హోమ్ / వ్యవసాయం / పథకములు / ప్రధాన్ మంత్రి కృషి సంచయ్ యోజన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రధాన్ మంత్రి కృషి సంచయ్ యోజన

దేశంలో నికర ప్రాంతం 141 మి. హె. లలో, 65 మిలియన్ హెక్టార్ల (లేదా 45%) ప్రస్తుతం నీటిపారుదల క్రింద ఉంది.

దేశంలో నికర ప్రాంతం 141 మి. హె. లలో, 65 మిలియన్ హెక్టార్ల (లేదా 45%) ప్రస్తుతం నీటిపారుదల క్రింద ఉంది. వర్షపాతం పై ఆధార పడటం వలన వ్యవసాయం చేయలేని ప్రాంతాలలో వ్యవసాయం అధిక ప్రమాదకరంగా మారి, తక్కువ ఉత్పాదక వృత్తి కలిగిస్తుంది. అనుభవాల ఆధారంగా తెలిసిందేమిటంటే హామీ ఇచ్చిన లేదా రక్షిత నీటిపారుదల రైతులు వ్యవసాయ సాంకేతిక మరియు ఇన్పుట్లలో పెట్టుబడి పెడతారని తెలియవస్తుంది. దీనీవలన ఉత్పాదకత వృద్ది అయి వ్యవసాయ ఆదాయం పెరిగింది.

ప్రధాన మంత్రి కృషి సంచయి యోజన (PMKSY) ద్వారా ఎవిధంగానైనా దేశంలోని వ్యవసాయ భూములకు రక్షిత నీటి సరఫరా కల్పించడానికి 'చుక్క మరింత పంట శాతం' ఉత్పత్తి చేసి దేశంలో ఎంతో అవసరమైన గ్రామీణాభివృద్ధి సాధించాలని అనుకుంటుంది.

లక్ష్యాలు

PMKSY విస్తృత లక్ష్యాలు

 • క్షేత్ర స్థాయిలో సేద్యపు పెట్టుబడులను ఏకీకృతం చేయటం (జిల్లా స్థాయి తయారీ మరియు, అవసరమైతే, ఉప జిల్లా స్థాయి నీటి వినియోగ ప్రణాళికలు).
 • పొలాలోకి నీటిని భౌతికంగా పంపటాన్ని మెరుగుపరచండి మరియు హామీ సేద్యం (ప్రతి పంటకు నీరు) కింద సాగు ప్రాంతాన్ని విస్తరించటం.
 • నీటి వనరులు, పంపిణీ మరియు నీటిని ఉత్తమంగా ఉపయోగించటాల మేళవింపు. దీనివలన సాంకేతిక మరియు విధానాలను ఉపయోగించి నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలి.
 • పొలాలలో నీటిని పెంపొందించేందుకు వృధాను తగ్గించండి మరియు అందుబాటు సామర్థ్యాన్ని పెంచండి.
 • ఖచ్చిత నీటిపారుదల మరియు ఇతర నీటి ఆదా సాంకేతికతలు (ప్రతి బిందువుకు మరింత పంట) ను ఎంచుకొండి.
 • జలాశయాల రీఛార్జ్ మెరుగుపరచండి మరియు స్థిరమైన జల పరిరక్షణ పద్ధతుల పరిచయం చేయండి.
 • నేల మరియు జల సంరక్షణకు పరీవాహక పద్ధతి, భూగర్భ జల పునరుత్పత్తి, ప్రవాహ అరెస్టు, జీవనోపాధి ఎంపికలు మరియు ఇతర NRM కార్యకలాపాలను ఉపయోగించి వర్షాధారిత ప్రాంతాలలో ఏకీకృత ఆభివృద్ధిని సాధించాలి.
 • నీటి వినియోగం, నీటి నిర్వహణ మరియు రైతులకు పంట అమరిక మరియు కింది స్థాయి ఫీల్డు కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమాలను పెంచటం.
 • పెరి - పట్టణ వ్యవసాయం కోసం చికిత్స చేసిన మున్సిపల్ మురికి నీటిని తిరిగి వినియోగించే అవకాశాలను తెలుసుకొండి.
 • సేద్యంలో ఎక్కువ ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించు.

కార్యక్రమం అమలు

 • కృషి సంచయి యోజన 5 సంవత్సరాల (2015-16 నుంచి 2019-20) కాలానికి 50,000 కోట్ల రూపాయలు క్షేత్రస్థాయిలో సేద్యపు పెట్టుబడులను ఒకటి చేయడానికి కేటాయించింది.
 • PMKSYను ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను విలీనం చేయడానికి రూపొందించారు. ఇందులో జలవనరుల మంత్రిత్వ శాఖ యొక్క యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (AIBP), రివర్ డెవలప్మెంట్ & గంగా రెజువెనేషన్; డిపార్ట్మెంట్ అఫ్ ల్యాండ్ రిసోర్సెస్ యొక్క ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ (IWMP); మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ యొక్క నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (NMSA) కాంపోనెంటు ఆన్ ఫార్మ్ వాటర్ మానేజ్మెంట్ (OFWM) ఉన్నాయి.
 • PMKSYలు ఒక ప్రాంతం అభివృద్ధి విధానాన్ని అమలు చేయాలి, రాష్ట్ర స్థాయి ప్రణాళిక వికేంద్రీకరణ మరియు ప్రాజెక్టు నిర్వహణ చేయాలి. దీనిలో రాష్ట్రాలు తమ నీటిపారుదల అభివృద్ధి ప్రణాళికలు జిల్లా/బ్లాక్స్ లలో 5 నుంచి 7 సంవత్సరాల సమయంలో తీసుకోవాలి. జిల్లా/రాష్ట్ర ఇరిగేషన్ ప్రణాళిక ఆధారంగా రాష్ట్రాలు ప్రాజెక్టులను తీసుకోవాలి.
 • ఈశాన్య రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కార్యక్రమం కింద ఉన్నాయి.
 • PMKSY యొక్క జాతీయ స్టీరింగ్ కమిటీ (NSC) గౌరవనీయ ప్రధాన మంత్రి అధ్యక్షతన, కార్యక్రమం కూర్పు విధాన దిశలను అందిస్తుంది. మరియు NITI ఆయోగ్ వైస్ చైర్మన్ అధ్యక్షతన ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (NEC) జాతీయ స్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తుంది.
 • నీటి వినియోగం, నీటి నిర్వహణ మరియు రైతులకు పంట అలైన్మెంట్ పై ప్రత్యేక దృష్టితో కింది స్థాయి కార్యకర్తలకు కార్యకలాపాల పొడిగింపు కోసం 2015-16 సమయంలో PMKSY క్రింద నియమం ఉంది.

కార్యక్రమ భాగాలు

A. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ( AIBP)

 • జాతీయ ప్రాజెక్టులతో సహా ప్రస్తుతం కొనసాగుతున్న భారీ మధ్యతరహా నీటి పారుదల పనులను వేగంగా పూర్తిచేయటం.

B. PMKSY ( ప్రతి పంటకు నీళ్లు )

 • మైనర్ ఇరిగేషన్ ద్వారా కొత్త నీటి వనరుల సృష్టి (ఉపరితల మరియు భూగర్భ జలాలు రెండు)
 • మరమ్మతు, పునరుద్ధరణ మరియు నీటి వనరులు ఆధునికీకరణ; సంప్రదాయ నీటి వనరుల యొక్క సామర్ధ్యానికి బలోపేతం చేయటం, వర్షం నీరు హార్వెస్టింగ్ నిర్మాణాలు (జల్ సంచయ్);
 • కమాండ్ ప్రాంత అభివృద్ధి, పొలం నుంచి పంపిణీ నెట్వర్కును బలోపేతం చేయటం మరియు సృష్టించటం;
 • వర్షాకాలంలో నీటి వరదను నిల్వ చేయడానికి సింకును రూపొందించటం ద్వారా సమృద్ధిగా ఉన్న ప్రదేశాలలో గ్రౌండ్ వాటర్ అభివృద్ధి.
 • నీటి సమూహాలలో నీటి నిర్వహణ మరియు పంపిణీ వ్యవస్థలో అభివృద్ధి. దీనితో అందుబాటులోని వనరు యొక్క ప్రయోజనాన్ని పూర్తిసామర్థ్యంతో టాప్ చేయవచ్చు (ఇది కిందికి వేళాడే పండ్ల నుండి ప్రయోజనాలు పొందటం). కనీసం 10% సూక్ష్మ/ఖచ్చిత నీటిపారుదల సౌకర్యం కమాండ్ ప్రదేశము పరిధిలో ఉండాలి.
 • పుష్కలంగా నీటి వనరులు ఉన్న ప్రాంతం నుండి నీటి కరవు ప్రాంతాలలోకి నీటి మళ్లింపు, సమీపంలోని, IWMP మరియు MGNREGS దాటి, దిగువ ఎత్తులోని నదుల నుంచి ఎత్తిపోతలు.
 • జల్ మందిర్ (గుజరాత్) వంటి సంప్రదాయ నీటి నిల్వ వ్యవస్థలు అభివృద్ధి; ఖత్రి, ఖుల్ (హెచ్.పీ.); జబోo (నాగాలాండ్); ఇరి, ఓరానిస్ (టీఎన్ల్హో); డాంగ్స్ (అసోం); కటాస్ , బంధస్ (ఒడిశా మరియు ఎంపీ) మొదలైనవి ఆచరణ ప్రాంతాలు.

C. PMKSY ( ప్రతి చుక్కుకు మరింత పంట )

 • కార్యక్రమ నిర్వహణ, రాష్ట్ర/జిల్లా ఇరిగేషన్ ప్రణాళిక, వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఆమోదం, పర్యవేక్షణ మొదలైనవి.
 • డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, ఇరుసులు, రేయిన్ గన్ (జల్ సిచాన్)వంటి సమర్థవంతమైన మరియు ఖచ్చిత నీటి అనువర్తన పరికరాలను ప్రోత్సహించడం;
 • ఇన్పుట్ ఖర్చు ముఖ్యంగా పౌర నిర్మాణంలో అనుమతించిన పరిదిని (40%) దాటకుండా టాపింగు, MGNREGS పథకం కింద లైనింగ్ ఇన్లెట్, అవుట్లెట్, సిల్ట్ ట్రాపులు, పంపిణీ వ్యవస్థ తదితరమైనవి
 • సూక్ష్మ నీటిపారుదల నిర్మాణాల నిర్మాణం బోరుబావులు మరియు పూరక బావుల తవ్వకంతో సహా (గ్రౌండ్ వాటర్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో మరియు సెమీ క్రిటికల్/క్రిటికల్/అధిక వాడకం). బ్లాక్/జిల్లా నీటిపారుదల ప్రణాళిక ప్రకారం AIBP, PMKSY (ప్రతి పోలానికి నీరు), PMKSY (వాటర్‌షెడ్) MGNREGS పథకాలు వీటికి సహాయం చేయవు.
 • కాలువ వ్యవస్థ యొక్క టేల్ చివరి సెకండరీ నిల్వ ఆకృతులు నీటి నిల్వ సమృద్ధి గా ఉన్నప్పుడు (వర్షాకాలం) లేదా ప్రభావవంతమైన పొడి కాలంలో ఉపయోగకర కాలువల వంటి శాశ్వత మూలాల నుండి అందుబాటులో ఉంచడానికి - వ్యవసాయ నీటి నిర్వహణ;
 • డీజిల్/ఎలక్ట్రిక్/సోలార్ పంపు సెట్ లాంటి వాటర్ లిఫ్టింగ్ పరికరాలు క్యారేజ్ పైపులు, భూగర్భ పైపింగ్ వ్యవస్థలు తో కలిపి.
 • శాస్త్రీయ తేమ పరిరక్షణ మరియు గ్రోనెమిక్ చర్యల పొడిగింపు కార్యకలాపాలు. ఇందులో అందుబాటులో ఉన్న నీరు, వర్షంనీటితో కలిపి, మరియు వ్వవసాయ అవసరాలను తగ్గించటం (జల్ సంరక్షణ) వంటి వాటికోసం క్రాప్ అలైన్మెంట్ చర్యలు తీసుకుంటారు;
 • కెపాసిటీ బిల్డింగ్, శిక్షణ మరియు అవగాహన ప్రచారం తక్కువ ధర ప్రచురణలు, పికో ప్రొజెక్టర్లు ఉంటాయి. వీటితో తక్కువ ఖర్చు అయ్యే ఫిల్ముల ద్వారా నీటి వనరులను ఉపయోగించేంకు సాంకేతిక, వ్యవసాయ మరియు నిర్వహణ పద్ధతులు కమ్మూనిటీ వ్యవసాయాన్ని వాడేందుకు ప్రోత్సహిస్తారు.
 • విస్తరణ కార్మికులు PMKSY క్రింద సంబంధిత సాంకేతికతలను పంపణీ చేయడానికి వారికి సరైన శిక్షణ అందించిన తర్వాత మాత్రమే అధికారం పొందుతారు. ముఖ్యంగా శాస్త్రీయ తేమ పరిరక్షణ మరియు వ్యవసాయ కొలతల ప్రమోషన్ అగోనామిక్ చర్యలు, మెరుగైన పైప్ మరియు బాక్స్ అవుట్లెట్ వ్యవస్థ తదితరవాటిలో శిక్షణ పొందిన తర్వాత. తగిన డొమైన్ నిపుణులు మాస్టర్ శిక్షకులుగా పనిచేస్తాయి.
 • సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) ఎన్ఇజిపి ద్వారా జోక్యం చేసుకుంటుంది - వ్యవసాయ నీటి నిర్వహణ, ఖచ్చితత్వ నీటిపారుదల సాంకేతిక, ఆన్ ఫాం నీటి నిర్వహణ, పంట అమరిక మొదలైననాటిలో. ఇంకా పథకాన్ని పర్యవేక్షిస్తుంది.

D. PMKSY ( వాటర్‌షెడ్ అభివృద్ధి )

 • ప్రవాహ నీటి సమర్థవంత నిర్వహణ మరియు మెరుగైన మట్టి & తేమ పరిరక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇందులో రిడ్జ్ ప్రాంతం చికిత్స, డ్రైనేజీ లైన్ 5 చికిత్స, వర్షంపు నీరు హార్వెస్టింగ్, సిటు -తేమ పరిరక్షణ మరియు ఇతర అనుబంధ కార్యకలాపాలు పరీవాహక ఆధారంగా ఉంటాయి.
 • బి) సంప్రదాయ నీటి వనరులు ఆధునికీకరణ సహా గుర్తించన వెనుకబడిన నిటి ఆధారిత బ్లాకులు పూర్తి సామర్థ్యాన్ని నీటి వనరు ఏర్పాటుకు MGNREGSతో కలవటం
మూలం : pmksy.gov.in

సంబంధిత వనరులు

 1. ఆపరేషనల్ మార్గదర్శకాలు (PMKSY)
3.01464713715
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు