హోమ్ / వ్యవసాయం / పథకములు / వ్యవసాయానికి వూతం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయానికి వూతం

అన్నదాతల బకాయిలు రూ. వందల కోట్లు మేర పేరుకుపోయాయి. రుణమాఫీ పరిధిలోకి రాని మొత్తాలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి వాటికి ఏకమొత్తం పరిష్కారం (వన్‌టైం సెటిల్‌మెంట్‌) కల్పించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే లీడ్‌ బ్యాంకు ముందడుగేసింది. ఇతర బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

అన్నదాతల బకాయిలు రూ. వందల కోట్లు మేర పేరుకుపోయాయి. రుణమాఫీ పరిధిలోకి రాని మొత్తాలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి వాటికి ఏకమొత్తం పరిష్కారం (వన్‌టైం సెటిల్‌మెంట్‌) కల్పించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే లీడ్‌ బ్యాంకు ముందడుగేసింది. ఇతర బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

జిల్లాలో 5.37 లక్షల మంది రైతులున్నారు. వీరిలో 4 లక్షల మందికిపైగా బంగారం, వ్యవసాయ, ఇతర తాకట్టు రుణాలు పొందినట్లు రుణమాఫీ ముందు లెక్కల్లో అధికారులు గుర్తించారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో వడపోత పోయడంతో పాటు ఒక కుటుంబానికి రూ. 1.50 లక్షలు మాత్రమే రుణమాఫీని ప్రభుత్వం వర్తింప చేసింది. ఈ రుణ భారం రూ.800 కోట్లకు పరిమితమైంది. మూడు విడతల్లో 2.94 లక్షల మందికి రూ.

401 కోట్ల చెల్లింపులు చేశారు. మొదటి విడతలో 2,46,656 మందికి రూ. 287 కోట్లు ప్రభుత్వం సమకూర్చింది. తాజా బడ్జెట్‌లో రుణమాఫీకి ప్రభుత్వం రూ. 3,512 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 90 కోట్ల వరకు జిల్లాకు కేటాయించవచ్చని బ్యాంకర్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇంత చేసినా జిల్లాలో రూ.వందల కోట్ల మేర రుణాలు బ్యాంకుల్లో పేరుకు పోయినట్లు గణంకాలు చెబుతున్నాయి. బంగారం తాకట్టు రుణాలు ప్రధాన సమస్యగా మారింది. ఇటీవల బ్యాంకర్లు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. బంగారంపై రుణం చెల్లించి తాకట్టు విడిపిస్తారా? లేదంలే వేలం వేసేయాలా అని హుకుం జారీ చేస్తుండడంతో చాలా మంది జమ చేయడం ప్రారంభించారు. దీర్ఘకాలికంగా మిగిలి పోయిన రుణాలకు వడ్డీలు భారీగా పేరుకుపోయాయి.

ఇది బ్యాంకర్లకు, రుణ గ్రహీతలకు మంచిది కాదు. ఇప్పటికే పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు వంటి వాటికి బ్యాంకర్లు పెద్ద ఎత్తున ఏక మొత్త పరిష్కారం (వన్‌ టైం సెటిల్‌మెంట్‌) అమలు చేస్తున్నాయి. భారీ ఎత్తున రాయితీలు ఇచ్చి రుణ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇదే విధానం వ్యవసాయ రంగానికి ఎందుకు అమలు చేయకూడదని ఇటీవల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రూ. 1.50 లక్షల వరకు ఉన్న నిరర్థక ఆస్తులు, గడువు ముగిసిన వాయిదాలు అన్నింటికీ ఈ సౌకర్యం కల్పించాలని కోరారు. దీనిపై బ్యాంకర్లు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. బ్యాంకుల వారీగా ఇలాంటి రుణాలు ఎంత మేర ఉన్నాయి? ఏక మొత్త పరిష్కారానికి వెళ్తే బ్యాంకు ఎంత మేర వడ్డీ, ఇతర రూపంలో నష్టపోవాల్సి వస్తుంది? వంటి అంశాలపై పరిశీలన చేస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు మాత్రం ఇప్పటికే రూ.

లక్ష వరకు ఏక మొత్త పరిష్కారం కింద పరిష్కరిస్తున్నారు. మేనేజర్‌ స్థాయిలోనే ఈ పరిష్కారం అమలవుతోంది. ఇంతకు మించి రుణాలు ఉంటే ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. జిల్లాలో రూ. 1,200 కోట్ల వరకు ఇలాంటి రుణాలు ఉంటాయని ఒక అనధికారిక అంచనా ఉన్నట్లు ఇక సీనియర్‌ బ్యాంకు ఉన్నతాధికారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కేవలం రుణ మాఫీ కింద వర్తించనివే రూ. 450 కోట్ల వరకు ఉన్నట్లు లీడ్‌ బ్యాంకు వర్గాలు స్పష్టీకరించాయి. రూ. 1.50 లక్షల వరకు పంట రుణాలకు రుణమాఫీ వర్తింప చేశారు. ఆపై మొత్తాలకు ఏక మొత్త పరిష్కారం వర్తింపచేస్తే రుణాలన్నీ బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లవుతుంది.

రూ. 3 లక్షల వరకు రుణాలు
రైతులకు బ్యాంకులు ఇస్తున్న రుణాలు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇది అంతిమంగా ప్రైవేటు అప్పులు పెరిగిపోవడానికి కారణమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రుణ పరిమితి పెంచాలని ప్రభుత్వం కోరింది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ. 3 లక్షల వరకు రుణాలు అందించాలని కోరుతున్నాయి. అయితే జిల్లాలో ఈపరిస్థితి కనిపించడం లేదు. చాలా మంది దీర్ఘకాలిక రుణాల్లో మునిగి కొట్టుమిట్టాడుతున్నారు. ఏళ్లుగా బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు, గడువు ముగిసిన వాయిదాలన్నింటికీ ఏకమొత్త పరిష్కారం అమలు చేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరడంతో వారు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న రుణాలను గరిష్ఠంగా రూ.2.50 లక్షల వరకు బ్యాంకు రుణాలుగా మార్చాలని ప్రభుత్వం కోరింది. దీనిపైనా బ్యాంకుల స్పందన కీలకంగా మారింది.

ఆంధ్రాబ్యాంకులో అమలు
ఆంధ్రాబ్యాంకులో రూ. లక్ష వరకు ఏక మొత్త పరిష్కారం అమలవుతోంది. మిగిలిన బ్యాంకుల్లో అమలు చేయాలని ప్రభుత్వం కోరింది. ఇది అమల్లోకి వస్తే జిల్లాలో రూ. వందల కోట్లు మేర రుణాలకు పరిష్కారం లభిస్తుంది. అన్నదాతలకు ప్రయోజనంగా ఉంటుంది.

ఎం.రామిరెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్‌, శ్రీకాకుళం
ఆధారము : ఈనాడు
3.01173285199
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు