Accessibility options

రంగు వ్యత్యాసం
టెక్స్ట్ పరిమాణం
విషయాన్నిప్రత్యేకంగా
చూపించడం
పెద్దగా చేయండి

Accessibility options

రంగు వ్యత్యాసం
టెక్స్ట్ పరిమాణం
విషయాన్నిప్రత్యేకంగా
చూపించడం
పెద్దగా చేయండి
india_flag

Government of India

MeitY LogoVikaspedia
te
te

చెఱకు

Open

Contributor  : Telugu Vikaspedia27/05/2020

Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.

మావి చౌడు నేలలు, చెఱకు వేయడం అనుకూలమా. ఎటువంటి రకాలు వేసుకోవాలి

చౌడు భూములలో చెఱకును పండించవచ్చును. పాలచెూడు భూముల్లో ముందుగా లవణాలను మురుగు నీటి కాల్వల ద్వారా తీసివేసి, క్షార భూముల్లో అయితే జిప్సమ్ను వేసి నేలను అభివృద్ధి పరచి చౌడును తట్టుకునే 81ఎ99, 81వి48, కో-7219, కో-టి8201, 93ఎ145 మొదలైన రకాలను నాటుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చును.

చెఱకులో దుబ్బ తెగులును తట్టుకునే రకాలు ఏమిటి

85ఎ261, 86వి96, కో-6907, కో-7219, 90ఎ278 మరియు 87ఎ397 రకాలు తెగులును తట్టుకుంటాయి.

చెఱకులో క్రొత్త రకాలేమైన విడుదలయ్యాయా. చెఱకులో ప్రోత్సాహకరమైన క్రొత్త రకాలు విడుదలయ్యాయి.

వాటిలో స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రకాలు కూడా వున్నాయి. స్వల్పకాలిక రకాలలో విశ్వామిత్ర (87 ఎ 298). 88ఎ 189, 90ఎ272, వసుధ (83ఆర్23), 9880297 మరియు 90ఆర్5 ముఖ్యమైనవి. మధ్యకాలిక 87ఆర్897, 898)74 మరియు 93ఎ21 .

కార్మి తోటలలో కలుపు చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఎలా నివారించాలి

కార్మి చెఱకు తోటలలో మోళ్ళు చెక్కిన నెల రోజుల లోపు ఫెర్నాక్సోన్ (ఎకరాకు 1.8 కిలోలు) మరియు గ్రమాక్సోన్ (ఎకరాకు 1.0 లీటరు) 450 చేసినట్లయితే నివారించబడుతుంది.

మొక్క తోటకి, కార్మి తోటకి ఎరువుల యాజమాన్యంలో ఏ విధమైన మెళకువలు పాటించాలి

సాధారణంగా మొక్క తోటల్లో 40 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులు, 48 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు మొక్క నాటే సమయంలో వేయాలి. నత్రజని ఇచ్చే ఎరువులు వివిధ ప్రాంతాల వారిగా 45 నుండి 160 కిలోలు వరకు రెండు సమపాళ్ళలో నాటిన 45 రోజులు మరియు 90 రోజులకు వేయాల్సి వుంటుంది.

కార్మి తోటలలో 40 కిలోల భాస్వరం ఎరువులు, 48 కిలోల పొటాష్ ఇచ్చు ఎరువులు మోళ్ళు చెక్కినపుడు మరియు 90 నుండి 200 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వివిధ ప్రాంతాల వారిగా రెండు సమపాళ్ళలో మోళ్ళు చెక్కినపుడు మరియు 45 రోజులకు వేయవలయును.

చెఱకులో అంతరపంటలు ఏవైనా వేసుకోవచ్చా? వేసుకుంటే దిగుబడి ఏమైనా తగ్గుతుందా

చెఱకులో అంతర పంటలుగా అపరాలు (పెసర, మినుము, సోయాచిక్కుడు) వేరుశనగ, కూరగాయలను సాగు చేయవచ్చును. చెఱకును సుమారు చాళ్ళ మధ్య 80-100 సెం.మీ. ఎడంలో నాటుతారు. చాళ్ళ మధ్య పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ పంటలను రెండు వరుసల్లో నాటుకోవాలి. అంతర పంటలవల్ల చెఱకులో దిగుబడులు ఏమాత్రం తగ్గవు.

45 రోజుల వయస్సు గల కార్మితోటల్లో, ఆకులు, ఈనెలు తెల్లగా పాలిపోతున్నాయి. ఏమిచెయ్యాలి

చెఱకులో ఆకులు తెల్లగా పాలిపోవడం ఇనుపధాతువు లోపించడం వల్ల జరుగుతుంది. ఈ ఇనుపధాతులోపం, పిలక తోటలలో ఎక్కువగా కనపడుతుంది. దీని నివారణకు అన్నభేది అమ్మోనియం సల్ఫేటు 0.5 శాతం) ఎకరాకు 2 కిలోలు పైరు 45 రోజులు మరియు 60 రోజుల వయస్సులో రెండుసార్లు పిచికారీ చేయాలి.

చెఱకులో పీక ఎండి పోతుంది. కాండంలో పురుగు ఉంది. నివారణకు ఎలా

లేత చెలుకు పంటలో పీక పురుగు ఉధృతి ఎక్కువగా వుంటుంది. చనిపోయిన మొవ్వలను పీకిన తేలికగా వూడి వస్తాయి. కుళ్ళి పోయిన మొవ్వు నుండి చెడు వాసన వస్తుంది. పిలకలు 15 శాతం మించి చనిపోయినచో వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చెఱకు ముచ్చెలను 20 సెం.మీ. లోతు కాలువలలో, 10 సెం.మీ. లోతుగా పెడ ప్రక్కలో నాటి, నాటేటప్పుడు ఎకరాకు 12 కిలోల కార్బోఫ్యూరాన్ 3 జి. గుళికలు లేదా 8 కిలోల సెవిడాల్ గుళికలు లేదా 10 కిలోల లిండేన్ 1.2 శాతం పొడి మందును చాళ్ళలో వేయాలి.

మొక్క తోటల్లో నాటిన మూడవ రోజున, కార్మి తోటల్లో కార్మి చేసిన వెంటనే ఎకరాకు 1-2 టన్నుల చొప్పన చెఱకు చెత్త కప్పాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. నాటిన 30 రోజుల నుంచి మొక్కల చుటూ మట్టిని ఎగదోయాలి. ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పన కలిపి పిచికారీ చేయాలి లేదా ఎకరాకు 9 కిలోల లిండేన్ 6 శాతం గుళికలు 2:3:4 నిష్పత్తిలో నాటిన 4, 6, 9 వారాలకు వేసుకోవాలి. తెలంగాణా ప్రాంతాల్లో ఎకరాకు 8 కిలోల ఎండోసల్ఫాన్ 5 శాతం గుళికలు లేదా సెవిడాల్ 4 శాతం గుళికలు 10 కిలోల చొప్పన నాటిన 4, 8, 12 వారాల్లో వేసుకోవాలి.

చెఱకు పైరు వేసి 4 నెలలైంది. కాండం తొలిచే పరుగు ఆశించింది. ఎలా నివారించాలి

ఈ పురుగు జూన్-జూలై మాసాల్లో ఎక్కువగా నష్టం కలుగ జేస్తుంది. లార్వాలు కణుపుల వద్ద రంధ్రాలు చేసి లోనికి ప్రవేశించి తిని, మలిన పదార్థాలను బయటకు విసర్జిస్తాయి. పురుగు ఆశించిన చెఱకు గడలోపల ఎబ్రని చారలు ఏర్పడతాయి. ఈ పురుగు నివారణకు, నత్రజని ఎరువులను సమపాళ్ళలో సిఫారుసు మేరకు వాడాలి. అందుబాటులో వుంటే టైకోగ్రామా గ్రుడు పరాన్నజీవిని ఎకరాకు 20,000 చొప్పన 3-4 సార్లు 15 రోజుల వ్యవధిలో వదలాలి. ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

చెఱకులో అంతరపంటలు ఏవైనా వేసుకోవచ్చా. వేసుకుంటే దిగుబడి ఏమైనా తగ్గుతుందా

చెఱకులో తెల్లపేను లేదా ఊలి ఏఫిడ్ నివారణ ఎలా

విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటలనుండి సేకరించాలి. విత్తన ముచ్చెలను మలాథియాన్ 3 మి.లీ. లీటరు చొప్పన కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటాలి. పురుగులు ఆశించిన ఆకులను తీసి తగుల బెట్టాలి. సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వాడాలి. మట్టి మొదళ్ళకు ఎగదోయాలి. ఎండోసల్ఫాన్ లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఆశించిన తోటల నుండి ఇతర ప్రాంతాలకు చెఱకు రవాణా చేయరాదు.

చెఱకులో విత్తనశుద్ధి ఎలా చేయాలి

ఎట్టకుళ్ళ తెగులు ఆశించకుండా విత్తనపు ముచ్చెలను నాటే ముందు వేడి నీటిలో కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి చొప్పన కలిపి 520 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు ఉంచి నాటు కోవాలి. ఆకు మాడు / కాటుక తెగులు / కొరడా తెగులు ఆశించకుండా కూడా పై పద్ధతిలో లేదా గాలితో మిళితమైన ఆవిరిలో 510 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలు విత్తనపు ముచ్చెలను శుద్ధి చేసి తర్వాత 10 లీటర్ల నీటికి 5 గ్రా.ల చొప్పన కార్బండజిమ్ కలిపిన నీటిలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. గడ్డి డుబ్బు తెగులు ఆశించకుండా పై పద్ధతిలో 50 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఒక గంట శుద్ధి చేయాలి. అనాస కుళ్ళు తెగులు నివారణకు విత్తనపు ముచ్చెలను 10 లీటర్ల నీటికి 5 గ్రా. కార్బండజిమ్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటాలి.

చెఱకులో ఎట్టకుళ్ళ తెగులు ఎలా నివారించాలి

తెగులు సోకని తోటల నుండి విత్తనాన్ని సేకరించాలి. ముచ్చెలను విత్తన శుద్ధి చేయాలి. తెగులు తీవ్రంగా ఆశించే ప్రాంతాల్లో కో-7706, కో.ఎ-7602. కోటి-8201. కో-8021, కో, ఆర్-8001, కో-8013, కో.ఎ-89082 కో-ఎ-89085, కో-87, 87ఎ298, 87ఎ397, 83వి15 వంటి రకాలను సాగు చేయాలి. ఇవే కాక స్వల్పకాలిక రకాలైన కో-6907, కో-7508, కో-8014, 81ఎ99, 86వి96, మధు వంటి వాటిని కూడా సాగు చేయవచ్చు. మొలకలు పెట్టని దుబ్బులను, మొలవని ముచ్చెలను, ఎదిగిన తోటలో తెగులు సోకిన తీసి కాల్చి వేయాలి. తోటలలో నీరు నిలవకుండా చూడాలి. తోటలు పడిపోకుండా నిలగట్టాలి. ప్రస్తుతం లభ్యమయ్యే శిలీంధ్ర నాశన మందుల నుపయోగించి ఎట్టకుళ్ళ తెగులును అరికట్టలేము.

కాటుక తెగులు లేదా కొరడా తెగులును ఎలా అరికట్టాలి

ఆరోగ్యవంతమైన తోటలనుండి విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధి చేయాలి. తెగులు ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో కార్మి తోటల పెంపకం మొదటి కార్మికే పరిమితం చేయాలి. కాటుక తెగులు తట్టుకొనే రకాలైన కో-8013, కో-8014, 81ఎ99, 86వి96, కో-7805, 82వి12, 83వి288. కో-7706, కో-8011 90ఎ272, 91వి83, 93వి297 89వి74, 93ఎ21 వంటి రకాలను సాగు చేయాలి. కార్మి దుబ్బులను కంటే కొంచెం లోతుగా నరకాలి. తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగలబెట్టాలి.

ఆధారం:www.apagrisnet.gov.in

Related Articles
వ్యవసాయం
విశాఖపట్నం

ఈ పేజిలో విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

వ్యవసాయం
వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు

పంచాంగంను అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి.

వ్యవసాయం
మెదక్

ఈ పేజిలో మెదక్ జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

వ్యవసాయం
పంటలలో ఉపపోషక పదార్ధముల లోపాలు,నివారణ చర్యలు

పంటలలో ఉపపోషక పదార్ధముల లోపనికి నివారణ

వ్యవసాయం
నిజామాబాదు

ఈ పేజిలో నిజామాబాదు జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

వ్యవసాయం
అటవీ వ్యవసాయం

ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం.

చెఱకు

Contributor : Telugu Vikaspedia27/05/2020

Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.

  1. మావి చౌడు నేలలు, చెఱకు వేయడం అనుకూలమా. ఎటువంటి రకాలు వేసుకోవాలి
  2. చెఱకులో దుబ్బ తెగులును తట్టుకునే రకాలు ఏమిటి
  3. చెఱకులో క్రొత్త రకాలేమైన విడుదలయ్యాయా. చెఱకులో ప్రోత్సాహకరమైన క్రొత్త రకాలు విడుదలయ్యాయి.
  4. కార్మి తోటలలో కలుపు చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఎలా నివారించాలి
  5. మొక్క తోటకి, కార్మి తోటకి ఎరువుల యాజమాన్యంలో ఏ విధమైన మెళకువలు పాటించాలి
  6. చెఱకులో అంతరపంటలు ఏవైనా వేసుకోవచ్చా? వేసుకుంటే దిగుబడి ఏమైనా తగ్గుతుందా
  7. 45 రోజుల వయస్సు గల కార్మితోటల్లో, ఆకులు, ఈనెలు తెల్లగా పాలిపోతున్నాయి. ఏమిచెయ్యాలి
  8. చెఱకులో పీక ఎండి పోతుంది. కాండంలో పురుగు ఉంది. నివారణకు ఎలా
  9. చెఱకు పైరు వేసి 4 నెలలైంది. కాండం తొలిచే పరుగు ఆశించింది. ఎలా నివారించాలి
  10. చెఱకులో అంతరపంటలు ఏవైనా వేసుకోవచ్చా. వేసుకుంటే దిగుబడి ఏమైనా తగ్గుతుందా
  11. 45 రోజుల వయస్సు గల కార్మితోటల్లో, ఆకులు, ఈనెలు తెల్లగా పాలిపోతున్నాయి. ఏమిచెయ్యాలి
  12. చెఱకులో పీక ఎండి పోతుంది. కాండంలో పురుగు ఉంది. నివారణకు ఎలా
  13. చెఱకు పైరు వేసి 4 నెలలైంది. కాండం తొలిచే పరుగు ఆశించింది. ఎలా నివారించాలి
  14. చెఱకులో తెల్లపేను లేదా ఊలి ఏఫిడ్ నివారణ ఎలా
  15. చెఱకులో విత్తనశుద్ధి ఎలా చేయాలి
  16. చెఱకులో ఎట్టకుళ్ళ తెగులు ఎలా నివారించాలి
  17. కాటుక తెగులు లేదా కొరడా తెగులును ఎలా అరికట్టాలి

Related Articles
వ్యవసాయం
విశాఖపట్నం

ఈ పేజిలో విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

వ్యవసాయం
వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు

పంచాంగంను అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి.

వ్యవసాయం
మెదక్

ఈ పేజిలో మెదక్ జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

వ్యవసాయం
పంటలలో ఉపపోషక పదార్ధముల లోపాలు,నివారణ చర్యలు

పంటలలో ఉపపోషక పదార్ధముల లోపనికి నివారణ

వ్యవసాయం
నిజామాబాదు

ఈ పేజిలో నిజామాబాదు జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

వ్యవసాయం
అటవీ వ్యవసాయం

ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం.

Lets Connect
Facebook
Instagram
LinkedIn
Twitter
WhatsApp
YouTube
Download
AppStore
PlayStore

MeitY
C-DAC
Digital India

Phone Icon

+91-7382053730

Email Icon

vikaspedia[at]cdac[dot]in

Copyright © C-DAC
vikasAi