Accessibility options
Accessibility options
Government of India
Contributor : Vikaspedia28/04/2022
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
జిల్లాలో నీటి పారుదల శాఖ ఖమ్మం డివిజన్ పరిధిలో వంద ఎకరాల కంటే ఎక్కువగా ఆయకట్టు ఉన్న చెరువులు 208 ఉన్నాయి. వీటి కింద 66698 ఎకరాలను స్థిరీకరించారు. వంద ఎకరాల కంటే తక్కువగా ఉన్నవి 1154 కుంటలు ఉన్నాయి. వీటి కింద 27104 ఎకరాలను స్థిరీకరించారు. బేతుపల్లి వరద కాలువ కింద 6000 ఎకరాలను స్థిరీకరించారు.
మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు
ప్రాజెక్టు పేరు - ఆయకట్టు
జిల్లాలో చెరువులు, కుంటలు
ఆధారము: ఈనాడు
జిల్లాలో వివిధ పంటల సాధారణ సాగు విస్తీర్ణం
జిల్లాలో ప్రధాన పంటలు...వాటి సాధారణ సాగువిస్తీర్ణం(హెక్టార్లలో)
1.వరి - 1,31,964
2.జొన్న - 141
3.సజ్జ - 10
4.మొక్కజొన్న- 14,010
5.పెసర - 10,533
6.మినుము - 252
7.కంది - 9,376
8.వేరుశనగ - 287
9.నువ్వులు - 930
10.మిర్చి - 19,924
11.పత్తి - 1,52,296
12.చెరకు - 3,558
13.పసుపు - 361
14.మామిడి - 46,000
15.కూరగాయలు - 6,500
16.జామ - 4,112
17.జీడిమామిడి - 5.145
18.అరటి - 4,182
19.బొప్పాయి - 3,567
20.ఆయిల్‌పామ్ - 9,617
మొత్తం పంటల సాగువిస్తీర్ణం - 4,05,014
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
ఉద్యానశాఖ
జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణం: 50,351 హెక్టార్లు
సూక్ష్మ సేద్యం
మత్స్య శాఖ
గంబూషియా చేపల ఉత్పత్తి
వైరాలోని మత్య్సవిత్తన క్షేత్రంలో మూడున్నర దశాబ్దాలుగా చేపల ఉత్పత్తి కేంద్రం మత్య్సశాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కట్ల, రోహు, మృగాల, బంగారుతీగ రకం చేపలను ఉత్పత్తి చేస్తుంటారు. గుడ్లద్వారా చేపల పిల్లను ఉత్పత్తి చేసి వాటిని ఇక్కడ నెలరోజుల వరకు పెంచి మత్స్యకారసంఘాలకు ఇస్తుంటారు. ఏటా ఇక్కడ సుమారుగా 2.5 కోట్ల చేపపిల్లలను ఉత్పత్తి చేస్తుంటారు. వీటితో పాటు ఇక్కడ దోమల నిర్మూలనలో కీలకమైన గంబూషియా చేపలను ఉత్పత్తి చేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభంలో ఏటా సుమారుగా పదిలక్షల గంబూషియా చేపలను ఉత్పత్తి చేసి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పంపిణీ చేస్తారు. మురికి గుంతల్లో ఉండే వ్యర్థపు నీటిలో గంబూషియా చేపపిల్లలను వదిలితే అవి దోమల లార్వాను, గుడ్లను తిని దోమల నిర్మూలనలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇక్కడ సిమెంట్‌తొట్టుల్లో గంబూషియా చేపలను ఉత్పత్తి చేస్తారు. వివరాలకు సంప్రందించాల్సిన ఫోన్‌నెంబర్- 9951096622
ఆధారము: ఈనాడు
భారీ నీటిపారుదల ప్రాజెక్టులు
నాగార్జునసాగర్ ఎడమ కాలువ దాని ఉప కాలువలు జిల్లాలోని 16 మండలాల్లో విస్తరించాయి. సాగర్ కాలువల కింద 2,51,800 ఎకరాల ఆయకట్టుంది. కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, వైరా, చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో భూములకు సాగర్ నీటి సరఫరా జరుగుతుంది.
దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ఎత్తిపోతల పథకం
అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. రెండు లక్షల ఎకరాలకు నీరందించడం లక్ష్యం. ఖమ్మం జిల్లాలో 16 మండలాలు, వరంగల్ జిల్లాలో ఒక మండలం దీని ద్వారా లబ్ధి పొందుతాయి. పనులు నత్తనడకన సాగుతున్నాయి.
దుమ్ముగూడెం ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం
వేలేరుపాడు మండలం రుద్రంకోట వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు నీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 మండలాలు లబ్ధి పొందుతాయి. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా ఈ ఎత్తిపోతల పథకం డిజైన్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితేనే ఈప్రాజెక్టు ఉపయోగంలోకి వస్తుంది.
దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ లింక్ కెనాల్
ఖమ్మం జిల్లా మణుగూరు మండలం అనంతారం వద్ద గోదావరి నదిపై చేపట్టిన లింక్ కెనాల్ ఇది. దీని ద్వారా గోదావరి నది నుంచి 165 టీఎంసీల నీటిని కృష్ణానదిపై ఉన్న నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుకు పంపాలని నిర్ణయించారు. ఈప్రాజెక్టు నిర్మాణం నిలిపేయాలని జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. కానీ ఈప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పటికే టెండర్లు పూర్తి చేశారు. గుత్తేదారులకు రూ.500 కోట్ల వరకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
శ్రీరాంసాగర్ వరద కాలువ
శ్రీరాంసాగర్ వరద కాలువల నిర్మాణం జిల్లాలోని 4 మండలాల్లో చేపట్టారు. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ మండలాల్లో 70 వేల ఎకరాలకు సాగునీరందించటం లక్ష్యం. ఈపనులు పదేళ్లుగా సాగుతున్నాయి.
ఆధారము: ఈనాడు
గోదావరి
మహారాష్ట్రంలోని నాసికా త్రయంబకం వద్ద పుట్టింది. వరంగల్‌లోని ఏటూరినాగారం వైపు నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భద్రాచలం, రాజమండ్రిలలో గోదావరిపై వంతెనలున్నాయి. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను తాకుతూ గోదావరి ప్రవహిస్తుంది.
శబరి
గోదావరికి ప్రవర, మూల, మంజీర, ప్రాణహిత, వైన్‌గంగ, పెన్‌గంగ, వార్ధ, ఇంద్రావతి, శబరి ఉపనదులున్నాయి. ఇందులో శబరి ఖమ్మం జిల్లాలోని కూరవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. శబరి అనే భక్తురాలికి వనవాసం సమయంలో రాముడు ఓ వరాన్ని ప్రసాదించాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. ఈ వరం వల్లనే శబరి నదిగా మారిందని కథనం. ఒరిస్సా కొండలు ఈ నది జన్మస్థానం. శబరికి ఉపనది సీలేరు.
తాలిపేరు
భద్రాచలం డివిజన్‌లోని అతిపెద్ద సాగునీటి పథకం ఇది. గోదావరికి ఉపనది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో పుట్టి దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహించి చర్ల మండలం పూసుగుప్ప వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. చర్ల మండలం ఎర్రగడ్డ వద్ద గోదావరిలో కలుస్తుంది. తాలిపేరు కింద దాదాపు 25 వేల ఎకరాల భూమి సాగు అవుతుంది.
ఆధారము: ఈనాడు
వాతావరణం, పంటల పరిస్ధితి, విశ్లేషలు గురించి వివరాలు.
తాము కోసిన పంటను నిలువ ఉంచాలా లేదా అమ్మవలెనా మరియు ఏ సమయంలో ఏ మార్కెట్లో విక్రయించాలో మొదలగు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది
ఈ విభాగం లో రాష్ట్రంలోని యువ రైతులకు పట్టు రైతులకు ప్రభుత్వము అందించే సహాయములో ఉత్తమ యాజమాన్య పద్ధతులు గురించి వివరించడం జరిగింది
వివిధ పంట ధరలవివరాలు,ధాన్యంతరలింపు జాగ్రత్తలు
ఈ పేజిలో కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.
కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మహబుబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడి, మెదేక్, నల్గొండ, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
Contributor : Vikaspedia28/04/2022
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
1381
వాతావరణం, పంటల పరిస్ధితి, విశ్లేషలు గురించి వివరాలు.
తాము కోసిన పంటను నిలువ ఉంచాలా లేదా అమ్మవలెనా మరియు ఏ సమయంలో ఏ మార్కెట్లో విక్రయించాలో మొదలగు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది
ఈ విభాగం లో రాష్ట్రంలోని యువ రైతులకు పట్టు రైతులకు ప్రభుత్వము అందించే సహాయములో ఉత్తమ యాజమాన్య పద్ధతులు గురించి వివరించడం జరిగింది
వివిధ పంట ధరలవివరాలు,ధాన్యంతరలింపు జాగ్రత్తలు
ఈ పేజిలో కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.
కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మహబుబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడి, మెదేక్, నల్గొండ, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.