ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పొదుపు చేయాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన అవసరాలను తీర్చుకుంటూనే మిగిలిన సొమ్మును భవిష్యత్తుకోసం దాచిపెట్టడం.. అందుకోసం సాంప్రదాయంగా వస్తున్న బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లు, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు.. ఇలా ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలోకి నష్ట భయం తక్కువగా ఉండి, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే పథకాల్లో పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు ఎంతో ఉత్తమం. కాబట్టి పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం గురించి తెలుసుకుందాం.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది. కనీసం వెయ్యి రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా మూడులక్షల రూపాయాలు, జాయింట్‌గా అయితే ఆరు లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు.
ఏడాది తరువాత పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఏడాది తరువాత పెట్టుబడి ఉపసంహరించుకుంటే డిపాజిట్ సొమ్ములో ఐదు శాతం తగ్గించి ఇస్తారు. మూడేళ్ల తరువాత అయితే ఎలాంటి కోత లేకుండా డిపాజిట్ సొమ్మును తిరిగి ఇస్తారు. చివరిదాకా డిపాజిట్ ఖాతాలో ఉంచితే వడ్డీతోపాటు పది శాతం బోనస్‌గా లభిస్తుంది. గడువుకు ముందే తీసుకుంటే బోనస్ ఉండదు. సెక్షన్ 80ఎల్ కింద ఈ పథకంలో ఉంచిన పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
రిటైర్డ్ ఉద్యోగులకు, పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న వారికి ఇది అనుకూలమైన పధకంగా చెప్పవచ్చు. అదేవిధంగా పెద్ద మొత్తంలో పొదుపుచేసి ప్రతి నెలా రాబడి అందుకోవాలని భావించే వారితోపాటు పెన్షన్ సదుపాయంలేని వారికి ఇది అనుకూలమైన పథకం.
ఏమిటీ ఎంఐపీ?
నెలసరి ఆదాయ పథకాలు అనగానే నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం అందించే పథకాలే అని భావిస్తాం. ఇవీ అలాంటివే అయినప్పటికీ సంప్రదాయ నెలసరి ఆదాయ పథకాలకూ వీటికీ చాలా వ్యత్యాసం ఉంది. తపాలా పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్ల లాంటి డెట్ పథకాలల్లో వచ్చిన వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంఐపీలతో పన్ను పరంగా కలిసొస్తుంది. ఇందులో వచ్చిన డివిడెండ్‌కు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
నామిని సౌకర్యం:
పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో అకౌంట్ తెరిచే సమయంలోనే మీ నామిని పేరును ప్రకటించే వెసులుబాటు ఉంది.
మెచ్యూరిటీ:
డిసెంబర్ 1, 2011 నుంచి ఈ పథకాలకు మెచ్యూరిటీ కాలపరిమితిని ఐదేళ్లు చేశారు.
పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో పెట్టుబడులు పెట్టొచ్చా?
పన్ను పరంగా కలిస్తాయి. పన్ను వర్తించే ఆదాయం గరిష్ఠంగా ఉండి, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను వర్తించకుండా ఉండాలని భావించేవారు ఇలాంటి పథకాలను ఎంచుకోవచ్చు. మీకు క్రమం తప్పకుండా ఆదాయం రావాలనుకొని, ఈ ఆదాయం మీదే ఆధారపడి జీవనం సాగించాలనుకుంటే మాత్రం ఎంఐపీలు ఏ మాత్రం ఉపయోగపడవు.
ఆధారము: తెలుగు.గుడ్ రిటర్న్స్.ఇన్
దాదాపు 135 సంవత్సరాల నుంచి తన సుధీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్న మనీ ఆర్డర్ వ్యవస్థ ఇక నుంచి మన దేశంలో కనిపించదు. ఇండియా పోస్ట్ అందిస్తోన్న ఈ సర్వీసుని త్వరలో నిలిపివేయనుంది. రాబోయే రోజుల్లో మనీ ఆర్డర్ సర్వీసు ఇక చరిత్రగా మిగలనుంది.
దాదాపు 1880 నుంచి భారత ప్రజల మనసుల్లో సుస్ధిరస్ధానాన్ని సంపాదించుకున్న ఈ మనీ ఆర్డర్ సర్వీసు దేశంలోని 155,000 పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎంతో మందికి నగదుని ఇంటికి డెలివరీ చేసింది. 2008లో ఇంటర్నెట్ సాంకేతిక వచ్చిన తర్వాత మనీ ఆర్డర్ సర్వీసుని ఉపయోగించడం పూర్తిగా మానేశారు.
ఇటీవల కాలంలో నగదు బదిలీ అంతా కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనే జరుగుతుంది. మనీ ఆర్డర్ సర్వీసుని నిలిపివేయడంపై డిప్యూటీ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ శిఖా మథుర్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం 'మనకు ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్, ఇనిస్టాంట్ మనీ ఆర్డర్స్ లాంటివి ఉన్నాయి. సాధారణ మనీ ఆర్డర్‌తో పోలిస్తే అవి చాలా వేగవంతంగా, సులభంగా ఉంటున్నాయి' అని అన్నారు.
అలాంటి సులభ, సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన నేపథ్యంలో మనీ ఆర్డర్ సర్వీసుని ఉపయోగించే వారు బాగా తగ్గిపోయారని పేర్కొన్నారు. మనీ ఆర్డర్ సర్వీసు స్ధానంలో ఇనిస్టాంట్ మనీ ఆర్డర్ (ఈఎమ్‌వో), ఐఎమ్‌వో పనిచేయనున్నట్లు తెలిపారు. ఇక ఇనిస్టాంట్ మనీ ఆర్డర్ విషయానికి వస్తే, రూ. 1,000 నుంచి రూ. 50,000లకు ఇండియా పోస్ట్ పెంచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
ఇండియా పోస్ట్ వెల్లడించిన సమాచారం ప్రకారం పోస్టల్ అధికారిక ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ మనీ ఆర్డర్ నగదుని బదిలీ చేసేవారట. 1880ల్లో ప్రజలు ఇంటి అద్దెలు, రెవెన్యూలు చెల్లించేందుకు సుదూర ప్రాంతాలకు వెళుతూ ఉండేవారట. ప్రజల ప్రయాణ భారాన్ని తగ్గించే భాగంలో ఈ మనీ ఆర్డర్ సర్వీసుని అందుబాటులోకి తీసుకొచ్చారుంట.
ఆధారము: తెలుగు.గుడ్ రిటర్న్స్.ఇన్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/30/2020