অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పశువుల భీమా,దాణా అభివృద్ధి పథకాలు

పశువుల భీమా,దాణా అభివృద్ధి పథకాలు

పాడి పశువుల బీమా పథకం

పాడి పశువుల (లైవ్ స్టాక్)  బీమా పథకం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలుజరుగుతున్న పథకం. 10 వ పంచవర్ష ప్రణాళికలోని 2005-06, 2006-07 సంవత్సరాలలో, 11వ పంచవర్ష ప్రణాళికలోని 2007-08 సంవత్సరంలో మనదేశంలో ఎంపికచేసిన 100 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు జరిపారు.  2010 సంవత్సరంనుంచి,  కొత్తగా ఎంపికచేసిన 300 జిల్లాలలో ఈ పథకాన్ని శాశ్వత స్థాయిలో అమలుజరుపుతున్నారు.

పాడి పశువుల బీమా పథకాన్ని రెండు  ఆశయాలను దృష్టిలోవుంచుకుని  చేపట్టారు. పాడిపశువులు చనిపోతే కలిగే నష్టంనుంచి రైతులకు , పాడి పశువుల పెంపకందార్లకు తగిన రక్షణ కల్పించడం ఒక ఆశయం కాగా ; పాడిపశువులను బీమాచేసుకోవడంవల్ల కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించి, తద్వారా  పాడిపశువులు, వాటి ఉత్పత్తులు నాణ్యంగా వుండేలా చూడాలనే అంతిమ లక్ష్య సాధనకు వీలుగా  ఆ బీమా పథకానికి ప్రాచుర్యం కల్పిచడం ఈ పథకం ఆశిస్తున్న మరో ఆశయం.

ఈ పథకం కింద, అధిక పాల దిగుబడి కలిగిన సంకరజాతి ఆవులు, గేదెలను మార్కెట్లో అప్పటికి వాటి గరిష్ఠ ధరకు బీమాచేసుకుంటారు. చెల్లించవలసిన బీమా ప్రీమియం మొత్తంలో, 50 % సబ్సిడీగా ఇస్తారు. సబ్సిడీరూపంలో అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది. ఒక్కొక్క లబ్ధిదారు, రెండు పాడి పశువులకు మించకుండా సబ్సిడీ సదుపాయాన్ని పొందవచ్చు. గరిష్ఠంగా మూడేళ్ళకు మించని బీమా పాలసీలకే సబ్సిడీ సదుపాయం వర్తిస్తుంది.

గోవా మినహా మిగతా అన్ని రాష్ట్రాలలో ఆయా  ' రాష్ట్ర పాడి పశువుల అభివృద్ధి బోర్డు ' ల ద్వారా ఈ పథకాన్ని అమలుజరుపుతున్నారు.

ఈ పథకం వర్తించే పశువులు - లబ్ధిదారుల ఎంపిక తీరు

  • ఈనిన తర్వాతనుంచి వట్టిపోయేవరకు , పాలిచ్చే కాలానికి (లాక్టేషన్), కనీసం 1,500 లీటర్ల పాలిచ్చే  గేదెలు, ఆవులనన్నిటినీ , అధిక దిగుబడి పాడి పశువులుగా పరిగణిస్తారు. ఈ పథకం కింద,  వీటిని మార్కెట్‌లో వాటి అప్పటి  గరిష్ఠ ధరకు బీమా చేయవచ్చు.
  • మరేదైనా బీమా పథకం / ప్రణాళికా పథకం కింద ప్రయోజనం పొందే పశువులు వేటికీ ఈ పథకం వర్తించదు.
  • సబ్సిడీ సదుపాయం ఒక లబ్ధిదారుకు, కేవలం రెండు పశువులకు మాత్రమే   పరిమితం. ఒక్కొక్క పాడి పశువుకు ఒక్కసారి బీమాకు,  గరిష్ఠంగా మూడేళ్ళ  కాలానికి మించని పాలసీలకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.
  • మూడేళ్ళ పాలసీ తీసుకునేలాగా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల  ఖర్చు తగ్గుతుంది ; తుపానులు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాలలో అసలైన ప్రయోజనం పొందడానికి వీలవుతుంది. అయితే, ఏవైనా సహేతుకమైన కారణాల దృష్ట్యా, పాడిపశువుల యజమానులైన వరైనా మూడేళ్ళకంటె తక్కువకాలానికి పాలసీ తీసుకోవాలనుకుంటే కూడా వారికి ఈ పథకం కింద సబ్సిడీ సదుపాయాన్ని వర్తింపజేయవచ్చు. కాని, ఆ తర్వాత పాలసీ కాలపరిమితి పొడిగింపునకు సబ్సిడీ పొందే అవకాశం వారికి వుండదు.

