অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సమాచార హక్కు చట్టం ప్రచారమే ప్రాణం!

సమాచార హక్కు చట్టం ప్రచారమే ప్రాణం!

ఒక వ్యక్తికి మాట్లాడే హక్కు, స్వాతంత్య్రపు హక్కు, జీవించే హక్కు ఉన్నప్పుడు సమాచారాన్ని అడిగి అదిపొందే హక్కు ఉంటే తప్పేమిటి? అసలు సమాచారం అడగడమే సాహసోపేతమైన విషయం. ఇలాంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి, బడుగు, బలహీన వర్గాలవారికి ఎప్పుడూ తారసపడుతూనే ఉంటాయి. సమాచారం ఎందుకివ్వాలి? ఆ సమాచారం నీకెందుకు ఉపయోగపడుతుందని అదిరించి, బెదిరించే బడా బాబులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. చట్టాలు, న్యాయాలు వారికి పట్టవు. చట్టాన్ని చుట్టంగా మలుచుకొని అగ్రకుల నీడల్లో బతుకుతూ గ్రామీణా భివృద్ధిని అడ్డుకుంటుంటారు. నేటి గ్రామీణ భారతంలో ఇదే జరుగుతోంది. ఒక్క గ్రామీణ సమాజంలోనే కాదు, ప్రతిచోట పాలనా ద క్షత, పరిపాలన, సమన్యాయం, సమాజాభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యాలపై ఈ ప్రభావం కనబడుతూనే ఉంది.

కొన్ని మారుమూల ప్రాంతాల్లోని అగ్రకుల నాయకు లు పంచాయి తీలను, గ్రామ నౌకర్లను, ఇతర ఉద్యోగులను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజా జీవితాన్ని, ప్రజాధనాన్ని, ప్రజలకోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల్ని మింగేస్తుంటారు. ఇలాంటప్పుడు ప్రభుత్వంనుండి, లేకఅధికారులనుండి సమాచారం అడిగినప్పుడు సమర్ధవంతమైన, నాణ్యమైన పరిపాలనతో సమాచారం అందించగలిగే పరిస్థితులు ఎక్కడ కనపడుతాయి? స్వాతంత్య్రం అనంతరం మన దేశంలో సమాచారం పొందేందుకు అనేక చట్టాలు చేశారు. కాని అవి ఏ మాత్రం ఉపయోగపడలేదని చెప్పాలి. కాని ఇప్పుడు ఎక్కడ కావాలన్నా, ఎప్పుడు కోరుకొన్నా సదరు సమాచారాన్ని పొందే హక్కును ప్రభుత్వాలు కల్పించాయి. సమాచార హక్కు చట్టం- 2005 ప్రజల చేతిలో వజ్రాయుధమైంది. కేవలం ఇక్కడ ప్రజలు మార్పుని గమనించి అవగాహనతో ముందడుగు వేశారు.ఇప్పుడు ‘చట్టం’- కొందరు కామందుల చేతిలో చుట్టం కాదని, పేదవాడి గుండె చప్పుడని నిరూపించింది. పౌర సరఫరాలు, ప్రజా సంబంధాలు, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్య- ఇలా అన్ని శాఖల పనితీరును ప్రశ్నించింది.

