును. మిగిలిన వాటన్నింటికి పాత వ్యయ ప్రమాణాలు వర్తించును.

1

భూమి

  • అసలు ధర లేదా అర్ హమగు ప్రాజెక్టు వ్యయంపై 10%వరకు ఏది తక్కువ అయితే అది (భూమి / ధర స్థలము మరియు దాని అభివృద్ధికైన ఖర్చు కాకుండా)
  • అంగీకార పత్రదరఖాస్తు అందిన తేది నుండి ఒక సంవత్సరము లోపు క్రొత్తగా భూమి కొన్నట్లైతే అనుమతించవచ్చు.

2

భూమి అభివృద్ధి

  • అసలు ధరలేదా అర్ హమగు ప్రాజెక్టు వ్యయముపై 15% (స్థలము /భూమి ధరమరియు భూమి/ స్థలము మరియు దాని అభివృద్ధి కైన ఖర్చు కాకుండా)గరిష్టముగా ఒక ఎకరమునకు రూ.50,000/-ల లోబడి ఏది తక్కువ అయితే అది.

3

సేద్యపు ఖర్చులు

  • ఒక ఎకరాకు నిర్మింపబడిన పరిమితికి లోబడి మొక్కలు నాట్లు వేయుటకు మొక్కలునాటుటకు అయ్యే ఖర్చు శ్రేష్టమైన మొక్కలు దిగుమతి చేసికొన్న రాయల్టీ/చెల్లించిన దిగుమతి చేసుకొన్నట్లు సాక్ష్యము చూపి మరియు ప్రభుత్వ ఐ.సి.ఎ.ఆర్ /య ఎ.యు.యస్ / జాతీయ ఉద్యానవన బోర్డు నర్సరీల నుండి మొక్కలు పొందిన ఎక్కువ ఖర్చును అనుమతించవచ్చును.
  • ఒక ఎకరాకు నిర్ధేశించిన పరిమితికి లోబడి మొత్తము పనిముట్లకు అయ్యేఖర్చు

4

మిశ్రమ పంటలు/ అంతరపంటలు

  • జాతీయ ఉద్యానవనబోర్డు పథకము క్రింద ముఖ్యపంటకు మొదటి సంవత్సరమునకు శాస్త్రీయముగా సిఫార్సు చేసిన మొక్కలనాట్లు పరికరములకు అసలు లేక గరిష్ట వ్యయము ఉత్పత్తి వ్యయాలు
  • పంట నాటుటకు అయ్యే ఖర్చు ముఖ్య పంట నాటుటకు అయ్యే ఖర్చుకు మించి ఉండకూడదు.
  • ముఖ్యపంట వ్యయమునకు లోబడి మిశ్రమపంట వ్యయము ఉండవలెను.

5

నీటివసతి మౌలిక సదుపాయాలు

  • నీటివసతి మౌలిక సదుపాయాలుల్ గొట్టపు బావి పైపులైను, నీటి పారుదల నిర్మాణము, వాటర్ ట్యాంక్ , నీటి చెరువు మొదలగు వాటికి బ్యాంకు వారి ఆర్ధిక నివేదిక ప్రకారము ఎకరా ఒక్కంటికి రూ.50,000/- వరకు ఉండవచ్చును.
  • ఋణ విభాగములో క్రొత్తగా ఏర్పాటు చేయబడిన నీటి పారుదల సౌకర్యాలు గరిష్ఠ వ్యయాలకు లోబడి అనుమతింపవచ్చును.
  • ఒక గొట్టపుబావి నిర్మాణమునకు 500 అడుగులలోతు వరకు 40 హెచ్.పి.మోటారుకు అయ్యే వ్యయము అసలు లేదా 2 లక్షలకు అనుమతింపబడును.
  • 500 అడుగులపైబడి మరియు 40హెచ్.పి.మోటారుకు ఒక్కింటికి  5000/- వరకు అసలు ధర లేదా 4 లక్షలకు మించకుండా  అను మతింపబడును.
  • రక్షిత వ్యవసాయమునకు గొట్టపుబావి, పైపులైను, నీటి నిల్వ చెరువులు మొదలగుబాటి నీటిపారుదల వ్యవస్థకు అయ్యే అసలు ఖర్చు లేదా ప్రతి ప్రాజెక్టుకు రూ.3,00,000/- (మూడు లక్షలు)

6

బిందు/సేద్యం

  • అనుబంధము/ప్రకారము పంటలవారి వ్యయప్రమాణాలు

7

వ్యవసాయ పనిముట్లు,  పరికరాలు

  • పవర్ టిల్లర్ /ట్రాక్టరు (గరిష్ఠముగా 25 హెచ్.పి.)ట్రయిలర్ మరియు సంబంధిత ట్రాక్టరు పనిముట్లు గరిష్టముగా ఒక యూనిట్ వ్యయము 4 లక్షలకు మించకూడదు. అసలు వ్యయము లేదా 4 లక్షల వ్యయపరిమితికి లోబడి ఉండాలి. ప్రాజెక్టు విస్తీర్ణము 3 ఎకరాలకు మించివున్నచో పవర్ టిల్లర్ మరియు అనుబంధ పరికరాల వ్యయము వాటి అసలు ధర లేదా గరిష్టముగా 1-50 లక్షలకు లోబడి.
  • ప్రాజెక్టు విస్తీర్ణము 5 ఎకరాలకు మించి ఉన్నచో ట్రాక్టరు మరియు దాని అనుబంధ పరికరాల వ్యయము వాటి అసలు ధర లేదా గరిష్టముగా 4 లక్షలకు లోబడి
  • మిగిలిన వ్యవసాయ పనిముట్లు, పరికరాలకు పంటల వారిగా వ్యయప్రమాణాలు అనుబంధము 1 లో సూచించబడినది.

8

సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

  • ఎకరమునకు ఒకే విధమైన ప్రమాణీక ధర రూ.20,000/- లేదా అసలు ధర, ఏది తకువైతే అది.
  • గరిష్టముగా అనుమతించబడిన పరిమితి రూ.3లక్షలు (కార్మిక నివాస స్థలము/గోదాముకు లక్ష రూపాయలు మరియు శాశ్వత గృహానికి రూ.2 లక్షలు.
  • రక్షిత సేద్యము ఒక యూనిట్ ఆధారముగా పక్కా గదికి, గ్రూపు గది (జి/పి హౌస) రేటు రూ.1,50,000/- ల వరకు అనుమతించ వచ్చును. లేదా అసలు విస్తీర్ణము ఆధారముగా చరరపు అడుగు కు రూ.250/-లు.

9

పాలి హౌస్ /షెడ్ నెట్ నీడనిచ్చు వల

  • తక్కువ ఖరీదు/కలప: పొగ రూపములో, చిన్న బిందువుల రూపములో వెదజల్లు పరికరమునకు చదరపు మీటరు రూ.100/- బిందుసేద్యముకు అయ్యే ఖర్చుతో కలుపుకొని చదరపు మీటరు కు రూ.500/- ఫాలిహౌస్ కు చరరపు మీటరుకు రూ 400/- లు మరియు చిన్న ఫాలిహౌస్ కు చరపు మీటరుకు రూ. 100/-లు.
  • ఎక్కువ ఖరీదు: బిందుసేద్యములో అయ్యే ఖర్చుతో కలుపుకొని చదరపు మీటరుకు రూ.750/-లు పొగరూపములో/చిన్న బిందువుల రూపములో వెదజల్లు పరికరమునకు చదరపు మీటరుకు రూ. 100/-లు
  • సూక్ష్మ సేద్యపరికరానికి చదరపు మీటరుకు రూ.100/-లు మరియు  ఫాలిహౌస్ కు చదరపు మీటర్య్జ్య్ రిఇ 650/-లు
  • (షెడ్ నెట్) నీడనిచ్చువల: బిందు/తుంపర సేద్యానికి అయ్యే ఖర్చుతో కలుపుకొని చదరపు మీటరుకు రూ.250/-లు
  • నీడనిచ్చు గృహము చదరపు మీటరుకు రూ.200/- మరియు సూక్ష్మసేద్య పరికరానికి చదరపు మీటరు రూ.50/-లు
  • · ఎక్కడకైనా భూమిపై పొర తీసివేయాలి అన్నా మరియు మార్చవలె నన్నా లేదా కుండీలతో/కాంక్రీట్ నేలతో సేద్యము చేయుచున్న పూల తోటల ప్రాజెక్టులకు మొక్కలు నాటుటకు, ఎర్రమట్టి, వరిపూత, కిక్ ఫీట్ , పొగపెట్టి క్రిములను నశింపచేయుట మొదలైనవాటితో భూమిని తయారుచేయుటకు అయ్యే ఖర్చు చదరపుమీటరుకు రూ. 100/-లు అనుమతించవచ్చును.
  • · ఏదైనా తనిఖీ బృందము పూర్తి సంతృప్తితో యిచ్చిన సిఫారస్సులతో భూమితయారు చేయుటకు అయ్యే ఖర్చు అనుమతించ బడును. 20 లక్షల రూపాయల ప్రాజెక్టులను కొన్నింటిని సహాయ సంచాలకు లు ఆకస్మిక తనిఖీ చేయవచ్చును.

10

ఫలసాయసేకరణ కేంద్రం/శీతలగదితో

  • స్థూలముగా ప్రస్తుత ప్రమాణాల ఆధారముగా

11

తేనెటీగల పెంపకము

  • ఒక భాగానికి చెందిన సమగ్రమొక్కలు నాటేప్రాజెక్టుకుఅయ్యేఖర్చు మొత్తము ఖర్చు పరిమితిని మించితే దానిని పరిశీలించ వచ్చును.
  • ప్రస్తుత పండ్లతోటల యాజమానులు/కౌలుదార్లు (కనీసం 5సంవత్సరాల రిజిష్ట్రరు కౌలుదారుడు)తేనెటీగల పెంపకానికి యిచ్చే సబ్సిడీని వేరే విభాగము క్రింద పొందవచ్చును.

12

ఇతరము

  • జాతీయ ఉద్యానవన బోర్డు యొక్క ప్రస్తుత లబ్దిదారుడు ప్లాస్టిక్ బుట్టలు మరియు అరటి గెలలు, ద్రాక్షగుత్తులు రక్షణకు నీడనిచ్చు వల మొదలగువాటిపై సమగ్ర ప్రాజెక్టు యొక్క్ వేరే విభాగము క్రింద సబ్సిడీతో కూడిన పరపతిని కూడా పొందవచ్చును. ఈ పధకము క్రింద మొత్తము సబ్సిడీ పరిమితి 25 లక్షలు.

13

పంటవారి/విభాగము వారి ఖర్చు పరిమితి

  • అనుబంధము – I, అనుబంధము -II

ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate