హోమ్ / వ్యవసాయం / పథకములు / పరంపరాగత్ కృషి వికాస్ యోజన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పరంపరాగత్ కృషి వికాస్ యోజన

పరంపరాగత్ కృషి వికాస్ యోజన నిర్వహణీయ జాతీయ వ్యవసాయ మిషన్ ప్రధాన ప్రాజెక్ట్ (NMSA)లోని సాయిల్ హెల్త్ మానేజ్మెంట్ (SHM)కు సంబంధించిన ఒక విస్తృత భాగం.

"పరంపరాగత్ కృషి వికాస్ యోజన " నిర్వహణీయ జాతీయ వ్యవసాయ మిషన్ ప్రధాన ప్రాజెక్ట్ (NMSA)లోని సాయిల్ హెల్త్ మానేజ్మెంట్ (SHM)కు సంబంధించిన ఒక విస్తృత భాగం. PKVY కింది సమూహ విధానం మరియు PGS సర్టిఫికేషన్ ద్వారా సేంద్రీయ గ్రామలను దత్తత తీసుకొని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రచారం చేస్తారు. PKVY కింది సమూహ విధానం మరియు PGS సర్టిఫికేషన్ ద్వారా సేంద్రీయ గ్రామలను దత్తత తీసుకొని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రచారం చేస్తారు.

అంచనావేసిన ఫలితాలు

పథకం ఊహలు:

 • సేంద్రీయ వ్యవసాయం ద్వారా వాణిజ్య సేంద్రీయ ఉత్పత్తి అభివృద్ధి.
 • పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉత్పత్తి ఉంటుంది మరియు వినియోగదారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది.
 • ఇది రైతుల ఆదాయం పెంచుతుంది మరియు వర్తకులకు సమర్థవంతమైన మార్కెట్టును సృష్టిస్తుంది.
 • ఇది ఇన్పుట్ ఉత్పత్తి చేయటానికి సహజ వనరుల సమీకరణ చేసేలా రైతులను చైతన్యపరుస్తుంది.

కార్యక్రమం అమలు

 • పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY) కింద సేంద్రీయ వ్యవసాయం చేపట్టేలా రైతుల సమూహాలకు ప్రేరణ ఇస్తారు.
 • 50 ఎకరాల భూమిని కలిగిన యాభై లేదా ఎక్కువ మంది రైతుల సమూహం ఈ పథకం కింద సేంద్రీయ వ్యవసాయం చేపడతారు. మూడేళ్లలో ఈ విధంగా 10,000 సమూహాలను తయారు చేసి 5.0 లక్షల ఎకరాల సేంద్రీయ వ్యవసాయం చేపట్టేలా చూస్తారు.
 • దృనీకరణ ఖర్చు కోసం రైతులపై ఎటువంటి భారం ఉండదు.
 • విత్తనాలు కొనడానికి మరియు మార్కెట్లోకి ఉత్పత్తిని రవాణా చేయడానికి ప్రతి రైతుకు రూ. 20,000 ఎకరానికి మూడు సంవత్సరాలలో అందిస్తారు.
 • సంప్రదాయ వనరులను ఉపయోగించి సేంద్రీయ వ్యవసాయ ప్రచారం చేయబడుతుంది మరియు సేంద్రీయ ఉత్పత్తులను అంగడికి (మార్కెట్) అనుసంధానిస్తారు.
 • రైతులను పాల్గొనేలా చేయటం ద్వారా సేంద్రీయ ఉత్పత్తి యొక్క దేశీయ ఉత్పత్తి మరియు ధ్రువీకరణ పెంచుతారు.