డొల్ల తనాన్ని బయట పెట్టింది. సుపరిపాల న, స్వచ్ఛమైన,నీతివంతమైన, దాపరికంలేని పాలన అందించింది. అవినీతిని అంతమొందించ డానికి సంబంధిత వ్యక్తులకు ప్రజలపట్ల జవాబుదారి తనాన్ని కలిగించే ఉద్దేశంతో, ప్రజలను భాగస్వాములుగా చేసి సమాచార హక్కు చట్టం ద్వారా వీలు కల్పించింది. జులై 2004న అప్పటి ప్రభుత్వం జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఈ జాతీయ సలహామండలి సమాచార హక్కు చట్టం ముసాయిదాను తయారుచేసి 2004 డిసెంబర్‌ 23న లోక్‌సభలో ప్రవేశపెట్టించింది. 2005 మే11 న లోక్‌సభలో ఆమోదం పొందిన సమాచార హక్కు చట్టం 2005 మే 12న మన రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ తరువాత రాష్ర్టపతి ఆమోదం పొంది 2005 జూన్‌ 21న గజెట్‌లో ప్రచురితమైంది. అప్పటి నుండి‘ సమాచారహక్కు చట్టం- 2005’ పౌరులకు సమాచారహక్కును కల్పిస్తోంది. ఈ హక్కు ద్వారా అధికార యంత్రాంగాల వద్దఉన్న సమాచారాన్నిపౌరులు పొందగలరు.తద్వారా ప్రభుత్వ యం త్రాంగాల పనితీరులు,పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతాయి.ఆయారాష్ట్రాలు లక్ష్య సాధనకోసం రాష్ర్ట సమాచార కమిషన్లనుకూడా ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ చట్టం అమలులోనికి వచ్చిన120 రోజులలో సంబంధిత ప్రభుత్వశాఖలు తమకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రభుత్వ పాలన ప్రజల బాగుకోసం, ప్రజల సొమ్ముతోనే సాగుతుంది. అందుచేత ప్రజలకు తెలియకుండా పాలన సాగటంఎంతవరకు సమంజసం? పరిపాలనలో పారదర్శకత లేకుంటే పాలన చీకటిలో సాగుతున్నట్లే భావించాలి. క్రీయాశీల పాత్ర పోషించాల్సిన ప్రజలను ప్రేక్షకులుగా మార్చినట్లవుతుంది. అలాంటప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది? అందువల్ల సమాచార హక్కు పాలనాసంస్కరణల్లో చాలా కీలకమైనది. ప్రభుత్వం వద్దనున్న ప్రజలకు సంబంధించిన సమాచారం పొందేందుకు ప్రతి పౌరుడికి ఇప్పుడు చట్టబద్ధమైన హక్కు ఉన్నది. రికార్డులు, ఫైళ్ళు, రిజిస్టర్లు, మ్యాప్‌లు, డేటా, ఎలక్ట్రానిక్‌లేదా కంప్యూటర్‌లలో నిక్షిప్తమైయున్న సమాచారాన్ని పొందటానికి ఇప్పుడు పౌరులకు హక్కు ఏర్పడింది. అన్ని అధికార కార్యాలయాల్లో ఈ చట్టం ప్రకారం సమాచారం కోరే ప్రశ్నలకు దానిని అందించడం కోసం పౌరసమాచార అధికారులను నియమిస్తారు.సక్రమ విధి నిర్వహణ కోసం పౌర సమా చార అధికారి, ఆ కార్యాలయంలోని మరో అధికారిని కోరినప్పుడు ఆ సహాయం అందించాలి.

సమాచారం కోసం వచ్చినప్రతి అభ్యర్ధనను పౌరసమాచార అధికారులు పరిశీలిం చాలి. లేదా చట్టంలోని సెక్షన్‌ 8 లేదా 9 ప్రకారం సమాచారం నిరాకరించిన విషయాన్ని అయినా రాత పూర్వకంగా తెలియజేయాలి. సమాచారం కోసం దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసినప్పుడు దానితోపాటు నిర్ణీత రుసుం చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ప్రభుత్వం దరఖాస్తు రుసుం విషయంలో తేది ఒక ఉత్తర్వును జి.ఒ.యం.యస్‌.నెం.454, జి.ఎ. (పే అండ్‌ పి.ఆర్‌) జారీ చేసింది. ఆ ప్రకారం దరఖాస్తుతో పాటు రుసుంగా నగదుగాని, డి.డి. గాని, బ్యాంకర్స్‌ చెక్‌గాని అందజేయవచ్చు. చట్టం చుట్టపు చూపులుగా ఉండకూడదు. ప్రజల చేతిలో జ్యోతివలె సమాజానికి వెలుగు ఇచ్చేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌ తన 2009 వార్షిక నివేదికను రాష్ర్ట శాసనసభలో ప్రవేశపెట్టింది.

ఆ ప్రకారం 2009 లో దాఖలైన మొత్తం దరఖాస్తులు 65,973, పెండింగ్‌లో ఉన్నవి 9,831 మొత్తం 75,804 దరఖాస్తులు. వీటిలో దాదాపు 67,021 పరిష్కారమయ్యాయి. దీనినిబట్టి ఈ చట్టం గురించి ప్రజలకు తెలిసిన సమాచారమెంత? గ్రామీణ ప్రాంతాలను ప్రక్కన పెడితే పట్టణాలు, నగరాల పౌరులకు సైతం ఏ మాత్రం సమాచారహక్కు చట్టం గురించి తెలుసు, ఎంతమేరకు ఉపయోగించు కుంటున్నారన్నది ప్రశ్న. ఇప్పుడు మన చేతికి వచ్చిన ఈ వజ్రాయుధం న్యాయమూర్తులను, అత్యున్నత పదవులను అధిష్ఠించిన వారిని సైతం వదలడం లేదు.ఇంత కఠినంగా, గొప్పగా, సమర్ధవంతంగా చట్టం అమలు ఉంటే సమాచారహక్కు చట్టం గురించి ప్రజలలో ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.

ఆధారము: సూర్య© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate