రియల్ ఎస్టేట్ ధోరణులు సాధారణంగా సెంటిమెంటుపై ఆధారపడి ఉంటాయి. ఈ సెంటిమెంట్లు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించినవి కావచ్చు లేదా ఉద్వేగపూరితమైన అవసరాలను తీర్చడానికి సంబందించినవైనా కావచ్చు. మొత్తం మీద, రియల్ ఎస్టేట్ ధోరణలు స్వభావ రీత్యా ఉద్వేగభరితమైన చలనశీలతతన కలిగి ఉంటాయి.
ఇల్లు కొనుక్కోవడం మంచిదా, అద్దెకు ఇల్లు తీసుకోవడం మంచిదా అనే ప్రశ్న అత్యంత ప్రధానమైందిగా ముందుకు వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత కష్టమేమీ కాదు. మీరు ఎప్పుడు ఇల్లు కొనాలని అనుకుంటున్నారనే విషయంపై ఆ సమాధానం ఆధారపడి ఉంటుంది.
మొదటిసారి ఇల్లు కొనాలని అనుకునేవారి కోసం ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం చొరవ ప్రదర్శించి, కొన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మొదటిసారి ఇల్లు కొనాలనే వారి కోసం హోం లోన్ పరిమితిని రూ.1.5 నుంచి 2.5 లక్షలకు పెంచింది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఇది వెసులుబాటు కల్పించిందనే చెప్పాలి.
ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ అమ్మకాలు పెరిగాయి. ధరలను తగ్గించడానికి డెవలపర్స్ కూడా ముందుకు వస్తున్నారు. ఆస్తుల ధరల్లో ఇటీవలి కాలంలో రియల్స్ ఎస్టేట్ మార్కెట్ భారతదేశంలో స్థిరత్వాన్ని సాధించింది. క్రెడాయి నివేదిక ప్రకారం - ఇంటి కొనుగోలుదారులకు ఐఎన్ఆర్ 30 లక్షల్లో ఇళ్లు - 60 లక్షల బ్రాకెట్ అత్యంత ఆదరణీయమైన ప్రత్యామ్నాయంగా మారింది.
వచ్చే నెలల్లో సానుకూల నియంత్రణ సంస్కరణలు అమలు అవుతాయి. పారదర్శకత, ఏకగవాక్ష పరిష్కారం, పన్ను విధింపు సంస్కరణలు, ధ్రువీకరణలో మానవ పాత్రను తగ్గించడం ఇంటి కొనుగోలు వ్యవహారంలో వచ్చే సానుకూల మార్పులు.
సరైన సమయంలో కొత్త ఆస్తులపై పెట్టుబడులు పెట్టడాన్ని ఇంటి కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం - వచ్చే మూడేళ్లలో అప్రిషియేషన్ వాల్యూ స్థిరంగా పెరుగుతుంది. అందువల్ల సరైన సమయంలో రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.
ఇంటి యజమానుల ఆంక్షలను భరించడం, ఇంటి అద్దెలు పెరడం వంటి కారణాల వల్ల సొంత ఇంటిని పొందడానికి తగిన ఆర్థిక సహాయం ఆకర్షణీయమైన రీతలో ఉన్నాయి. ఇంటికి రుణం తీసుకుని వాయిదాలు (ఈఎంఐ) చెల్లించడం మేలా, ఇంటి అద్దె చెల్లించడం మేలా అని ఆలోచించే వారికి ఇంటిని సొంత చేసుకుని ఈఎంఐ చెల్లించడమే మంచిదనే దిశగా మార్పులు వస్తున్నాయి. ఉద్వేగానికి, హేతుబద్దతకు మధ్య సమన్వయం కుదిరించే అవకాశం ఇప్పుడుంది.
సరికొత్త మరియు ఆకర్షణీయమైన ఆఫర్లతో మీరు సొంతిల్లు పొందే అవకాశాన్ని డిహెచ్ఎఫ్ఎల్ మీకు ఇస్తోంది. అంతేకాదు మహిళా రుణాలు కేవలం 0.25%కే అందిస్తోంది!
బ్యాంకు లాకర్ గురించి విన్నాం కదా. మన వద్ద ఉన్న బంగారు నగలు, రహస్య డాక్యుమెంట్లు, విలువైన నగదు ఉన్నప్పుడు వాటిని ఇంట్లో భద్రంగా దాచుకోలేం కాబట్టి బ్యాంకు లాకర్‌లో ఉంచడం మంచిది. కొంత మంది ఖాతాదారులు బ్యాంకు లాకర్‌లో సొమ్మును భద్రపరచి వాటి గురించి మరిచిపోతారు.
కాగా, బ్యాంకు నిపుణులు ఏమని చెబుతున్నారంటే ఏదైనా బ్యాంకు లాకర్‌లో ఇంటిపత్రాలు లేదా ఆభరణాలు దాచినప్పుడు ఏడాదికొకసారి బ్యాంకు లాకర్‌ను తెరిచిచూడటం మంచిదంటున్నారు. అలా చేయని పక్షంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
సాధారణంగా మనం చేసే వృత్తి, వయసును బట్టి బ్యాంకు హై రిస్క్ ప్రొపైల్ లేదా లో రిస్క్ ప్రొపైల్ లాకర్ ఇస్తుంది. బ్యాంకు లాకర్ ఇచ్చినందుకు సంవత్సరానికి కొంత ఫీజును తీసుకుంటుంది. బంగారు నగలు, రహస్య డాక్యుమెంట్లు, విలువైన నగదు ఉన్న వారికి హై రిస్క్ ప్రొపైల్ కేటగీరి కింద బ్యాంకు లాకర్ ఇస్తుంది.
లాకర్‌ను తీసుకున్న తర్వాత ప్రతి ఏడాదికి ఒకసారి లాకర్‌ను తెరచి చూసుకోవాలి. అలా చేయడం వల్ల మన లాకర్‌లో ఉంచిన విలువన నగదు, రహస్య డాక్యుమెంట్లు గురించి తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్లోని లాకర్స్‌లో దోపీడీ దొంగతనాలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ లాకర్ తీసుకుందుకు గాను వారు సరైన సమయంలో బ్యాంకుకి నగదు జమ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా లో రిస్క్ ప్రొపైల్ లాకర్‌ను తీసుకున్న కస్టమర్లు మూడు సంవత్సరాలకు ఒకసారి లాకర్‌ను తెరిచి చూసుకోవాలని బ్యాంకు వర్గాలు తెలిపారు. కస్టమర్లు ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
లాకర్ కీ భద్రంగా ఉంచుకోవాలి:
బ్యాంకులో లాకర్ తెరిచిన కస్టమర్ లాకర్ కీని భద్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా బ్యాంకు లాకర్ తెరిచిన తర్వాత ఒక కీని కస్టమర్‌కు ఇవ్వడంతో పాటు మరో కీని బ్యాంకు తన వద్దే ఉంచుకుంటుంది. ఒకవేళ మీరు గనుక లాకర్ కీని పొగొట్టుకున్నట్లైతే, బ్యాంకు లాకర్ కీని పగులగొట్టడం లాంటివి చేయకుండా బ్యాంకును సంప్రదించాలి. అలా సంప్రదించనట్లైతే లాకర్ కీని మార్చడం లేదా వేరే కీని బ్యాంకే ఇస్తుంది.
కొన్నిసార్లు మనం చేసే చిన్న సాధారణమైన పెట్టుబడులే మనకు ఎంతగానో సంతృప్తినిస్తాయి. కుటుంబ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన టర్మ్ ప్లాన్ అనేది కూడా ఇన్య్సూరెన్స్ యొక్క ప్రాథమిక అంశంగా చెప్పవచ్చు.
ఒక్కోసారి మనం కోల్పోయే వరకు కూడా దాని యొక్క విలువ మనకు తెలియదని ఇన్స్యూరెన్స్ టర్మ్ పాలసీ తెలుపుతోంది. టర్మ్ ప్లాన్ ద్వారా మీరు స్వేచ్ఛను పొందడమే గాక భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇన్స్యూరెన్స్ కోసం ఏడాదికి ఐఎన్ఆర్ 5,900 దీర్ఘకాలంపాటు చెల్లించడం కొంత సమస్యగా భావిస్తారు. అయితే టర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం వల్ల ఏడాదికి ఐఎన్ఆర్ 5,900 చెల్లించడమంటే రోజుకు ఐఎన్ఆర్ 16.16 చెల్లించడమన్న మాట. టర్మ్ ప్లాన్‌లో ఈ పెట్టుబడుల వల్ల మీకు జరగరానిదేదైనా జరిగితే.. మీ కుటుంబానికి ఐఎన్ఆర్ ఒక కోటి వరకు పొందే అవకాశం ఉంటుంది.
మీరు లేనప్పుడు కూడా మీ ప్రియమైన కుటుంబ సభ్యులు ప్రశాంతంగా జీవించడానికి టర్మ్ ప్లాన్ ఉపయోగపడుతుంది. మీరు ఉన్నప్పుడు మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఒకవేళ మీకేమైనా జరిగినా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ఇండియాఫస్ట్ ఎనీటైం ప్లాన్
కనీస వార్షిక ప్రీమియం: ఇన్య్సూరెన్స్ ప్లాన్‌తో పొందే లాభాలతో పోల్చితే మీరు చెల్లించే మొత్తం చాలా తక్కువనే చెప్పాలి. ప్లాన్ ద్వారా మీరు చెల్లించే మొత్తం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఫిక్స్‌డ్ ప్రీమియం: మీ ఆదాయం తక్కువగా ఉన్నట్లయితే మీకు సాధ్యమైనంత మొత్తంలో కూడా ప్రీమియం చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మొత్తం స్థిరంగా ఉంటుంది. మీ వయస్సు, ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఉంటుంది.
ఆప్షనల్ రైడర్స్: మీరు టర్మ్ ప్లాన్ చేసిన సమయం నుంచి మీకు జీవితాన్ని కవర్ చేస్తుంది. మీరు ఏ పరిస్థితుల్లోనైనా చనిపోయినా పాలసీలో పేర్కొన్న మేరకు మీకు బీమా కవర్ చేయడం జరుగుతుంది. ప్రమాదాలు, కొన్ని ఇతర సంఘటనలు అటువంటి ప్లాన్‌లో కవర్ చేయడం జరగదు.
మార్జినల్ కాస్ట్ వద్ద ప్లాన్ కొనుగోలు చేసి ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యం వంటి వాటికి విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80 సి, సెక్షన్ 10 (10డి) కింద పన్ను లాభాలు కూడా మీరు చెల్లించిన ప్రీమియం మొత్తాలకు పొందవచ్చు. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
చివరి మాట
ప్రశాంతంగా ఆలోచించి మీరు ఎంతోగానో ప్రేమించే మీ కుటుంబ సభ్యులు మీ తర్వాత కూడా సమస్యలు లేకుండా జీవించాలనుకుంటే ఇన్స్యూరెన్స్ పాలసీని చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్స్యూరెన్స్ ప్లాన్ కోసం చెల్లించే మొత్తం కంటే చాలా ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ప్లాన్ వల్ల మీ కుటుంబ సభ్యులు సమస్యలు లేని జీవితాన్ని గడుపుతారు.
గుర్తుంచుకోండి! పాలసీలో పేర్కొన్న నామినీ గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పాల్సి ఉంటుంది.
నోట్: 25 సంవత్సరాల (పొగతాగని) వారు ఐఎన్ఆర్ 5,900 ప్రీమియం 20 ఏళ్లపాటు టర్మ్ ప్లాన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.
నిబంధనలు(డిస్క్లేమర్): ఇన్స్యూరెన్స్ అనేది అభ్యర్థించే విషయం. ప్రస్తుత పన్ను చట్టలా ప్రకారం టాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. టైమ్ టు టైమ్ మార్పులకనుగుణంగా ఇండియాఫస్ట్ టైమ్ ప్లాన్-యూఐఎన్-143 ఎన్009వి02 వ్యవహరిస్తుంది. ప్లాన్ కొనే ముందు సేల్స్ బ్రోచర్‌ను జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్, కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్., 301, ‘బి' వింగ్, ది క్యూబ్, ఇన్ఫినిటి పార్క్, దిందోషి-ఫిల్మ్‌సిటీ రోడ్, మాలద్ (ఈ), ముంబై-400097. వెబ్‌సైట్: www.indiafirstlife.com ఐఆర్‌డిఏ రిజిస్ట్రేషన్ నెం. 143. టోల్ ఫ్రీ నెం. 1800 209 8700. ఎస్ఎంఎస్ టు 5667735, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అప్లై.
భారతదేశంలో కొత్తగా ప్రారంభించబడి అతివేగంగా విస్తరిస్తున్న జీవిత బీమా సంస్థఅయిన ఇండయాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ తన ఖాతాదారుల కోసం నూతన విధానాన్ని ప్రకటించింది. ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ ద్వారా అన్ని పాలసీలకు డీ మ్యాట్ ఫార్మట్ (డీమెటీరియలైజ్డ్) ప్రారంభించింది.
పాలసీదారులకు తమ ఇన్స్యూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చుకునేందుకు, తమ పాలసీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక చోటే పొందేందుకు ఈ విధానాన్ని ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ ఏర్పాటు చేసిందని ఇండియాఫస్ట్ ఎండీ, సీఈవో పి. నందగోపాల్ తెలిపారు.