పాడి పశువు మార్కెట్ ధర నిర్ణయించడం

పాడిపశువులను మార్కెట్‌లో అప్పటి గరిష్ఠ ధరకు బీమా చేస్తారు. ఈ ధరను లబ్ధిదారు, గుర్తింపుపొందిన పశువైద్యుడు, ఇన్సూరెన్స్ ఏజంట్ కలిసి నిర్ణయిస్తారు.

బీమాచేసిన పాడి పశువును గుర్తుపట్టే తీరు

బీమా సొమ్ము చెల్లించాలంటే, బీమాచేసిన పాడిపశువు అదేనని సక్రమంగా, నిర్దిష్టంగా గుర్తించడం అవసరం. అందువల్ల, అలాంటి పశువు చెవికి ఒక గుర్తింపు పట్టీ (టాగ్) తగిలించడం వున్నంతలో ఆధారపడదగిన మంచి పద్ధతి. బీమా చేసే సమయంలో సాంప్రదాయికంగా చెవికి పట్టీ వేయడమో లేదా ఆధునిక పరిజ్ఞానంతో మైక్రో చిప్ అమర్చడమో అనుసరించవలసి వుంటుంది. గుర్తింపు పట్టీ లేదా చిప్‌కు అయ్యే ఖర్చును బీమా కంపెనీ  భరిస్తుంది; దానిని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత మాత్రం లబ్ధిదారుదే. ఎలాంటి గుర్తింపు పద్ధతిని అనుసరించాలి, దాని నాణ్యత ఎలా వుండాలనేది లబ్ధిదారులు, బీమా కంపెనీ పరస్పర అంగీకారంతో నిర్ణయించుకోవలసి వుంటుంది.

బీమా పాలసీ అమలులో వుండగానే యజమాని మారితే…

బీమా పాలసీ అమలులో వుండగానే ఆ ఫాడి పశువును అమ్మడమో లేదా మరొకరికి అప్పగించడమో జరిగే సందర్భంలో , పాలసీ పూర్తయ్యే గడువులో మిగతా కాలానికి, లబ్ధిదారుకు వుండే అధికారాన్ని ఆ పాడి పశువు కొత్త యజమానికి బదలాయించవలసి (మార్చడం) వుంటుంది. అందువల్ల, బీమా పాలసీ ని మరొకరిపేర బదలాయించవలసివస్తే అనుసరించవలసిన పద్ధతులు, ఫీజు, విక్రయ పత్రం (సేల్ డీడ్) మొదలైన విషయాలను గురించి, బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే ముందే, ఒక నిర్ణయానికి రావాలి.

క్లెయిముల పరిష్కారం

క్లెయిము చెల్లించవలసి వచ్చిన  సందర్భంలో, అవసరమైన పత్రాలను అందజేసిన 15 రోజులలోగా (వీలున్నంతవరకు) బీమా మొత్తాన్ని చెల్లించవలసివుంటుంది. పాడి పశువును బీమా చేసే సమయంలోనే, క్లెయిముల పరిష్కారానికి అనుసరించవలసిన నిర్దిష్టమైన పద్ధతులను స్పష్టంగా పేర్కొనడం, క్లెయిము కోసం అందజేయవలసిన  పత్రాల జాబితాను రూపొందించడం, పాలసీ పత్రంతోపాటు ఆ వివరాలను లబ్ధిదారుకు అందించడంలో సి.ఇ.ఓ.లు శ్రద్ధ వహించవలసి వుంటుంది.

పశువుల మేత మరియు దాణా అభివృద్ధి పరచే పథకం

దాణా మరియు పశువుల మేత కు సంబంధించి రాష్ట్రాలు చేసే కృషికి అదనంగా, పశుసంవర్ధక శాఖ (Animal husbandry) పాల సరఫరా శాఖ (Dairying) మరియు చేపల పెంపకకేంద్రాలు  (fisheries) కలసికట్టుగా ఒక కేంద్రీకృతమైన పశువుల మేతను అభివృద్ధి పరచే పథకం ను ప్రాయోజిత కార్యక్రమంగా అమలు పరుస్తున్నాయి. ఈ పథకం 2005 – 2006 నుండి  క్రింద పేర్కొన్న నాలుగు అంశాలతో కూడి అమలు పరచబడుతున్నది.
(ఎ) పశువుల మేతను తయారుచేసే కేంద్ర విభాగాల ఏర్పాటు.
(బి) గడ్డి మైదానాల అభివృద్ధి, గడ్డి నిల్వలతో సహా
(సి) పశువుల మేత యొక్క విత్తన ఉత్పత్తి మరియు పంపిణి
(డి) జీవన సాంకేతిక శాస్త్ర పరిశోధనా పధకాలు
కేంద్రీకృమైన ప్రాయోజిత పశువుల మేత అభివృద్ధి పథకం ( The centrally sponsored fodder development scheme ), అందుబాటులో ఉన్న /  దాణాను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి 2010 నుండి మార్చబడింది. 141. 40 కోట్ల రూపాయల ఖర్చుతో, ఈ పథకం దిగువ పేర్కొన్న క్రొత్త అంశాలను / సాంకేతిక మార్పులను చేర్చుకుంది.

  1. మేత / దాణాను పరీక్షించే ప్రయోగశాలలను శక్రి మంతం చేయడం.
  2. గడ్డిని తునకలుగా తరిగే యంత్రాల ఏర్పాటు
  3. సి లేజి ( silage making unit) -  (గాలి చొరని కేంద్రాల) యూనిట్లను ఏర్పాటు చేయడం.
  4. అజోలా (azolla) వ్యవసాయ పద్ధతిని వివరించడం మరియు ఆ విధానంలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం.
  5. మధ్యతర మాంసకృత్తుల (ప్రోటిన్లు) ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు
  6. ప్రాంతాల వారీగా అవసరమైన ఖనిజలవణాల మిశ్రమ కేంద్రాలు / దాణాగుళికలు / దాణా తయారు చేసే కేంద్రాల ఏర్పాటు.

ఈ అంశాలకు సంబంధించి, యిచ్చే రాయితీ ధనం, పశువుల మేత తయారీ కేంద్రాల ఏర్పాటుకు 50 శాతం పెంచడమైనది. ఆ విధంగా ప్రోత్సహించే ఎక్కువ తయారీ కేంద్రాల ఏర్పాటులో పాల్గొనేటట్లు చేయడం, మరియు గడ్డి నిల్వలతో సహా గడ్డి మైదానాల అభివృద్ధి అనే అంశానికి కావలసిన సహకారభూమిని 5 నుండి 10 హెక్టార్లకు పెంచడమైనది.

ఈ క్రింద పేర్కొన్నవి, అంశాల వివరాలు, నిధులు సమకూర్చే విధానం, కేంద్రఏర్పాటు ఖర్చు మరియు పదకొండవ ప్రణాళికలో మిగిలిన రెండు సంవత్సరాలలో సాధించ వలసిన లక్ష్యాలు.

మార్చబడిన అంశాలు/ నూతన అంశాల యొక్క పేరు(Name of modified componeuts / new comboneuts

లబ్ధిదారులు ( Beneficiaries)

సహకార విధానం

కేంద్రం ఖర్చు

పశువుల మేత తయారీ కేంద్ర విభాగాల ఏర్పాటు

పబ్లిక్ (ప్రభుత్వరంగం) / ప్రైవేట్ వ్యాపారులు. సహకార సంఘాలు మరియు స్వయం సహాయక బృందాలు(shgs)  తో సహా

50: 50

85: 00

గడ్డి నిల్వలతో పాటు గడ్డి మైదానాల అభివృద్ధి

రైతులు, పశుసంవర్ధక శాఖ మరియు అటవీ సాఖ కాని Ngos / గ్రామపంచాయితీ భూములు మరియు ఉమ్మడి ఆస్తి వనరులపై తమ తోడ్పాటును అందిస్తారు.

100: 00

0: 70

పశువుల మేత యొక్క విత్తన సేకరణ మరియు పంపిణి

రైతులే లబ్ధిదారులు. రాష్ట్ర ప్రభుత్వాలు Si AS / పాల సహకార సంఘాలు / Ngos లను కలుపుకుని ఈ పథకం అమలు చేసే వీలుంది. క్వింటాలుకు 5000రూపాయల చొప్పున, మొత్తం 37,000 క్వింటాళ్ళ పశువుల మేత యొక్క విత్తనాలను సేకరించి రాష్ట్రప్రభుత్వం, రైతులకు పంపిణీ చేస్తుంది.

75: 25

0: 05

దాణా పరీక్ష చేసే ప్రయోగ శాలలను శక్తి మంతం చేయడం

ప్రస్తుతం ఉన్న వెటర్నరీ (జంతు వైద్య కళాశాలల) కళాశాలల పోషక పదార్ధాల ప్రయోగశాలలు / వ్యవసాయ విశ్వవిద్యలయాలు

50: 50

200: 00


మార్చబడిన అంశాలు/ నూతన అంశాల యొక్క పేరు

లబ్ధిదారులు

సహకార విధానం

కేంద్రం ఖర్చు

 

దాణా / మేతను విశ్లేషించి యంత్రాలు / సాధనాలను కొనడానికి కావలసిన విధులకు అనుమతి. అనుమతించిన సాధనాల పట్టిక పంపిణీ

 

 

చేతితో పనిచేసే గడ్డిని తరిగే పరికర పరిచయం

రైతులు మరియు పాల సహకార సంఘాల సభ్యులు /ATMA/ KVKS

75: 25

0.05

విద్యుత్తుతో పనిచేసే గడ్డిని తరిగే పరికర పరిచయం

రైతులు మరియు పాల సహకార సంఘాల సభ్యులు /ATMA/ KVKS

75: 25

0.20

గాలిని చొరని కేంద్రాల ఏర్పాటు ( silage making units)

రైతులు మరియు పాల సహకార సంఘాల సభ్యులు /ATMA/ KVKS

100: 00

1.05

అజోలా (azolla) వ్యవసాయ పద్ధతుల వివరణ మరియు ఉత్పత్తి కేంద్రాలు

రైతులు మరియు పాల సహకార సంఘాల సభ్యులు /ATMA/ KVKS

50: 50

0.10

మధ్యంతర మాంసకృత్తుల ఉత్పత్తి కేంద్రాల
ఏర్పాటు

పాల సమాఖ్యలు / ప్రైవేట్ వ్యాపారులు. ఏదైనా వాణిజ్య బ్యాంకు ఆమోదం పొందిన ప్రణాళిక కు మాత్రమే వర్తిస్తుంది.

25: 75

145.00

ప్రాంతాల వారీగా అవసరమైన ఖనిజ లవణాల మిశ్రము/ దాణా గుళికల దాణా తయారీ ఏర్పాటు

ప్రభుత్వ/ ప్రైవేట్ వ్యాపార సంస్థలు, పాల సహకార సంఘాలు మరియు, స్వయం సహాయక బృందాలు. ఏదైనా వాణిజ్య బ్యాంకు ఆమోదం పొందిన ప్రణాళిక కు మాత్రమే నిధులు, యంత్రాలు/ సాధనాలు కొనడానికి మాత్రమే అనుమతి

25: 75

100.00

సన్న జీవాలు, కుందేళ్ళ సమగ్రాభివృద్ధి-కేంద్ర ప్రభుత్వ పథకం

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate