హోమ్ / వ్యవసాయం / పథకములు / రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) నేపథ్యం

వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వృద్ధి తగ్గుదల కారణంగా, జాతీయ అభివృద్ధి మండలి (NDC), 29 మే, 2007 న జరిగిన భేటీలో, ఒక ప్రత్యేక అదనపు కేంద్ర సహాయ పథకం (RKVY) మొదలు పెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ అభివృద్ధి వ్యూహాలు రైతుల అవసరాలకు సరిపోయే విధంగా నవీకరించాలనిNDC తీర్మానం చేసింది. వ్యవసాయానికి చైతన్యం నింపేందుకు వ్యూహాలను రూపొందిచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపు నిచ్చింది. 11 వ ప్రణాళికా కాలంలో వ్యవసాయ రంగంలో 4 శాతం వార్షిక వృద్ధి సాధించడానికి NDC తన నిబద్ధత పునరుద్ఘాటించింది.

పై తీర్మాణం ప్రకారం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ప్రణాళికా సంఘం సంప్రదింపులతో, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి మార్గదర్శకాలు సిద్ధం చేసింది. అది జాతీయ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం (RKVY) గా పిలువబడుతుంది.

కార్యక్రమం లక్ష్యాలు

 • వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో రాష్ట్రాలు పెట్టుబడిని పెంచేందుకు ప్రోత్సహించటం.
 • ప్రణాళికలను తయారు చేసుకునేందుకు మరియు వ్యవసాయ కార్యక్రమాలు అమలు చేయడానికి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం.
 • జిల్లాలు మరియు రాష్ట్రాలు వ్యవసాయ ప్రణాళికలను తయారు చేసుకొనేలా చూడటం.
 • ముఖ్యమైన పంటల దిగుబడి అంతరాలను తగ్గించే లక్ష్యాన్ని సాధించటం.
 • రైతుల సంపాదన పెరిగేలా చూడటం.
 • వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సమీకృత పద్ధతిలో పరిష్కారాలు చూపటం.

RKVY యొక్క ప్రాథమిక లక్షణాలు

* ఇది ఒక రాష్ట్ర ప్రణాళిక పథకం.

 • వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రాష్ట్రల ప్రణాళికా వ్యయాన్ని బట్టి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) కు ఆ రాష్ట్రాలు అర్హతను పొందుతాయి.
 • బేస్ లైన్ వ్యయం మునుపటి సంవత్సరంకంటే ముందు మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించే సగటు వ్యయం ఆధారంగా నిర్ణయించబడుతుంది.
 • జిల్లా, రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికల తయారీ తప్పనిసరి.
 • ఈ పథకం NREGS వంటి ఇతర కార్యక్రమాలతో కలవటాన్ని ప్రోత్సహిస్తుంది.
 • 100% కేంద్ర ప్రభుత్వ నిధుల గ్రాంట్ ఉంటుంది.
 • రాష్ట్రం తరువాతి సంవత్సరాల్లో తమ పెట్టుబడిని తగ్గిస్తే, మరియు RKVY పథకంనుండి వైదొలగి నట్లైతే అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తిచేయడానికి మిగిలిన వనరులను రాష్ట్రాలు సమకూర్చుకోవాలి.
 • ఇది ఒక ప్రోత్సాహక పథకం, అందుకే కేటాయింపులు ఆటోమేటిక్ గా ఉండవు.
 • ఇది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను పూర్తిగా కలుపుతుంది.
 • ఇది రాష్ట్రాలకు అధిక స్థాయిలో సౌలభ్యాతను కల్పిస్తుంది.
 • ఖచ్చితమైన సమయం కలిగిన ప్రాజెక్టులను అత్యదికంగా ప్రోత్సహిస్తారు.

ఈ పథకం క్రింద ఉండే అనుబంధ రంగాల జాబితా

* పంట సంవర్ధక (తోటల పెంపకం సహా).

 • పశుగణాభివృద్ధి, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్.
 • అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్.
 • అగ్రికల్చరల్ మార్కెటింగ్.
 • ఆహార నిల్వ మరియు గిడ్డంగులు.
 • నేల మరియు జల సంరక్షణ.
 • వ్యవసాయ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్.
 • ఇతర వ్యవసాయ కార్యక్రమాలు మరియు సహాయకాలు.

RKVY పథకం దృష్టిపెట్టిన క్షేత్రాలు

* ముతక ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు మరియు సహా ఆహార పంటల సమగ్ర అభివృద్ధి.

 • వ్యవసాయ యాంత్రీకరణ.
 • మట్టి ఆరోగ్యం మరియు ఉత్పాదకత.
 • వర్షాధారిత సేద్య వ్యవస్థల అభివృద్ధి.
 • అనుసంధాన తెగుళ్ళ నివారణ.
 • పొడిగింపు సేవలు ప్రచారం.
 • ఉద్యానవన పెంపకం.
 • పశుపోషణ, పాల కేంద్రాలు మరియు చేపల పెంపకం.
 • పట్టుపురుగుల పెంపకం.
 • రైతుల అధ్యయన పర్యటనలు.
 • సేంద్రీయ మరియు బయో ఎరువులు ఉపయోగం.
 • వినూత్న పథకాలు.

ఆధారము: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పోర్టల్, భారతదేశం ప్రభుత్వం

3.00549450549
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు