অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ భీమా

ఏమి చేయాలి?

  • ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడ పురుగులు,క్రిమి కీటకాదులు, తెగుళ్ళ బెడద,ఉప్పెన, కరువు, కీటకాలు, నీటి ముంపులు, వడ్లగండ్ల వానలు, అత్యల్ప వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నుండి రక్షణ కోసం రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
  • మీ ప్రాంతములో వర్తింప చేయబడుతున్న పంట భీమా పధకం ద్వారా లబ్ది పొందాలి. జాతీయ పంట భీమా పధకము(ఎన్.ఏ.సి.ఐ.సి) మూడు రకాల పథకాలు 1. సవరించిన జాతీయ పంట భీమా పధకము (ఎమ్.ఎన్.ఏ.ఐ.ఎస్),
  • 2. వాతావరణ ఆధారిత పంటల భీమా పథకము (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్) మరియు 3. కొబ్బరి మొక్కల భీమా పథకము (సి.పి.ఐ.ఎస్) అమలు చేయబడుతున్నాయు.
  • ప్రకటించబడిన పంటలకు ఋణము తీసుకొనిన యెడల మీరు (ఎమ్ ఎన్ ఏ ఐ ఎన్ )/ (డబ్ల్యు బి సి ఐ ఎస్ ) పథకం తప్పని సరిగా వర్తిస్తుంది. ఋణాలు తీసుకోని రైతులు ఐచ్చికంగా ప్రీమియంగా చెల్లించి పంటల భీమా చేసుకోవాలి.
  • పంటల భీమా పథకం ద్వారా లబ్ది పొందడానికి దగ్గర లోని బ్యాంక్ /ఇన్సూరెన్స్ కార్యాలయాలను సంప్రదించాలి.

మీరు ఏమి పొందుతారు?

క్రమ సంఖ్య

పథకము

సహాయము

 

 



1





సవరించబడిన జాతియ

వ్యవసాయ బీమా పథకము

(ఎమ్.ఎన్ ఏ.ఐఎస్ ),

  • ప్రకటించబడిన ఆహార పంటల, నూనె గింజలు మరియు తోట /ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటల రక్షణ భీమా పథకము.

  • ప్రకటించబడిన పంటల భీమా పథకము యొక్క వాస్తవమైన గరిష్టమైన ప్రీమియము రేటుకు లోబడి రబీ మరియు ఖరీప్ కాలములో వేయు ఆహార మరియు నూనె గింజలు పంటలకు గాను 11% మరియు 9% వరకు ఉండును. ఇదే విధముగా,వార్షిక తోట / ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటలకు 13% వరకు ఉండును.

  • అన్ని రకాల రైతులకు ప్రీమియము పరిమితి ఆధారముగా, సబ్సీడీ 75% వరకు ఏర్పాటు చేయబడును.

ఎ. 2% వరకు ఏమీ లేదు

బి. 2-5% కంటే ఎక్కువ 40% ప్రీమియము నగదు కనీసము 2%నకు లోబడి

సి. 5-10% కంటే ఎక్కువ 50% ప్రీమియము నగదు కనీసము 3%నకు లోబడి

డి. 10-15% కంటే ఎక్కువ 60% ప్రీమియము నగదు కనీసము 5%నకు లోబడి

ఇ. 15% కంటే ఎక్కువ 75% ప్రీమియము నగదు కనీసము 6%నకు లోబడి

  • ప్రకృతి/వాతావరణ ప్రతికూల పరిస్థితుల వలన విత్తనాలు నాటలేకపోవడము జరిగినపుడు, భీమా మొత్తము పైన 25% వరకు ఈ పరిస్థితులను అధిగ మించుటకు గాను క్లేయిములు/నష్ట పరిహారములు చెల్లింపు చేయబడును. ప్రకటించ బడిన పంటలకు గాను వాస్తవముగా రావలిసిన ఆదాయము కంటే ఒకవేళ పంట పైన రాబడి లేదా ఆదాయము తక్కువగా ఉన్నచో అట్టి పంట రాబడి తరుగునకు సమానముగా నష్ట పరిహారములు చెల్లింపు చేయ బడును.

  • ఏది ఏమైనను, కొన్ని ప్రకటించిన ప్రాంతాలలో, పంట నష్ట పరిమితి 50% ఎదుర్కొన్న సందర్బాల లోనికి తీసుకొన బడును.

  • దీనితో పాటు, తుఫానుల వలన పంట కోతల కాలము (2వారాల వరకు) జరుగు నష్టాన్ని కూడా పరిగణన లోనికి తీసుకోన బడును.

  • స్థానికంగా సంభవించే ప్రమాదాలు అంటే వడగళ్ల వానలు మరియు కొండ పరియలు విరిగి పడటం మొదలగు నష్టాలను, వ్యక్తి గత ఆదారంగా మధింపు చేసి మరియు భీమా పథకము క్రింద ఉన్న బాధిత రైతులకు తదను గుణముగా చెల్లింపు చేయబడును.

2

వాతావరణ ఆదారిత పంటల బీమా పథకము (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్)

  • ప్రకటించబడిన ఆహార పంటల, నూనె గింజలు మరియు తోట /ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటల భీమా రక్షణ కలదు.

  • ప్రకటించబడిన పంటల భీమా పథకము యొక్క వాస్తవమైన గరిష్టమైన ప్రీమియము రేటుకు లోబడి రబీ మరియు ఖరీప్ కాలములో వేయు ఆహార మరియు నూనె గింజలు పంటలకు గాను 10% మరియు 8% వరకు ఉండును. ఇదే విధముగా,వార్షిక తోట / ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటలకు 12% వరకు ఉండును. ఇది 12% వరకు ఉంచబడినది.

ఎ. 2% వరకు ఏమీ లేదు

బి. 2-5% కంటే ఎక్కువ 25% ప్రీమియము నగదు కనీసము 2%నకు లోబడి

సి. 5-8% కంటే ఎక్కువ 40% ప్రీమియము నగదు కనీసము 3.75 %నకు లోబడి

డి. 8-50% కంటే ఎక్కువ 50% ప్రీమియము నగదు కనీసము 4.8%నకు లోబడి, గరిష్టముగా నగదు ప్రీమియము పైన రైతులకు 6% చెల్లింపు చేయబడును.

  • పంటలకు గాను నిర్ధేశించబడిన వాతావరణ సూచనలు అనగా (వర్షపాతము/ఉష్ణోగ్రత/ గాలిలో తేమ/ గాలి తీవ్రత మొదలగునవి) భేదము (తగ్గింపు / హెచ్చు) జరిగి నపుడు, ఇవ్వబడు నష్ట పరిహారము ప్రకటించ బడిన ప్రాంతాలలో ప్రకటించ బడిన పంటలకు గాను ఇట్టి తీవ్రతను బట్టి కలిగిన వ్యత్యాసము ప్రకారము చెల్లింప బడును.

3

కోకోనట్ పాల్మ్ భీమా పధకము (సిపిఐఎస్ )

  • కొబ్బరి పంపకము దారులు సంరక్షణకు భీమా

  • భీమా కిస్తు రేటు రూ.9.00 (వయస్సు 4 నుండి 15 సంవత్సరములు) మరియు (16 నుండి 60 సంవత్సరములు) రూ.14.00

  • 50 – 75 % భీమా కిస్తు పైన సబ్సిడి అన్ని రకాల రైతులకు ఇవ్వబడును.

  • ప్రకటించబడిన ప్రాంతాలలోని రైతులకు కొబ్బరి చెట్లు ధ్వంసము జరిగినపుడు, నష్ట పరిహారము భీమా చేసిన మొత్తమునకు / జరిగిన నష్టమునకు చెల్లింపు చేయబడును.

ఎవరుని సంప్రదించాలి?

దగ్గరలో ఉన్న వాణిజ్య బ్యాంకులు, నమోదు చేయబడిన జనరల్ భీమా కంపెనీలు, క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటిలు మరియు జిల్లా వ్యవసాయ అధికారులు/బ్లాక్ డెవలప్ మెంట్ అధికారులను సంప్రదించండి.

ఆదారము: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate