Accessibility options
Accessibility options
భారత ప్రభుత్వం
భాగస్వామ్యం అందించినవారు : Saikumar reddy05/09/2023
పెద్ద పెద్ద సారాంశాలను చదవాల్సిన అవసరం లేదు. వికాస్ AI సహాయంతో సంక్షిప్త సారాంశం కోసం 'కంటెంట్‌ను సంగ్రహించు' పై క్లిక్ చేయండి.
కొమరంభీం జిల్లాగిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్ జిల్లా.
కొమురం భీమ్ తో పాటు మరెందనో పోరాట యోధుల జన్మించింది ఈ ప్రాంతంలోనే.ఒకప్పుడు ఈ పట్టణం జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో మళ్లీ జిల్లా పరిపాలన ప్రధాన కేంద్రంగా కొమురం భీమ్ పేరుతో 2016 అక్టోబరు 11న అవతరించింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్.
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుండి విభజింపబడినది. దీని చుట్టూ ఆదిలాబాద్, మంచిరాల, నిర్మల్ జిల్లాలు మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతంగా ఉన్నాయి.
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలలు మరియు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ అనే రెండు రెవెన్యూ విభాగాలను కలిగి ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం ప్రధానంగా గిరిజన పట్టణమైన ఆసిఫాబాద్ లో కలదు. భారతదేశం యొక్క దక్షిణ మరియు ఉత్తరాలను కలిపే రైల్వే మార్గం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గుండా వెళుతుంది. సిర్పూర్-కాగజ్ నగర్ జిల్లాలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఈ జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో కూడా ఉంది.
జిల్లా లో ప్రాధమిక పంటలైన వరి, పత్తి మరియు పప్పుధాన్యాలు పండిస్తారు. ఈ జిల్లాలో సింగరేని, సిర్పూర్ పేపర్ మిల్లు, స్పిన్నింగ్ మరియు జిన్నింగ్ మిల్లులు పారిశ్రామిక ప్రాంతాలు కలవు.
“ఈ జిల్లాకు అద్భుతమైన చారిత్రాత్మక గతం ఉంది, పూర్వపు పాలకుల విషయాలలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ ఒక ముఖ్యమైన భాగం. జిల్లాలో మరియు చుట్టుపక్కల తవ్విన పూర్వ-చారిత్రక కాలం యొక్క శిలాజాలు ఈ ప్రదేశానికి పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కుమురం భీమ్ ప్రాజెక్టు, గంగాపూర్ కేవ్, మోవ్వాడ్ గ్రామం పర్యాటక ఆకర్షణలు.
ఆధారం : కొమురం భీమ్ ఆసిఫాబాద్
ఈ అంశం జిల్లా గణాంక నివేదికలు గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం జిల్లా అభివృద్ధి ప్రణాళిక గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం జిల్లా అవలోకనం గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం కొమరం భీమ్ గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం ఖమ్మం జిల్లా అవలోకనం గురించి సమాచారాన్ని అందిస్తుంది
జిల్లా గురించి
భాగస్వామ్యం అందించినవారు : Saikumar reddy05/09/2023
పెద్ద పెద్ద సారాంశాలను చదవాల్సిన అవసరం లేదు. వికాస్ AI సహాయంతో సంక్షిప్త సారాంశం కోసం 'కంటెంట్‌ను సంగ్రహించు' పై క్లిక్ చేయండి.
1
ఈ అంశం జిల్లా గణాంక నివేదికలు గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం జిల్లా అభివృద్ధి ప్రణాళిక గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం జిల్లా అవలోకనం గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం కొమరం భీమ్ గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఈ అంశం ఖమ్మం జిల్లా అవలోకనం గురించి సమాచారాన్ని అందిస్తుంది
జిల్లా గురించి
+91-7382053730
vikaspedia[at]cdac[dot]in