హోమ్ / విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకోండి
పంచుకోండి

విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకోండి

ఈ పేజి లో వికాస్ పీడియా పోర్టల్ లో కంటెంట్ కాంట్రిబ్యూటర్ గా నమోదు చేసుకొనే విధానం గురించి చర్చించబడింది.

ఈ పేజి లో వికాస్ పీడియా పోర్టల్ లో కంటెంట్ కాంట్రిబ్యూటర్ గా నమోదు చేసుకొనే విధానం గురించి చర్చించబడింది.

మొదటగా http://te.vikaspedia.in కు వెళ్ళండి.

 1. కుడి వైపు పై భాగం చివరలో ఉన్న నమోదు పత్రం ను క్లిక్ చెయ్యండి.
 2. తరువాత విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్నBecome a Volunteer ను క్లిక్ చేయండి.
 3. ఇక్కడ పూర్తిపేరు, ఇ-మెయిల్, చిరునామా తదితర వివరాలను నింపండి.
 4. తరువాత నైపుణ్యతా అంశం లో ఏవైనా 2 అంశాలను ఎంచుకోండి.
 5. ఎరుపు రంగు గుర్తు గల అన్ని వివరాలు పూరించిన తరువాత నమోదు చేసుకోండి పై క్లిక్ చేయండి.
 6. మీకు 5 నిముషాలలో మీ పాస్ వర్డ్ ను ఏర్పాటు చేసుకోడానికి URL లింక్ తో మెయిల్ పంపబడును.
 7. మీ ఇ-మెయిల్ ను ఓపెన్ చేసి InDg Admin నుండి వచ్చిన మెయిల్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
 8. ఇక్కడ మీరు మీ పాస్ వర్డ్ ని ఏర్పాటు చేసుకోవలెను.
 9. పాస్ వర్డ్ షరతులు:
  • మీ పాస్ వర్డ్ 8 అక్షరాలకు తక్కువ ఉండరాదు.
  • ఒక కాపిటల్ లెటర్ ఉండవలెను (A-Z).
  • ఒక స్మాల్ లెటర్ ఉండవలెను (a-z).
  • వీటిలో ఏదైనా ఒక ప్రత్యేక అక్షరం ఉండవలెను (@,$,#,%).
  • వీటిలో ఏదైనా ఒక అంకె ఉండవలెను (0-9).
 10. తరువాత నా పాస్ వర్డ్ సెట్ చేయుము పై క్లిక్ చేయండి.
 11. మీ పాస్ వర్డ్ విజయవంతంగా సెట్ చేయబడింది. ఇప్పుడు మీరు మీ పాస్ వర్డ్ తో లాగిన్ కావచ్చు, లాగిన్ అవ్వటానికి ఇక్కడ క్లిక్ చేయండి పై క్లిక్ చేయండి.
 12. ఇక్కడ మీ ఇ-మెయిల్, పాస్ వర్డ్ మరియు డబ్బాలో ఉన్న అంకెలను ఎంటర్ చేసి లాగ్ ఇన్ ను క్లిక్ చేయండి.

విషయ రచన భాగస్వామి ఏ విధంగా విషయాన్ని పోర్టల్ లో పొందుపరచవచ్చు

విషయ రచన భాగస్వామి (కంటెంట్ కాంట్రిబ్యూటర్) ఏ విధంగా విషయాన్ని(కంటెంట్) పోర్టల్ లో పొందుపరచవచ్చు మరియు మార్పులు చేయవచ్చు...

గమనిక :
రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంచుకున్న అంశాలలో మాత్రమే మార్పులు చేయవచ్చును.

“వికాస్ పీడియా పోర్టల్” లో మీరు విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకున్నందున మీరు ఈ పోర్టల్ లో సమాచారాన్ని/విషయాన్ని పొందుపరచవచ్చు. మీరు విషయాన్ని పొందుపరచాలంటే మొదటగా లాగిన్ అవ్వాలి.

లాగ్ ఇన్ అవటానికి కుడివైపు పైన ఉన్న లాగ్ ఇన్ ను క్లిక్ చేసి, ఇ-మెయిల్, పాస్వర్డ్ మరియు డబ్బా లో ఉన్న కోడ్ ను నింపి లాగ్ ఇన్ ను క్లిక్ చేయండి.

మీ పేరు కుడివైవు పైన కనబడితే మీరు లాగిన్ అయినట్లు.

కొత్త పేజి ని జతచేయడానికి :

 1. మీరు ఎంచుకున్న వర్టికల్ కి వెళ్ళండి.ఉదా: వ్యవసాయం, ఆరోగ్యం, విద్య..
 2. మీరు పెట్టదలచిన పేజి ని సెలెక్ట్ చేసి కొత్త ఐటం జతచేయుము పై క్లిక్ చేసి, పేజి ని ఎంచుకోండి. (ఆకుపచ్చని రంగులో ఉన్న బాక్స్ లో ఉండును).
 3. శీర్షిక లో పేజి యొక్క శీర్షిక (టైటిల్) ని రాయండి.
 4. సంక్షిప్త వర్ణన లో విషయం యొక్క సంక్షిప్త వివరణ (సమ్మరీ) రాయండి.
 5. విషయ వివరణ లో సంబందిత వివరణ రాయండి.
 6. తరువాత సేవ్ చేయుము పై క్లిక్ చేయండి, మీ పేజి సేవ్ అయిపోతుంది.

ఒకవేళ మీరు ఇంతకుముందున్న పేజి ని సవరించాలనుకున్నా (రివ్యూ) లేదా ఆ పేజి లో మీరు కొత్తగా విషయాన్ని జోడించాలనుకుంటే :

 1. మీరు ఎంచుకున్న వర్టికల్ కి వెళ్ళండి (ఉదా: వ్యవసాయం, ఆరోగ్యం, విద్య)
 2. మీరు ఎడిట్ చేయదలచిన పేజి ని ఓపెన్ చేయండి.
 3. పేజి యొక్క శీర్షిక (టైటిల్) పైన ఉన్న ఎడిట్ పై క్లిక్ చేయండి. (ఆకుపచ్చని రంగులో ఉన్న బాక్స్ లో ఉండును).
 4. పేజి ఎడిట్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడ సవరించాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి సవరించండి.
 5. ఒకవేళ కొత్తగా జోడించాలనుకుంటే ఆ పేజి లో ఎక్కడ జోడించాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి విషయాన్ని జోడించండి.
 6. సవరణలు చేసిన తరువాత, సేవ్ చేయుము పై క్లిక్ చేయండి, మీరు చేసిన సవరణలు సేవ్ అయిపోతాయి.
పైకి వెళ్ళుటకు