ఇండియా ఫస్ట్ తన పాలసీదారులకు ఉత్తమమైన సౌకర్యాలను కల్పించేందుకు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని, దీని ద్వారా స్పష్టమైన సమాచారాన్ని, వారికి కావాల్సిన సేవలను అందించేందుకు పూర్తి సామర్థ్యంతో ముందుకెళుతున్నామని ఆయన చెప్పారు. జీవిత బీమా అనేది దీర్ఘకాలికమైనదని, దీని ద్వారా పాలసీదారు రక్షణ పొందుతాడని తెలిపారు. జీవిత బీమా అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమని, ఏదో ఒక సమయంలో అండగా ఉంటుందని తెలిపారు.
పాలసీలను డీమెటీరియలలైజేషన్ చేయడం ద్వారా పాలసీదారు తన పాలసీకి సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని నందగోపాల్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతా ద్వారా పాలసీదారు కెవైసి నిబంధనలు నుంచి బయటపడవచ్చు. దీని ద్వారా చిరునామా, వ్యక్తిగత గుర్తింపు వివరాలను ప్రతీ కొనుగోలు సమయంలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతేగాక డీమ్యాట్‌తో ఇన్స్యూరెన్స్ వ్యాపార లాభాలు పొందడం, ప్రీమియం సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
ఇప్పటికీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలను కాగితాల రూపంలోనే నిర్వహించడం జరుగుతోందని, అయితే భారతదేశంలో తొలిసారి కాగితాలపై నమోదు చేసిన పాలసీ వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడం జరుగుతోందని నందగోపాల్ తెలిపారు. ఈ విధానంలో ముందునుంచి తమ సంస్థ భాగమైనందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇన్స్యూరెన్స్ కంపెనీలు తమ వినియోగదారులకు ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలను అందించడం ద్వారా ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చు. మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీల విషయంలో ఈ విధానం ఇంకా ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం కంపెనీలన్నీ డీమ్యాట్ రూపంలోని ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. వినియోగదారులు కూడా తమ పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో కొనసాగించుకునేందుకు ఇష్టపడుతున్నారు.
వినియోగదారులు ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా ఫాంను ఇండియాఫస్ట్ వెబ్ సైట్ www.indiafirstlife.com (under the Download section) ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇండియాఫస్ట్ ప్రతినిధుల ద్వారా కూడా వినియోగదారులు తమకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. సమాచారం కోసం ఫోన్ నెం. 1800 209 7800ను సంప్రదించవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇండియాఫస్ట్ రూ. 475కోట్ల రూపాయల మూలధనంతో ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రాబ్యాంకులు, యూకేలోని రిస్క్, వెల్త్, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లీగల్ & జనరల్ సంస్థలచే ప్రమోట్ చేయబడుతోంది. ఇండియాఫస్ట్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా 44శాతం, ఆంధ్రాబ్యాంకు, లీగల్ & జనరల్ సంస్థ 30శాతం, 26శాతం కలిగి ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కన్సల్టెంట్స్ తమన్నా ఖన్నా, టి. ఆనంద మహేష్ లను ఫోన్: +91 98206 02369, +91 98707 16285, amanna.khanna@indiafirstlife.com, anand@mavcommgroup.com ద్వారా సంప్రదించవచ్చు.
పాలసీ తీసుకునే విధానం
1. ఎలక్ట్రానిక్ రూపంలో ఖాతా తెరిచే విధానం
మొదట ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతా తెరిచేందుకు అవసరమైన దరఖాస్తు ఫాంను ఇండియాఫస్ట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫాం నింపిన తర్వాత కెవైసి డాక్యుమెంట్లను జత చేయాలి. నింపిన ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా దరఖాస్తు ఫాంతోపాటు జతచేసిన డాక్యుమెంట్లను ఇండియాఫస్ట్ ఇన్స్యూరెన్స్ కు పంపించాలి. ఇండియాఫస్ట్ ఇన్స్యూరెన్స్ దరఖాస్తు ఫాంను సంబంధిత ఇన్స్యూరెన్స్ రెపోసిటరీకి పంపిస్తుంది. దరఖాస్తు ఫాం వివరాలతో ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ (ఐఆర్) ఈ-ఇన్య్యూరెన్స్ ఖాతా నంబర్ తయారు చేసి ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కు పంపిస్తుంది. పాలసీదారుకు సంబంధించిన పాలసీ వివరాలను ఎలక్ట్రానిక్ ఫాంలో ఐఆర్ పోర్టల్ లోని ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతాకు అందజేస్తుంది. అప్పుడు ఐఆర్ పాలసీ వినియోగదారుకు తన ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందనే సమాచారాన్ని అందజేస్తుంది.
2. ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ ప్రయోజనాలు
భద్రత: ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ వల్ల పాలసీదారుకు ఎలాంటి నష్టభయం ఉండదు. పాలసీ డ్యామేజ్ కావడమనేది ఉండదు. ఎలక్ట్రానిక్ ఫాంను అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా..ఎక్కడైనా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ ద్వారా పాలసీ కాపీని ఎప్పుడైనా డౌన్ లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అనుకూలం: అన్ని ఇన్స్యూరెన్స్ పాలసీల వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో ఏకైక ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్స్యూరెన్స్ రెపోసిటరీకి సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ లో ఎప్పుడైన లాగిన్ అవొచ్చు. పాలసీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
ఒకే చోటు నుంచి అన్నిరకాల సేవలు: ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పాలసీకి సంబంధించిన వివరాలనైనా ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ సర్వీస్ పాయింట్ల నుంచి దాఖలు చేయవచ్చు. చాలా మంది ఇన్స్యూరర్స్ నుంచి ఒకే రకమైన విన్నపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చిరునామాకు సంబంధించిన ఒక మార్పును బహుళ పాలసీలు కలిగిన పాలసీదారు ఖాతాలో ఐఆర్ ఒకేసారి అప్‌డేట్ చేస్తుంది.అయితే ఇందుకు వేర్వేరు ఇన్స్యూరెన్స్ సంస్థలకు వేర్వేరు కార్యాలయాలు అవసరం ఉండదు.
పేపర్ వర్క్ ఉండదు, సమయం వృథా కాదు: ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతాదారు కొత్త పాలసీ తీసుకున్న ప్రతీసారి కెవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరముండదు. పాలసీదారు చిరునామాలో గానీ కాంటాక్ట్ నెంబర్ లో గానీ మార్పులేవైనా ఉంటే ఓ చిన్న ఆన్ లైన్ రిక్వెస్ట్ తో సరిచేసుకోవచ్చు. ఇందుకు పెద్ద సమయమేమి పట్టదు, పేపర్ల పని కూడా ఉండదు.
స్టేట్ మెంట్ ఆఫ్ అకౌంట్: ఏడాదిలో ఒకసారైనా పాలసీదారుకు పాలసీ గురించిన వివరాలను ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ నెంబర్ ద్వారా ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ అందజేస్తుంది.
సర్వీస్ టచ్ పాయింట్లలో పెరుగుదల: ఇన్స్యూరెర్స్ కు ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ కార్యకలాపాలు అదనం కాగా, అవసరమున్నప్పుడు ఈ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా పాలసీదారు సర్వీస్ టచ్ పాయింట్లను పెంచుకోవచ్చు.
సింగిల్ వ్యూ: ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ నెంబర్ ద్వారా పాలసీదారుకున్న పాలసీలన్నీ చూడబడతాయి కాబట్టి ఒకవేళ పాలసీదారు చనిపోయినట్లయితే పాలసీలకు సంబంధించిన లాభాలన్నీ అందుబాటులో ఉంటాయి.
హాస్పిటలైజేషన్ అనేది భౌతికంగానే కాకుండా మన ఆర్థిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని చర్యలు పాటించాలి. ఇందుకు ఇండియా ఫస్ట్ మెడిక్లెయిమ్ ప్లాన్ మీకు సహాయపడుతుంది. ఇండియా ఫస్ట్ మెడిక్లెయిమ్‌నే ఎందుకు ఎంచుకోవాలంటే అందుకు పలు కారణాలున్నాయి.
అనుకోకుండా అనారోగ్యం పాలైనప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆస్పత్రిలో అడ్మిట్ అవుతాం. అప్పుడు మన ఆర్థిక పరిస్థితి సరిగా ఉండకపోవచ్చు. డాక్టర్ చికిత్స చేయాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మనకు ఆర్థిక సహాయం చేసేందుకు ఎవరూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఇండియా ఫస్ట్ మెడిక్లెయిమ్ ప్లాన్ మీ రిస్క్‌ను భరించేందుకు సిద్ధంగా ఉంటుంది.
1. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపజేసుకోవచ్చు
మీ కుటుంబ మొత్తానికి అంటే భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులకు ఈ ప్లాన్ వర్తింపజేసుకోవచ్చు.
2. క్లెయిమ్ కార్డుతో స్వైప్ చేసుకోవడం సులభం
ఇండియా ఫస్ట్ హెల్త్ క్లెయిమ్ కార్డును అత్యవసర సమయాల్లో చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. హాస్పిటలైజేషన్ కోసం మీరు డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు లాగే హెల్త్ కార్డును స్వైప్ చేసుకుని ఆస్పత్రిలో అడ్మిట్ కావొచ్చు. కార్డు మీ వ్యక్తిగత వివరాలు చూడా అందజేస్తుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెండోసారి స్వైప్ చేయాలి. అర్హతలను తనిఖీ చేసిన తర్వాత ఈ ప్లాన్ వెంటనే మీ క్లెయిమ్‌ను ఆమోదిస్తుంది.
3. ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేసుకోవచ్చు
ఇండియా ఫస్ట్ మెడిక్లెయిమ్ ప్లాన్ భారతదేశంలోని వైద్య శాస్త్రంలో నిపుణత కలిగిన సుమారు 50వేలకు పైగా వైద్యులను మీకు అందుబాటులో ఉంచుతోంది.
4. 200ల రోజులకు పైగా జాగ్రత్త తీసుకునే విధానాలు
మీరు ఏడాదిలో 200రోజులకు పైగా ఆస్పత్రిలో రాత్రి పూట బస చేయకుండా చికిత్స చేసుకోవచ్చు.
5. అన్ని ఖర్చులకు పరిహారం
మీ వాస్తవ ఖర్చులు రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. హాస్పిటలైజేషన్‌కు ముందు, తర్వాత ఖర్చులను కూడా ప్లాన్ కవర్ చేస్తుంది.
6. ప్రీమియం రేట్‌కు భరోసా
ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వచ్చినా భవిష్యత్ మూడు సంవత్సరాలకు కూడా ప్రీమియం రేట్ లాభాలను మీరు పొందవచ్చు.
7. రెండు రకాల ప్రయోజనాలు
ఇండియా ఫస్ట్ ప్లాన్ నిబంధనల ప్రకారం మీరు రెండు రకాల లాభాలను పొందవచ్చు. లైఫ్ కవర్ + హెల్త్ కవర్.
8. పన్ను లాభాలు
ఆదాయ పన్నుల చట్టం సెక్షన్ 80డీ, 1961 ప్రకారం హెల్త్ ప్రీమియంపై పన్ను లాభాలను పొందవచ్చు. లైఫ్ కవర్ కోసం చెల్లించిన మొత్తానికి కూడా సెక్షన్ 80సీ, 1961 ప్రకారం పన్ను లాభాలను పొందవచ్చు.
చివరి మాట
ఇండియా ఫస్ట్ మెడిక్లెయిమ్ ప్లాన్ చేతిలో ఉన్నంత కాలం మెడికల్ ఎమెర్జన్సీ పట్ల మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఖర్చుల గురించి ఎలాంటి దిగులు లేకుండా మీరు సరైన ట్రీట్ మెంట్ తీసుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండొచ్చు.
ఇన్య్సూరెన్స్ అనేది అభ్యర్థించే విషయం. ప్లాన్ కొనేముందు సేల్స్ బ్రోచర్‌ను జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. టాక్స్ బెనిఫిట్స్ చట్టాల్లో వచ్చే మార్పులతోపాటు మారే అవకాశం ఉంది. మీరు మీ టాక్స్ కన్సల్టెంట్ ద్వారా సంప్రదించడం వల్ల పూర్తి సమాచారం పొందవచ్చు.
ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఐఆర్‌డీఏ రిజిస్ట్రేషన్ నెం. 143. ఇండియా ఫస్ట్ మెడిక్లెయిమ్ ప్లాన్: ప్రొడక్ట్ యూఐఎన్ నెం. 143ఎన్ 021వి01, ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ ప్లాన్: 143బి001వి01. రిజిష్టర్డ్, కార్పొరేట్ ఆఫీస్ అడ్రెస్: 301, ‘బి'వింగ్, ది క్యూబ్, ఇన్ఫినిటీ పార్క్, దిందోషి ఫిల్మ్ సిటీ రోడ్, మలాద్ (ఈస్ట్), ముంబై -400 097. www.indiafirstlife.com. SMS to 5667735 SMS Charges apply. Toll free No - 1800 209 8700.
మార్చి వచ్చిందంటే చాలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారు వారంతా.. ఇన్‌కమ్ ట్యాక్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది ఉద్యోగులకు ఓ పెద్ద సవాల్‌గా మారుతుంది. భౌతికంగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకుండా ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. మీ సంపాదన రూ. 10 లక్షలకు మించి ఉంటే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఫైల్ దాఖలు చేయాల్సిందే.
ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం వల్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసులకు వెళ్లి గంటలు తరబడి క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే మన వద్ద ఏమేమి ఉండాలో అవి తెలుసుకుందాం.
* ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉన్న కంప్యూటర్ అవసరం
* నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్న బ్యాంక్ ఎకౌంట్
* బ్యాంక్ ఎకౌంట్ కలిగిన ఉన్న వినియోగదారుడికి ఒక యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్‌ని అందిస్తుంది.
ఆన్‌లైన్ పన్ను చెల్లింపు ఎలా..?
* ఏదైనా జాబితా బ్యాంకు నుండి నెట్ బ్యాంకింగ్ ఖాతా తెరవండి.
* www.incometaxindia.gov.in వెబ్ సైట్ వెళ్ళండి
* ' ఆన్ లైన్‌లో పన్నులు చెల్లించాలి (pay taxes on-line)' పై క్లిక్ చెయ్యండి.
* అవసరమైన ఛలానాని ఆన్‌లైన్‌లో పూర్తి చెయ్యండి. సహాయం కోసం FAQ, డౌన్ లోడ్ మొదలైన వాటి స్క్రీన్ షాట్ అందుబాటులో ఉంది.
* నెట్ - బ్యాంకింగ్ ఖాతా ద్వారా ఆన్ లైన్‌లో పన్ను చెల్లింపు చేయండి.
* ఛాలానా గుర్తింపు సంఖ్య తో తెరపై తక్షణమే అందుబాటులో ఉంటుంది.
* ఈ కౌంటర్ ఫాయిల్ ద్వారా ఛాలానా గుర్తింపు సంఖ్య (CIN) ఆదాయం రిటర్న్ ఆఫ్ కోట్ చేయాలి.
* అవసరమైతే కౌంటర్ ఫాయిల్ ముద్రణను కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి.
* మీ చెల్లింపు ఆదాయం పన్ను శాఖ చేరుకుందా లేదా తనిఖీ చేయండి.
ఎండోమెంట్ పాలసీకి ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన డబ్బు పొదుపుతో పాటు మనకు ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు వాటికి రక్షణగా నిలుస్తాయి. ఈ ఎండోమెంట్ పాలసీలు మన దగ్గర ఉన్న ధనాన్ని పెంచుకోవడంతో పాటు.. భవిష్యత్తులో ఏదైనా అపాయం నుండి మనల్ని రక్షించడం కోసం ఏర్పడ్డాయి. ఈ బీమా పాలసీలు వార్షిక, అర్ధ వార్షిక మరియు త్రైమాసికంగా ప్రీమియం చెల్లించే విధాన పద్ధతిలో ఉంటాయి. ప్రీమియం చెల్లించడంలో మనం జాగ్రత్తగా ఉండాలి. బీమా కంపెనీలు, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి దాటిపోయాక కూడ కొంత సమయం కేటాయిస్తాయి. మీరు గనుక ఈ గ్రేస్ పీరియడ్ సమయం లోపల ప్రీమియం చెల్లించక పోయినట్లైతే పాలసీ రద్దు అవుతుంది.
ఎండోమెంట్ పాలసీలు:
ఎండోమెంట్ పాలసీలు ఒక నిర్దిష్ట కాలానికి బీమా చేసుకోవచ్చు. బీమా చేయించుకున్న వారు మరణించినప్పుడు (పాలసీ టర్మ్ కాలంలో) హామీ ఇచ్చిన మొత్తాన్ని మరియు బోనస్ వంటిది ఉంటే దాన్ని కూడా నామినీ అందుకుంటాడు. పాలసీ అమలులో ఉన్న సంవత్సరాల వరకు బోనస్ చెల్లించబడుతుంది. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నట్లయితే, అంటే మెచూరిటీ తరువాత హామీ ఇచ్చిన మొత్తాన్ని పాలసీకి సంబంధించిన బోనస్ లాంటిది ఉంటే దాన్ని కూడా బీమా చేయించుకున్న వారు అందుకుంటారు. ఆ తర్వాత, బీమా చేయించుకున్నవారు పాలసీ ద్వారా రక్షణ పొందలేరు.
సంపూర్ణ జీవిత పాలసీలతో పోలిస్తే ఎండోమెంట్ పాలసీలు సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. ఎండోమెంట్ పాలసీలు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి.
ఎండోమెంట్ - లాభం లేనటువంటివి: బీమా తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు, నామినీకి హామీ ఇచ్చిన మొత్తాన్ని మాత్రమే అందిస్తాయి. పాలసీ టర్మ్ ఉంటున్నప్పుడు లేదా మెచూరిటీ అయినప్పుడు, బీమా తీసుకున్న వ్యక్తి హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందుకుంటారు లేదా హామీ ఇవ్వడిన మొత్తంలో కొంతభాగాన్ని లేదా ప్రీమియం యొక్క రీఫండ్ మాత్రమే అందుకుంటాడు.
ఎండోమెంట్ - లాభంతో కూడినవి: బీమా తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు లేదా పాలసీ టర్మ్ ముగిసినప్పుడు, హామీ ఇవ్వబడిన మొత్తానికి అదనంగా బోనస్‌ని (దీనికి గ్యారంటీ ఉంది) అందిస్తుంది. లాభంలేని పాలసీలు కంటే ఎక్కువ ఖర్చుతో కూడి ఉంటాయి.
ఎస్‌బిఐ లైఫ్ ఎండోమెంట్ పాలసీ 'శుభ్ నివేశ్':
ప్రైవేట్ రంగ భీమా కంపెనీ అయిన ఎస్‌బిఐ లైఫ్ 'శుభ్ నివేశ్' అనే పేరుతో కొత్త ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ రెండు రకాలుగా లభిస్తుందని, పాలసీ కాల పరిమితి తీరిన తర్వాత జీవితాంతం బీమా రక్షణ కల్పించడం వల్ల ఇది అందరిని బాగా ఆకర్షిస్తుందని ఎస్‌బిఐ తెలిపింది. జీవితం మొత్తానికి ఎండోమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ కాల పరిమితి తీరిన తర్వాత గరిష్టంగా 100 సంవత్సరాల వరకు బీమా రక్షణ ఉంటుంది. అదే మీరు మెచ్యూర్టీ ఆప్షన్‌ని ఎంచుకుంటే, కాల పరిమితి తీరిన తర్వాత మొత్తం మెచ్యూర్టీ సొమ్ముని ఒకేసారిగా లేదా సులభ వాయిదాల్లో ప్రతీ 5/10/15/20 సంవత్సరాలకు అందుకోవచ్చు.
ఈ పాలసీని 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి గరిష్టంగా 60 ఏళ్ల వారిదాకా తీసుకోవచ్చు. పాలసీ కనీస కాలపరిమితి 5 ఏళ్లు, గరిష్ట కాలపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస బీమా మొత్తం రూ.75,000. ఈ పాలసీ సింగిల్ లేదా రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రధాన పాలసీకి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రిఫర్డ్ టర్మ్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, యాక్సిడెంటల్ టోటల్, పర్మనెంట్ డిసబిల్టీ బెనిఫిట్ రైడర్లను తీసుకోవచ్చు. చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి.
మీరు జీతం పన్ను పరిమితిని మించితే 80C మరియు ఇతర ప్రమాణాలు సమర్పించడం ఉన్నప్పటికీ.. మీ యజమాని మీ వద్ద నుండి పన్నుని తీసివేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియను TDS అంటారు. ఆర్థిక సంవత్సరం ముగిసే చివరలో ఉద్యోగులు ఇచ్చే డిక్లరేషన్, ఇతర ఆధారాల ఆధారంగా యాజమాన్యం ఫామ్ 16 ఇస్తుంది. ఈ ఫామ్ 16లో మీరు సమర్పించిన పన్ను వివరాలతో పాటు మీ మొత్తం జీతానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ ఫామ్ 16ను మీ యాజమాన్యం మాత్రమే ఇస్తుంది.
ఈ ఫామ్ 16 సహాయంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు. దీనితో పాటు ఆదాయానికి సంబంధించిన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఆదాయ వివరాలను (పన్ను వర్తించే లేదా వర్తించని) కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ), 80 సి సెక్షన్ కింద సేవింగ్స్ (పీపీఎఫ్, ఈపీఎఫ్, బీమా లాంటివి) వాటిని వెల్లడించి, వాటి ఆధారాలను సమర్పిస్తుంటారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఇతర ఆదాయ వనరులు ఏంటో చూద్దాం.
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి పొందిన వడ్డీ:
రూ. 10,000 వరకూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి పొందిన వడ్డీకి పన్ను వర్తించని ఆదాయం. అంతకు మించిన వడ్డీ పొందితే మాత్రం దానికి పన్ను వర్తిస్తుంది.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ:
ఇన్‌కమ్ టాక్స్ శ్లాబ్‌ను బట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది.
రికరింగ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ:
ఒక వ్యక్తి ఇన్‌కమ్ టాక్స్ శ్లాబ్‌ను బట్టి రికరింగ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ అనేది పన్ను వర్తించేదిగా ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ పై బ్యాంకులు ఎలాంటి టీడీఎస్‌ను మినహాయించవు కాబట్టి ఈ విధమైన ఆదాయ వనరును వెల్లడించడం మరింత ప్రధానం.
పోస్టల్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సి) పై పొందిన వడ్డీ:
పోస్టల్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సి) పై పొందిన వడ్డీ అనేది పన్ను వర్తించేది. దీన్ని తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది.
నగదు బహుమతులు:
రూ. 50,000కు మించి పొందిన నగదు బహుమతుల వివరాలను ప్రకటించాలి.
క్యాపిటల్ గెయిన్స్ / లాసెస్:
ట్రేడింగ్ ఈక్విటీలు, మ్యూచ్‌వల్ ఫండ్స్ విక్రయాలు, బంగారం వంటి వాటిపై క్యాపిటల్ గెయిన్స్/లాసెస్‌ను, వాటికి పన్ను వర్తించనప్పటికీ, వెల్లడించాలి. అదే విధంగా ఏవైనా నష్టాలుంటే కూడా వెల్లడించాలి. తదుపరి సంవత్సరాల్లో లాభాల నుంచి ఈ నష్టాలను తగ్గించే వీలుంటుంది.
సంవత్సరకాలంలో మొదటి ఆరు నెలలు ఒక సంస్థలో, మరో ఆరునెలలు మరో సంస్థలో పని చేస్తే, ఆ రెండు ఫామ్ 16లను కలిపి ఒక్కటిగా దాఖలు చేయాలి. చాలా మంది ఉద్యోగులు మొదటి దానిని మరిచిపోతుంటారు. ఈ - ఫైలింగ్ విధానంలో ఐటి రిటర్న్స్ వివరాల నమోదు తర్వాత డిజిటల్ సంతకం కూడా అనుసంధానం చేస్తే మీ ఈ - ఫైలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆ తర్వాత బెంగుళూరులో ఉన్న సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు ఐటి రిటర్న్స్ దాఖలు చేసిన వ్యక్తి సంతకం పెట్టి స్పీడ్ పోస్ట్‌లో గానీ, సాధారణ పోస్ట్‌లో గానీ 120 రోజుల్లోపు పంపిచాల్సి ఉంటుంది.
రాము టీవి కొందామని ఓ ప్రముఖ టీవి షోరూంకి వెళ్లాడు. తనకు నచ్చిన టీవిని కొనుగోలు చేసిన తర్వాత బిల్లును చూడగా ఖరీదుతో పాటు అదనంగా వ్యాట్ అంటూ కొంత సొమ్ముని తన వద్ద నుండి వసూలు చేశారు. అసలు ఈ వ్యాట్ అంటే ఏమిటీ.. దాని గురించి తెలుసుకుందాం. వ్యాట్ అంటే విలువ ఆధారిత పన్ను. ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి లేదా అమ్మకపు దశలలో పెరిగిన విలువపై మాత్రమే విధించే పన్నును విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటారు. అమ్మకాలపై పన్ను విధిస్తూ అంతక ముందు జరిగిన అమ్మకాలపై విధించిన పన్నుకు రిబేటు ఇచ్చి.. దానిపై వేసే పన్నుని వ్యాట్ అంటారు.
అసలు వ్యాట్ ఎందుకు ప్రవేశపెట్టారు:
ప్రజల వద్ద నుండి పన్నుల వ్యవస్దను సరళతరం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యాట్‌ను తొలిసారిగా 1954లో ఫ్రాన్స్‌లో ప్రవేశపెట్టారు. మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తొలిసారిగా ఎల్ కె ఝూ కమిటీ (197) సూచించింది. ఎల్ కె ఝూ సూచనల మేరకు మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలో వెూడ్ వ్యాట్ టాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1991లో రాజా చెల్లయ్య అధ్యక్షతన పనిచేసిన పన్నుల సంస్కరణ కమిటీ కేంద్రీకృత వాల్యు యాడెడ్ ట్యాక్స్‌ను సూచించింది. దీని తర్వాత 2000-01 బడ్జెట్ నుండి ఎక్సైజ్ సుంకాల విషయంలో సెన్ వ్యాట్ (CENVAT) ను ప్రవేశపెట్టారు.
వ్యాట్ సాధికార కమిటీ:
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాట్‌ను అమలుపరిచేందుకు విధివిధానాలను రూపొందించేందుకు 2000వ సంవత్సరంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వ్యాట్ సాధికార కమిటీ ఏర్పడింది. అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి ఆసిన్ దాస్ గుప్తా ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించారు. మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను అమలు చేసిన మొదటి రాష్ట్రం హర్యానా. చివరిగా వ్యాట్‌ను ఆమోదించిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఇక కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, అండమాన్, లక్షదీవులలో అమ్మకం పన్ను అమలులో లేనందున వ్యాట్ అమలులో లేదు. ఇక మన రాష్ట్రానికి వస్తే వ్యాట్ 2005 ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో రూ. 5 లక్షలలోపు టర్నోవర్ కలిగిన వ్యాపారస్తులకు వ్యాట్ నుండి మినహాయింపు ఉంది.
ఆధారిత పన్ను (వ్యాట్) వల్ల లాభాలు:
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
రాష్ట్రంలోపన్ను ఎగవేతను అరికట్టవచ్చును.
రాష్ట్రంలో పన్ను భారాన్ని తగ్గించవచ్చును.
సాధారణంగా ఉద్యోగాలు చేసే వారి వద్ద నుండి వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి నెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వారి జీతం నుండి కట్ అవుతుంది. దీనిని ఉద్యోగి వాటా(Employee Contribution) అంటారు. అదే మీరు పని చేసే కంపెనీ నుండి కూడా కొంత మొత్తాన్ని మీ ప్రావిడెంట్ ఫండ్‌కు జత చేయడం జరుగుతుంది. దీనిని యజమాని చందా (Employer Contribution) సూచిస్తారు. ఈ ఈపీఎఫ్‌ను లెక్కించడం ఎలా అనేది వన్ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
EPF= Employee (12% of salary + DA) + Employer (12% + DA)
గతంలో ఉద్యోగి చెల్లించే జీతంలో Basic + DA రెండూ కలిసి ఉండేవి. ఐతే కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం జీతంలో basic + DA + allowances మూడు కలిగి ఉన్నాయి.
ఉదాహరణ:
రవి బేసిక్ జీతం రూ. 50,000
నెలకు ఇతర అలవెన్సులు రూ. 5,000
నెలకు మెడికల్ అలవెన్సు రూ. 5,000
పాత నిబంధనల ప్రకారం గనుక ఈపీఎఫ్ లెక్కిస్తే రవి యొక్క బేసిక్ జీతం రూ. 30,000 కాబట్టి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ Rs 30,000*12/100= Rs 3,600గా ఉండనుంది.
సవరించిన కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ మరియు ఇతరాలు అన్నింటిని కలిపి బేసిక్ జీతంలో కలిపి లెక్కిస్తారు.
Rs 40,000*12/100= Rs 4,800
పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ అందరికీ పాన్ కార్డుగా సుపరిచితం. 10 అంకెల కలిగి ఉన్న ఈ పాన్ కార్డు గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తారు. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌తో లావా దేవీలు చేస్తున్న తరుణంలో పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డును బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడానికి, సెక్యూరిటీలతో పాటు మొదలైన ఆర్దిక లావాదేవీల విషయాల్లో ఉపయోగిస్తారు. ఎవరైనా వ్యక్తి తన చిరునామాతో రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లైతే... ప్రభుత్వం వారికి లీగల్ నోటీసుతో పాటు, ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 272 బి ప్రకారం రూ. 10,000 జరిమానా విధిస్తుంది. కాబట్టి రెండు పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తి ఏమి చేయాలో చూద్దాం.
ఎవరైనా వ్యక్తి రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లైతే ఆన్ లైన్‌లో http://incometax.sparshindia.com అనే వెబ్ సైట్‌కి లాగిన్ అయి తన వద్ద ఉన్న రెండవ పాన్ కార్డు సమాచారాన్ని ఇన్ కమ్ టాక్స్ వెబ్ సైట్‌లో జత చేయాలి. ఇక ఆఫ్ లైన్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేయాలంటే లిఖిత పూర్వకంగా లెటర్ వ్రాసి NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్ లేదా UTI PAN సెంటర్‌లో ఉన్న అధికారులకు అందజేయాలి. అప్లికేషన్‌లో ఉన్న చివరి కాలమ్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని క్లుప్తంగా వ్రాయాలి.
ఎవరైతే వ్యక్తి రెండవ పాన్ కార్డుని కలిగి ఉంటారో అప్లికేషన్‌లో పేరు, పూర్తి చిరునామాతో పాటు పాన్ కార్డు డిటేల్స్ వ్రాయాలి. ఆ తర్వాత సదరు అధికారి మీకు రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేసినట్లు మీరు రసీదు ఇవ్వడం జరుగుతుంది.
పాన్ కార్డు ఎటువంటి సమయాల్లో అవసరం:
* బ్యాంక్‌లో రూ. 50 వేలకు మించి ఫిక్సడ్ డిఫాజిట్ చేస్తున్నప్పుడు
* పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో రూ. 50లకు మించి నగదు డిఫాజిట్ చేసినప్పుడు.
* మోటర్ వాహనం కొనుగోలు, అమ్మకాలు (ద్విచక్రవాహనాలు మినహామింపు)
* సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాల్లో రూ. 11 లక్షలకు మించినప్పుడు.
* బ్యాంక్‌లో ఏదైన ఖాతాను తీసుకుంటున్నప్పుడు
* విదేశీ ప్రయాణం కోసం రూ. 25 వేల నగదు చెల్లించినప్పుడు.
మీరు పాన్ కార్డుని కలిగి ఉన్నారా... ఐతే పాన్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలని అనుకుంటే అది ఇప్పుడు మరింత సులభం. దీనికి మీకు ఒక ఉదాహారణ. సరళ అనే అమ్మాయి చదువుకునే రోజుల్లో పాన్ కార్డుకి అప్లై చేసింది. ఆ తర్వాత సరళకి పెళ్లి కావడంతో ఇంటి పేరు మారి పోయింది. దీంతో సరళ తన భర్త ఇంటి పేరుని తన పాన్ కార్డులో మార్పు చేయాలని అనుకుంది. పాన్ కార్డులో సరళ తన ఇంటి పేరుని ఏవిధంగా మార్పు చేసుకుందో తెలుసుకుందాం.
సాధారణంగా ఆడవారికి పెళ్లి కాగానే వారి ఇంటి పేరు మారిపోతుంది. కొన్ని కొన్ని ముఖ్యమైన పత్రాల్లో వారి భర్త ఇంటి పేరే వ్రాయాల్సి వస్తుంది. అటువంటి వాటిల్లో పాన్ కార్డు ఒకటి. ఇందు కోసం వారి చేయాల్సిందల్లా పాన్ కార్డు ఫామ్‌తో పాటు కొన్ని పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. జత చేయాల్సిన పత్రాలు:
* మ్యారేజి సర్టిఫికేట్
* మ్యారేజి ఇన్విటేషన్ కార్డు
పైన తెలిపిన పత్రాల యొక్క జిరాక్స్ కాపీలను గెజిటేడెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించి... మీ యొక్క భర్త పేరు కలిగిన ఐడెంటిటీతో పాటు ఒక పాస్ పోర్ట్ కాపీ ఉంటే సరిపోతుంది. ఎవరైతే అప్లికేషన్ ఫామ్‌ని ఇవ్వదలచుకున్నారో వారు అప్లికేషన్‌లో ఎడమవైపున ఉన్న change/correction బాక్సును టిక్ చేయాలి. సంతకాన్ని కూడా మార్పు చేయాలనుకుంటే అవకాశం ఉంది.
అలాగే భాగస్వామ్యం సంస్థలు తమ యొక్క పాన్ కార్డులో మార్పులు చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డులో తప్పనిసరిగా మార్పులు చేయాలనుకుంటేనే మార్పులు చేయించడం మంచింది. ఎందుకంటే మీరు ఒకసారి ఫామ్‌ను పూర్తి చేస్తే ఆ సమాచారంలో మీకు కొత్త పాన్ కార్డు వస్తుంది.
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ వస్తువులపై స్పాట్ ట్రేడింగ్ వీలు కల్పించే అధ్బుతమైన ప్లాట్ ఫామ్. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ రెండింటి జాయింట్ వెంచరే ఈ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్. భారతదేశంలో ఉన్న నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్, మల్టీ కమోటిడీ ఎక్స్ఛేంజ్‌ల మాదిరిగానే ఈ ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ పని చేస్తుంది.
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ లైవ్ ట్రేడింగ్‌ని మొట్టమొదటి సారి అక్టోబర్ 15, 2008లో ప్రారంభించింది. మొదటి సారి వెండి మరియు బంగారు కడ్డీలు దిగుమతి కోసం అహ్మదాబాద్, ముంబై వేదికగా పత్తి బేళ్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 52 వస్తువులను 16 రాష్ట్రాల్లో ఉన్న వివిధ రాజధానుల నుండి దిగుమతి చేసుకుంటుంది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఎగుమతిదారులు వస్తువులు, రైతులు, దిగుమతిదారులు, ప్రాసెసర్లు మరియు వ్యాపారులు సేకరణ, నిల్వ, గిడ్డంగి రసీదులు ఫైనాన్సింగ్ మరియు మార్కెటింగ్ కోసం కస్టమ్ చేసిపెట్టిన పరిష్కారాలను అందిస్తుంది.
ఇన్వెస్టర్లు ఎటువంటి సమస్యలు లేకుండా సాధారణ పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడులు పెట్టడం చాలా మంచింది. ఇందులో ప్రతి వంద గ్రాముల వెండిని ఒక యూనిట్ అంటే ఒక షేర్‌గా పరిగణిస్తారు. మన సామర్ద్యాన్ని బట్టి ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలు చేసిన తర్వాత మామూలు షేర్ల లాగే మన డీమ్యాట్ ఖాతాలోకి వస్తాయి. అంతేకాకుండా మామూలు షేర్ల మాదిరే వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. వెండి కొనాలంటే డీమ్యాట్‌లోని యూనిట్లును సరెండర్ చేస్తే వెండిని ఇస్తారు (కొన్ని షరతులకు లోబడి). కాబట్టి వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఒక ఉత్తమమైన సాధనం.
రిస్క్ తక్కువగా ఉండే పొదుపు గురించి అలోచించే వారికి వెంటనే గుర్తుకు వచ్చేవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. పెట్టుబడికి రక్షణ, స్ధిరమైన రాబడి వస్తుందనే నమ్మకంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎంత మొత్తం వస్తే ట్యాక్స్ కట్టాలి? మినహాయింపు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
సధారణంగా బ్యాంకులు రకరకాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల పథకాలను అందిస్తుంటాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్ధిరంగా వడ్డీ రేటుని బ్యాంకులు చెల్లిస్తుంటాయి. అయితే వినియోగదారుడికి వడ్డీ చెల్లించడానికి ముందే టీడీస్ రూపంలో బ్యాంకులు ట్యాక్స్ రూపంలో కోత విధిస్తాయి. ఈ టీడీఎస్ నుంచి తప్పించుకోవడం ఎలాగో చూద్దాం.
సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్:
మనలో చాలా మంది ఈ పథకాన్నే ఎంచుకొని పొదుపు చేస్తుంటారు. ఈ పథకం కింద ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. డిపాజిట్ చేసేటప్పుడే కాల వ్వవధిని ఎంచుకుంటే ఎంత వడ్డీ వస్తుందో ముందే తెలుస్తుంది.
ట్యాక్స్ ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్:
బ్యాంకులు కల్పించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేసి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీ ప్రకారం ఐదేళ్ల వ్వవధిలో ట్యాక్స్ ఆదా డిపాజిట్ చేసినప్పుడు పరిమితికి లోబడి ఈ మినహాయింపు వర్తిస్తుంది. కాకపోతే ఇందులో పెట్టుబడిని ఐదేళ్లపాటు కొనసాగించాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్ధితుల్లో ముందుగానే తీసుకుంటే ఆ ఆర్ధిక సంవత్సరంలో ఆదాయంలో భాగంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
రికరింగ్ డిపాజిట్లు:
చాలా మంది క్రమం తప్పకుండా పొదుపు చేయడానికి అనుకూలమైన పథకం. నెలవారీ నిర్ణీత మొత్తాన్ని, నిర్ణయించున్న తర్వాత పెట్టుబడి పెట్టడమే ఈ పథకం ప్రధానుద్దేశం. ఇందులో పెట్టుబడి ప్రారంభినప్పుడే ఎంత వడ్డీ చెల్లిస్తారన్నది ముందే తెలుస్తుంది. మనకి అందుబాటులో ఉన్న పొదుపు పథకాల్లో అత్యంత అనుకూలమైనవి ఇవే.
ఫామ్ 15జీ/15హెచ్:
ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ నుంచి అసలు వద్ద ట్యాక్స్ మినహాయించకుండా ముందుగానే బ్యాంకుకు 15జీ సమర్పించాలి. సీనియర్ సిటిజన్లయితే ఫామ్ 15హెచ్ ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్స్ ఇవ్వడం వల్ల మీకు ఇచ్చే వడ్డీపై బ్యాంకు పన్ను కోత విధించదు.
ఎక్కువ డిపాజిట్లు ఓపెన్ చెయ్యడం:
వేరు వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను చేయడం వల్ల కూడా అసలు వద్ద ట్యాక్స్ కోత పడకుండా చూసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంకు వడ్డీ రూ. 10 వేలకు మించకుండా ఉండేలా చూసుకోవాలి.
ఆధారము: తెలుగు.గుడ్ రిటర్న్స్.ఇన్
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/11/2020
ఈ విభాగంలో వివిధ జీవనోపాధులు మరియు వాటి వివరాల గుర...
ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలైన పక్కాగృహా...