భాగాలు మరియు సహాయ విధానాలు

 1. పాల్గొనే హామీ వ్యవస్థ (పార్టిసపేటరీ గ్యారంటీ సిస్టం-PGS) దృవీకరణను సమూహ విధానం ద్వారా ఎంపిక చేసుకోవటం
  • రైతులు/స్థానిక ప్రజలను 50 ఎకరాల సమూహాలుగా ఏర్పడడానికి ఒప్పించడం
   • లక్ష్య ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయ సమూహాలను ఏర్పరిచేందుకు రైతులతో సమావేశాలు మరియు చర్చలు చేయటం @ రూ 200 /రైతు.
   • సేంద్రీయ వ్యవసాయ పొలాలను సమూహా సభ్యులకు చూపించటం. @ రూ 200/ రైతు
   • సమూహాన్ని ఎర్పరచటం, PSG రైతు ప్రతిజ్ఞ మరియు లీడ్ రిసోర్సుఫుల్ పర్సన్ (LRP) గుర్తింపు.
   • సేంద్రీయ వ్యవసాయంపై సమూహ సభ్యుల శిక్షణ (@ రూ . 20000 శిక్షణకు, 3 శిక్షణలకు)
  • PGS దృవీకరణ మరియు నాణ్యత నియంత్రణ
   • 2 రోజుల PGS దృవీకరణ శిక్షణ. @ రూ 200/LRP
   • శిక్షకులకు (20) శిక్షణ లీడ్ రిసోర్స్ పర్సన్స్. @ రూ 250/రోజు/3 రోజులు సమూహానికి.
   • రైతు ఆన్ లైన్ నమోదు @ రూ .100 సభ్యుల సమూహం x 50
   • నేల నమూనా సేకరణ మరియు పరీక్ష (21 నమూనాలు/సంవత్సరం/సమూహం) @ నమూనాకు రూ. 190, మూడు సంవత్సరాల వరకు
   • సేంద్రీయ పద్ధతులకు మారిన పద్ధతి, ఉపయోగిస్తున్న ఇన్పుట్లు, అనుసరిస్తున్న పంట నమూనా, ఉపయోగించిన సేంద్రీయ పెంట మరియు ఎరువులు మొదలైన వాటికి సంబంధించిన నమోదు. PGS దృవపత్రం @ రూ .100 ప్రతి సభ్యుడు x 50.
   • సమూహ సభ్యుల పొలాల తనిఖీ @ రూ 400/తనిఖీ x 3 (సమూహానికి సంవత్సరానికి 3 తనిఖీలు పూర్తి చేస్తారు)
   • NABLలో అవశేష నమూనాల విశ్లేషణ (ఏటా 8 నమూనాలు). @ రూ 10, 000/నమూనా
   • దృవీకరణ ఛార్జీలు
   • ధ్రువీకరణ కోసం కార్యనిర్వహణ ఖర్చులు
 2. సమూహ విధానం ద్వారా ఎరువుల నిర్వహణ మరియు జీవ నత్రజని పంటలు పెంపు కోసం సేంద్రీయ గ్రామాల ఎంపిక
  • ఒక సమూహం కోసం సేంద్రీయ సేద్యం ప్రణాళిక
   • భూమిని సేంద్రీయంగా మార్చడం @ 1000/ఎకరా x 50
   • పంట వ్యవస్థ పరిచయం; సేంద్రీయ సీడ్ సేకరణ లేదా సేంద్రీయ నర్సరీ పెంచడం @ రూ .500/ఎకరం/సంవత్సరం x 50 ఎకరాలు
   • పంచగవ్య, బీజ్అమృత్ మరియు జీవామృత్ తదితర సాంప్రదాయ సేంద్రీయ ఇన్పుట్ ఉత్పత్తి యూనిట్లు @ Rs.1500/యూనిట్/ఎకరా x 50 ఎకరాలు
   • జీవ నత్రజని పంటలు నాటడం (గ్లిరికీడియా, సెస్బానియా, మొ) @ రూ. 2000/ఎకరాల x 50 ఎకరాలు
   • చెట్ల నుంచి పొందిన వాటి ఉత్పత్తి విభాగం (వేప కేక్, వేప నూనె) @ 1000/యూనిట్/ఎకరాల x 50 ఎకరాలు
  • ఇంటిగ్రేటెడ్ ఎరువుల నిర్వహణ
   • ద్రవ జీవకీటకనాశణి సహవ్యవస్థ (కన్సార్టియం) (నత్రజని ఫిక్సింగ్/ఫాస్ఫేట్ సోల్యుబలైజింగ్ / పొటాషియం మోబీలైజిగ్ బయోఫర్టిలైజరు) @ రూ. 500/ఎకరా x 50
   • ద్రవ జీవకీటకనాశణి (ట్రైఖొడర్మ విరీడియా, సూడోమోనాస్ ఫ్లోరొసెంస్, మెటార్జియం, బీవియోరి బసియానా, పేస్లోమిసేస్, పెస్లోమీసేమ్, వర్టిసీలియం) @ రూ. 500/ఎకరాల x 50
   • వేప కేక్/వేప నూనె @ రూ .500/ఎకరా x 50
   • ఫాస్ఫేట్ ఎక్కువగా గల సేంద్రీయ ఎరువులు/ జైమ్ కణికలు @ రూ. 1000 /ఎకరా x 50
   • వర్మికంపోస్టు (పరిమాణం 7'x3'x1 ') @ Rs.5000/యూనిట్ x 50
  • కస్టమ్ నియామక కేంద్రం (CHC) ఖర్చులు
   • వ్యవసాయ పనిముట్లు (SMAM మార్గదర్శకాల ప్రకారం) - పవర్ టిల్లర్, కోనో వీడర్, పాడీ త్రేషర్, ఫర్రో ఓపెనర్, స్పేయర్ , రోస్ క్యాన్, టాప్ పాన్ బ్యాలంస్.
   • ఉద్యాన వనాలకోసం వాల్క్-ఇన్ సొరంగాలు (MIDH మార్గదర్శకాల ప్రకారం)
   • పశువుల షెడ్డు/పౌల్ట్రీ/జంతు కంపోస్ట్ కోసం పిగ్గరీ (గోకుల్ పథకం మార్గదర్శకాల ప్రకారం)
  • సమూహ సేంద్రీయ ఉత్పత్తుల ప్యాకింగ్, లేబులింగ్ మరియు బ్రాండింగ్
   • PGS లోగో + హోలోగ్రామ్ ముద్రణ గల ప్యాకింగ్ వస్తువులు @ రూ. 2500/ఎకరాలు x 50
   • సేంద్రీయ ఉత్పత్తి రవాణా (నాలుగు చక్రాలు, 1.5 టోన్ భార సామర్ధ్యం) @Rs. 120000 గరిష్ట సాయం. 1 సమూహాం కోసం
   • సేంద్రీయ ఉత్సవాలు (గరిష్ట సాయం @ 36330 సమూహానికి ఇవ్వబడుతుంది)

సహాయ విధానం మరిన్ని వివరాలకు, ఇక్కడ క్లిక్ చేయండి..

మూలం : డిపార్ట్మెంట్  అఫ్  అగ్రికల్చర్ , కోఆపరేషన్  అండ్  ఫార్మర్స్  వెల్ఫేర్ , మినిస్ట్రీ  అఫ్  అగ్రికల్చర్  అండ్  ఫార్మర్స్  వెల్ఫేర్ , గవర్నమెంట్  అఫ్  ఇండియా

3.00853485064
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు