অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీటి పారుదుల

ఏమిచేయాలి?

  • సరైన సాగుపద్దతులను పాటించి భూసారాన్ని, నీటిని సంరక్షించు కోవాలి.
  • చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించుకొని వర్షపునీటిని సద్వినియోగం చేసుకోవాలి.
  • నీటి ముంపుకు గురయ్యే ప్రాంతాలలో పంటల మార్పిడి, విత్తనోత్పత్తి, నర్సరి पेపెంపకం వంటి పనులు
  • బిందు తుంపర్ల చేద్య పద్దతులను అమలు చేసి 30-37 శాతము నీటిని ఆదా చేసి పంట నాణ్యతను, ఉత్పత్తిని పెంచుకోవాలి.

నీవు ఏమి పొందుదువు?

క్రమసంఖ్య

సహాయక విధం

సహాయక పరిమాణం

 

పధకం

 

1

నీరు తీసుకెళ్లు పైపులు

మీటరుకు రు.25/-లు లేక ధరలో 50 శాతము మించకుండా, గరిష్ట పరిమితి రూ.15,000/- లు ధరతో 600 మీటర్లు.

యన్.యఫ్.యస్.యం

2

ఆయిల్ పామ్ కు బిందు సేద్యం వ్యవస్థ

యస్.యం.యస్.ఏ.వారి వివరణ ప్రకారము

యన్.యం.ఓ.ఓ.పి

3

ప్లాస్టిక్/ ఆర్.సి.సి. ఆధారిత నీరునిల్వనిర్మాణములు/వ్యవసాయ చెరువులు (ఫామ్ పాండ్స్) /సమాజ చెరువుల నిర్మాణములు (100మీటర్లుX100మీటర్లుX3మీటర్లు/చిన్న పరిమాణ చెరువులు/కుంటలు. ఆయకట్టు దామాశా అధారంగా ధర అనుమతించ బడును.

చదును ప్రాంతములలో రు.20 లక్షలు మరియు కొండ ప్ర్రాంతములకు, 10 హెక్టారుల కమాండ్ ఏరియాకు 500 మైక్రాన్ ప్లాస్టిక్ లైనింగ్ తో/ఆర్ సిసి లైనింగ్ .

యన్.హెచ్.యం./హెచ్ . యం.యన్.ఇ.హెచ్ .ఉప పధకములు,యం.ఐ.డి.హెచ్.

క్రింద

4

నీరు నిల్వ కుంటలు/తవ్విన బావులు 20X20X3మీటర్లు (కొలతలతో)చిన్న పరి మాణము బావులకు / కుంటలు దామాశా అధారంగా ధర అనుమతించ బడును.

చదును ప్రాంతములలో రు.1.50 లక్షలు లబ్ధిదారునకు మరియు రూ.1.80 లక్షలు కొండ ప్ర్రాంత లబ్ధిదారునకు, 2 హెక్టారుల కమాండ్ ఏరియాకు 300 మైక్రాస్ ప్లాస్టిక్ లైనింగ్ తో/ ఆర్ సిసి లైనింగ్ .

యన్.హెచ్.యం./హెచ్ . యం.యన్.ఇ.హెచ్ .ఉప పధకములు, యం.ఐ.డి.హెచ్. క్రింద

5

గోధుమ మరియు పప్పు ధాన్యాలకు తుంపరసేధ్యం.

హెక్టారుకు రూ.10,000/-లు లేక ధరలో 50 శాతము మించకుండా,

జాతీయ ఆహార భద్రతా మిషన్ (యన్.యఫ్.యస్.యం)

6

(ఎ) నీరు భూమిలోనికి ఇంకుట తగ్గించి, లైనింగ్ లతో కొత్త నీటి కుంటలు నిర్మించుట.

(బి) నీటి విలువ నిర్మాణములు/కుంటలు

నిర్మాణములు 20యం X 20యం X 3 యం నీటి కుంటలు నిర్మాణమునకు రూ . 40,000/- మరియు లైనింగ్ ఉపయోగమునకు. 50 శాతము రాయితీ రూ.75000/- వేలకు మించకుండా చదును ప్రాంతాలలో మరియు రూ.90000/- పర్వత ప్రాంత్లలో లైనింగ్ తో కలిపి.

యన్.యం.ఓ.ఓ.పి

7

ఆయిల్ పామ్ సాగుచేయువారికి డీజిల్ పంపు సెట్లు సరఫరా

వ్యవసాయ సబ్ మిషన్ మెకానైజేషన్

(యస్.యం.ఏ.యస్) వారి నిబంధనల ప్రకారము 10హెచ్.పి. పంపు సెట్టుకు ధరలో 50 శాతము, పరిమితి రూ. 15,000/- (యస్.యం.ఏ.ఎం).

యన్.యం.ఓ.ఓ.పి

8

బి.జి.ఆర్.ఇ.ఐ.క్రింద బోరు బావులు ఆయిల్ పామ్ పంపకం దారులకు బోరుబావులు

ఒక యూనిట్ కు 100 శాతము సహాయము, పరిమితి రూ.30,000/-

ఒక యూనిట్ కు 50 శాతము సహాయము, పరిమితి రూ.25,000/-

పశ్చిమ భారతములో హరత విపవము తీసుకువచ్చుట. (బీ.జి.ఆర్.ఇ.ఐ)

యన్.యం.ఓ.ఓ.పి

9

తక్కువ లోతు బోరుబావులు

100 శాతము సహాయము,పరిమితి రూ. 12,000/-

(బీ.జి.ఆర్.ఇ.ఐ)

10

10 హెచ్ .పి . వరకు పంపు సెట్లు

50 శాతం రాయితీ పైన లేక రూ.10000/-లకు మించకుండా ఒక పంప్ సెట్ కు ఇవ్వబడును

యన్.యఫ్.యస్.యం.

జాతీయ సుస్థిరవ్యవసాయ మిషన్ (యన్.యం. యస్.ఏ.) క్రింద నీటి నిర్వహణ

నీటి నిల్వమరియు నిర్వహణ

1.1ఎ.

వ్యక్తులకు నీటి నిల్వ వ్యవస్థ

ధరలో 50 శాతము (క్యుబిక్ మీటర్ కు నిర్మాణ ధర రూ. 125/-లు చదను ప్రాంతానికి రూ.150/-లు కొండ ప్రాంతములకు) పరిమితి రూ .75,000/-లు సాధారణ ప్రాంతములకు, రూ. 90,000/- లు కొండ ప్రాంతములకు, లైనింగ్ తో కలుపుకొని. చిన్నపరిమాణము కల చెరువులు/బావులు తవ్వుటకు,దామాషా ఆదారముగా ధర అనుమతించ బడును. లైనింగ్ లేని చెరువులు/ కుంటల ధరకు 30 శాతము తక్కువ.

(యన్.యం.యస్.ఏ)

1.1బి

యం.యన్.ఆర్.ఇ.జి.ఏ./

డబ్ల్యు.యస్.డి.పి. క్రింద లైనింగ్ చేసిన చెరువులు నిర్మాణము చేసిన కుంటలు.

ప్లాస్టిక్/ఆర్.సి.సి. లైనింగుకు ధరలో 50 శాతము లేక చెరువు/కుంట/బావికి పరిమితి రూ .25,000/-

(యన్.యం.యస్.ఏ)

1.2

సామాజిక కమ్యూనిటీస్ లకు నీటి నిల్వ వ్యవస్థ -

ప్లాస్టిక్ / ఆర్.సిసి. లైనింగ్ లు (పబ్లిక్ భూములలో) ఉపయోగించి చెరువులు నిర్మించుటకు/వ్యవసాయ భూముల్లో చెరువులు/ చెక్ డ్యాములు/ జిలాశయాలు నిర్మించుట

ధరలో 100 శాతము పరిమిత రూ .20 లక్షల/ చదును ప్రాంతంలో ఒక యూనిట్ కు, రూ ..25 లక్షలు కొండ ప్రాంత యూనిట్లకు. ఆయకట్టు ఏరియా ప్రాంతములో 10 హెక్టారులకు లేక అలాంటి పోలిక ప్రాంతములలో దామాషా ప్రకారము ఆధార పడును. లైనింగ్ చేయని చెరువులు/ కుంటలు 30 శాతము తక్కువ.

 

 

(యన్.యం.యస్.ఏ)

1.3

గొట్టపు బావులు / బోరుబావులు నిర్మించుట. (లోతు తక్కువ / మధ్యమము)

సంస్థాపన ధరలో 50 శాతము, ఒక యూనిట్ కు, పరిమితి రూ.25,000/-లు.

(యన్.యం.యస్.ఏ)

 

1.4

చిన్న చెరువుల నవీకరణ / పునరుద్దరించుట.

నవీకరణ ధరలో 50 శాతము, పరిమితి రూ.15,000/-లు

(యన్.యం.యస్.ఏ)

1.5

పైపు/ప్రీక్యాస్టు పంపిణీ వ్యవస్థ

వ్యవస్థ ధరలో 50 శాతము, పరిమితి రూ.10,000/- ఒక హెక్టారుకు సహాయము, లబ్ధిదారునికి లేక సమూహము నకు, గనిష్ట పరిమితి 4 హెక్టారులు.

(యన్.యం.యస్.ఏ)

1.6

నీరుపైకి తీసుకెళ్లు పరికరములు (లిఫ్ట్ ఇరిగేషన్) (కరెంటు/డీజిల్ /గాలి/సోలార్ )

సంస్థాపన ధరలో 50 శాతము, పరిమితి రూ.15,000/- కరెంటు/డీజిల్ యూనిట్లకు మరియు రూ.50,000/- లు సోలార్ / గాలి యూనిట్లకు.

(యన్.యం.యస్.ఏ.)

క్రమ సంఖ్య

సహాయక విధం

సహాయక పరిమాణం

పధకం

2

బిందు సేద్యం

మొత్తం సంస్థాపన ధరలో 25 నుండి 35 శాతము నాన్ డిపిఏపి/డిడిపి/యన్ ఇ హెచ్ ప్రాంతములకు మరియు 35 నుండి 50 శాతము డిపిఏపి/డిడిపి/

యన్ ఇ హెచ్ ప్రాంతములకు 10 శాతము అధిక సహాయము రాష్ట్ర ప్రభుత్వముల (డిపిఏపి వచ్చిన ప్రాంతములలో, డిడిపి – అడవి అభివృద్ది కార్యక్రమములలో, ఈశాన్య మరియు హిమాలయాల రాష్ట్రములలో) సంస్థాపన ధర సరిచేయుచు ఎక్కువ సహాయము పరిమితము చేయబడినది. ఎక్కువ వైశాల్యము కల పంటలకు స్థాపన ధర రూ.37,200/- (సరాసరి) మరియు తక్కువ వైశాల్యము కల పంటలకు రూ.90,000/- (సరాసరి) కాని, దీని ధర పంట వైశాల్యము మరియు భూమి వైశాల్యమును బట్టి ఆధారపడును. లబ్ధిదారునకు / సమూహమునకు గరిష్ట సహాయము 5 హెక్టారులకు పరిమితం చేయబడినది.

(యన్.యం. యస్.ఏ.)

3

తుంపర సేద్యం

బిందు సేద్యములాగా రాష్ట్ర ప్రభుత్వములు ఇచ్చు సహాయము మరియు మొత్తం సంస్థాపన ధర అధిక సహాయము, తుంపర సేద్యంకు కూడా ఇవ్వబడును. ఎక్కువ పరిమితి సహాయము సంస్థాపన ధరపై ఆధారపడి యుండును. సాధారణ సంస్థాపన ధర రూ.58,900/-లు హెక్టారుకు, సూక్ష్మ తుంపర సేద్యనకు, రూ.85,200/-లు చిన్న తుంపర సేద్యనకు, రూ.19,600/-లు మార్చి పెట్టె తుంపరులకు, రూ.36,600/- హెక్టారుకు, అర్థ శాశ్వత నీటిపారుదల వ్యవస్థకు మరియు రూ 31,600/- హెక్టారుకు, పెద్ద పరిమితి గల తుంపర నీటిపారుదల వ్యవస్థకు (రేన్ గన్ ) లబ్ధిదారునకు / సమూహమునకు గరిష్ట పరిమితి అనుమతించునది. 5 హెక్టారులు

(యన్.యం. యస్.ఏ.)

ఎవరిని సంప్రదించాలి?

  • జిల్లా వ్యవసాయ అధికారి/ జిల్లా ఉద్యానవన అధికారి/ ప్రాజెక్టు డైరక్టరు, ఆత్మా.
  • ఆదారము: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం

    చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate