హోమ్ / వ్యవసాయం / పథకములు / మన తెలంగాణ - మన వ్యవసాయ పథకాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మన తెలంగాణ - మన వ్యవసాయ పథకాలు

వివిధ వ్యవసాయ పథకాల వివరాలు

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. 3.53 కోట్ల జనాభా (2011)తో తూర్పు, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పడమర కర్ణాటకా, మహారాష్ట్ర రాష్ట్రాలు, ఉత్తరాన మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. 114.62 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. 31 జిల్లాలు, 9 జిల్లా పరిషత్‌లు, 68 రెవిన్యూ డివిజన్లు, 158 పట్టణాలు (2011), 584 రెవెన్యూ 8,778 గ్రామాలు కలిగిఉంది. మొత్తం కుటుంబాల సంఖ్య 83.58 లక్షలు. రాష్ట్రంలో ప్రవహిస్తున్న ముఖ్య నదులు కృష్ణా, గోదావరి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం, వ్యవసాయ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా ఉన్నాయి. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి, రైతుల నికరాదాయం పెంచే దిశగా వ్యవసాయం ఒక లాభసాటి జీవన విధానంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పంటల ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. వ్యవసాయమే కాక వ్యవసాయ అనుబంధ రంగాలపైన దృష్టి సారించింది. రాష్ట్రంలో సాధారణంగా నైరుతి రుతుపవనాల వలన 715.1 మి.మీ., ఈశాన్య రుతుపవనాల ద్వారా 129.2 మి.మీ., శీతాకాలం 11.5 మి.మీ., ఎండాకాలంలో 50.8 మి.మీ. వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలో వ్యవసాయం మొత్తంగా 55.54 లక్షల కమతాలలో, 61,97 లక్షల హెక్టార్లలో సాగవుతోంది.

వ్యవసాయ రంగంలో అమలవుతున్న వివిధ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

 • పంటల బీమా.
 • వ్యవసాయ విస్తరణ.
 • రైతుశ్రీ (పావలా వడ్డీ వడ్డీలేని రుణాలు).
 • సమగ్ర పోషక యాజమాన్యం.
 • వ్యవసాయ యాంత్sకరణ.

కేంద్ర పథకాలు

 • జాతీయ సమగ్ర వ్యవసాయ మిషన్.
 • జాతీయ ఆహార భద్రతా పథకం.
 • జాతీయ నూనెగింజలు, ఆయిల్‌పామ్ మిషన్.
 • జాతీయ వ్యవసాయ విస్తరణా సాంకేతిక మిషన్.
 • రాఫ్రియ కృషి వికాస్ యోజన.
 • ప్రధాన మంత్రిక్బసి సించాయి యోజన.

ఈ పథకాల్లో లబ్దిదారులను ఆయా పథకాలకు రూపొందించిన నియమాలను అనుసరించి ఎంపిక చేస్తారు. అలా ఎంపిక చేసిన లబ్దిదారులకు ఆ పథకం కింద కేటాయించిన నిధుల నుండి ఆర్థిక సహాయం అందిస్తారు.

vponeరాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా సేంద్రియ వనరులు ప్రోత్సాహకరంగా అందించడం, రైతులలో అవగాల వలన పెంపొందించడం, విజాన యూత్రలు నిర్వహించడం, సేంద్రియ ఉత్పత్తుల మేళా, వర్మీ కంపోసుల యూనిట్లను నిర్మించుకోవడానికి రాయితీ, ట్రాక్టర్లతో నడిచే పనిముట్ల, ట్రాక్టర్లు, పవర్టిల్లర్లు, రోటోమేటర్, సస్యరక్షణకు చేతిస్ప్రే, పలు పంటల నూర్పిడి యంత్రం, పసుపు ఉడికించే యంత్రం, లేజర్ గైడెడ్ ల్యాండ్ లేవలర్ – స్ట్రాబెలర్ వరి నాటే యంత్రం, కంబైన్స్ హార్వెస్టర్ అలాగే ఎచ్.డి.పి.ఇ. వర్మీబెడ్లపై రాయితీ ఈ పథకంలో భాగంగా అందుతున్నాయి.

vptwoవర్షాధార ప్రాంత అభివృద్ధి పథకంలో భాగంగా వర్మీకంపోస్టుల యూనిట్లపై రాయితీ సమస్యాత్మక భూముల పునరుద్ధరణ, సమగ్ర వ్యవసాయం కింద వ్యవసాయ ఆధారిత పంటల సరళి, ఉద్యాన ఆధారిత వ్యవసాయం, చెట్ల - సిల్వీపాస్చురల్ పాడి పశువుల ఆధారిత సమగ్ర వ్యవసాయం, మత్స్య ఆధారిత సమగ్ర వ్యవసాయం, తేనేటీగల పెంపకం వంటి వాటికి సహాయం అందుతోంది.

జాతీయ నూనెగింజలు, ఆయిల్‌పామ్ మిషన్ లో భాగంగా నేల ఆరోగ్యం నూనెగింజల పంటలకు సూక్ష్మపోషకాల సరఫరా, జీవన ఎరువుల సరఫరా, పప్పుదినుసులకు సున్నం /80 శాతం గంధకం సరఫరా చేస్తున్నారు. విత్తనాల ఉత్పత్తిలో పప్పుధాన్యాలు, పశుగ్రాసం, నూనెగింజలు, ఫౌండేషన్ / సర్టిఫైడ్ విత్తనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. ఎక్కువ దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాల విత్తనాల సరఫరా చేస్తున్నారు. నీటి పారుదల అంశం కింద నీటి సరఫరా పైపుల కొనుగోలు కోసం, తుంపర్ల సేద్యం, నూనెగింజల పంటలకు తుంపర్లసేద్యం విషయంలో రాయితీలు అందిస్తున్నారు. విస్తరణ అంశంలో భాగంగా రైతు క్షేత్ర పాఠశాలలు, రైతు శిక్షణా కార్యక్రమాలు, సమగ్ర సస్యరక్షణపై ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహిస్తున్నారు. పవర్ పరికరాలు, స్ప్రేయర్, చేతి వంపులు, మనుషులు ఉపయోగించుకునే, పశువుల సహకారంతో నడిచే యంత్రాలను రాయితీపై అందిస్తున్నారు.

జాతీయ ఆహార భద్రతా మిషన్ లో భాగంగా వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు సూక్ష్మపోషకాల సరఫరా, పప్పుధాన్యాలకు, నూనెగింజలకు జిప్సం సరఫరా, జీవన ఎరువుల సరఫరా, పప్పుదినుసులకు సున్నం / 80 శాతం గంధకం సరఫరా, అపరాలకు సున్నం /గంధకం సరఫరా చేస్తున్నారు. విత్తన సరఫరాలో భాగంగా హైబ్రిడ్ వరి విత్తనాలు, అధిక దిగుబడినిచ్చే వరి విత్తన రకాల పంపిణీ, ఫౌండేషన్, సర్టిఫైడ్ వరి, మొక్కజొన్నల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు. రాయితీపై సర్టిఫైడ్ పప్పుధాన్యాల విత్తనాలు సరఫరా చేస్తున్నారు. సాంకేతిక ప్రదర్శనా క్షేత్రాలు, హైబ్రిడ్ వరిలో క్లస్టర్ ప్రదర్శనా క్షేత్రాలు, వరి,పప్పుధాన్యాల పంటల్లో వివిధ హైబ్రిడ్ రకాల సాగుకు సహకారం అందిస్తున్నారు.

సస్యరక్షణలో భాగంగా సేంద్రియ రసాయన మందులు (వరి, పప్పుధాన్యాలు), పప్పుధాన్యాలు, నూనెగింజల సమగ్ర సస్యరక్షణ, జీవన ఎరువుల సరఫరాకు రాయితీ అందిస్తున్నారు. కోనోవీడర్, నాప్సాక్స్పేయర్, ఆయిల్ ఇంజన్లకు రాయితీ అందిస్తున్నారు.

గ్రామ విత్తనోత్పత్తి కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్, సర్టిఫైడ్ వరి, మొక్కజొన్న ఉత్పత్తి చేపట్టడం, పప్పుధాన్యాలు, నూనెగింజల ఫౌండేషన్, సర్టిఫైడ్ విత్తనాల ఉత్పత్తి.

వ్యవసాయ విస్తరణలో భాగంగా ఆత్మ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజిమెంట్ vpthreeఏజెన్సీ) పథకం కింద ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రదర్శనా క్షేత్రాలు, పొలం బడులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతుల క్షేత్ర సందర్శన, రాష్ట్ర స్థాయిలో రైతుల క్షేత్ర సందర్శన, జిల్లా స్థాయిలో రైతుల క్షేత్ర సందర్శనలకు ఏర్పాటు చేస్తున్నారు. నైపుణ్యాల అభివృద్ధికి సహకరిస్తున్నారు. సీడ్ మనీ - రివాల్వింగ్ ఫండ్‌కు, ఆహార భద్రతా గ్రూపులకు కెపాసిటీ బిల్డింగ్ పథకాలు చేపడుతున్నారు.

పంట రుణాల కింద వడ్డీలేని పంట రుణాలు అందించడమే కాకుండా పంట రుణమాఫీ పథకాన్ని (2014) విజయవంతంగా అమలు చేశారు.

పంటల బీమాలో భాగంగా మూడురకాల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అవి

 1. జాతీయ వ్యవసాయ బీమా పథకం,
 2. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం,
 3. సవరించిన జాతీయ బీమా పథకం.

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్‌తో నడిచే పనిముట్ల, ట్రాక్టరు, పవర్టిల్లర్లు, చేతి (స్పేయర్లు, పవర్ స్పేయర్లు, పవర్ వీడర్లు, పలు పంటల నూర్పిడి యంత్రాలు, వరి నాటే యంత్రం, కంబైన్స్ హార్వెస్టర్లు అందిస్తున్నారు.

 • 2016-17కు గాను 27.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా జరిగింది. జింక్ సల్ఫేట్ 1672.25 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది.
 • ఎన్.ఎస్.పి. పథకంలో భాగంగా 2016-17కు గాను 69448 అంశాలు గాను రూ.77.12 కోట్లు  ఖర్చు చేశారు.
 • ఆర్.కె.వి.వై. కింద 2016-17లో 4986 అంశాలపై రూ. 554 లక్షలు.
 • ఎస్.ఎం.ఎ.ఎం. 256 అంశాలకు 28.47 లక్షలు ఖర్చు చేశారు.ఉత్పాదకాలపై నబ్సిడీ 2016-17 సంవత్సరంలో 21,78,970 మంది రైతులకు 70324.92 లక్షలు ఖర్చు చేశారు.
 • మన తెలంగాణ - మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా 2016-17లో 4,72,619 మంది రైతులు హాజరుకాగా, రూ.97.05  లక్షలు ఖర్చు చేశారు.
 • రుణమాఫీ కింద 2014-15 నుంచి 2017-18 మధ్య నాలుగు విడతల్లో రూ.16105.155 కోట్లు మాఫీ చేశారు. ఈ పథకం కింద 39.3 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
 • 2016-17లో నిర్దేశిత లక్ష్యం 30, 33, 602 సాయిల్ హెల్త్ కారులు పంపిణీ చేయాల్సి ఉండగా, 18, 22,065 పంపిణీ చేశారు.
 • 2016-17లో రాఫ్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.30 కోట్లు విడుదల కాగా రూ.30 కోట్ల ఖర్చు చేశారు.
 • ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద ఎక్కడికక్కడ జల వనరుల అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నారు.

vpsevenఇవేకాక పలు పథకాలతో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసి, రైతుల జీవన ప్రమాణాలు, నికర ఆదాయం పెరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రణాళికలను రైతులకు చేరేలాగా కృషి చేస్తోంది.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

3.00900900901
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు